సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థాపించే ఎయిమ్స్ ఆస్పత్రికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గణనీయమైన స్థాయిలో నిధులు కేటాయించాలని కేంద్రాన్ని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. మంగళవారం లోక్‌సభలో హెచ్‌ఐవీ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. హెచ్‌ఐవీ బాధితులకు అవసరమైన సేవలు అందించేందుకు నిరాకరించే వారిని శిక్షించడం, పెళ్లికి ముందు హెచ్‌ఐవీ ఉన్నప్పటికీ భాగస్వామి కుటుంబానికి ఆ విషయాన్ని వెల్లడించని వారిపై తగిన చర్యలను తీసుకోవడం వంటి పలు అంశాలు ఈ బిల్లులో పొందుపరచడం స్వాగతించదగ్గ విషయమని ఆయన చెప్పారు.