
పరిగి: జిల్లాకు రెండు చొప్పున బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్‌కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని బీసీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న లాల్‌కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ రిజర్వేషన్ ఉన్నచోట తప్ప ఎక్కడా బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం లేదన్నారు. జనరల్ స్థానాలు ఉన్నచోట కూడా బీసీలకు టిక్కెట్లు ఇచ్చే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని మాణిక్‌రావ్ ఠాక్రేకు వినతిపత్రం అందజేశారు. పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment