bc welfare
-
విదేశీ విద్య దరఖాస్తులకు మోక్షమెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకం రెండు సీజన్ల నుంచి దరఖాస్తులకే పరిమితమవుతోంది. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ... ధ్రువపత్రాల పరిశీలన చేపడుతున్నప్పటికీ అర్హుల జాబితాలను మాత్రం విడుదల చేయట్లేదు. ఈ ఏడాది జనవరి, ఆగస్టులో దాదాపు 5 వేల మంది బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన యంత్రాంగం.. నెలలు గడుస్తున్నప్పటికీ అభ్యర్థుల అర్హతలను ఖరారు చేయడంలో తాత్సారం చేస్తోంది. దీంతో విదేశీ విద్యాభ్యాసంపై అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారు. కొందరు కోర్సును వాయిదా వేసుకోగా మరికొందరు పథకంపై ఆశలు వదులుకొని విదేశాల్లో చదువు కొనసాగించేందుకు వెళ్లిపోయారు.పెండింగ్... పెండింగ్... విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం విద్యానిధి పథకాన్ని అమలు చేస్తోంది. వివిధ సంక్షేమ శాఖల ద్వారా వేర్వేరు పేర్లతో ఈ పథకాన్ని అమలు చేస్తుండగా... ఎంపికైన అభ్యరి్థకి గరిష్టంగా రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. పీజీ కోర్సు మొదటి సంవత్సరం పూర్తి కాగానే రూ. 10 లక్షలు, రెండో సంవత్సరం పూర్తి చేశాక మరో రూ. 10 లక్షల చొప్పున సాయాన్ని విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. అలాగే ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ. 50 వేలు కూడా చెల్లిస్తోంది. ఈ క్రమంలో బీసీ సంక్షేమ శాఖ ఏటా 300 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో దరఖాస్తులను ఆహా్వనించగా 2,850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.జనవరి నెలాఖరులో అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించిన అధికారులు... విద్యార్థుల మార్కులు, పోటీ పరీక్షలకు సంబంధించిన స్కోరు వివరాలతో జాబితాలను తయారు చేసుకున్నారు. చివరగా పథకానికి అర్హత సాధించిన వారి జాబితాను విడుదల చేయాల్సి ఉండగా... వివిధ కారణాలతో జాబితా ప్రకటన వెలువడలేదు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు రావడం, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచి్చంది.ఇంతలో రెండో విడత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆగస్టులో ప్రారంభించిన అధికారులు... అదే నెలాఖరులో ధ్రువపత్రాల పరిశీలన సైతం పూర్తి చేశారు. కానీ ఇప్పటివరకు అర్హుల జాబితాను విడుదల చేయలేదు. రెండు విడతల్లో 300 మంది అర్హులను గుర్తించకుండా ఈ ప్రక్రియను పెండింగ్‌లో పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు అర్హుల జాబితాలను విడుదల చేసినప్పటికీ బీసీ సంక్షేమ శాఖలో నిలిచిపోవడంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. -
వెనుకబడిన వర్గాలకు చేయూత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నిధుల కేటాయింపును గణనీయంగా పెంచింది. బీసీ సంక్షేమ శాఖకు గత బడ్జెట్లో రూ.6,229 కోట్లు ఇవ్వగా.. ఈసారి సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా రూ.9,200.32 కోట్లను కేటాయించింది. వాస్తవానికి కొన్నేళ్లుగా బీసీ కార్పొరేషన్‌తోపాటు ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా లేవని.. ఈసారి ఊరట కలిగించేలా కేటాయింపులు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.⇒ వడ్డెర, కృష్ణబలిజ పూసల, వాల్మీకి బోయ, భట్రాజ, కుమ్మరి, శాలివాహన, సగర కో–ఆపరేటివ్ ఫెడరేషన్లకు, మేదర కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కో–ఆపరేటివ్ కార్పొరేషన్లకు రూ.50కోట్ల చొప్పున మొత్తం రూ.450 కోట్లు కేటాయించారు.⇒ తెలంగాణ తాడీ టాపర్స్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.68 కోట్లు.⇒ ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు, చేనేతకారుల సహాయానికి రూ.450 కోట్ల గ్రాంటు..⇒ నాయీబ్రాహ్మణ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.100 కోట్లు, వాషర్మెన్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్‌కు రూ.150 కోట్లు..⇒ ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర, ఈబీసీ వెల్ఫేర్ బోర్డులకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు.⇒ నీరా పాలసీకి రూ.25 కోట్ల గ్రాంటు ఇచ్చారు.⇒ మైనారిటీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,200 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.798 కోట్లు అదనంగా రూ.3,002.60 కోట్లు కేటాయించారు.⇒ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ఈసారి రూ.2,736 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఇచ్చిన రూ.2,131 కోట్లతో పోలిస్తే ఇది రూ.605 కోట్లు అదనం.⇒ ఇక ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల కోసం అన్ని సంక్షేమశాఖలకు కలిపి రూ.2,600 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.200 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాల కింద బీసీ సంక్షేమ శాఖకు అధికంగా రూ.1,650 కోట్లు కేటాయించారు.సంక్షేమ శాఖలకు కేటాయింపులివీ..శాఖ నిధులు (రూ.కోట్లలో)ఎస్సీ సంక్షేమం 28,724.53గిరిజన సంక్షేమం 15,123.91బీసీ సంక్షేమం 9,200.32మైనారిటీ సంక్షేమం 3,002.60మహిళా, శిశు సంక్షేమం 2,736.00కార్మిక సంక్షేమం 881.86 -
బాబు ఇంతేకదమ్మ!
బీసీ సామాజికవర్గాన్ని చంద్రబాబు కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారని ఆ సామాజిక వర్గం నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ తమకు మొండిచెయ్యే చూపుతున్నారని రగిలిపోతున్నారు. టీడీపీ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు కేవలం రెండు సార్లే బీసీలకు సీట్లు ఇవ్వడం చూస్తుంటే తమ సామాజికవర్గంపై బాబుకు ఎంత పగ ఉందో అర్థమవుతోందని పలువురు నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. బీసీలకు మారుపేరుగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కబ్జా చేశారని చర్చించుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లోనూ తన కుటిల బుద్ధి చూపి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తన సామాజిక వర్గానికి నాలుగు సీట్లు కట్టబెట్టి.. తమకు ఒక్క సీటూ ఇవ్వలేదని లోలోపలే రగిలిపోతున్నారు. ఈ ఎన్నికల్లో బాబును ఓడించి తీరుతామని పలువురు నేతలు తెగేసి చెబుతున్నారు. సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 33,59,457 మంది బీసీలు ఉన్నారు. ఇందులో బీసీ ఓటర్లే సుమారు 11 లక్షలు. ఓసీ ఓటర్లు సుమారు 8 లక్షలు ఉండొచ్చని అధికారులు చెబుతున్న లెక్కలు. ఇంత పెద్ద మొత్తంలో ఓటర్లు ఉన్న బీసీ సామాజిక వర్గానికి టీడీపీ కానీ జనసేన, బీజేపీ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అదే చంద్రబాబు సామాజికవర్గానికి మాత్రం ఏకంగా నాలుగు సీట్లు కేటాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. ఇద్దరు బీసీ సామాజికవర్గం వారికి టికెట్లు ఇచ్చి వారి పట్ల ఉన్న నిబద్ధతను చాటుకుంది. ఆ ఇద్దరిలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా భరత్‌కృష్ణ ఒకరైతే.. పలమనేరు నియోజకవర్గానికి వెంకటేగౌడ్కి టికెట్ ఇచ్చి బీసీలను గౌరవించింది. మూడన్నర దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కుప్పం మొదటిది. అటువంటి కుప్పం నియోజకవర్గాన్ని ఒక్క శాతం కూడా లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కబ్జా చేశారు. గత 35 ఏళ్లుగా కుప్పంలో బీసీలకు ఎమ్మెల్యే పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారు. బీసీల అమాయకత్వాన్ని ఓట్ల రూపంలో మలచుకుంటూ బీసీలను దగా చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో 48.23 శాతం బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉంటే.. అందులో 23.29 శాతం ఓట్లు వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం వారివే. టీడీపీ పుట్టినప్పటి నుంచి కేవలం వెయ్యి ఓట్లు కూడా లేని కమ్మ సామాజికవర్గం కుప్పాన్ని ఆక్రమించుకుని బీసీలను అణగదొక్కుతూ వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కుప్పంలో బీసీలకే పెద్దపీట వేస్తూ వస్తోంది. వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్‌కృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బీసీలను గౌరవించింది. సీఎంగా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు హైదరాబాద్, అమరావతికే పరిమితమైనా.. కుప్పంలో పెత్తనం కూడా కమ్మ సామాజిక వర్గం వారికే అప్పగించారు. టీడీపీ పురుడు పోసుకున్నప్పటి నుంచి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకే ఒకసారి శ్రీకాళహస్తి, పుంగనూరు అసెంబ్లీ స్థానాలకు బీసీ అభ్యర్థులను బరిలోకి దింపింది. అంతకుమించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ బీసీలకు టికెట్లు ఇచ్చి గౌరవించిన దాఖలాలు లేనే లేవు. బాబు కులస్తులకే పెద్దపీట కుప్పం మొదలు.. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన సామాజిక వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేస్తూ వచ్చారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులను పరిశీలిస్తే.. కుప్పం అభ్యర్థిగా చంద్రబాబు, చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ (కమ్మ), నగరి నుంచి గాలి భానుప్రకాష్ (కమ్మ), వెంకటగిరి అభ్యర్థిగా లక్ష్మీసాయి ప్రియ (కమ్మ) వారిని చంద్రబాబు ప్రకటించారు. కుప్పం, పలమనేరు, చిత్తూరు, తిరుపతి, నగరి, వెంకటగిరి నియోజక వర్గాల నుంచి బీసీలు టీడీపీ టికెట్ ఆశించినా చంద్రబాబు కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. టీడీపీ పుట్టినప్పటి నుంచి జెండా మోస్తున్న నరసింహయాదవ్ (తిరుపతి) టికెట్ కోసం ప్రతి సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రయత్నించినా చంద్రబాబు కరుణించిన దాఖలాలు లేవు. నగరి టికెట్ కోసం మొదలియార్లు, వెంకటగిరి అసెంబ్లీ కోసం చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీ టికెట్ ఆశించినా చంద్రబాబు పట్టించుకోకపోగా ఆయన సామాజికవర్గం వారికే కట్టబెట్టి “కమ్మ’టి ప్రేమను చాటుకుంటూ వస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఓటు బ్యాంకింగ్‌గా మార్చుకుంటూ పబ్బంగడుపుకుని వదిలేస్తున్న చంద్రబాబుకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి తీరుతామని బీసీ ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. -
తెలంగాణలో త్వరలో కులగణన
-
బాబూ.. బోత్ ఆర్ నాట్ సేమ్
సాక్షి, గుంటూరు: సామాజిక న్యాయం.. బహుశా దీని గురించి చంద్రబాబు హయాంలో ఎవరూ విని ఉండరు. ఎందుకంటే.. ఆయన తన కులం గురించి తప్పా ఇతర వర్గాల గురించి ఆయన ఆలోచించలేదు కాబట్టి. కానీ, గత నాలుగున్నరేళ్లలో అదెంటో ఏపీ ప్రజలు కళ్లారా చూస్తున్నారు. పదవుల్లో, పథకాల్లో అన్నింటా అన్ని వర్గాలకూ సమ న్యాయం చేస్తోంది ఇప్పుడు జగనన్న ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారిప్పుడు. పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలని అధికార పక్షానికి చంద్రబాబు సవాల్ విసిరుతున్నారు. అది సీఎం జగన్ సొంత నియోజకవర్గం. మరి పులివెందులలో ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టే దమ్ము టీడీపీకి ఉందా?. ఎన్నికలొస్తున్నాయి కదా అందుకే చంద్రబాబు స్వరం మారింది. బీసీలను ఉద్ధరించేవాడిలా స్టేట్మెంట్లు ఇస్తున్నారాయన. ►చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబు కూడా బీసీలనే దెబ్బకొట్టారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. అక్కడ ఓడిపోగానే.. బీసీలు ఎక్కువగా ఉండే కుప్పం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన బీసీల నోట్లో మట్టి కొడుతూ వస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు తనయుడ్ని అదే బాటలో నడిపిస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉండే మంగళగిరి నుంచి పోటీ చేయిస్తున్నాడు. ►బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బలంగా నమ్మారు. అందుకే బీసీలకు, అదే విధంగా ఇతర సామాజికవర్గాలకూ పెద్ద పీట వేశారు. ఇప్పుడు కులాలవారీగా ఏపీ ప్రజలపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్న చంద్రబాబు (2014-2019)తన హయాంలో ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? అలాగే సీఎం జగన్ తన హయాంలో సముచిత స్థానం కల్పించారో లెక్కలు చూస్తే.. 1)మంత్రి పదవులు చంద్రబాబు పాలనలో బీసీలు -8 వైఎస్ జగన్ పాలనలో బీసీలు-11 బాబు పాలనలో ఎస్సీలు -2 జగన్ పాలనలో ఎస్సీలు-5 2)స్పీకర్ బాబు పాలనలో కోడెల-కమ్మ సామాజిక వర్గం జగన్ పాలనలో తమ్మినేని సీతారాం - బీసీ శాసనమండలి ఛైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు 3)రాజ్యసభ ఎంపీలు బాబు పాలనలో బీసీలు-0 జగన్ పాలనలో బీసీలు-4 (50 శాతం) 4)ఎమ్మెల్సీ పదవులు బాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు -18 (37 %) జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు-29 (68 %) 5) సీఎం జగన్ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే.. అందులో నలుగురు (80 శాతం) బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లే. 6)13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో ఒక్క బీసీలకే 6 (46 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి ఏకంగా 9 జడ్పీ ఛైర్మన్ పదవులు(69 శాతం) ఇచ్చారు. 7) రాష్ట్రంలో 14 మున్సిపల్ కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తే.. 14 మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) ఇచ్చారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగానూ 12 పదవులు (86 శాతం) వారికే ఇచ్చారు 8 ) 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగితే.. అందులో 84 మున్సిపాల్టీలలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో 44 మున్సిపల్ ఛైర్మన్ పదవులను బీసీలకు(53 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలవర్గాలకు కలిపి 58 మున్సిపల్ ఛైర్మన్ పదవులు(69 శాతం) ఇచ్చారు. 9) వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 53 పదవులు (39శాతం) బీసీలకే ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 137 పదవుల్లో 79 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. 10) 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి... 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే అందులో 201 పదవులు బీసీలకు(41 శాతం) ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 484 పదవుల్లో 280 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. 11) బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. వాటికి ఆ వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులూ ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపుగా 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503... అంటే సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. ఈ లెక్కలు చాలావా? జగనన్న పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని చెప్పడానికి. ‘‘నాయీ బ్రహ్మణుల తోక కత్తిరిస్తా’’ ‘‘మత్స్యకారుల తోలు తీస్తా’’ ‘‘దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’’ ఇలాంటి కులహంకార వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు కాదా?.. దశాబ్దాల తరబడి రాజకీయ అనుభవం.. సీఎంగా ఉండి కూడా ప్రజలకు సామాజిక న్యాయం ఎందుకు అందించలేకపోయారు?.. అధికార దాహంతోనే ఇప్పుడు మళ్లీ అది చేస్తా.. ఇది చేస్తా.. అంటూ చిడతలు వాయిస్తున్నారిప్పుడు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన చంద్రబాబు- సామాజిక న్యాయం అందిస్తున్న సీఎం జగన్ ఒక్కటేనా?.. ఆయన బావమరిది బాలయ్య స్టైల్లోనే చెప్పాలంటే.. ‘‘బాబూ.. బోత్ ఆర్ నాట్ సేమ్’’. -
అసెంబ్లీ టికెట్లు ఇవ్వండి
పరిగి: జిల్లాకు రెండు చొప్పున బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్‌కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని బీసీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న లాల్‌కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ రిజర్వేషన్ ఉన్నచోట తప్ప ఎక్కడా బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం లేదన్నారు. జనరల్ స్థానాలు ఉన్నచోట కూడా బీసీలకు టిక్కెట్లు ఇచ్చే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని మాణిక్‌రావ్ ఠాక్రేకు వినతిపత్రం అందజేశారు. పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. -
కేసీఆర్ సర్కార్ రూ.లక్ష ఆర్థిక సాయం.. వెబ్సైట్ ఇదే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రాలతో ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. కులవృత్తులు, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరకు కొనుగోలు కోసం ప్రభుత్వం ఈ సాయం అందించనుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో ఈనెల 9న రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించనున్నారు. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది. దరఖాస్తు కోసం https://tsobmmsbc.cgg.gov.in క్లిక్ చేయండి -
తెలంగాణలో బీసీ సంక్షేమశాఖ ఎత్తేసే కుట్ర!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఏపీ సర్కార్ బీసీలకు మేలు చేస్తుంటే.. తెలంగాణ సర్కార్ తీరని అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. అంతేకాదు బీసీలకు సాయం అందిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ సర్కార్ మాట తప్పిందని, తెలంగాణలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఎత్తేసే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారాయన. ‘‘బీసీల్లో ఆరు కులాలకు మాత్రమే టీఎస్ సర్కార్ రూ. లక్ష సాయం అందిస్తోంది. గతంలో అనేక కులాలకు ఇస్తామని హామీ ఇచ్చింది. బీసీల్లో ఉన్న మిగతా 130 కులాలకు కూడా రూ. లక్ష సాయం అందించాలి’’ అని డిమాండ్ చేశారాయన. ఇక.. బీసీ బంధు ఇస్తామని రెండేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికీ ఆ హామీ నెరవేర్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారాయన. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్‌ఉన్న రాష్ట్రం కాబట్టి అందరికీ నిధులు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారాయన. ఉన్నత చదువులు చదివే విద్యార్థులను ప్రభుత్వమే ఆదుకోవాలని గుర్తు చేస్తున్నారాయన. అలాగే ‘‘తెలంగాణలో కులాంతర పెళ్లి చేసుకున్న వాళ్లకు రూ.10 వేలు ఇస్తున్నారు. కానీ, ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తెలంగాణలో బీసీ సంక్షేమ శాఖ ఎత్తివేసే కుట్రజరుగుతోందని, సీఎం పేషీలో కూడా అదే విధంగా జరుగుతోందని’’ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సంచలన ఆరోపణలు చేశారు. -
బీసీల అభ్యున్నతి కోసం సీఎం జగన్ కృషి
గుంటూరు రూరల్: బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విడదల రజిని చెప్పారు. నగర శివారు అమరావతిరోడ్డులో ఆదివారం బీపీ మండల్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో మంత్రులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న నేత సీఎం జగన్ అని కొనియాడారు. గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని, కానీ నేడు జగనన్న ప్రభుత్వంలో బీసీల అభివృద్ధి జరిగిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు మంత్రి పదవులు, చట్ట సభల్లో ప్రాధాన్యం దక్కిందన్నారు. బీపీ మండల్ బీసీల అభివృద్ధికి దేశ వ్యాప్తంగా తిరిగి జనాభా ప్రాతిపదికన ఎన్నో సంస్కరణలు చేశారని, వాటిని అమలు చేయాలని కోరారు. బీసీల అభివృద్ధికి జనగణన చేపట్టాలంటూ బీసీలంతా ఐకమత్యంగా ఒక వేదికపైకి రావడాన్ని అభినందించారు. జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్, కల్పలతారెడ్డి, ఎంపీ బీద మస్తాన్‌రావు, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, ఎమ్మెల్యే మద్దాళి గిరిధరరావు, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిల, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా, బీపీ మండల్ మనుమడు ప్రొఫెసర్ సూరజ్‌మండల్, ద్రవిడ కజగం ప్రెసిడెంట్ వీరమణి, తమిళనాడు ఎంపీ తిరుమావళాన్, బీసీ సంక్షేమ సంఘం నేత డాక్టర్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడలో సీఎం జగన్ కాన్వాయ్..
-
వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభ వేదికపైకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
జయహో బీసీ: ‘రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాముల్ని చేశాను’
జయహో బీసీ మహాసభ.. లైవ్ అప్డేట్స్ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ► ప్రతి గడపకు వాస్తవ పరిస్థితిని తీసుకెళ్లాలి. మంచి జరిగితేనే జగనన్నకు తోడు ఉండండని చెప్పండి. చంద్రబాబు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పండి ► వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. మానవతా వాదానికి వైఎస్ఆర్సీపీ ప్రతీక. నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతోంది. ► 2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలే. మనమంతా మారీచులు, పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదు. చంద్రబాబు, ఆయన బ్యాక్‌బోన్ ఎల్లో బ్రదర్స్, దత్తపుత్రుడు ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులో ఆలోచన చేయాలి. ►రెండో విడత కేబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. కేబినెట్లో పదకొండు మంది బీసీ మంత్రులు ఉన్నారు. కేబినెట్లో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్థానం కల్పించాం. ► చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించలేదు. కానీ, మన ప్రభుత్వం ప్రతీ అడుగులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాం. ఈ మూడున్నరేళ్లలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కితే.. సగం బీసీలకే ఇచ్చాం. ► ఎస్సీల్లో ఎవరైనా పుడతారా? అని చంద్రబాబు హేళన చేశారు. కానీ, మన హయాంలో అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకున్నాం. ► వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆత్మ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమమే. గడప గడపకు నవరత్నాలు అందించడమే లక్ష్యం. ► చరిత్రలో ఎవరూ వేయని విధంగా అడుగులు వేశాం. బీసీ కులాలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశాం. ► టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. కానీ, మన పాలనలో రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యం అయ్యారు. ► ఖబడ్దార్ మీ అంతు చూస్తా అని బీసీలను చంద్రబాబు బెదిరించాడు. తోకలు కత్తిరిస్తానన్నాడు. కానీ, బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములనే విషయం చంద్రబాబుకు చెప్పండి. ► మీ బిడ్డ జగన్ వయసు 49 ఏళ్లు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అవుతోంది. కానీ, 2024లో ఒంటరిగా పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. ► నా బీసీ కుటుంబం.. గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వాగతం. బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నాగరికతకు పట్టుకోమ్మలు బీసీలు. నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది. మీ హృదయంలో జగన్.. నా హృదయంలో మీరు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని.. బ్యాక్‌బోన్ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే అడుగులు. బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమ. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉంది. పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టింది. ఆధునిక విద్య బీసీలను వెనకబాటుకు గురి చేసింది. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు.. వెన్నెముక కులాలు చేస్తానని చెప్పాను. నేడు రాజ్యాధికారంలో వారిని భాగస్వాముల్ని చేశాను: సీఎం జగన్ ► సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం.. బీసీ సోదరులకు, అక్కచెల్లెమ్మలకు హృదయపూర్వక కృతజ్ఞతలతో మహాసభను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారాయన. ► నేతల ప్రసంగాలు పూర్తి కావడంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. అందరికీ అభివాదం తెలిపారు. చివరగా.. సీఎం వైఎస్ జగన్‌ను ప్రసంగానికి ఆహ్వానించారు. ► సీఎం జగన్ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహించారు. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదవాళ్లను చదువకు దగ్గర చేసిన ఘనత ఆయనది. ఒక యజ్ఞంలా సీఎం జగన్.. ఎన్నో సంక్షేమాలను ప్రజలు అందించారు. సీదిరి అప్పలరాజు గుర్తు చేశారు. ► మళ్లీ జగన్నే గెలిపించుకుందాం సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోనే సామాజిక న్యాయం జరిగిందని ఎమ్మెల్సీ పోతుల సునీత పేర్కొన్నారు. ఇక్కడి బీసీ నినాదాలు చంద్రబాబు గుండెల్లో వణుకు పుట్టించాలన్నారు ఆమె. బీసీల కోసం ఇంతలా కష్టపడే ముఖ్యమంత్రిని ఎవరం చూడలేదని ఆమె పేర్కొన్నారు. ధర్మానికి-అధర్మానికి.. నిజానికి-అబద్ధానికి రాబోయే రోజుల్లో యుద్ధానికి సిద్ధం కావాలని బీసీలను కోరారు ఆమె. సంక్షేమ పథకాలు కొనసాగాలన్న.. మంచి పాలన అందాలన్నా సీఎం జగన్నే మళ్లీ సీఎంగా చేసుకుందామని, దుష్టచతుష్టయానికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆమె పిలుపు ఇచ్చారు. ► 2024 ఎన్నికలకు మేమంతా సిద్ధం వచ్చే ఎన్నికలకు మేం సిద్ధం. సీఎం జగన్ 85వేల బీసీ సైన్యాన్ని తయారు చేశారు. ఈ సైన్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి.. మీకు అండగా ఉంటామన్న జగనన్న వెంట నడుద్దామని బీసీలను కోరారు మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడిపై పంచ్‌లు పేల్చారు జోగి రమేష్. వైఎస్ జగన్‌ను ఎదుర్కొలేని దద్దమ్మలు.. కుట్రలు చేస్తున్నారు. 2024లో 175కి 175 గెల్చి తీరుతాం అని ఆయన అన్నారు. ► బీసీలకు సీఎం జగన్ ఇచ్చింది ఆల్‌టైం రికార్డు లక్షమంది హాజరైన వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభలో మాజీమంత్రి అనిల్‌యాదవ్ భావోద్వేగంగా మాట్లాడారు. బీసీలకు సీఎం జగన్ ఇచ్చిన సంక్షేమం.. ఆల్‌టైం రికార్డు. ఇదే వేదిక నుంచి ఆయన చంద్రబాబుకు చరకలు అంటించారు. చంద్రబాబు డీఎన్ఏలో ఉంది కుళ్లు, కుతంత్రం తప్ప మరేమీ లేదు. చంద్రబాబుకు బీసీలు వణుకు పుట్టిస్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్‌ను గెలిపించి తీరతాం.. 175కి 175లో గెలిపిద్దాం అని బీసీలకు పిలుపు ఇచ్చారు అనిల్ యాదవ్. ► ఇవాళ బీసీల పండుగ. బీసీల తలరాతలు మార్చిన మహానేత సీఎం జగన్ అని మంత్రి గుమ్మనూరి జయరాం పేర్కొన్నారు. ► జయహో బీసీ మహాసభకు దాదాపుగా 80వేల మందికి పైగా బీసీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారని మంత్రి కారుమూరి తెలిపారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా?అని నిలదీశారు. అన్ని బీసీ కులాలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్‌దే అని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. ► బీసీల పల్లకి మోస్తున్న మహానేత సీఎం జగన్ అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ పేర్కొన్నారు. పూలేకి సరిసమానమైన నేత జగన్ అని ఆమె కితాబిచ్చారు. 139 కులాలకు రాజ్యాధికారంలో స్థానం కల్పించారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. ఆయన్ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత బీసీలదే అని ఈ సందర్భంగా మంత్రి ఉషా శ్రీ చరణ్ పిలుపు ఇచ్చారు. ► వెనుకబడిన కులాలే వెన్నెముక! నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ మహాసభను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల నుంచి భారీగా బీసీ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు ఈ సభకు హాజర్యారు. బీసీల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగిపోయింది. సభా ప్రాంగణంలో బీసీలతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. 11.31AM ► వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభ వేదికపైకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. అక్కడే ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే, మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ► బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. రాజకీయ గౌరవం ఇచ్చింది సీఎం జగన్ అని మంత్రి విడదల రజని పేర్కొన్నారు. సీఎం జగన్ బీసీ బాంధవుడు. చంద్రబాబు బీసీల పట్ల రాబందు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని అన్నారామె. ► విజయవాడ జయహో బీసీ మహాసభ.. ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► వార్డు మెంబర్ నుంచి రాజ్యసభ వరకు బీసీలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్‌ది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఆశాజ్యోతి పూలే, అంబేద్కర్ భావజాలం ఆయనది. చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మింగేస్తారు అని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ► బీసీల్లో పేదరికాన్ని తొలగించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు. బీసీల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. చదవుకు పేదరికం అడ్డుకావొద్దని ఆయన భావించారు: ఎంపీ మోపిదేవి ► బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్ భావించారు తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా అని చంద్రబాబు బీసీలను బెదిరించారు. కానీ, బీసీలే రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్ భావించారు. బీసీలకు సీఎం జగన్ ఏం చేశారో ఈ సభను చూస్తే తెలుస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నెముక అనే భావజాలాన్ని తెచ్చింది కూడా సీఎం జగనే అని పార్థసారథి పేర్కొన్నారు. బీసీలే రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్ భావించారు. రాష్ట్రంలో బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. గతంలో కాళ్లు అరిగేలా తిరిగినా సంక్షేమ పథకాలు వచ్చేవి కావు. కానీ, జగన్ పాలనలో ఇంటి గడపకే సంక్షేమ పథకాలు వస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే అని పార్థసారథి పేర్కొన్నారు. ► బీసీలు బాబుకి బుద్ధి చెప్పాలి: స్పీకర్ తమ్మినేని జయహో బీసీ మహాసభలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తామన్నారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ ఏకంగా లేఖ రాశాడు. కానీ, సీఎం జగన్ బీసీలకు గొప్ప ఆత్మగౌరవం ఇచ్చారు. బీసీలకు సమున్నత స్థానం కల్పించారు. చరిత్ర తెలియనివాళ్లు బీసీల తోకలు కత్తిరిస్తారా?బీసీలు జడ్జిలుగా పనికి రారా? ముసుగులు వేసుకుని మారువేషంలో వస్తున్నారు జాగ్రత్త.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బీసీలు బుద్ధి చెప్పాలి అని తమ్మినేని పిలుపు ఇచ్చారు. బీసీలకు పదవులిచ్చి ప్రొత్సహించింది సీఎం జగన్. ఎంపీపీ పదవుల్లో 67 శాతం పదవులు కల్పించారు. బీసీలకు 56 కార్పొరేషన్లు కేటాయించారు. బీసీలంతా ఆలోచించుకుని.. సీఎం జగన్ వెంట నడవాలని తమ్మినేని సీతారాం బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు స్పీకర్ తమ్మినేని. ► పదకొండు తరాల వెనుకబాటు తనానికి కారణం చంద్రబాబు కష్టం నా కులం అన్నాడు. మానవత్వం నా మతమన్నాడు. వ్యక్తిత్వం నా వర్గమన్నాడు. అదీ జగనంటే.. అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పేర్కొన్నారు. ‘‘బీసీల పక్షపాతి సీఎం జగన్. రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన వ్యక్తి కూడా. 139 బీసీ కులాలను ఏకం చేసిన నేత. చంద్రబాబు నాయుడు కేవలం కుల వృత్తులకే బీసీలను పరిమితం చేయాలనుకున్నాడు. పదకొండు తరాల వెనుకబాటుకి కారణం అయ్యాడు. కానీ, సీఎం జగన్ అలా కాదు’’ అంటూ ప్రశంసలు గుప్పించారు మంత్రి చెల్లుబోయిన. ► విజయవాడ దారులన్నీ జయహో బీసీ మహాసభ వైపే వెళ్తున్నాయి. సభ కోసం భారీ సంఖ్యలో బీసీలు తరలి వస్తున్నారు. బీసీ జయ జయ నాదాలతో విజయవాడ మారుమోగిపోతోంది. 80 వేల మంది అంచనాని దాటేసి.. సుమారు లక్ష మంది దాకా సభకు హాజరు అయ్యారు. ► ఆయనేమో బీసీలను చిన్నచూపు చూశారు బీసీలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారు. బీసీలంతా సీఎం వైఎస్ జగన్ వెంటనే ఉన్నారు. బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు కల్పించిన ఘతన సీఎం జగన్‌దే. బీసీలను చంద్రబాబు చిన్నచూపు చూశారు. కించపరిచారు. అలాంటిది.. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి సీఎం జగన్ అని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ► బీసీల ఆత్మగౌరవమే కాదు.. అభివృద్ధి జరిగింది ఏపీలో బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీలకు ఆత్మగౌరవాన్ని మాత్రమే కాదు.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది సీఎం జగనే అని ఉద్ఘాటించారాయన. మాయమాటలకు లొంగిపోకుండా.. మన అభివృద్ధికి పాటుపడుతున్న నిజమైన నేత వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ► బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ ‘జయహో బీసీ మహాసభ’ ప్రారంభోపన్యాసాన్ని చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బీసీ స్థితిగతులను మార్చేసిన వ్యక్తి సీఎం జగన్. సంచార జాతులను గుర్తించిన ఏకైక సీఎం కూడా ఈయనే. సీఎం జగన్ తన పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కేబినెట్లో పదకొండు మంది బీసీలకు స్థానం కల్పించారు. రాజ్యసభ పదవుల్లో సగం బీసీలకే ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్’’ అని కొనియాడారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. 09.35AM ► వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభం అయ్యింది. బీసీ నేతలంతా కలిసి జ్యోతి ప్రజల్వనతో ప్రారంభించారు. అనంతరం ప్రసంగోపన్యాసం సాగుతోంది. ► బీసీలంతా సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారు - మంత్రి కారుమూరి ► 14 ఏళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు బలహీనవర్గాలను కట్టుబానిసలుగా వాడుకున్నారు. బీసీలకు ఏపీలో మాత్రమే న్యాయం జరిగింది. బీసీ మహాసభ చరిత్రలో నిలిచిపోతుంది. - జోగి రమేష్ ► వెనుకబడిన కులాలే వెన్నెముక! నినాదంతో ఇవాళ(బుధవారం) విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహాసభను నిర్వహిస్తోంది అధికార వైఎస్సార్సీపీ పార్టీ. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు సభ కోసం తరలి వచ్చారు.. ఇంకా వస్తూనే ఉన్నారు. ► జయహో బీసీ మహాసభకు సీఎం జగన్ హాజరై.. ప్రసంగించనున్నారు. ► వైఎస్ఆర్సీపీ మినీ ప్లీనరీ తరహాలో ‘జయహో బీసీ మహాసభ’కు భారీ ఏర్పాట్లు చేశారు. ► బీసీ ప్రజాప్రతినిధులు వేలాదిగా తరలి రానున్నారు. భారీ సంఖ్యలో వచ్చే వారి కోసం అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు. ► జయహో బీసీ మహాసభకు హాజరయ్యే వాళ్ల కోసం విజయవాడ, గుంటూరు హోటళ్లు, కమ్యూనిటీ హాళ్లలో వసతి ఏర్పాటు చేశారు. ► బీసీ మహాసభ సందర్భంగా.. విజయవాడలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుచోట్ల ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ► బీసీలను సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దడమే లక్ష్యమని 2019 ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో చేసిన ప్రకటనను సీఎం జగన్ ఆచరించి చూపుతున్నారు. ఎన్నికల హామీలకు మించి అత్యధికంగా బీసీలకు ప్రయోజనం చేకూర్చారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బీసీ మహాసభ: నాడు అవమానం.. నేడు సమున్నతం..
నాడు బాబు హయాంలో... తమ హక్కులను పరిరక్షించాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తాత్కాలిక సచివాలయం సాక్షిగా తోకలు కత్తిరిస్తానంటూ అధికార దర్పంతో చంద్రబాబు బెదిరించారు. హామీలను నెరవేర్చాలని విన్నవించిన మత్స్యకారులను తాట తీస్తానంటూ హూంకరించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ అవహేళన చేశారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ దళితులను, కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ మహిళలను కించపరిచి తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారు. నేడు జగన్ పాలనలో... బీసీలను సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దడమే లక్ష్యమని 2019 ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో చేసిన ప్రకటనను సీఎం జగన్ ఆచరించి చూపుతున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో బీసీల ఖాతాల్లోకి రూ.85,915.06 కోట్లు జమ చేశారు. అమ్మఒడి నుంచి విద్యాదీవెన వరకూ వివిధ పథకాల ద్వారా బీసీ విద్యార్థులకు సింహభాగం మేలు చేస్తూ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ అత్యధిక పదవులను బీసీలకే కేటాయించారు. సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక చేయూత.. రాజ్యాధికారంలో సింహభాగం వాటా.. బీసీ బిడ్డల చదువులకు అండగా నిలిచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా బీసీ సామాజిక వర్గాలను సీఎం వైఎస్ జగన్ సమాజానికి వెన్నెముకలా నిలబెడుతున్నారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మూడున్నరేళ్లలో పేదలకు రూ.1,77,585.51 కోట్లను పారదర్శకంగా అందించగా బీసీ వర్గాలకే రూ.85,915.06 కోట్ల మేర ప్రయోజనం చేకూరటాన్ని ప్రస్తావిసు్తన్నారు. నగదు బదిలీ, నగదేతర బదిలీతో పేదలకు మొత్తం రూ.3,19,227.86 కోట్ల మేర లబ్ధి చేకూరగా బీసీ వర్గాలకే రూ.1,63,344.10 కోట్ల మేర మేలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టి అమ్మఒడి, విద్యాకానుక అందచేసి పిల్లలను చదువుకునేలా ప్రోత్సహించడంతోపాటు విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా బీసీ బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. అధికారంగా వాటా.. ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 17న వైఎస్సార్సీపీ ఏలూరులో బీసీ గర్జన సభను నిర్వహించింది. తాము అధికారంలోకి రాగానే బీసీలకు చేసే మేలును బీసీ డిక్లరేషన్ రూపంలో ఈ సభలో వైఎస్ జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక అందులో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా వారికి ప్రయోజనం చేకూర్చారు. అవి ఏమిటంటే... ► 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 50% ఓట్లతో 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్‌సభ స్థానాలతో చారిత్రక విజయాన్ని సాధించింది. 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరించారు. 25 మంది సభ్యులున్న తాజా కేబినెట్లో 11 మంది బీసీలకు స్థానం కల్పించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అంజాద్ బాషాతో పాటు బూడి ముత్యాలనాయుడును డిప్యూటీ సీఎంగా నియమించారు. విద్య, రెవెన్యూ, లాంటి కీలక శాఖలను ఆ వర్గాలకే అప్పగించారు. ► స్పీకర్‌గా బీసీ వ్యక్తి అయిన తమ్మినేనికు అవకాశం కల్పించారు. శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులుండగా అందులో బీసీలే అత్యధికం కావడం గమనార్హం. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా నలుగురు బీసీలను జగన్ రాజ్యసభకు పంపారు. ► స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించేలా టీడీపీ నేతలను చంద్రబాబు ఉసిగొల్పారు. హైకోర్టు తీర్పుతో బీసీల రిజర్వేషన్లు 24%కి తగ్గిపోయాయి. రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువగా బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని సీఎం హామీ ఇచ్చి మాటను నిలబెట్టుకున్నారు. ► 13 జిల్లా పరిషత్‌ల్లో 9 జడ్పీ చైర్పర్సన్ పదవులను (70%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. ఇందులో బీసీలకే పెద్దపీట వేశారు. ► మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకుగాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోగా అందులో 67 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. ఇందులో కూడా గరిష్టంగా బీసీలకే పదవులు దక్కాయి. ► 13 కార్పొరేషన్లనూ వైఎస్సార్ సీపీ క్లీన్‌స్వీప్ చేయగా ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే దక్కాయి. ఇందులోనూ బీసీలకే అగ్రతాంబూలం కల్పించారు. ► 87 మున్సిపాలిటీల్లో 84 వైఎస్సార్సీపీ కైవశం చేసుకోగా చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73% ఇచ్చారు. ఇందులోనూ బీసీలదే అధిక శాతం వాటా ఉంది. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు.. ► దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 % రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం చట్టం తెచ్చారు. 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76(39%) బీసీలకే ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు కేటాయించారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42%) ఇచ్చారు. పెద్దల సభకు ఒక్కరినీ పంపలేదు బీసీలు లేనిదే టీడీపీ లేదంటూ తరచూ చెప్పే చంద్రబాబు ఆ వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చాక వారికి వెన్నుపోటు పొడిచారు. 2014లో అధికార పగ్గాలు చేపట్టాక మంత్రివర్గంలో ఆరుగురు బీసీలకే బాబు అవకాశం కల్పించగా 11 మంది ఓసీలకు ఛాన్స్ ఇచ్చారు. 2014–19 మధ్య రాజ్యసభకు ఒక్క బీసీని కూడా బాబు పంపలేదు. నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ, మత్స్యకారులను తాట తీస్తానంటూ బెదిరించారు. అడుగడుగునా బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు. వైఎస్సార్సీపీ వెంటే బీసీలు.. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజ్యసభలో వైఎస్సార్సీపీ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టింది. అధికారంలోకి వచ్చాక బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషిచేస్తుండటంతో ఆ వర్గాలు వైఎస్సార్సీపీ వెంటే నడుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్ ఉభయ సభల్లో పోరాటం చేస్తూ బీసీల అభ్యున్నతి కోసం శాశ్వత కమిషన్‌ను సీఎం నియమించడంతో ఆయా వర్గాలు వైఎస్సార్సీపీకి వెన్నెముకలా నిలిచాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయాలు ఇందుకు నిదర్శనమని ప్రస్తావిస్తున్నారు. బీసీల జనాభా అధికంగా ఉండే కుప్పంలో టీడీపీ కోట కుప్ప కూలటానికి ఇదే కారణమంటున్నారు. -
Warangal: బర్త్‌డే వేడుకల్లో గొడవ.. శానిటైజర్ తాగిన విద్యార్థినులు
వరంగల్/ఎంజీఎం: హనుమకొండ జిల్లా ఆరెపల్లి సమీపంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం ఉదయం 10వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగారు. దీంతో రుతిక, స్ఫూర్తి, జోత్స్న, ఉమాదేవి, చార్విక అనే విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యు లు విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో స్కూల్ నిర్వాహకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ములుగు జిల్లా పాకాల కొత్తగూడకు సంబంధించిన జ్యోతిరావుపూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆరెపల్లి వద్ద ఒక ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. కాగా, శనివారం 10వ తరగతి విద్యార్థిని పుట్టినరోజు వేడుకల్లో తలెత్తిన గొడవ ఈ ఘటనకు దారి తీసినట్లు తెలుస్తోంది. బర్త్‌డేకు హాస్టల్లోని వారే కాకుండా ఇతర విద్యార్థులు కూడా హాజరు కావడంతో హాస్టల్ విద్యార్థినుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో ఈ గొడవపై వసతి గృహం అధి కారులు విద్యార్థినులను మందలించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ విషయాన్ని వారు ఆదివారం ఉదయం ప్రిన్సి పాల్ దృష్టికి తీసుకెళ్లడంతో గొడవతో సంబంధం ఉన్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. అధికారులు మాత్రం విద్యారి్థని బర్త్ డే వేడుకల్లో తలెత్తిన గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాగా, హాస్టల్లో విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లు ఆరా తీసినట్లు సమాచారం. ఆస్పత్రి లో ఉన్న విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని వై ద్యులకు సూచించినట్లు తెలుస్తోంది. విచారణకు ఆదేశించిన మంత్రి.. ఈ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ విచారణకు ఆదేశించినట్లు చెపుతున్నారు. మరో పక్క ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చే స్తున్నాయి. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవత్స పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారో.. తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. విద్యారి్థనుల తల్లిదండ్రులతో మాట్లాడి హాస్టల్లో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్ ఎదుట సంతోష్ హాజరు లేనట్టే! -
మాయ మాటలు చెప్పడానికి చాలామంది వస్తారు
సాక్షి, విజయవాడ: పలు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్ల నుంచి బీసీలుగా ముఖ్యమంత్రిగా పని చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ, ఏ ఒక్కరూ బీసీలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయారు. కానీ, సీఎం జగన్ మాత్రం బీసీల పక్షపాతిగా.. వాళ్ల తలరాతలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు బీసీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. గురువారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్ సామాజిక విప్లవకారుడు. ప్రతీ ఒక్క బీసీ మంచి చదవులు దిశగా అడుగులు వేయాలని కలలు కంటున్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకి అధికారంలో, బడ్జెట్లో కూడా వాటా ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. బీసీ కులాల గౌరవాన్ని ఆయన పెంచారు. బీసీల ఆత్మ గౌరవాన్ని గుర్తించిన సీఎం జగన్ గొప్ప విజనరీ. ఈ సంక్షేమ ఫలాలని ఎప్పటికీ గుర్తించుకోవాలి. మనకి మాయమాటలు చెప్పడానికి చాలా మంది వస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో పట్టుమని పదిమందికి మంత్రి పదవులు రాలేదు. అలాంటిది సీఎం జగన్ కేబినెట్లోనూ, ఇతర చోట్లా బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నామినేటెట్ పోస్టులలో బీసీలకి 50 శాతం కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది.రాజ్యసభ సీటు కోసం కోట్ల రూపాయల ఫండ్ తీసుకుంటున్న రోజులివి. అలాంటిది అలాంటిది.. బీసీ ఉద్యమ నేత అయిన నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. బీసీ బిల్లు పెట్టాలని 40 ఏళ్లగా పోరాటం చేశా. కొందరు ప్రధానులను, ప్రముఖ పార్టీలను కలిశా. ప్రయోజనం లేకుండా పోయింది. కానీ, ఒకేసారి సీఎం వైఎస్ జగన్‌ని కలిసి అడిగా. వెంటనే ఆయన స్పందించారు. వైఎస్సార్సీపీ ఎంపీలను పిలిపించి బీసీ బిల్లు పెట్టడానికి చర్యలు తీసుకోమన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టిన ఏకైకపార్టీగా వైఎస్సార్ సీపీ నిలిచిపోతుంది. ఇంతలా సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ జగన్‌కి అండగా నిలబడాల్సిన అవసరం బీసీలకు ఉంది అని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఇక ఈ కార్యక్రమంలో.. ఇక ఈ ఆత్మగౌరవ సభలో బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ మంత్రులు, ఎంపీలకు సన్మానం చేశారు. మంత్రులు జోగి రమేష్ , విడదల రజినీ, సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీ పోతుల సునీత.. ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ప్రతి జిల్లాకు 4 స్టడీ సర్కిళ్లు.. కేసీఆర్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్–1 వంటి కేంద్ర, రాష్ట్ర సర్వీసుల ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చేందుకు ‘ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని కోరారు. నాలుగు వర్గాలకు నాలుగు ఆల్ ఇండియా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో బడుగు, బలహీనవర్గాలకు విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా వర్గాల విద్యార్థినీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యనందించడం, పోటీ పరీక్షలకు శిక్షణనివ్వడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించడం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అందుబాటులో జాతీయ స్థాయి నోటిఫికేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగం, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో విడుదలయ్యే ఉద్యోగాల నోటిఫికేషన్లను స్టడీ సర్కిళ్లలో అందుబాటులో ఉంచాలని, అందుకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. చదువుకు తగ్గ ఉద్యోగ, ఉపాధి సమాచారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించే కేంద్రాలుగా స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు. అద్భుతమైన భూమికను పోషించాలి ‘స్టడీ సర్కిళ్లు క్యాంపస్ రిక్రూట్మెంట్ కేంద్రాలుగా మారాలి. ఎంప్లాయ్మెంట్ అవెన్యూలుగా వాటిని తీర్చిదిద్దాలి. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అందివచ్చే ఉద్యోగాలను అందిపుచ్చుకునే విధంగా యువతను తీర్చిదిద్దాలి. ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిల్ ఎలా ఉండాలో విధివిధానాలను అధికారులు రూపొందించాలి. ఇందుకు సమర్ధవంతులైన అధికారులను నియమించాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సులను పూర్తి చేసుకున్న తెలంగాణ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సర్కిళ్లు పోషించాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేట్ రంగాలలో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా మారాలి. శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతులు ఏర్పాటు చేయాలి. ప్రతి స్టడీ సర్కిల్లో కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను కల్పించాలి. ఆయా జిల్లాల్లో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అనుసరించి ప్రవేశాలు కల్పించే దిశగా విధివిధానాలు రూపొందించాలి. విద్యార్థులకు కల్పించినట్టుగానే విద్యార్థినులకు కూడా ప్రత్యేక వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి’ అని సీఎం ఆదేశించారు. అన్ని గురుకులాల్లో ఇంటర్మీడియెట్ పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలతో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో సైతం ఇంటర్మీడియెట్ విద్యను, కోర్సులను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక విద్యనుంచి ఉన్నతవిద్య వరకు పునాది వేస్తున్నట్టే, విద్యార్థి దశలో కీలకమైన మలుపుగా భావించే ఇంటర్మీడియెట్ విద్య వరకు కూడా ప్రభుత్వమే పునాది వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉన్నతాధికారిని నియమించాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులు ఎంతమంది? పదో తరగతి అనంతరం వారు ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని కోరారు. గురుకులాల్లో ఆధునిక కోర్సులు రాష్ట్రంలో ప్రస్తుతమున్న గురుకుల డిగ్రీ కళాశాలలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, మొత్తంగా జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో బీసీ వర్గాల జనాభా అధికంగా ఉందని, వారి జనాభా దామాషా ప్రకారం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పెంచాలన్నారు. సాంప్రదాయ కోర్సులను కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగావకాశాలను కల్పించే ఆధునిక డిగ్రీ కోర్సులను రూపొందించాలని సూచించారు. అలాగే ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. -
ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఐటీ కార్యదర్శిగా సౌరవ్‌గౌర్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా జయలక్ష్మీ, కార్మికశాఖ కార్యదర్శిగా జి. అనంతరాము బదిలీ అయ్యారు. -
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!
-
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణాలో వివిధ శాఖల్లో 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి తెరలేచిన నేపథ్యంలో వెనుక బడిన తరగతికి చెందిన నిరుపేదలకు ఉచితంగా శిక్షణనిచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ సమాయత్తమైంది. దాదాపు లక్షా 25వేలమందినిరుపేద ఉద్యోగుల శిక్షణ నిమిత్తం సమగ్ర కార్యాచరణను రూపొందించింది. బీసీ స్టడీ సెంటర్ల ద్వారా బీసీ విద్యార్థులతోపాటు, పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులను ఆయా పోటీ పరీక్షలకు తీర్చిదిద్దనుంది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం సాక్షి.కామ్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. బీసీ స్టడీ సెంటర్ పేరుతో 100 కొత్త కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని మరో యాభై అటువంటి కేంద్రాలు ఒక వారంలో సిద్ధం కానున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రూపు-1, గ్రూపు-2 లాంటి పోటీ పరీక్షలతోపాటు, పోలీసు, రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు, డీఎస్సీ, క్లరికల్ తదితర పోటీ పరీక్షలకు కూడా ఉచితంగా శిక్షణ యిస్తామన్నారు. ఇందుకుగాను స్క్రీనింగ్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఎంపికలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా వెంకటేశం స్పష్టం చేశారు. ఏప్రిల్ 16 న స్క్రీనింగ్ టెస్ట్ అలాగే కోచింగ్‌కు ఎంపికకు సంబంధించిన పరీక్ష ఏప్రిల్ 16న జరగనుందని, ఈ పరీక్షకు ఒక గంట ముందు కూడా రిజిస్ట్రేషన్లు అంగీకరిస్తామని ఆయన తెలిపారు. ఫలితాలను వెంటనే అన్లైన్లో ప్రకటిస్తామని చెప్పారు. ఈ స్క్రీనింగ్ పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ద్వారా వారు ఏ కోర్సుకు శిక్షణకు అర్హులో నిర్ణయించి, వారికి కౌన్సిలింగ్ ఇస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా శిక్షణ డిజిటల్ మీడియా ద్వారా అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. మెటీరియల్ అంతా సిద్ధంగా ఉంచామనీ, అలాగే వీడియోల ద్వారా ట్రైనింగ్ ఉంటుందన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అన్అకాడమీ, బైజూస్ లాంటి సంస్థలతో టైఅప్ కోసం ప్రయత్నిస్తున్నామని వెంకటేశం తెలిపారు. ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందేవారు సందేహాల నివృత్తి కోసం ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ కావచ్చని కూడా బుర్రా వెల్లడించారు. అలాగే ఫిట్నెస్ పరీక్షలు లాంటి కొన్ని తప్పనిసరి పరీక్షలకు, శిక్షణకు ఫిజికల్‌గా కూడా ఆన్లైన్ విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఉద్యోగార్థులకు అండగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుర్రా వెంకటేశం కోరారు. -
జ్యోతి బా పూలే జయంతి సందర్భంగా సాహిత్య రచనలకు ఆహ్వానం, ఏప్రిల్ 11న బహుమతి ప్రదానం
-
పెంచీ పెంచనట్టు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తాజా బడ్జెట్లో కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.175.46 కోట్లు ఎక్కువగా రూ.5,697.55 కోట్లను సర్కారు కేటాయించింది. నిర్వహణ పద్దులో పెరుగుదల ప్రభావంతో ఈ మేరకు బడ్జెట్ పెరిగినా సంక్షేమ పథకాలకు ప్రత్యేకంగా కేటాయింపులు పెరగలేదు. బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ.90 కోట్లు కేటాయించింది. 42 కులాల ఆత్మగౌరవ భవనాల కోసం ఇప్పటికే స్థలాలను ప్రభుత్వం నిర్దేశించగా తాజా కేటాయింపులతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కార్పొరేషన్లకు కోత.. ఫెడరేషన్లకు కొంత.. బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు తాజా బడ్జెట్ నిరాశ కలిగించింది. 2021–22 బడ్జెట్లో బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. తాజా బడ్జెట్లో ఒక్కో కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు చొప్పున ప్రకటించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.400 కోట్లు కోతపడింది. ఫెడరేషన్లకు గత బడ్జెట్లో రిక్త హస్తం చూపినా తాజా బడ్జెట్లో 12 ఫెడరేషన్లకు సింగిల్ డిజిట్లో నిధులు కేటాయించింది. ఉచిత విద్యుత్ పథకం కింద రజకులకు రూ.50 కోట్లు, నాయీబ్రాహ్మణులకు రూ.50 కోట్లు చొప్పున ప్రకటించింది. ఎస్సీలకు దండిగా.. ఎస్టీలకు మెండుగా.. ఎస్సీ అభివృద్ధి శాఖకు తాజా బడ్జెట్లో ప్రభుత్వం నిధులు భారీగా కేటాయించింది. రూ.20,624.88 కోట్లు ప్రతిపాదించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే పద్దు రూ.15,036.91 కోట్లు పెరిగింది. దళితబంధు పథకానికి ఏకంగా రూ.17,700 కోట్లు ప్రకటించడంతో బడ్జెట్ అమాంతం పెరిగింది. గిరిజన సంక్షేమానికి ప్రస్తుత బడ్జెట్లో రూ.3,415.41 కోట్లను కేటాయించింది. ఈ పద్దు గత బడ్జెట్‌తో పోలిస్తే 359.29 కోట్లు పెరిగింది. మైనార్టీ సంక్షేమ శాఖకు గత బడ్జెట్ కన్నా రూ.122.32 కోట్లు ఎక్కువగా రూ.1,728.71 కోట్లను ప్రకటించింది. నిధులు దాదాపు 7 శాతం మేర పెరగడంతో పెండింగ్ పథకాలకు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
బడ్జెట్లో బీసీలకు రూ. 10 వేల కోట్లివ్వాలి
కాచిగూడ: వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సంఘం ప్రతినిధులతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ఆయన సోమవారం కలిశారు. బీసీల బడ్జెట్‌పై చర్చించారు. బడ్జెట్లో బీసీ కార్పొరేషన్‌కు సబ్సిడీ రుణాల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు, బీసీ కులాల ఫెడరేషన్లకు రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు. నాలుగేళ్ల క్రితం సబ్సిడీ రుణాల కోసం 5 లక్షల 77 వేల మంది కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 40 వేల మందికే రుణాలు ఇచ్చారని, మిగతా 5 లక్షల 37 వేల మంది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు. బీసీ గురుకుల పాఠశాలలకు పక్కా భవనాల కోసం నిధులివ్వాలని.. ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ తదితర కోర్సులకు పూర్తి ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. -
50 మంది విద్యార్థులకు ఇన్స్పైర్ మానక్ అవార్డులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలకు చెందిన 50 మంది విద్యార్థులు ఇన్స్పైర్ మానక్ అవార్డులకు ఎంపికయ్యారని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన ఇన్స్పైర్ మానక్ అవార్డ్స్–2021–2022కు ఎంపిక కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ అవార్డును సాధించిన విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున పారితోషికం లభించనుందని తెలిపారు. అత్యధికంగా లేపాక్షి బాలుర గురుకులంలో ఐదుగురు, పుంగనూరు(పెదపంజాని) బాలికల గురుకులంలో 4గురు అవార్డులను సాధించారని పేర్కొన్నారు. అవార్డులు సాధించిన విద్యార్థులు, పోత్సహించిన ఉపాధ్యాయులను కృష్ణమోహన్ అభినందించారు. -
ఆదివారం.. వంట భారం.. సాయం తీసుకోమంటే ఏకంగా..
కోరుట్ల: రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ బీసీ గురుకుల పాఠశాలల నిర్వహణ గాడి తప్పుతోంది. గురుకులాల్లో ప్రతి ఆదివారం అల్పాహారం తయారు చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే పడుతోంది. వంట మనుషుల్లేక ఒక్కోవారం ఒక్కో తరగతి విద్యార్థులు ప్రణాళిక వేసుకొని కావాల్సినవి తయారు చేసుకోవాల్సి వస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులే చపాతీలు చేసుకోవడం వెలుగులోకి వచ్చింది. 67 గురుకులాలు.. 2,200 మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ బీసీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు 67 వరకు ఉన్నాయి. ఇందులో 5 నుంచి పదో తరగతి వరకు చదువు చెబుతుంటారు. ప్రస్తుతం వీటిలో సుమారు 2,200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురుకుల పాఠశాలల్లో రోజూ విద్యార్థులకు టిఫిన్ అందజేస్తారు. ప్రతి 80 మంది విద్యార్థులకు ఓ వంటమనిషి ఉంటారు. ఈ లెక్కన ఒక్కో గురుకులంలో సుమారు ఆరుగురు వంట మనుషులు ఉండాలి. కానీ చాలా స్కూళ్లలో ఈ లెక్కన వంట మనుషుల్లేరు. సగానికి మించి గురుకులాల్లో ఉదయం విద్యార్థులకు ఇవ్వాల్సిన టిఫిన్ కేటరింగ్ ద్వారా తెప్పిస్తున్నారు. లేదంటే విద్యార్థులతోనే తయారు చేయిస్తారు. దాదాపు మూడేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. సాయం తీసుకోమన్నందుకు.. వారంలో 6 రోజుల పాటు కిచిడీ, ఇడ్లీ, అటుకులు వంటి టిఫిన్లు వంట మనిషులు లేదా కేటరింగ్ ద్వారా తెప్పిస్తున్నారు. అయితే ఆదివారం గురుకులాల్లో తప్పనిసరిగా చపాతీ లేదా పూరీ టిఫిన్‌గా పెట్టాలి. ఒక్కో గురుకులంలో ప్రతి ఆదివారం ఒక్కో విద్యార్థికి రెండు చపాతీలు లేదా పూరీల చొప్పున దాదాపు వెయ్యి వరకు కావాలి. ఇంత పెద్దమొత్తంలో చపాతీలు, పూరీలు తయారుచేయడం వంట మనుషులకు తలకు మించిన భారమవుతోందని చాలాచోట్ల ఉన్నతాధికారులకు ప్రిన్సిపాళ్లు నివేదించినట్లు సమాచారం. దీంతో ఆదివారం పిల్లల సాయం తీసుకుని చపాతీ లేదా పూరీలు తయారు చేసుకోవాలని అధికారులు మౌఖికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఇదే ఆసరాగా కొన్నిచోట్ల గురుకులాల ప్రిన్సిపాళ్లు ప్రతి ఆదివారం ఓ క్లాసు చొప్పున విద్యార్థులే చపాతీలు, పూరీలు చేసేలా ప్రణాళిక వేసి వంటపనులు చేయిస్తున్నారు. మౌఖిక ఆదేశాలున్నాయి ఆదివారం పెద్దసంఖ్యలో చపాతీలు, పూరీలు తయారుచేయడం వంట మనుషులకు సాధ్యం కావట్లేదు. దీంతో పిల్లల సాయం తీసుకోవాలని అధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. ప్రతి ఆదివారం ఓ క్లాసు చొప్పున పిల్లల సాయంతో చపాతీలు చేయిస్తున్నాం. మిగిలిన రోజుల్లో పిల్లలకు సమస్య ఉండదు. – బాబు, ప్రిన్సిపాల్, కోరుట్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల -
బీజేపీకి బీసీ ఓట్లు అవసరం లేదా?: జాజుల
కవాడిగూడ (హైదరాబాద్): బీసీల లెక్కలు తీస్తేనే బీజేపీకి బీసీలు ఓట్లు వేస్తారని లేకుంటే బీజేపీని బీసీలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. జనాభా లెక్కల్లో బీసీ జనగణనను నిర్వహించేది లేదని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేయడాన్ని దేశంలోని 60 కోట్ల మంది బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. శనివారం దోమలగూడలోని బీసీ సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన బీసీ సంఘాల సమావేశంలో జాజుల మాట్లాడుతూ బీసీ జనాభా లెక్కలు తీస్తామని గతంలో చెప్పిన బీజేపీ ప్రభుత్వం నేడు మాట మార్చడం అంటే బీసీలను దగా చేయడమేనని ఆరోపించారు. 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని జనాభా లెక్కలు సేకరించాలని బీజేపీ పార్లమెంట్లో డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జనాభా లెక్కలు తీస్తామని ప్రకటించారన్నారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, సంఘం కార్యదర్శి జాజుల లింగం, యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, విద్యార్థి సంఘం నాయకులు మహేశ్, చంద్రశేఖర్‌గౌడ్, రాజేందర్, సాయితేజ్, అరవింద్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.