శ్రీకాంతాచారి తల్లి తీవ్ర మనోవేదన | Srikanth Chary Mother Dissapointed at Telangana Formations celebrations | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 2 2018 1:43 PM | Last Updated on Sat, Aug 11 2018 7:51 PM

Srikanth Chary Mother Dissapointed at Telangana Formations celebrations - Sakshi

సాక్షి, భువనగిరి : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి.. తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో మొదట తనకు తాను నిప్పటించుకొని ఆత్మత్యాగం చేసుకున్న అమరుడు ఆయన.. కానీ శ్రీకాంతాచారి ఆత్మత్యాగం నిరూపయోగమైపోయిందని ఆయన తల్లి శంకరమ్మ శనివారం తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా తనను మొదట వేదిక మీదకు పిలువకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఈ ఘటన జరిగింది.

తెలంగాణ రాష్ట్ర నాలుగోవ ఆవిర్భావ వేడుకల్లో ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో తనను వేదికపైకి మొదట పిలువకపోవడంతో ఆమె ఆవేదన చెందారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు శ్రీకాంతాచారి త్యాగాన్ని మరిచిపోయి.. తన కొడుకును అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జోక్యం చేసుకుని.. ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో వేదికపై తనను సన్మానించిన వెంటనే.. ఆవేదనతో అక్కడి నుంచి శంకరమ్మ వెళ్లిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement