సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించి రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉంటే.. నేను మాత్రం బాధపడుతున్నా’ అని అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు. గత నాలుగేళ్లుగా కేసీఆర్ అపాయింట్‌మెంట్ లభించడం లేదని వాపోయారు. వనస్థలిపురంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను బీసీ నేత అయినందునే టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక అమరవీరుడి తల్లిగా తనను బాధపెట్టడం మంచిది కాదని చెప్పారు. ‘టికెట్ నిరాకరించి శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేస్తారో.. అన్యాయం చేస్తారో కేసీఆర్‌కే వదిలేస్తున్నాను. నా కొడుకు మెడలో వేసుకున్న గులాబీ కండువాను వదల్లేకపోతున్నా. ఇప్పటికీ కేసీఆర్ నాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది.’ అని వ్యాఖ్యానించారు. వెయ్యి మంది అమరుల కుటుంబాలకు 2014లో ఒక సీటు ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment