డాక్టర్‌.. ఎంపీ  | Boora Narsaiah Goud First Aid To A Woman On Road | Sakshi
Sakshi News home page

డాక్టర్‌.. ఎంపీ 

Published Sat, Feb 9 2019 2:52 AM | Last Updated on Sat, Feb 9 2019 2:52 AM

Boora Narsaiah Goud First Aid To A Woman On Road - Sakshi

గాయపడ్డ మహిళకు ప్రథమ చికిత్స చేస్తున్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌

నకిరేకల్‌: తాను అటుగా వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళకు భువనగిరి ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ ప్రథమ చికిత్స చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాములు గ్రామం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ మియాపూర్‌ నుంచి ద్విచక్రవాహనంపై నాగమణి, వెంకటేశ్వర్లు, నాగరాజు కలసి వారి స్వగ్రామమైన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఇనుపాముల శివారులో జాతీయ రహదారిపై తమ ముందు ఉన్న వాహనాన్ని వారి బైక్‌ ఢీకొనడంతో కిందపడ్డారు. ఈ ప్రమాదంలో నాగమణికి తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తన కారును ఆపి గాయపడ్డ నాగమణికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆయన 108ను పిలిపించి నకిరేకల్‌ ఆసుపత్రికి ఆమెను పంపించారు. దీంతో స్థానికులు ఎంపీపై ప్రశంసలు కురిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement