బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదు బ్యాక్ బోన్.. అంటూ కొత్త నిర్వచనం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి తన ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే వారి అభ్యున్నతి, సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు ఏకంగా రూ.15,061.64 కోట్లు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో బీసీలకు కేటాయింపులు చేయడం ఇదే తొలిసారి. ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.