MLA tickets
-
టీడీపీలో టికెట్ల పంచాయితీ
-
తెలుగుదేశం పార్టీలో డబ్బు ఉంటేనే సీట్లు
-
యూత్ కాంగ్రెస్ ‘నారాజ్’
సాక్షి, హైదరాబాద్: టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరితో యూత్ కాంగ్రెస్ నాయకత్వం నారాజ్ అవుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ యూత్ కోటాలో 3–7 టికెట్లు కేటాయిస్తారని, కానీ ఈసారి మాత్రం తమను పరిగణనలోకి తీసుకోకపోవడంతో యూత్ కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలో మునిగిపోతున్నారు. ఇందుకు నిరసనగా యూత్‌కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని భావిస్తున్నారు. ఈసారి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి వనపర్తి టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ వనపర్తి కాకపోయినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండేళ్లుగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక పోరాటా లు చేసి విద్యార్థులు, యువత పక్షాన నిలబడ్డామని, ఈ ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. తద్వారా యువకులకు పార్టీ ప్రాధాన్యతమిస్తుందనే సంకేతాలను పంపాలని చెబుతున్నారు. వనపర్తితో పాటు దేవరకొండ, అంబర్‌పేట లాంటి సీట్లను తమకు కేటాయించాలని యూత్ కాంగ్రెస్ నేతలు కోరుతున్న నేపథ్యంలో అధిష్టానం ఏం చేస్తుందో వేచిచూడాల్సిందే. నేడు ‘బుజ్జగింపు’ భేటీ? యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణ యించారు. అయితే, చాలామంది యూత్‌కాంగ్రెస్ నేతలు నిరాశలో ఉన్న మాట వాస్తవమేనని, వారందరూ రాజీనామాలు చేయాలనే భావనలో ఉన్నప్ప టికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్‌లోనే ఉంటారని, వారిని బుజ్జగించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారనే చర్చ జరుగుతోంది. -
రేవంత్‌కు శాపనార్థాలు.. గాంధీభవన్‌లో నిరసనలు
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్ మైనార్టీ నేతలు నిరసనకు దిగారు. బహుదూర్‌పురాలో ఖిలీమ్ బాబా, చాంద్రాయణగుట్టలో షకీల్ దయానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదని నిరసస వ్యక్తం చేస్తూ.. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పాతబస్తీకి చెందిన టికెట్లు.. సంబంధం లేని వారికి ఇచ్చారని మైనార్టీ నేతలు ఆందోళనకు దిగారు. మరో వైపు, టికెట్లు అమ్ముకుని కాంగ్రెస్‌ను భ్రష్టుపట్టించడానికి రేవంత్ వచ్చాడంటూ, ఉప్పల్ టికెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. వచ్చే లిస్ట్ సంబంధించిన వాళ్లది కూడా శాపనార్థాలు తగులుతాయంటూ లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు.. డబ్బులు ఇవ్వనందుకే ఉప్పల్ టికెట్ ఇవ్వలేదని ఆరోపించిన ఆయన.. రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని కాల్చివేశారు. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే నేడు తొలి విడతలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 55 మంది అభ్యర్థులను తొలి లిస్ట్‌లో భాగంగా ప్రకటించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ఆదివారం ఉదయం జాబితాను విడుదల చేశారు. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు తొలి లిస్టులో లేకపోవడం గమనార్హం. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మొదటి జాబితాలోనే చోటు సంపాదించుకున్నారు. చదవండి: 51 మందికే బీ ఫామ్స్.. అభ్యర్థుల్లో టెన్షన్.. గులాబీ బాస్ వ్యూహమేంటి? -
బీసీ వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్: జాజుల
సాక్షి,యాదాద్రి/కాజీపేట రూరల్: ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేసి తన వ్యతిరేకతను చాటుకున్న బీఆర్ఎస్ను వదిలేది లేదని, వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీ కి గుణపాఠం చెబుతామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ సీట్ల కేటాయింపుపై గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే రెడ్లు, రావుల సమితిగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను వెంటనే సవరించి 60 సీట్లను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 136 కులాల్లో కేవలం ఆరింటికి మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారని, మిగిలిన 130 కులాలకు ప్రాతినిధ్యమే లేదన్నారు. మహిళలకు 7 టికెట్లు కేటాయించగా, అందులోనూ ఆరింటిని అగ్రకుల మహిళలకు ఇచ్చి, బీసీ మహిళలపట్ల వివక్ష చూపార ని ధ్వజమెత్తారు. కాగా, హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్ వైష్ణవిగ్రాండ్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు కూడా జనాభా ప్రకారం బీసీలకు సీట్లు ప్రకటించాలని, సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 10న హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో తలపెట్టిన బీసీల సింహగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలు అధికారం కోసం తిరుగుబాటు చేయాలన్నారు. -
అసెంబ్లీ టికెట్లు ఇవ్వండి
పరిగి: జిల్లాకు రెండు చొప్పున బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్‌కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని బీసీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న లాల్‌కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ రిజర్వేషన్ ఉన్నచోట తప్ప ఎక్కడా బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం లేదన్నారు. జనరల్ స్థానాలు ఉన్నచోట కూడా బీసీలకు టిక్కెట్లు ఇచ్చే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని మాణిక్‌రావ్ ఠాక్రేకు వినతిపత్రం అందజేశారు. పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. -
రసవత్తర రాజకీయం.. సీఎం కేసీఆర్ నిర్ణయం సరైనదేనా?
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని, ప్రస్తుత సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో సిట్టింగ్‌ల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా.. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో కొంతకాలంగా గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్న ఆశావహుల్లో మాత్రం ఆందోళన మొదలైంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం లభిస్తుందనే ఆశతో వివిధ నియోజకవర్గాల్లో ఎందరో నేతలు ఎదురుచూస్తున్నారు. సీఎం ప్రకటనతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు. గులాబీ పార్టీలోనే కొనసాగడమా? లేక మరో దారి చూసుకోవడమా? అనే మీమాంసలో కొందరు నేతలు కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయమే ఉత్తమమా..? అధికారంలోకి వచ్చాక.. వివిధ పార్టీల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని గులాబీ గూటికి వచ్చేలా చేసేందుకు కొందరికి రాబోయే ఎన్నికల్లో టికెట్లిస్తామనే హామీలున్నాయి. దాంతో వారు ఆయా నియోజకవర్గాలను నమ్ముకొని పనులు చేస్తున్నారు. ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకత సైతం తమకు కలిసి వస్తుందని భావించారు. కానీ.. ఇటీవల టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం చేసిన ప్రకటనతో హతాశులైన వారిలో కొందరు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ప్రతిపక్ష పార్టీల వైపు దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ పరిధిలో.. - ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా.. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకు వస్తుందని భావించిన ఇదే పారీ్టకి చెందిన కార్పొరేటర్ విజయారెడ్డి.. తనకు టికెట్ వచ్చే పరిస్థితి లేదని గ్రహించి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన శ్రవణ్‌కుమార్.. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందనే చేరినట్లు ఆయన వర్గీయులు భావిస్తున్నారు. మన్నె గోవర్ధన్‌రెడ్డి, మరికొందరు సైతం ఎంతో కాలం నుంచి ఇదే నియోజకవర్గంపై కన్నేసి ఉన్నారు. కానీ.. కేసీఆర్ ప్రకటనతో ఆశావహులకు ఏమీ పాలుపోవడం లేదు. - ముషీరాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ముఠా గోపాల్ ఉన్నారు. ఈ నియోజకవర్గంపై ఎప్పటినుంచో కన్నేసి ఉన్న ఎమ్మెన్ శ్రీనివాస్ మంత్రి తలసాని అండదండలతో ఇక్కడి టికెట్‌ను దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం తదితరాలు తనకు కలిసి వస్తాయని ఆయన ఆశలు పెంచుకున్నారు. - అంబర్‌పేట నియోజకవర్గం నుంచి కాలేరు వెంకటేశ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనగసాగుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమిపాలైన ఎడ్ల సుధాకర్‌రెడ్డితో పాటు ఓ కార్పొరేటర్ భర్త తదితరులు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. సాయన్న ప్రాతినిధ్యం వహిస్తున్న కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి మూడు కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జెల నగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కృషాంక్‌లు రాబోయే ఎన్నికల్లో టికెట్‌పై కన్నేసి ఉన్నారు. పొరుగు జిల్లాలో.. - ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రాబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచిన దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి.. అనంతరం టీఆర్ఎస్లో చేరడం తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన చేతిలో ఓటమి పాలైన ఎం.రామ్మోహన్‌గౌడ్ సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశపడుతున్నారు. - ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపొందారు. గతంలో డీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన క్యామ మల్లేష్ ఆ పారీ్టకి రాజీనామా చేసి, అధికార టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఆ అవకాశం కల్పించలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని, ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత (సినీ నటుడు అల్లు అర్జున్ మామ) చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. - గత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి గెలిచిన సబితారెడ్డి.. అనంతరం టీఆర్ఎస్లో చేరి మంత్రిగా ఉన్నారు. ఇదే సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీటుపై ఆశలు పెట్టుకున్నారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఏదైనా ఒక చోట నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సహా మంత్రి సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి భావించారు. ఆ మేరకు పావులు కూడా కదిపారు. - ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లోనే టిక్కెట్ వస్తుందని ఆశించి ఇప్పటికీ ఈ నియోజకవర్గంపైనే దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఇక్కడ బేతి సుభాష్‌రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సమయానుకూల నిర్ణయాలు.. సీఎం ప్రకటన చేసినప్పటికీ, సమయానుకూల నిర్ణయాలుంటాయని కొందరు ఆశావహులు అభిప్రాయపడుతున్నారు. వయోభారం, ఆరోగ్య పరిస్థితులు తదితరాలు పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఇప్పట్నుంచే టికెట్లు రావంటే పక్కచూపులు చూస్తారని కూడా అలా ప్రకటించి ఉండవచ్చని వారు పేర్కొంటున్నారు. -
నా కూతుర్నే పార్టీ మారమన్నారు
సాక్షి, హైదరాబాద్: ‘నా సొంత కూతురు, ఎమ్మెల్సీ కవితకు.. పార్టీ మారాలంటూ బీజేపీ నుంచి ప్రతిపాదనలు రావడం, దేశంలో ఆ పార్టీ చేస్తున్న వికృత రాజకీయాలకు అద్దం పడుతోంది. ఈ తరహా రాజకీయాలపై తెలంగాణ నుంచే పోరాటాన్ని ప్రారంభించి బీజేపీకి చరమగీతం పాడదాం. బీజేపీ రూపంలో దేశానికి పట్టిన చెదను రూపుమాపాల్సిన బాధ్యత టీఆర్ఎస్పై ఉంది. ఉన్మాద రాజకీయాలు చేసే ఆ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..’ అని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘ఫోన్లు చేసి ‘పార్టీ మారతారా?’ అని ఎవరైనా అడిగితే చెప్పుతో కొడతామంటూ సమాధానం ఇవ్వాలి. మూడున్నర కోట్ల రాష్ట్ర నాభాలో 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ మనదనే ధీమాతో ఉండాలి..’ అని సూచించారు. తెలంగాణ భవన్లో మంగళవారం టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. బీజేపీ అప్రజాస్వామిక, వికృత చర్యలపై పోరాటం చేయాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రెండు గంటల పాటు సాగిన ఈ కీలక భేటీలో బీజేపీపై సాగించాల్సిన పోరు, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగం సన్నద్ధతపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్‌లా కొట్లాడాలి ‘బీజేపీపై ధర్మయుద్ధం చేస్తున్న మనం ఆ పార్టీపై ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను దేశానికి ఇవ్వాలి. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను చీల్చే కుట్రలను బీజేపీ విజయవంతంగా చేసినా, తెలంగాణ మాత్రం ఈ కుట్రలను ప్రపంచం ముందు నిలబెట్టింది. బీజేపీ కుట్రలకు సంబంధించి 5 టెరాబైట్ల (దాదాపు 5లక్షల పేజీలకు సమానం) సమాచారం ఉంది. బీజేపీ నిజ స్వరూపానికి సంబంధించిన ఈ సమాచారాన్ని దేశ వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో న్యాయస్థానాలు, దేశంలోని వివిధ పార్టీల అధ్యక్షులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపించాం. బీజేపీపై పోరులో ప్రతి ఒక్కరూ కేసీఆర్‌లా నిలబడి కొట్లాడాలి..’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. దాడులు, బెదిరింపులకు అవకాశం ‘రాజ్యాంగ వ్యవస్థలను సర్వనాశనం చేసిన బీజేపీ, ఎనిమిదేండ్లలో అనేక మందిపై ఈడీ కేసులు పెట్టి ఇప్పటివరకు ఒక్కటీ నిరూపించలేక పోయింది. మంత్రి గంగుల ఇళ్లల్లో ఈడీ సోదాలు చేసినా ఏమీ దొరకలేదు. బీజేపీ దగ్గర రూ.2 లక్షల కోట్లు ఉన్నట్లు ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడైన సింహయాజీ చెప్తున్నాడు. ఒక రాజకీయ పార్టీకి ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో, దేని కోసం వాడుతున్నారో దేశానికి తెలియచేద్దాం. కొంతమంది ఎమ్మెల్యేలపై ఈడీ దాడులకు, బీజేపీ బెదిరింపులకు అవకాశముంది. అయినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కేంద్ర సంస్థలు దాడులు చేస్తే తిరగబడండి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో త్వరలో మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశముంది’ అని సీఎం చెప్పారు. 95 స్థానాల్లో అవలీలగా గెలుపు ‘రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇస్తాం. 119 సీట్లకు గాను టీఆర్ఎస్ పార్టీ 95 స్థానాల్లో అవలీలగా గెలుస్తుంది. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ఇప్పటినుంచే ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి పార్టీ కేడర్‌తో ఎమ్మెల్యేలు సమావేశమై కష్ట సుఖాలు పంచుకోవాలి. వచ్చే 15 రోజుల్లో ఈ ఆత్మీయ సమ్మేళనాలు పూర్తిచేస్తే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఒక అవగాహన వస్తుంది. ఈ సమ్మేళనాలకు సంబంధిత జిల్లా మంత్రులు కూడా హాజరు కావాలి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రోగ్రెస్ కార్డును తయారు చేసుకోవాలి. ప్రతి వందమంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జిలను నియమించి, వారి ఫోన్ నంబర్లను పార్టీ కార్యాలయానికి పంపించాలి. ఈ ఇన్చార్జిలు.. వంద మంది ఓటర్లలో ఎవరు స్థానికంగా ఉంటున్నారు, ఇతర ప్రాంతాల్లో ఎందరు ఉంటున్నారు, వారి వివరాలు, ఫోన్ నంబర్లు తదితరాలు సేకరించాలి..’ అని సూచించారు. త్వరలో జిల్లా కలెక్టర్లతో భేటీ, కేబినెట్ సమావేశం ‘వచ్చే పది నెలల పాటు నియోజకవర్గాలపైనే ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి. త్వరలో నేను కూడా జిల్లాల్లో పర్యటిస్తా. పార్టీ జిల్లా కార్యాలయాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. దళితబంధు పథకం కింద నియోజకవర్గానికి 500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ధరణి ద్వారా 98 శాతం సమస్యలు పరిష్కారమైనా, మిగతావాటి పరిష్కారం కోసం నియోజకవర్గాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. సొంత జాగా ఉండి ఇళ్లు లేనివారికి రూ.3 లక్షలు చొప్పున అందిస్తాం. ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యేలు పాలు పంచుకోవాలి. పోడు భూములు, ధరణి సమస్యలు తదితరాలపై త్వరలో జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక భేటీ ఉంటుంది. వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు త్వరలో కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తా..’ అని కేసీఆర్ తెలిపారు. మునుగోడు తరహా వ్యూహంతో మళ్లీ అధికారంలోకి.. ‘రాజకీయాలు ఎంతగా కలుషితం అయ్యాయో మునుగోడు ఉప ఎన్నిక అద్దం పట్టింది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఏవైనా ప్రసాదాలు పంచిందా? గూండాగిరి, దాదాగిరి చేసినా ప్రజలు మనవైపే ఉండటాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతోంది. ఒక గ్రామంలో కావాలని ఘర్షణకు దిగింది. మనకున్న బలంతో పోలిస్తే ఆ పార్టీకి ఉన్న బలం పిడికెడు. ఇకపై ఇలాంటి ఘటనలకు బీజేపీ ఎక్కడైనా పాల్పడితే గట్టిగా సమాధానం చెప్పాలి. మునుగోడు తరహా వ్యూహాన్ని రూపొందించుకుని మూడోసారి కూడా అధికారంలోకి వస్తాం..’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ది ముగిసిన అధ్యాయం ‘దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌గాంధీ గుజరాత్లో ఎన్నికలు ఉన్నా వెళ్లడం లేదు. ఎవరు ఎంతగా పనిచేసినా కాంగ్రెస్ బతకదనే సంకేతాలు రాహుల్‌గాంధీ ఇస్తున్నారు. కాబట్టి దేశంలో కాంగ్రెస్‌ది ముగిసిన అధ్యాయమే..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఆ ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదు.. ఎన్నికలకు సిద్ధమైపోండి: సీఎం కేసీఆర్ -
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లపై తేల్చేసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, పార్టీ శ్రేణులంతా ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామని తెలిపారు. ఎన్నికలకు 10 నెలల సమయమే ఉంది. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలి. మంత్రులు ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మూడోసారి కూడా మనదే గెలుపు కావాలని ఆకాంక్షించారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. వాళ్లకు దర్యాప్తు సంస్థలు ఉంటే మనకు కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రసంస్థలో రాష్ట్ర సంస్థలో తేల్చుకుందామని అన్నారు. పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. నాకు తెలియకుండా ఏదో చేస్తున్నామనుకుంటే మీ పొరపాటు. మీ ఫోన్లపై నిఘా ఉంటుంది. పార్టీ మారాలని ఎవరైనా ఒత్తిడి తేస్తే నాకు సమాచారం ఇవ్వండి అని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. చదవండి: (ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ) -
సై‘కిల్’: టీడీపీ నేతల పోరు.. తముళ్ల బేజారు
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): ఎవరికి టికెట్టు దక్కుతుందో తెలియదు కానీ, మాకంటే మాకేనంటూ టీడీపీ నేతాగణం అప్పుడే ప్రచారం మొదలుపెట్టింది. అడ్డొస్తే సహించేది లేదంటూ పార్టీలోని తమ ప్రత్యర్థి వర్గంపై అడ్డంగా విరుచుకుపడుతున్నారు. రెండుగా విడిపోయి ఎవరికి వారు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందర్నీ ఒకచోటకు తెచ్చి సయోధ్య కుదర్చాల్సిన పార్టీ జిల్లా అధినేత తనకే టికెట్టు దక్కుతుందో లేదో తెలియక బయటకు రావడమే మానేశారు. ఎన్నికలకు రెండేళ్లుండగానే నేతలు కుమ్ములాటల్లో తేలియాడుతుండడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. జిల్లాలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల తీరుతో కేడర్ విసిగిపోతోంది. కొంత మంది ఆ పార్టీ కీలక నాయకులు బహిరంగంగానే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. చదవండి: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? ‘పల్లె’.. మూటాముల్లె సర్దుకోవాల్సిందే! తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై తిరుగుబాటు చేస్తున్న నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించి అగ్గిరాజేశారు. ఈసారి సైకం శ్రీనివాస రెడ్డికే టికెట్ అని బాంబు పేల్చారు. ఇదే క్రమంలో పుట్టపర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న కూడా ‘పల్లె’పై తిరుగుబావుటా ఎగరేశారు. నాలుగు రోజుల క్రితం బుక్కపట్నం మాజీ ఎంపీపీ పెదరాసు సుబ్రమణ్యం మీడియా ముందుకు వచ్చి.. ‘పల్లె’కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పనిచేయబోనని స్పష్టం చేశారు. ఓబుళదేవరచెరువు మండలానికి చెందిన మాజీ ఎంపీపీ ఇస్మాయిల్, కొత్తచెరువులో రఘుపతి (మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్), పెద్దన్న (లోచెర్ల), నిషార్ అహ్మద్ (మాజీ డీలర్), మండల మాజీ కన్వీనర్ శ్రీనాథ్ తదితరులు పల్లె రఘునాథ రెడ్డికి దూరంగా ఉంటున్నారు. ఇంత జరుగుతున్నా ఆయన పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో కిందిస్థాయిలోని కార్యకర్తలు నిరుత్సాహంలో కూరుకుపోయారు. ‘పల్లె’ వెంట వెళ్లాలా? వద్దా? అనే సంశయంలో పడ్డారు. ధర్మవరంలో పరిటాల వర్సెస్ వరదా ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి బీజేపీలో చేరిన వరదాపురం సూరిని మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని పరిటాల శ్రీరామ్ చెబుతున్నారు. ఒకవేళ ఆయన చేరాల్సి వస్తే తానే కండువా వేసి ఆహ్వానిస్తానని.. పార్టీ కోసం కష్టపడ్డాక పదవుల కోసం రెకమెండ్ చేస్తానని గతంలో పేర్కొన్నారు. సూరికి ధర్మవరం టికెట్ ఇస్తే మాత్రం తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలపై వరదాపురం సూరి వర్గీయులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. సూరి టీడీపీలో చేరడం ఖాయమని, పరిటాల శ్రీరామ్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. కదిరిలో అత్తార్ వర్సెస్ కందికుంట కదిరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట తారాస్థాయికి చేరింది. అత్తార్ చాంద్‌బాషా, కందికుంట వెంకటప్రసాద్ మధ్య కోల్డ్‌వార్ కొన్నిరోజులుగా హీట్ పుట్టిస్తోంది. టికెట్ తమకంటే తమకేనంటూ ఎవరికి వారు సొంత కేడర్ ఏర్పాటు చేసుకుని వేరు కుంపట్లు పెట్టుకున్నారు. అన్ని మండలాల్లో వర్గాలను ప్రోత్సహిస్తున్నారు. కందికుంట అనుచరులు ఇటీవల అత్తార్ అనుచరుడిపై దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. పెనుకొండలో తెరచుకోని టీడీపీ కార్యాలయం పెనుకొండ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిది విచిత్ర పరిస్థితి. ఈ సారి నియోజకవర్గ పార్టీ టికెట్ యూత్‌కేనంటూ అధిష్టానం తేల్చేయడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడిపోయారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడైన తనకే అధిష్టానం చెక్ పెట్టేలా వ్యవహరిస్తుండడంతో నెల రోజులుగా పట్టణంలోని టీడీపీ కార్యాలయాన్ని కూడా ఎక్కువగా తెరవడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ రేసులో అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్.సవితమ్మతో పాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా ఉన్నారు. బీకే నాయకత్వంపై సోమందేపల్లి, పరిగి, పెనుకొండ మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటరమణ, బోయ సూరి, నాగలూరు నారాయణస్వామి తదితరులు అసంతృప్తితో ఉన్నారు. మడకశిరలో ఈరన్న వర్సెస్ తిప్పేస్వామి మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య సమన్వయం లోపించింది. గత కొన్ని రోజులుగా ఇద్దరూ ఒకే కార్యక్రమంలో కనిపించడంలేదు. ఈరన్న ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. కాగా గుండుమల తిప్పేస్వామి తనకు అనుకూలంగా ఉన్న మరొకరిని ఎమ్మెల్యే రేసులోకి తెచ్చే ప్లాన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. బాలయ్యో.. ఇటు చూడయ్యో.. హిందూపురంలో అయితే తెలుగు తమ్ముళ్లది కక్కలేని మింగలేని పరిస్థితి. ఎంతో నమ్మకంతో గెలిపించిన నందమూరి బాలకృష్ణ ఈ మధ్య ఇటు చూడడమే మానేశారు. సినిమా షూటింగుల్లో బిజీబిజీగా ఉంటున్నారు. చుట్టుపు చూపుగా అప్పుడప్పుడు వస్తున్నా.. గృహ ప్రవేశాలు, వివాహాల ఫంక్షన్లకే పరిమితమవుతున్నారు. తను నమ్మి ఇక్కడ ఉంచిన పీఏనేమో అసాంఘిక కార్యకలాపాల్లో తలమునకలైన పరిస్థితి. దీంతో ఆ పార్టీ కేడర్ నైరాశ్యంలో మునిగిపోయింది. -
బిహార్ ఫలితాలు-ఆసక్తికర అంశాలు
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారి సామాజిక నేపథ్యం ఏమిటీ? వారు సమాజంలో ఏ వర్గానికి చెందిన వారు? తెలుసుకునేందుకు విజేతల కుల, మతాలు, ఆడ, మగ అంశాలపై ‘త్రివేది సెంటర్ ఆఫ్ పొలిటికల్ డాటా’ పరిశోధకులు వివరాలు సేకరించి ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ వద్ద నున్న డాటాతో విశ్లేషించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 40.7 శాతం మంది ఇతర వెనకబడిన వర్గాల (ఓబీసీ)కు చెందిన వారు కాగా, అగ్రవర్ణాలకు చెందిన వారు 30 శాతం మంది, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు 16. 5 శాతం మంది ఉన్నారు. ముస్లిం మతానికి చెందిన వారు 8 శాతం మంది ఉన్నారు. అగ్రవర్ణాల వారికన్నా ఇతర వెనక బడిన వర్గాల వారే ఎక్కువ మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక పార్టీల పరంగా చూస్తే అగ్రవర్ణాలకు చెందిన వారు బీజేపీ తరఫున 34 మంది, రాష్ట్రీయ జనతాదళ్ తరఫున 13 మంది జేడీయూ తరఫున పది మంది, కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడుగురు విజయం సాధించారు. వెనకబడిన వర్గాలకు చెందిన వారు రాష్ట్రీయ జనతాదళ్ తరఫున 39 మంది, బీజేపీ తరఫున 27 మంది, జేడీయూ తరఫున 22 గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున ఇద్దరంటే ఇద్దరే విజయం సాధించారు. (చదవండి: కొలువు దీరిన నితీష్ కొత్త సర్కార్) ఇక టిక్కెట్ల కేటాయింపు విషయానికొస్తే మొత్తం 110 అభ్యర్థుల్లో అగ్రవర్ణాలకు 52 టిక్కెట్లు, ఇతర వెనకబడిన వర్గాలకు 39, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి 15 టిక్కెట్లు, షెడ్యూల్డ్, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికి ఒక టిక్కెట్ కేటాయించింది. ముస్లిం వర్గానికి ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదు. బీజేపీకి చెందిన మరో ముగ్గురు అభ్యర్థుల కులాలేమిటో నిర్ధారణ కాలేదు. ఇక రాష్ట్రీయ జనతాదళ్ పోటీ చేసిన 144 నియోజకవర్గాల్లో ఓబీసీలకు 69 టిక్కెట్లు, అగ్రవర్ణాలకు 23, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి 18, ముస్లింలకు 19 టిక్కెట్లను కేటాయించింది. ఆర్జేడీ తరఫున పోటీ చేసిన మరో 14 మంది అభ్యర్థుల కులాలేమిటో నిర్ధారణ కాలేదు. అయితే వారిలో ఎక్కువ మంది ఓబీసీలేనని అర్థం అవుతోంది. జేడీయూ విషయానికొస్తే ఓబీసీలకు 59 టిక్కెట్లు, అగ్రవర్ణాలకు 23 టిక్కెట్లు, షెడ్యూల్డ్ కులాలకు 18, ముస్లింలకు 11, షెడ్యూల్డ్ తెగలకు ఒక టిక్కెట్ కేటాయించారు. ముగ్గురు అభ్యర్థుల వివరాలు తెలియరాలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా అగ్రవర్ణాల వారికే ఎక్కువ సీట్లను కేటాయించగా, ఆర్జేడీ, జేడీయూ పార్టీలు వెనకబడిన వర్గాల వారికే కేటాయించాయి. ఇక అగ్రవర్ణాల్లో ఏ సామాజిక వర్గానికి పార్టీలు ఎక్కువ టిక్కెట్లు కేటాయించాయో పరిశీలిస్తే ఏ వర్గానికి ఆ పార్టీలు ప్రాధన్యత ఇచ్చాయో కూడా స్పష్టం అవుతుంది. బీజేపీ 24.5 శాతం టిక్కెట్లను రాజ్‌పుత్‌లకు, 11.8 శాతం టిక్కెట్లు బ్రాహ్మణులు, 7.3 శాతం టిక్కెట్లు భూమిహార్లు, బిహార్‌లో ఓబీసీలుగా పరిగణించే కొమట్లు కూడా వారి జనాభాతో పోల్చి చూస్తే ఎక్కువగానే ఇచ్చింది. ఇక ఓబీసీల్లో యాదవ్‌లకు 13.6 శాతం, ఇతర ఓబీసీలకు 22 శాతం టిక్కెట్లు కేటాయించింది. జనతాదళ్ యూ పార్టీ ఓబీసీల్లో కుర్మీలకు 14 శాతం, యాదవ్‌లకు 13 శాతం టిక్కెట్లను కేటాయించగా, యాదవ్‌లు, కుర్మీలు కాకుండా ఇతర ఓబీసీలకు 25 శాతం టిక్కెట్లను కేటాయించింది. ఆర్జేడీ 31 శాతం టిక్కెట్లను యాదవ్‌లకు, మిగతా శాతం టిక్కెట్లను మిగతా అన్ని వర్గాలకు కేటాయించింది. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల వారికి 40 శాతం టిక్కెట్లను, ముస్లింలకు 17 శాతం టిక్కెట్లను కేటాయించింది. బీజీపీ కారణంగా 2000 సంవత్సరం నుంచి బీహార్ ఎన్నికల్లో ఠాకూర్ల ప్రాబల్యం పెరగతూ వస్తోంది. అందుకనే ఆ రాష్ట్రంలో బీజేపీని రాజ్‌పుత్‌ల పార్టీగా వ్యవహరిస్తున్నారు. తగ్గిన మహిళల ప్రాతినిధ్యం గత అసెంబ్లీ కన్నా ఈసారి ఎన్నికల్లో పలు పార్టీల తరఫున ఎక్కువ మంది మహిళలు పోటీ చేసినప్పటికీ తక్కువ మంది విజయం సాధించడం గమనార్హం. 2015 ఎన్నికల్లో 273 మంది మహిళలు పోటీ చేయగా, ఈసారి 371 మంది పోటీ చేశారు. వారిలో మహా కూటమి తరఫున 62 మంది పోటీ చేయగా, ఏన్డీయే తరఫున 37 మంది పోటీ చేశారు. గత ఎన్నికల్లో 28 మంది మహిళలు విజయం సాధించగా, ఈసారి 26 మంది మాత్రమే విజయం సాధించారు. -
విజయనగరం ఎన్నికల సభలో గందరగోళం
-
విజయనగరం టీడీపీలో అసమ్మతి జ్వాలలు
సాక్షి, విజయనగరం: జిల్లాలో టీడీపీలో అసమ్మతి జ్వాలలు కొనసాగుతున్నాయి. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్నప్పటికీ పలు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అనిశ్చితి నెలకొంది. కొన్ని చోట్ల టికెట్లపై స్పష్టత రాకపోవడం.. మరికొన్ని చోట్ల టీడీపీ ప్రకటించిన అభ్యర్థులపై తీవ్ర అసంతృప్తి చెలరేగడం పార్టీకి తలనొప్పిగా మారింది. నెలిమర్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. నియోజకవర్గంలో మరోసారి ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేపట్టాలని టీడీపీ భావిస్తోంది. దీంతో ఆశావహులు తమ వంతుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే పత్తివాడ నారాయణ స్వామి నాయుడు, భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగర్రాజుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్న త్రిమూర్తులు రాజు.. చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీ టికెట్‌ను ఆ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగర్జునకు కేటాయించింది. నాగర్జునకు టికెట్ కేటాయించడంపై కె త్రిమూర్తులు రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైన ఈ సారి ఎమ్మెల్యేగా బరిలో నిలిచేందుకు త్రిమూర్తులు రాజు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగా సోమవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గీతకు మొండిచేయి... విజయనగరం టిక్కెట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకు మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రూపంలో గట్టి షాక్ తగిలింది. ఈ స్థానానికి తొలుత గీత, అశోక్ కుమార్తె ఆదితి గజపతిరాజు మధ్య పోటీ నెలకొంది. అయితే అశోక్ గట్టిగా పట్టుపట్టడంతో ఈ స్థానాన్ని టీడీపీ అధిష్టానం ఆదితికి కేటాయించినట్టుగా ప్రచారం సాగుతోంది. సిట్టింగ్‌ను కాదని ఆదితికి టికెటు కేటాయించడంపై బీసీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయం పట్ల ఆగ్రహంతో ఉన్న గీత ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గజపతినగరంలో అసమ్మతి జ్వాలలు.. మరోవైపు గజపతినగరం నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి చోటుచేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకు మళ్లీ టికెట్ కేటాయించడంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అప్పలనాయుడు సోదరుడు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కొండపల్లి కొండలరావుకు టికెటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ తనకు కేటాయించని పక్షంలో కొండలరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలువాలని భావిస్తున్నారు. కాగా, జిల్లాలో పూర్తి స్థాయిలో పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండానే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. -
మహానేతను అనుసరించిన వైఎస్ జగన్
సాక్షి, ఇడుపులపాయ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలకు గాను మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన సంచలనానికి తెరలేపారు. ఇప్పటికే 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. అన్ని సామాజిక వర్గాలకు సమప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ జగన్ ఒకేసారి మొత్తం అసెంబ్లీ స్థానాలకు అభ్యుర్థుల్ని ప్రకటించి తండ్రి బాటను అనుసరించారు. 2009 ఎన్నికల సందర్భంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 294 ఎమ్మెల్యే స్థానాలకు 282 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరారు. కేవలం పాతబస్తీ సీట్లను మాత్రమే తర్వాత ప్రకటించారు.ఇక అభ్యర్థుల జాబితా విడుదల అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చాం. బీసీలకు 41 సీట్లు కేటాయించాం. చంద్రబాబు బీసీలను మోసం చేశారు. బలిజలకు ఇచ్చిన సీట్లను బీసీల కోటాలో చూపించారు. తద్వారా బీసీలకు టికెట్ల కోటా పెంచామని మోసం చేస్తున్నారు. ముస్లిం సోదరులకు 5 సీట్లు కేటాయించాం. గతంలో కన్నా ఒక సీటు పెంచాం. ప్రజాభిప్రాయ సేకరణ, సర్వేల మేరకు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్ కేటాయించలేదు. అందరికీ ధన్యవాదాలు’ అన్నారు. -
ఎన్ని కుట్రలు చేసినా టిక్కెట్ నాదే
తూర్పుగోదావరి, ఏలేశ్వరం, (ప్రత్తిపాడు): ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రత్తిపాడు టీడీపీ టిక్కెట్ తనదేనని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని లింగంపర్తి గ్రామంలో తన ఇంటివద్ద మంగళవారం నియోజకవర్గ టీడీపీ, తనవర్గం నేతలతో సమావేశం నిర్వహించారు. ఇటీవల ప్రత్తిపాడు టీడీపీ టిక్కెట్ డీసీసీబీ చైర్మన్, తన మనువడు వరుపుల రాజాకు ఇచ్చినట్టుగా కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో రావడంతో ఎమ్మెల్యే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ అనుభవంతోపాటు 13 ఏళ్లుగా అనేక పదవులు చేసిన తనకు గానీ, గత 36 ఏళ్లుగా టీడీపీకి సేవలు అందిస్తున్న పర్వత కుటుంబానికి గానీ అధిష్ఠానం టిక్కెట్ ఇస్తుందన్నారు. ఇద్దరిలో ఎవరికి ఇవ్వకపోయినా వేరే అభ్యర్థిని గెలిపించే ప్రశ్నేలేదన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వరుపుల రాజా తనను మోసం చేస్తాడని అనుకోలేదన్నారు. టిక్కెట్ విషయంలో చంద్రబాబుపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల పెదబాబు, ఎంపీపీ అయిల సత్యవతి, గొంతిన సురేష్, రొంగల సూర్యారావు, వాసిరెడ్డి భాస్కరబాబు పాల్గొన్నారు. -
ఎంపీని తెచ్చి ఎమ్మెల్యేను చేశారు.. ఇప్పుడేమో..!!
సాక్షి, అమరావతి : టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలకు టికెట్లు ఇస్తే దగ్గరుండి ఓడిస్తామని కొవ్వూరు ఎమ్మెల్యే, మంత్రి జవహర్‌కు టికెట్ కేటాయింపుపై కార్యకర్తలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక మొదటి నుంచీ పార్టీకి సేవలు చేసిన వారికి కాకుండా ఫిరాయింపుదారులకు ప్రాధాన్యమిస్తున్నారంటూ టీడీపీ సీనియర్ నాయకులు పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా ఉన్న తనను ఎమ్మెల్యేగా పోటీ చేయించి.. ఇప్పుడు టికెట్ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా లేకపోవడంతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ నేతలో సీఎం చంద్రబాబు ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన గైర్హాజయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పనిచేసిన తనను అవమానిస్తున్నారని ఆయన ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ స్థానం అభ్యర్థి ఎంపికలో తన పేరు లేకపోవడం పట్ల పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైనట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో నరసారావు పేట లోక్‌సభ స్థానం నుంచి మోదుగుల గెలుపొందిన విషయం తెలిసిందే. టీడీపీ మోదులకు టికెట్ ఇవ్వడం లేదా..! గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు చర్చించారు. గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా.. ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి.. ఆలపాటి రాజా, తాడికొండ.. తెనాలి శ్రవణ్‌కుమార్‌కు కేటాయించినట్టు సమాచారం. కాగా, గుంటూరు పశ్చిమ స్థానానికి కోవెలమూడి రవీంద్ర, మన్నవ మోహన్ కృష్ణ, చందు సాంబశివరావు, గుంటూరు తూర్పు స్థానానికి మద్దాలి గిరి.. ముస్లిం వర్గానికి చెందిన ఇంకో ముఖ్యనేత పేరు పరిశీలనలో ఉన్నాయి. పత్తిపాడు నియోజకవర్గానికి రిటైర్డ్ ఐఏఎస్ రామాంజనేయులు, డొక్కా మాణిక్యవరప్రసాద్, మంళగిరి స్థానానికి కాండ్రు కమల కుటుంబ సభ్యుల్లో ఒకరు, తిరువీధుల శ్రీనివాసరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. -
ఫిరాయింపు ఎమ్మెల్యేకు టీడీపీ షాక్..!
సాక్షి, అమరావతి : టీడీపీలో టికెట్ల లొల్లి మొదలైంది. కొవ్వూరు, నిడదవోలు, పత్తిపాడు ఎమ్మెల్యే టికెట్లు సిట్టింగులకు కేటాయించొద్దని పార్టీ నేతలు అధిష్టాన్ని హెచ్చరించినట్టు సమాచారం. రాజమండ్రి, కాకినాడ పార్లమెంటు స్థానాల పరిధిలో శనివారం అభ్యర్థుల ఎంపిక సమావేశం జరిగింది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై చర్చ సందర్భంగా.. కొవ్వూరు స్థానం మంత్రి జవహర్‌కు కేటాయించొద్దని తమ్ముళ్లు పట్టుబట్టారు. జవహర్ మద్యం, ఇసుక మాఫియాలో కూరుకుపోయాడని పార్టీ నాయకులు అదిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తమ మాటను లెక్కచేయక జవహర్‌కు టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు. ఇక, కాకినాడ పార్లమెంటు పరిదిలోని పత్తిపాడు ఫిరాయింపు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు చంద్రబాబు టికెట్ నిరాకరికంచిట్టు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో వరుపుల రాజాకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది. నిడదవోలు పరిస్థితి కూడా అంతే.. నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలోనూ సందిగ్ధం నెలకొంది. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు సీటు ఇవ్వొద్దని స్థానిక నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కుటుంబ పెత్తనం ఎక్కువైందని, శేషారావు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరావుపై కూడా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అభ్యర్థిని మార్చాలని నేతలు డిమాండ్ చేశారు. నేతల విభేదాలతో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యుర్థుల ఎంపిక వాయిదా పడింది. -
‘అందుకే గులాబీ కండువాను వదల్లేకపోతున్నా’
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించి రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉంటే.. నేను మాత్రం బాధపడుతున్నా’ అని అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు. గత నాలుగేళ్లుగా కేసీఆర్ అపాయింట్మెంట్ లభించడం లేదని వాపోయారు. వనస్థలిపురంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను బీసీ నేత అయినందునే టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక అమరవీరుడి తల్లిగా తనను బాధపెట్టడం మంచిది కాదని చెప్పారు. ‘టికెట్ నిరాకరించి శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేస్తారో.. అన్యాయం చేస్తారో కేసీఆర్‌కే వదిలేస్తున్నాను. నా కొడుకు మెడలో వేసుకున్న గులాబీ కండువాను వదల్లేకపోతున్నా. ఇప్పటికీ కేసీఆర్ నాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది.’ అని వ్యాఖ్యానించారు. వెయ్యి మంది అమరుల కుటుంబాలకు 2014లో ఒక సీటు ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ రెబల్స్ ఫ్రంట్ నుంచి 40 మంది..
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ అసమ్మతి నేతలు కూటిమిగా ఏర్పడి గళం విప్పారు. కాంగ్రెస్ రెబల్స్ ఫ్రంట్ పేరుతో 40 మందిమి ఎన్నికల బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీమంత్రి విజయరామారావు, రవీందర్, బొడా జనార్ధన్ కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఆర్సీ కుంతియా ముగ్గురూ కూటమిగా ఏర్పడి మహాకూటమి పేరుతో మాయ చేశారని మండిపడ్డారు. రేపటి బీసీల బంద్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ‘మా నలభై మంది గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం. టికెట్లు అమ్ముకున్నారు కాబట్టే.. చివరి నిముషంలో కాంగ్రెస్‌లో చేరిన 19 మందికి సీట్లిచ్చారు. స్క్రీనింగ్ కమిటీ మమ్మల్ని ఎంత ఖర్చు పెడతారు. ఎన్ని డబ్బులున్నాయని అడిగింది. మరోసారి సమావేశమై అభ్యర్థుల్ని ప్రకటిస్తాం’ అని రెబల్స్ ఫ్రంట్ సభ్యులు తెలిపారు. పారాచూట్ నేతలకు సీట్లు లేవన్నారు.. పారచూట్ నేతలు, నాలుగు సార్లు ఓడిన నేతలకు టికెట్లిచ్చారని విజయరామారావు ధ్వజమెత్తారు. అయినా, పారాచూట్ నేతలకు టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని రాహుల్ గతంలో చెప్పాడని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక రాహుల్ గాంధీ ప్రిన్సిపల్స్‌కు అనుగుణంగానే జరిగిందా అని ఆయన టీపీసీసీ నేతలను ప్రశ్నించారు. పార్టీలో కనీసం ప్రాథమిక సభ్యత్వం లేనివారికి కూడా సీట్లెలా కేటాయించారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఉత్తమ్ అమ్ముకున్నారని విజయరామారావు ఆరోపించారు. కాంగ్రెస్, కూటమి నేతల తీరుతో మళ్లీ టీఆర్ఎస్ గెలిచే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీని ముంచేందుకే ఉత్తమ్ ఉన్నాడు.. ధర్మపురి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత రవీందర్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. నాలుగు సార్లు పోటీ చేసి ఓడిన వారికి కూడా టికెట్లెలా ఇస్తారని నిప్పులు చెరిగారు. ‘మా ధర్మపురిలో నాలుగు సార్లు ఓటమిపాలైన వారికి టికెట్ ఇచ్చారు. ప్రజల్లో సానుభూతి అంటే.. ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటుంది. అయిదో సారి కూడా ఉంటుందా’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ముంచేలా ఉత్తమ్ వ్యవహరించాడని ఆరోపించారు. కాంగ్రెస్ రెబల్స్ ఫ్రంట్ తరపున ధర్మపురి నుంచి పోటీకి దిగుతానని రవీందర్ స్పష్టం చేశారు. కాగా, ధర్మపురి టికెట్‌ను కాంగ్రెస్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు కేటాయించినన సంగతి తెలిసిందే. -
పొన్నాల ప్రయత్నాలు ఫలించేనా?
సాక్షి, న్యూఢిల్లీ: జనగామ అసెంబ్లీ సీటు విషయంలో హైడ్రామా నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య జనగామ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాల్లో జనగామ సీటు విషయం తేల్చకపోవడంతో.. ఈ సీటును కోదండరామ్‌కు కేటాయించారని ప్రచారం సాగింది. దీంతో పొన్నాల రాహుల్‌గాంధీ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. జనగామ సీటుపై రాహుల్ పొన్నాలకు హామీ ఇచ్చారనీ.. కోదండరామ్ వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనగామపై స్పష్టత లేదు.. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మీడియాతో శుక్రవారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ‘జనగామ సీటు విషయంలో జరుగుతున్న పరిణామాలు సంతృప్తికరంగా లేవు. కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎటూ తేల్చలేదు. సీట్ల పంపకం ఆలస్యమవడం కొంత నష్టం కలిగించేదే. ఈ రోజు సాయంత్రం టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆర్సీ కుంతియా, పొన్నాలతో భేటీ అవుతాను’ అని తెలిపారు. ఏదేమైనా ప్రజాకూటమిగా ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతామని కోదండరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. టీజేఎస్ అభ్యర్థులకు రేపు బీ-ఫామ్‌లు ఇస్తామని తెలిపారు. టీజేఎస్ 8 సీట్లలో 6 సీట్లపై స్పష్టత వచ్చిందనీ, ఈ సాయంత్రం అభ్యర్థుల్ని ప్రకటిస్తామని తెలిపారు. చాడ వెంకట్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కోదండరామ్ తెలిపారు. టీజేఎస్ బలంగా ఉన్న నియోజక వర్గాల్లో ఇద్దరం కలిసి ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఒకటి, రెండు చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని అన్నారు. ప్రచారం అనుకున్నంత వేగంగా సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. -
కూటమిలో కుంపట్లు
-
‘టవర్’ ఎక్కిన కాంగ్రెస్ నిరసనలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు కాంగ్రెస్ నాయకులు తమ నిరసన వెళ్లగక్కారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయగా... మరికొందరు తమ భవిష్యత్ కార్యాచరణ రచిస్తున్నారు. తాజాగా.. టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత మానుకొండ రాధకిశోర్ అనుచరులు, కార్యకర్తలతో గురువారం సమావేశమయ్యారు. బల్లేపల్లిలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల నిర్ణయమే నాకు శిరోధార్యమని అన్నారు. ఈ నెల 19న కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఖమ్మం స్థానానికి నామినేషన్ వేస్తానని ప్రకటించారు. కష్టపడి పనిచేసేవారికి కాంగ్రెస్‌లో టికెట్ కేటాయించకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. సెల్ టవర్ ఎక్కి ఆందోళన సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ పార్టీ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనిపై దయాకర్ అభిమానులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తిరుమలగిరి మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దయాకర్‌కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ యువయుడు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టాడు. దయాకర్‌కు టికెట్ కన్ఫామ్ అయ్యేంతరకు టవర్ దిగేది లేదని హెచ్చరిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కామారెడ్డిలో... నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ టికెట్‌ను నల్లమడుగు సురేందర్‌కు కేటాయించడం పట్ల వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశమైన సుభాష్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు నిర్ణయించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రాజేంద్రనగర్‌లో.. తనకు టిక్కెట్ రాకపోడంతో పార్టీ కార్యాలయంలో కార్తీక్ రెడ్డి తన మద్దతుదారులతో కలిసి హంగామా చేశారు. పార్టీ జెండా దిమ్మను సుత్తితో కొట్టి ధ్వంసం చేశారు. ఫ్లెక్సీలు, జెండాలు చించివేశారు. రాజేంద్రనగర్‌లో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త రాజీనామా చేస్తారని హెచ్చరించారు. టీడీపీకి ఎవరితో ఓట్లేసి గెలిపించుకుంటారో గెలిపించుకోండంటూ సవాల్ విసిరారు. -
కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు..!!
సాక్షి, నిర్మల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్త నేతలు తమ భవిష్యత్ కార్యాచరణకు సిద్దమయ్యారు. కొందరు ఆయా పార్టీలకు రాజీనామా చేయగా... మరికొందరు రెబెల్స్‌గా ఎన్నికల బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామాలు చేయగా.. తాజాగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో కూడా టికెట్ల లొల్లి మొదలైంది. ముధోల్ నియోజకవర్గ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌కు టికెట్ రాకపోవడంతో ఆయన గురువారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. జాతీయ పార్టీ ఎన్సీపీ నుంచి ఆయన ముధోల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారని సమాచారం. అరుణతార కాంగ్రెస్‌కు రాంరాం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ తార కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బిచ్కుంద మండల కేంద్రం నుంచి గాంధీ భవన్‌కు ఆమె ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తొమ్మిదేళ్లు పార్టీ కోసం శ్రమిస్తే పార్టీ పట్టించుకోలేదనీ, టికెట్ ఇవ్వకపోవడంతోనే కాంగ్రెస్‌ను వీడుతున్నానని ప్రకటించారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి వచ్చిన తనకు మొదట టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని, అనంతరం మొండిచేయి చూపారని అరుణ వాపోయారు. మరో నాలుగు రోజుల్లో అభిమానులు, అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. -
జాబితా మళ్లీ వాయిదా..?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటనపై ఇంకా ఊగిసలాట కొన సాగుతోంది. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న జాబితా ప్రకటన.. శనివారమైనా విడుదలౌతుందా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఖరారు చేసిన 74 స్థానాల అభ్యర్థులను శనివారం ఉదయం ప్రకటిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా ప్రకటించినా.. కూటమికి కేటాయించే స్థానాలపై స్పష్టత లేకపోవడంతో ఈ వ్యవహారంలో సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఖరారయ్యాయని చెబుతున్న స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల నుంచి పలు అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో జాబితా ప్రకటన ఆదివారానికి వాయిదా పడే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. సీట్లపై అస్పష్టత.. అభ్యంతరాలు.. కూటమిలోని టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన కాంగ్రెస్ పార్టీ.. ఉమ్మడిగా కూటమి అభ్యర్థుల జాబితాపై ఈనెల 8న ప్రకటన చేస్తామని పేర్కొంది. అయితే అది సాధ్యం కాలేదు. కూటమి పక్షాలకు కేటాయించే స్థానాల సంఖ్యపై కొంత స్పష్టత ఇచ్చినా, ఏయే స్థానాలు కేటాయించారన్న దానిపై అస్పష్టత నెలకొనడంతో జాబితా ప్రకటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘ కసరత్తుల అనంతరం 74 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, తమ తొలి జాబితాను భాగస్వామ్య పార్టీల జాబితాలతో కలిపి ఈ నెల 10న ఉదయం విడుదల చేస్తామని కుంతియా ప్రకటించారు. అయితే టీడీపీ కోరుతున్న స్థానాల విషయంలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఆ పార్టీ ఆశిస్తున్న శేరిలింగంపల్లి స్థానాన్ని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ బలంగా కోరుతున్నారు. అలాగే ఎల్బీ నగర్ సీటును టీడీపీ కోరుతుండగా, అదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డి బలంగా ఉండటం.. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌లోని ఆశావహుల మధ్యే పోటీ ఎక్కువగా ఉండటంతో ఎటూ తేలడంలేదు. లక్ష్మయ్యకు ఓకే అయితే, మరి కోదండరామ్..? పటాన్చెరు స్థానాన్ని కచ్చితంగా కాంగ్రెస్‌కే కేటాయించాలని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాన్ని టీజేఎస్‌కు కట్టబెట్టడంపైనా జిల్లా నేతల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఇక పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పోటీ చేయనున్న జనగామను పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌కు కేటాయిస్తారని, అక్కడి నుంచి ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరగడం గందరగోళానికి తావిచ్చింది. కాగా, ఈ స్థానం నుంచి పొన్నాలే పోటీలో ఉంటారని కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే నిజమైతే కోదండరాంకు ఏ స్థానం కేటాయిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సీపీఐ.. ఊరుకుంటుందా..? ఇక వరంగల్ వెస్ట్ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారన్న వార్తల నేపథ్యంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. దీంతో ఈ స్థానంపై అధిష్టానం పునరాలోచనలో పడింది. ఇక కొత్తగూడెం విషయంలోనూ సీపీఐ, కాంగ్రెస్ మధ్య వివాదం రాజుకుంటోంది. ఈ స్థానాన్ని తమకే కేటాయించాలని సీపీఐ కోరుతుండగా, ఇప్పటికే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్రావుకు టికెట్ ఖరారైందని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం మొదలుపెట్టడంతో వివాదం ముదురుతోంది. వీటితో పాటే మరికొన్ని స్థానాలపై ఎటూ తేలకపోవడంతో శనివారం అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందా లేదా అనేదానిపై అయోమయం నెలకొంది. -
మహాకూటమిలో కాంగ్రెస్ టిక్కెట్ల గోల