రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
ఇనుపాముల(కేతేపల్లి): వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలవ్వగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేతేపల్లి, చివ్వె ంల మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు.. ఇనుపాముల గ్రామానికి చెందిన తిరుగుడు అంతయ్య(45) పట్టేటి విద్యాసాగర్, నకిరేకల్‌లో గురువారం జరిగిన వివాహ శుభకార్యానికి బైక్‌పై వెళ్లారు. తిరిగి గ్రామానికి చేరుకునే క్రమంలో స్థానిక మల్లన్నగుట్ట వద్ద రోడ్డు క్రాసింగ్ జంక్షన్ వద్ద హైవే దాటుతుండగా సూర్యాపేట వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న అంతయ్య, విద్యాసాగర్‌కు తీవ్ర గా యాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు నకిరేకల్, అక్కడి నుంచి నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంతయ్య మృతి చెందాడు. అంతయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ బాలగోపాల్ తెలిపారు.
లారీ,బైక్ ఢీ...ఒకరు..
వల్లభాపురం(చివ్వెంల) మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన సిద్దుల రమేష్(40) సొంత పనుల నిమిత్తం బైక్‌పై సూర్యాపేటకు వెళ్లి వస్తున్నాడు. మార్గమధ్యలో 65వ జాతీయ రహదారిపై చివ్వెంల మండల పరిధి వల్లభాపురం గ్రామ ఆవాసం జగన్నాయక్తండా వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈప్రమాదంలో రమేష్‌తల నుజ్జు నుజ్జు అయి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భా ర్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.