Shankaramma
-
అమ్మ ప్రాణం తీసిన రూ.500
పరిగి: గొడవ పడుతున్న కొడుకులను విడిపించేందుకు వెళ్లిన ఓ తల్లి ప్రాణం కోల్పోయింది. క్షణికావేశంతో మొదలైన చిన్నపాటి తగాదా ఆమె నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్‌మల్కాపూర్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శంకరమ్మ (63)కు వెంకటయ్య, శ్రీను, సత్యమ్మ సంతానం. భర్త గతంలోనే మృతిచెందగా.. చిన్న కొడుకు శ్రీనుతో కలిసి ఉంటోంది. పెద్దకొడుకు వెంకటయ్య కుటుంబంతో సహా సమీపంలోని నజీరాబాద్ తండాలో జీవిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల శ్రీను అనారోగ్యం బారినపడ్డాడు. ఈ నేపథ్యంలో అన్న వెంకటయ్యకు ఫోన్ చేసి.. మహ్మదాబాద్‌కు చెందిన పసుపుల మల్లయ్య వద్ద రూ.5 వేలు తీసుకురమ్మని చెప్పాడు. డబ్బులు తీసుకొచ్చిన వెంకటయ్య వాటిని తమ్ముడికి ఇచ్చేందుకు బుధవారం రాత్రి భార్యతో కలిసి సయ్యద్‌మల్కాపూర్ వచ్చాడు. ఇదిలా ఉండగా అనారోగ్యం పాలైన తమ్ముడిని పరామర్శించేందుకు అక్క సత్యమ్మ సైతం వచ్చింది. అయితే రాత్రి వేళ అందరూ భోజనానికి సిద్ధమవుతుండగా.. అన్నదమ్ములిద్దరూ మద్యం తాగేందుకు కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత అక్క సత్యమ్మ తనకు ఇవ్వాల్సిన రూ.500 ఇవ్వలేదని వెంకటయ్య వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీను తనను చూసేందుకు వచ్చిన అక్కను డబ్బులు అడుగుతావా అంటూ అన్నను నిలదీశాడు. ఇలా ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. డబ్బు తెచ్చిస్తానని సత్యమ్మ చెప్పినా అన్నదమ్ముల వాగ్వాదం ఆగలేదు. ఈ క్రమంలో ఇద్దరూ పెనుగులాడుతూ ఇంటి ఎదురుగా ఉన్న సీసీ రోడ్డుపైకి చేరుకున్నారు. కొడుకులు కొట్టుకుంటున్నారని గాబరాపడిన తల్లి శంకరమ్మ.. ఇరువురినీ విడిపించే ప్రయత్నం చేసింది. దీంతో సహనం కోల్పోయిన శ్రీను మధ్యలో నీవెందుకు వస్తున్నావంటూ తల్లిని తోసేయగా, సీసీ రోడ్డుపై పడిపోయింది. కుటుంబ సభ్యులు వచ్చి లేపేందుకు ప్రయత్నించగా చలనం కనిపించలేదు. చుట్టుపక్కల వాళ్లు 108కి ఫోన్ చేసి, అంబులెన్స్‌లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెద్ద కొడుకు వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు. -
తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి కెప్టెన్.ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నిజంగా తెలంగాణకు బీజేపీ చేసిందేదైనా ఉంటే ఫలానా పనిచేశానని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతోపాటు హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. గాం«దీభవన్‌లో గురువారం ఉత్తమ్‌తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్‌మున్షీలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకరమ్మతో కలిసి ఉత్తమ్ మాట్లాడుతూ శ్రీకాంతాచారి తెలంగాణ కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడని, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ చాలా కాలం బీఆర్ఎస్లో పనిచేసినా ఆమెకు న్యాయం చేయలేదన్నారు. తనపై శంకరమ్మ పోటీ చేసినా, ఎప్పుడూ తాము వ్యక్తిగత వైరాలకు వెళ్లలేదని, శంకరమ్మ చేరికతో హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ ఖాళీ అయ్యిందని చెప్పారు.లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలవాలని బీజేపీ, బీఆర్ఎస్లు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలు కాగానే కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని, అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13 చోట్ల గెలుపొందుతుందని, 3 చోట్ల బీజేపీతో, ఒక చోట ఎంఐఎంతో కాంగ్రెస్‌కు పోటీ ఉందన్నారు. నాకు అన్యాయం జరిగింది: శంకరమ్మ శంకరమ్మ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో తమకు అన్యాయం జరిగిందని చెప్పారు. శ్రీకాంతాచారి మరణం చూసిన సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఆమె కోరారు. -
నాకు ఒక పదవి కల్పించాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్న: శంకరమ్మ
-
ఎమ్మెల్సీ పదవి ప్రచారంపై శంకరమ్మ స్పందన
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరవీరుల స్మృతి వనం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలిగా అమరుడైన శ్రీకాంత్ చారి తల్లికీ ఆహ్వానం.. ఆ ఆహ్వానం వెనుక ఆమెకు శాసనమండలి సభ్యురాలిగా అవకాశం ఇచ్చే ప్రతిపాదనపైనా రాజకీయ చర్చ మొదలైంది. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు శంకరమ్మకు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ చేసి కార్యక్రమానికి ఆహ్వానించారట. ఈ విషయాన్ని స్వయంగా శంకరమ్మ సాక్షికి తెలిపారు. అయితే ఎమ్మెల్సీ పదవి గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని అంటున్నారామె. గతంలో ఎన్నడూ సీఎం కేసీఆర్‌ను కలవలేదని.. అలాగని ఆయన మీద వ్యతిరేకత ఏం లేదని చెప్పారామె. స్మృతి వనం రూపంలో తన కొడుకు లాంటి ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేసినవాళ్లు సజీవంగా బతికే ఉన్నట్లు భావిస్తానని సంతోషం వ్యక్తం చేశారామె. కేసీఆర్ ప్రకటన? ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ శ్రేణుల్లో, ఆయా సంబంధిత వాట్సాప్ గ్రూపుల్లో గత కొంతకాలంగా శంకరమ్మ ఎమ్మెల్సీ పదవి గురించే జోరుగా చర్చ నడుస్తోంది. ఆమెకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు గన్‌మన్‌ను ఓ పీఏను, ప్రభుత్వ వాహనాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. గురువారం ఉదయం నుంచి ఆమెకు ఈ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని కూడా ప్రచారం నడుస్తోంది. అలాగే.. అమరవీరుల స్మృతి వనం ప్రారంభోత్సవ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ స్వయంగా శంకరమ్మ ఎమ్మెల్సీ ప్రకటన చేయొచ్చనే ప్రచారమూ నడుస్తోంది. గతంలో రాజకీయ ఎంట్రీ కోసం శంకరమ్మ తీవ్ర యత్నాలే చేసి భంగపడిన సంగతి విదితమే. మరోవైపు అమరవీరుల కుటుంబాల నుంచి పలు అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తం అవుతుండడంతో.. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో శంకరమ్మకు ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇదీ చదవండి: గద్దర్.. కేసీఆర్‌ను నిలదీయు -
‘కేఏపాల్‌తో మా కుటుంబానికి ప్రాణహాని.. నా భర్తను విడిపించండి’
సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఎపాల్ తన భర్త కాసోజు వెంకటాచారిని మభ్యపెట్టి బంధించాడని, వెంటనే అతడిని విడుదల చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్‌చారి తల్లి కాసోజు శంకరమ్మ డిమాండ్ చేశారు. సోమవారం ఎల్బీనగర్లోని శ్రీకాంత్‌చారి విగ్రహం వద్ద బంధువులతో కలిసి కేఏ పాల్ చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్తను కేఎపాల్ తన ఇంటిలో బంధించాడని, తాము కేఎపాల్ ఇంటికి వెళ్లి వెంకటాచారిని విడిచిపెట్టాలని కోరగా బౌన్సర్లతో గెంటి వేయించాడని ఆరోపించారు. గేటుకు తాళాలు వేసి లోపలికి రానివ్వడం లేదన్నారు. వెంకటాచారి విడాకుల నోటీసును మీ ఇంటికి పంపించాడు అందలేదా.. అని కేఏ పాల్ తన అనుచరులతో చెప్పిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేఏ పాల్‌తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. శ్రీకాంత్‌చారి పేరు చెప్పుకుని, ఉద్యమకారుల పేరుతో రాజకీయాలు చేస్తే కేఏపాల్‌కు బుద్ధి చెబుతామన్నారు. కేఏపాల్ చేపట్టే బస్సు యాత్రలో తన భర్త వెంకటాచారిని వెంట తీసుకెళుతూ, తన కుమారుడు శ్రీకాంత్‌చారి ఫొటోను వాడుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎల్బీనగర్లోని శ్రీకాంత్‌చారి విగ్రహం వద్ద కేఎపాల్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో తెలంగాణ నుంచి అతడిని తరిమి కొడతామన్నారు. కార్యక్రమంలో బంధువులు సునంద, లలిత, నర్సింహాచారి, వీరాచారి, వాసుదేవాచారి, సంపతాచారి, రఘు తదితరులు పాల్గొన్నారు. చదవండి: Amnesia Pub Case: ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు -
‘అందుకే గులాబీ కండువాను వదల్లేకపోతున్నా’
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించి రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉంటే.. నేను మాత్రం బాధపడుతున్నా’ అని అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు. గత నాలుగేళ్లుగా కేసీఆర్ అపాయింట్మెంట్ లభించడం లేదని వాపోయారు. వనస్థలిపురంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను బీసీ నేత అయినందునే టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక అమరవీరుడి తల్లిగా తనను బాధపెట్టడం మంచిది కాదని చెప్పారు. ‘టికెట్ నిరాకరించి శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేస్తారో.. అన్యాయం చేస్తారో కేసీఆర్‌కే వదిలేస్తున్నాను. నా కొడుకు మెడలో వేసుకున్న గులాబీ కండువాను వదల్లేకపోతున్నా. ఇప్పటికీ కేసీఆర్ నాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది.’ అని వ్యాఖ్యానించారు. వెయ్యి మంది అమరుల కుటుంబాలకు 2014లో ఒక సీటు ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
'శ్రీకాంత చారిలాగానే ఆత్మాహుతి చేసుకుంటా'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలిఅమరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ తెలంగాణ భవన్లో బుధవారం కంటతడిపెట్టారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఆపద్ధర్మ మంత్రి జగదీశ్ రెడ్డిదే బాధ్యత అని పేర్కొన్నారు. నియోజక వర్గంలో పని చేయని సైదిరెడ్డికి టికెట్ ఇవ్వాలని చూస్తున్నారన్నారు. తనకు కేటీఆర్, కేసీఆర్‌ల సపోర్ట్ ఉన్నా కూడా జగదీశ్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తనకు టికెట్ ఇవ్వకపోతే జగదీష్ రెడ్డి ఇంటి ముందే కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటానని శంకరమ్మ హెచ్చరించారు. తనకు సూర్యాపేట టికెట్ ఇచ్చి, అంత బలం ఉన్న జగదీశ్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేయాలని డిమాండ్ చేశారు. తనకు ఎమ్మెల్సీ పదవి వద్దని, ప్రజల మద్దతుతోనే గెలుస్తానన్నారు. తాను వేల మెంబర్ షిప్‌లు చేయించినా, జగదీశ్ రెడ్డి బలపరుస్తున్న సైదిరెడ్డికి టికెట్ ఇస్తున్నారన్నారు. టికెట్ రాకపోతే జగదీశ్ రెడ్డి ఇంటిముందు శ్రీకాంత చారి లాగానే ఆత్మాహుతి చేసుకుంటానన్నారు. -
టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా : శ్రీకాంతాచారి తల్లి
-
టికెట్ దక్కకుంటే ప్రాణ త్యాగం
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రకటించిన తొలి జాబితాలో తనకు హుజూర్నగర్ టికెట్ దక్కకుండా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకున్నారని కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. తనకు హుజూర్నగర్ టికెట్ దక్కకుంటే మంత్రిపై సూసైడ్ నోటు రాసుకుని ఎల్బీ నగర్ రింగ్‌రోడ్డులో ప్రాణ త్యాగానికి పాల్పడతానని స్పష్టం చేశారు. శుక్రవారం ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హుజూర్నగర్ టికెట్ తనకు కేటాయించేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అనుకూలంగా ఉన్నారని, అయితే, మంత్రి జగదీశ్‌రెడ్డి వారి వద్ద అసత్యాలు చెప్పి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బీసీ మహిళైన తాను హుజూర్‌నగర్‌లో పోటీ చేయడం మంత్రికి ఇష్టం లేదని, కార్యకర్తల బలం లేదని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఉద్యమంలో తన కుమారుడు శ్రీకాంతాచారి అమరుడై ఉద్యమానికి జీవం పోశాడని, అమరుల కుటుంబాలపక్షాన హుజూర్నగర్ సీటును కేటాయించాలని కోరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రవర్తనతో తాను విసిగిపోయానని కంటతడి పెట్టారు. -
టికెట్ ఇవ్వకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం!
హుజూర్నగర్: హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇవ్వకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హెచ్చరించారు. ఆదివారం హుజూర్‌నగర్‌లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో జరిగిన ఓటర్ జాబితా సవరణ సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 2014లో కేసీఆర్ తనకు పార్టీ టికెట్ ఇస్తే 47 వేల ఓట్లు పొందానన్నారు. నాటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. అమరుల కుటుంబాలకు కేసీఆర్ న్యాయం చేస్తారని భరోసా ఉన్నప్పటికీ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి తనకు టికెట్ రాకుం డా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. హుజూర్నగర్ నియోజకవర్గ టికెట్ తప్ప రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చినా తాను అంగీకరించబోనన్నారు. -
శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇవ్వాలని..
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు యువకులు రేడియో టవర్ ఎక్కారు. శుక్రవారం ఎల్బీనగర్లోని చింతల్ కుంటలోని రేడియో టవర్ ను ఎక్కిన యువకులు శంకరమ్మకు టికెట్ ఇస్తేనే కిందకు దిగుతామని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు గంటల నుంచి ఇద్దరు యువకులు రేడియో టవర్ పైనే ఉండటంతో అక్కడ స్థానికులు భారీగా గుమిగూడారు. తెలంగాణ ఉద్యమంలో ఆమరణ దీక్షకు సిద్దమైన కేసీఆర్ అరెస్ట్‌ను నిరసిస్తూ.. నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరాస్తాలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ అమరవీరులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. -
శ్రీకాంతాచారి తల్లి తీవ్ర ఆవేదన
-
శ్రీకాంతాచారి తల్లి తీవ్ర మనోవేదన
సాక్షి, భువనగిరి : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి.. తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో మొదట తనకు తాను నిప్పటించుకొని ఆత్మత్యాగం చేసుకున్న అమరుడు ఆయన.. కానీ శ్రీకాంతాచారి ఆత్మత్యాగం నిరూపయోగమైపోయిందని ఆయన తల్లి శంకరమ్మ శనివారం తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా తనను మొదట వేదిక మీదకు పిలువకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఈ ఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్ర నాలుగోవ ఆవిర్భావ వేడుకల్లో ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో తనను వేదికపైకి మొదట పిలువకపోవడంతో ఆమె ఆవేదన చెందారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు శ్రీకాంతాచారి త్యాగాన్ని మరిచిపోయి.. తన కొడుకును అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జోక్యం చేసుకుని.. ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో వేదికపై తనను సన్మానించిన వెంటనే.. ఆవేదనతో అక్కడి నుంచి శంకరమ్మ వెళ్లిపోయారు. -
'శంకరమ్మపై టీఆర్ఎస్ది కృత్రిమ ప్రేమ'
హైదరాబాద్ : ఒప్పందం ప్రకారమే సీపీఐకి సీట్లు కేటాయించామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అధిష్టానం సూచనల మేరకే మల్రెడ్డి రంగారెడ్డికి షరతులతో బీఫారమ్ ఇచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత స్థానం కలిపించామని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా లేని పార్టీలు అధికారంలోకి వస్తామని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. హేయమైన చరిత్ర కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని పొన్నాల ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినవారికే టికెట్లు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. అమర వీరులకు టికెట్లు ఇవ్వాలని అంశం తన దృష్టికి రాలేదని పొన్నాల తెలిపారు. బలమైన కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నచోట శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను నిలబెట్టారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్కు శంకరమ్మపై ఉన్న కృత్రిమ ప్రేమకు ఇది నిదర్శనమని పొన్నాల వ్యాఖ్యానించారు.