
సాక్షి, హైదరాబాద్: అసలు తెలంగాణ మోడల్ అంటే ఏ మిటో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ డిమాండ్‌చేశారు. ఈ మోడల్ అంటే అహంకారం, అప్పు, అవి నీతా? లేదా అప్పు, సిప్పు, డప్పుకొట్టడమా? అని ఎద్దేవాచేశారు. మంగళవారం పార్టీ నేత హరిశంకర్‌గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్‌ఎస్ ఏర్పాటు సందర్భంగా అసలు తెలంగాణ తల్లి ఎక్కడ? ఏం చేశారు? తెలంగాణ తల్లి ఉన్నట్లా? లేనట్లా? కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఏర్పాటు సందర్భంగా కేసీఆర్ ముఖంలో గాంభీర్యం లేదని గాబరా కనిపిస్తోందన్నారు. కేంద్రంలో కేసీఆర్ లాంటి వారు అధికారంలోకి వస్తే దేశంలో ‘అబ్ కీ బార్ భ్రష్టచార్ సర్కార్’ ఏర్పడుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment