AP Budget 2019
-
‘అప్పటి నుంచి మైండ్ మరింత దెబ్బతిన్నట్టుంది’
సాక్షి, అమరావతి : టీడీపీ అరాచక పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి 23 సీట్లిచ్చి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో అడ్డగోలుగా మాట్లాడుతున్న టీడీపీ సభ్యుల తీరుపై శాసనసభ స్పీకర్ పలుమార్లుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఓటర్లు కట్టబెట్టిన ప్రతిపక్షపాత్ర పోషించకుండా చంద్రబాబు వింతగా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. ‘అధికారం పోయిన తర్వాత మైండ్ మరింత దెబ్బతిన్నట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. గూగుల్ మ్యాప్స్ ప్రకారం కృష్ణా నది భవానీ ద్వీపం నుంచే మొదలవుతుందట. ప్రకాశం బ్యారేజి కట్టక ముందు లింగమనేని గెస్ట్ హౌజ్ ప్రాంతం నది వెలుపలే ఉండేదట. ఇదేం వాదన బాబూ?’అని చురకలంటించారు. మరొక ట్వీట్లో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారుల తీరుపై విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓడినా చంద్రబాబే సీఎం అని ఆ మధ్య మాజీ మంత్రి ఒకావిడ.. రాజపత్రంలో ప్రకటించినంత ధీమాగా చెప్పుకొచ్చారు. దీనిని గట్టిగా నమ్మినట్టున్నారు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలోని కొందరు అధికారులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో పెట్టడానికి ఇష్టపడటం లేదట. పచ్చ జీవులూ డినయలిజం నుంచి బయటపడండి. వాస్తవ ప్రపంచంలోకి రండి’అని హితవు పలికారు. -
సర్వజనాస్పత్రికి జీవం పోసిన వైఎస్ జగన్
ప్రభుత్వ సర్వజనాస్పత్రికి మహర్దశ చేకూరనుంది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్... ఆస్పత్రి రూపురేఖలు మార్చేందుకు వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది. రూ.250 కోట్లతో అదనపు భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే బడ్జెట్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.30 కోట్లు కేటాయించగా.. తాజాగా చిన్నపిల్లల వార్డుకు కలెక్టర్ రూ.45 లక్షలు మంజూరు చేశారు. ఇక నుంచి ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు ఉండాల్సిన బాధలు తప్పడంతో పాటు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. సాక్షి, అనంతపురం న్యూసిటీ : జిల్లాకే పెద్దదిక్కు అనంతపురంలోని సర్వజనాస్పత్రి. కానీ గత పాలకుల వివక్ష కారణంగా నిధులు లేక మెరుగైన సేవలందించలేకపోతోంది. బోధనాస్పత్రి ఏర్పడి 19 ఏళ్లయినా.. కనీసం పడకలు కూడా అందుబాటులో లేక జనం సతమతమయ్యారు. ఇవన్నీ గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభుత్వంలోకి వచ్చిన అనతి కాలంలోనే సర్వజనాస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రిలో ఈ ఏడాది చోటు చేసుకున్న శిశు మరణాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఆయన ఆదేశాలతో జూన్ 15న డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని సర్వజనాస్పత్రిని పరిశీలించి, మౌలిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. వాటన్నింటినీ ముఖ్యమంత్రికి అందజేయగా.. వెంటనే స్పందిస్తూ అదనపు పడకలు ఏర్పాటు చేయాలని భావించారు. అందులో భాగంగానే రూ.250 కోట్లతో 700 పడకలు ఏర్పాటు చేసేందుకు నూతన భవనం మంజూరు చేశారు. ఈ క్రమంలోనే నూతన నిర్మాణానికి స్థల సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ బాబ్జి రెండు రోజుల క్రితం ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. అంతేకాకుండా వివిధ వార్డులు, బ్లాక్‌లు ఎక్కడ ఏర్పాటు చేయాలో నివేదికను పంపాలని డీఎంఈ సూపరింటెండెంట్ డాక్టర్ బాబూలాల్‌కు ఆదేశించారు. ఆర్అండ్బీ కార్యాలయం అనువైంది ఉన్నతాధికారుల ఆదేశాలతో అదనపు భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించేందుకు గురువారం సూపరింటెండెంట్ బాబూలాల్ తన చాంబర్లో ఆర్ఎంఓ డాక్టర్ లలిత, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్, ఏఓ డాక్టర్ శ్రీనివాస్శౌరి తదితరులతో సమావేశమయ్యారు. ఆస్పత్రి ఆవరణలో మరో 700 పడకల భవనం నిర్మించే స్థలం లేదని తేల్చేశారు. అయితే రోగులకు ఇబ్బంది కలుగకుండా స్థలాన్ని పరిశీలించాలని భావించారు. ఈ క్రమంలోనే బోధనాస్పత్రిలో స్థలంలో నిర్మించిన ఆర్అండ్బీ కార్యాలయమైతే బాగుటుందని అందరూ నిర్ణయించారు. అక్కడ 3 నుంచి 5 ఎకరాల స్థలం ఉంటుందని, భవనం ఏర్పాటుకు అనువైన ప్రాంతమని నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్దామన్నారు. ఆస్పత్రిలోని మెడిసిన్, చిన్నపిల్లల విభాగం, ఆర్థో, సర్జరీ, తదితర విభాగాలతో పాటు ఓపీ బ్లాక్, మెడికల్ రికార్డ్ సెక్షన్, ఐసీసీయూలు, డయాగ్నస్టిక్ బ్లాక్ తదితర వాటిని నూతన భవనంలో మార్చితే రోగులకు మెరుగైన సేవలందించవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఇక ‘సూపర్’ వైద్యం అనంతలో వైద్య సదుపాయాలు పెంచాలని భావిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి.. ఈ మేరకు బడ్జెట్లో అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.30 కోట్లు మంజూరు చేశారు. ఈ ఆస్పత్రిలో 8 సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు ట్రామాకేర్ సెంటర్లో మౌలిక సదుపాయాల కోసం రూ.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందించేందుకు ట్రాక్కేర్ను మరింత బలోపేతం కానుంది. ఇక చిన్నపిల్లల వార్డుకు కలెక్టర్ రూ.45 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధుల ద్వారా మల్టీచానల్ మానిటర్స్, హైఫ్లో నాసల్ క్యాన్యులా, ఫోర్టబుల్ పంప్ సెక్షన్స్, లారింజోస్పోప్స్, సీ పాప్స్, కంప్రెసర్లు తదితర పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. -
అడ్డంగా దొరికి.. పారిపోయి వచ్చారు
సాక్షి, అమరావతి : పక్క రాష్ట్రాలతో తమ ప్రభుత్వం సన్నిహితంగా మెలుగుతోందనే బాధ టీడీపీ నేతల్లో స్పష్టంగా కనబడుతోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడిన దాంట్లో సబ్జక్ట్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. అందరికీ తెలిసిన విషయాలనే అచ్చెన్నాయుడు పదేపదే ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయి రాత్రికి రాత్రి హైదరాబాద్‌నుంచి పారిపోయి వచ్చారంటూ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆ భవనాలు ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నాయని, ఆ భవనాలకు మూడేళ్లుగా కరెంట్ బిల్లులు కూడా కట్టలేదని తెలిపారు. వాటిని ఎవరో ఒకరు ఉపయోగించుకోవాలనే తెలంగాణకు ఇచ్చామన్నారు. సీఎం జగన్ పాలనలో రైతులకు పెద్దపీట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎలీజా వ్యాఖ్యానించారు. గురువారం ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులకు సీఎం జగన్ పెద్దమొత్తంలో కేటాయింపులు చేశారని తెలిపారు. చింతలపూడి పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమని, చింతలపూడి ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రారంభించారని చెప్పారు. గత ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం విషయంలో అన్యాయం చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక మంది నిర్వాసితులు ఉన్నారని, వారిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖలో కూడా భారీగా అవినీతి జరిగిందన్నారు. టీడీపీ అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు. నీరు-చెట్టు పథకంలో అక్రమాలు జరిగాయి: మనుగుంట గత టీడీపీ ప్రభుత్వంలో నీరు-చెట్టు పథకంలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కందుకూరు సమస్యలను ప్రస్తావించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలింపు జరిగిందన్నారు. చెరువుల్లో నీళ్లు లేవని, కంప చెట్లతో నిండిపోయిందని అన్నారు. చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. మధ్య,చిన్న తరహా చెరువులపై దృష్టి సారించాలని కోరారు. తెలుగుగంగ ప్రాజెక్టును వైఎస్సార్ వరంలా ఇచ్చారు తెలుగుగంగ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజేశేఖరరెడ్డి గూడూరుకు వరంలా ఇచ్చారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. గూడూరు బ్యారేజీ ఎత్తు పెంపును పరిశీలించాలని కోరారు. తెలుగుగంగ ప్రతి ఒక్క చెరువుకు వెళ్లే విధంగా స్వర్ణముఖి నదిని అభివృద్ధి పరచటానికి 3టీఎంసీ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబుపై సెటైర్లు.. సభలో నవ్వులు..!
సాక్షి, అమరావతి : శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కృష్ణానది కరకట్టపై వెలిసిన అక్రమ కట్టడాల కూల్చివేతపై గురువారం సభలో వాడీవేడీ చర్చ జరిగింది. అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటున్న చంద్రబాబు తప్పును ఒప్పుకోకుండా చర్చను పక్కదారి పట్టిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ‘చట్టాలను ఎన్నటికీ అతిక్రమించను. సభాసంప్రదాయాలు పాటిస్తాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాటం చేస్తాను’ అని చంద్రబాబు వ్యాఖ్యానించడంపట్ల అంబటి చురకలంటించారు. ‘చంద్రబాబు మాటలు వింటుంటే నా రక్తం మరిగిపోతోంది’ అని అనడంతో సభలో నవ్వులు పూసాయి. సీఎం స్థాయిలో ఉండి అక్రమాలకు పాల్పడిందే కాకుండా ఈ విధమైన మాటలు చెప్పడం సమంజసమా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన బాబు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘ఇవన్నీ చేసికూడా సభా నియమాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ఉపన్యాసాలిస్తున్నారు. శభాష్ చంద్రబాబు’ అని అంబటి వ్యాఖ్యానించారు. లింగమనేని అక్రమ కట్టడంలో నివాసముంటున్న ఆయన అక్కడ నుంచి ఖాళీ చేసి గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. -
అక్రమ కట్టడాల తొలగింపుపై చర్చించడమా?
సాక్షి, అమరావతి : నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంవల్ల ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలు నీట మునుగుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అక్రమ కట్టడాలు తొలగిస్తే ఎవరైనా చర్చిస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కృష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమకట్టడాలపై శాసనసభలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద ప్రవాహాన్ని అడ్డుకునేలా ప్రజావేదిక నిర్మించారు. నదీపరివాహక ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అక్రమ కట్టడాలతో వరద ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు. దానివల్లే వరద ముప్పు పెరుగుతోంది. కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాల వల్ల తీవ్రనష్టం వాటిల్లుతోంది. వర్షాలు పడితే ముంబై, చెన్నై నగరాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటున్నాయో చూస్తున్నాం. అప్పటి సీఎం చంద్రబాబు రూల్స్ పాటించకపోవడంతో అక్రమకట్టడాలు వెలిశాయి. (చదవండి : చంద్రబాబు ఇంటికి నోటీసులు) ఫ్లడ్ లెవల్ 22.60 మీటర్లు ఉంటే చంద్రబాబు ఉంటున్న నివాసం 19.50 మీటర్ల ఎత్తులో ఉంది. స్వయంగా ఆయనే రివర్ కన్జర్వేటివ్ నిబంధనలు తుంగలో తొక్కారు. సామాన్యుడు అక్రమ నిర్మాణం చేపడితే వెంటనే కూల్చేస్తారు. ముఖ్యమంత్రయినా సామాన్యుడైనా ఒకటే నిబంధన ఉండాలి. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఉందంటూ ఊదరగొడతారు. నిబంధనలు అతిక్రమించేందుకేనా అనుభవం. రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికీ ఆదర్శంగా ఉండాలి. సీఎం హదాలో ఉన్న వ్యక్తి అక్రమాలకు పాల్పడితే మిగతా జనం అనుకరించరా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని రివర్ కన్జర్వేటివ్ ఇంజనీర్ రాసిన లేఖను ఈ సందర్భంగా సీఎం జగన్ స్పీకర్ దృష్టికి తెచ్చారు. (చదవండి : ప్రజావేదిక కూల్చివేత) -
తవ్వేకొద్దీ అక్రమాలే
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా పెండింగ్ ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామని 2014 జూలైలో అప్పటి సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. చెప్పిన మొత్తం కంటే ఐదేళ్లలో అదనంగా రూ.16 వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ, ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు’ అంటూ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ తూర్పారబట్టారు. పోలవరం ప్రాజెక్టులో ఒక్క గేటు అమర్చే డ్రామాకే చంద్రబాబు రూ.2.30 కోట్ల ఖర్చుతో ప్రకటన ఇచ్చారని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తవ్వుతున్న కొద్దీ చంద్రబాబు అవినీతి, అక్రమాలు, సినిమాలు, వీడియోలు, యాడ్లు బయట పడుతున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతి నిగ్గు తేల్చడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నిపుణుల కమిటీ, మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. అంచనా వ్యయాన్ని పెంచేసి చేపట్టిన పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి ప్రజాధనాన్ని ఆదా చేస్తామని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ పనుల్లో పారదర్శకత కోసం జ్యుడీషియల్ కమిషన్ నేతృత్వంలో టెండర్లు నిర్వహించాలనే విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని, ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని చెప్పారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమాధానం చెప్పారు. హంద్రీ–నీవా రెండో దశలో రెండో ప్యాకేజీలో రూ.10.43 కోట్ల విలువైన పని వ్యయాన్ని రూ.92 కోట్లకు పెంచేసి కమీషన్లు కాంట్రాక్టర్‌కు అప్పగించారని ఎత్తిచూపారు. రూ.5 కోట్ల పనికి రూ.137 కోట్లా? గాలేరు–నగరి తొలి దశలో 29వ ప్యాకేజీలో రూ.171 కోట్లకుగాను రూ.166 కోట్ల పని 2014 నాటికే పూర్తయిందని.. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక మిగిలిన రూ.5 కోట్ల విలువైన పనిని 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి విడదీసి దాని వ్యయాన్ని రూ.137 కోట్లకు పెంచి, రాజ్యసభ సభ్యుడి సంస్థకు అప్పగించి ప్రజాధనాన్ని దోచుకున్నారని మంత్రి అనిల్‌కుమార్ మండిపడ్డారు. టీడీపీ సర్కార్ హయాంలో మొత్తం 268 పనులను 60సీ నిబంధన కింద విడదీస్తే ఇందులో రూ.1,600 కోట్ల విలువైన పనులను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు నామినేషన్ పద్ధతిలో, టెండర్ నిబంధనలు మార్చి అప్పగించారని ఎత్తి చూపారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై నిపుణుల కమిటీ విచారణ చేస్తోందని.. ఆ తర్వాత గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, వంశధార తదితర ప్రాజెక్టుల అవినీతిని నిగ్గు తేల్చుతుందని స్పష్టం చేశారు. జీవో 22, 63 వల్లే పెరిగిన అంచనాలు టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. జీవో 22, జీవో 63 వల్లే అంచనాలు పెరిగాయి తప్ప భూసేకరణ వల్ల కాదన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ పనుల్లో రూ.6 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ తేల్చినా కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.68 వేల కోట్లు ఖర్చు చేస్తే.. రూ.60 వేల కోట్లను చంద్రబాబు సర్కార్ దోచేసిందని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. కుందురు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీళ్లు ఇచ్చి ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లోనే రూ.2,346 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు పచ్చ పత్రిక కథనం ప్రచురించిందన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిని తేల్చడానికి హౌస్ కమిటీ వేయాలని కోరారు. -
40 ఏళ్ల సీనియరైనా రూల్స్ పాటించాల్సిందే
సాక్షి, అమరావతి: శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి అంశాన్ని వివాదం చేసి, అన్యాయం జరిగిందని చూపి, సానుభూతి పొందాలని చూడటం ధర్మమా? అని ప్రశ్నించారు. సభలో ఎక్కడ కూర్చోవాలనే విషయంలో కూడా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ‘నిబంధనల ప్రకారమే శాసనసభలో సభ్యులకు సీట్లు కేటాయించారు. కేటాయించిన సీట్లలో కూర్చోవాలని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తయినా రూల్స్ పాటించాల్సిందే. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా, రెండోసారి ఎన్నికైనా.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఒకసారి ఓడిపోయినా ఎవరైనా చట్టసభలోనే కూర్చుంటారు కదా’ అని సీఎం వైఎస్ జగన్ చురకలంటించారు. శ్రీధర్‌రెడ్డి గుడ్ బాయ్ టీడీపీ సభ్యులు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనకు కేటాయించిన సీటులో కాకుండా మరో స్థానంలో కూర్చున్నారని స్పీకర్ దృష్టికి తెచ్చారు. దాంతో.. ‘మీ సీట్లోకి మీరు వెళ్లాలి’ అని స్పీకర్ సూచించడంతో శ్రీధర్ రెడ్డి తన స్థానంలోకి వెళ్లారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పక్కన ఉన్న సీటును బుచ్చయ్య చౌదరికి కేటాయించారని.. కానీ ఆ స్థానంలో అచ్చెన్నాయుడు కూర్చున్నారని.. తనకో న్యాయం, అచ్చెన్నాయుడుకో న్యాయమా అని కోటంరెడ్డి ప్రశ్నించారు. దాంతో అచ్చెన్నాయుడును ఆయనకు కేటాయించిన సీట్లో కూర్చోవాలని స్పీకర్ సూచించారు. చంద్రబాబు జోక్యం చేసుకుంటూ ప్రతిపక్ష నేతగా డిప్యూటీ లీడర్ల సీట్లు కేటాయింపు హక్కు తనకు ఉంటుందని, మిగతా సభ్యుల సీట్లను నిబంధనల ప్రకారం కేటాయించవచ్చునని, అచ్చెన్నాయుడుకు తన సీటు పక్కనే కేటాయించామని చెప్పారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పక్కన సీటును తనకు కేటాయించారని, ఆ స్థానంలో జ్యోతుల నెహ్రూ కూర్చుంటే.. ఆ స్థానంలో ఎలా కూర్చుంటారని ప్రశ్నించారని, ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు కూర్చోవాలని అప్పట్లో రూలింగ్ ఇచ్చిన అంశాన్ని ఎత్తిచూపారు. స్పీకర్ జోక్యం చేసుకుంటూ కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరిలకు సూచించారు. బుచ్చయ్య చౌదరి హాఫ్ హ్యాండ్ చొక్కాలో స్మార్ట్‌గా కనిపిస్తున్నారంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ శ్రీధర్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ సీట్లోనే కూర్చునేవారని.. ఇటీవల కూడా అక్కడే కూర్చుంటున్నారని.. ఆ సీటుపై వ్యామోహం కొద్దీ అక్కడే కూర్చుంటున్నారన్నారు. కానీ స్పీకర్ సూచించిన వెంటనే గుడ్ బాయ్‌లా శ్రీధర్ రెడ్డి తన స్థానంలో కూర్చున్నారని అనడంతో సభ నవ్వులతో నిండింది. నిబంధనలు మారవు కదా! సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు ప్రశ్నకు అనుబంధ ప్రశ్న అడిగేందుకు సమయం ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ప్రశ్నలు అడిగిన వారికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని.. ఇతరులకు ఇచ్చేది లేదని.. అనుమతి కోరితే అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ తేల్చిచెప్పారు. దీంతో చంద్రబాబు ఇదెక్కడి ప్రజాస్వామ్యమంటూ బెదిరించే రీతిలో మాట్లాడటంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాక.. అనుబంధ ప్రశ్నలు అడిగే హక్కు ఆ ప్రశ్న వేసిన వారికే ఉంటుందని చెప్పారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఈ మాత్రం నిబంధనలు తెలియవా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకుంటూ.. పది ప్రశ్నలకుగానూ ఇప్పటివరకూ రెండు ప్రశ్నలకే సమాధానం చెప్పారని.. ఇలాగైతే మిగతా ప్రశ్నలకు 10.30 లోగా సమాధానాలు పూర్తి చేయలేరని, బడ్జెట్‌పై చర్చను చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. -
ఆర్భాటం ఎక్కువ.. అభివృద్ధి తక్కువ
సాక్షి, అమరావతి: తమ బడ్జెట్లో ఎక్కడా గందరగోళం లేదని, అంతా స్పష్టంగా తేటతెల్లంగానే ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌పై టీడీపీ పక్షం చేసిన వాదనను తిప్పికొట్టారు. బడ్జెట్‌పై రెండు రోజులుగా శాసనసభలో జరిగిన చర్చకు మంత్రి బుగ్గన బుధవారం సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనంతా మ్యాటర్ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం శాసనసభ్యులు లేవనెత్తిన వాటికి అంశాల వారీగా సూటిగా సమాధానం చెప్పారు. తాము ఎక్కడా పన్నులు పెంచలేదని, గతంలో కన్నా తగ్గించామన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కన్నా తక్కువేనని వివరించారు. గత ఫిబ్రవరిలో చంద్రబాబు ప్రభుత్వం రూ.2,26,177 కోట్లతో వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే తమ ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.2,27,974.99 కోట్లతో ప్రతిపాదించామన్నారు. వ్యవసాయ బడ్జెట్లో ఎందుకు తేడా వచ్చిందని టీడీపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారని, వాళ్లు బడ్జెట్ ప్రతిని సరిగా చదివితే విషయం బోధ పడుతుందన్నారు. ద్రవ్యలోటుపై టీడీపీ వారిది అర్థం లేని ఆందోళన అంటూ.. 2015–16లో 3.58 శాతం, 2016–17లో 4.42 శాతం, 2017–18లో 4.03 శాతం, 2018–19లో 3.67 శాతం ఉంటే 2019–20లో 3.26 శాతమే ఉందని వివరించారు. వడ్డీలేని రుణాలకు కేటాయింపులు వచ్చే బడ్జెట్లో భారీ ఎత్తున ఉంటాయన్నారు. రూ.40 వేల ఆదాయం ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న వాటిలో 80 శాతం హామీల అమలుకు మొదటి ఏడాదిలోనే శ్రీకారం చుట్టామని మంత్రి బుగ్గన తెలిపారు. మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని వివరించారు. పశువులతో పాటు గొర్రెలకు కూడా ఈ ఏడాది నుంచే ఉచిత బీమా పథకాన్ని అమలు చేసేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. రూ.40 వేల ఆదాయం ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నట్టు సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పింఛన్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. టీడీపీ హయాంలో ఐటీ పరిశ్రమలు తీసుకు రాకుండానే తాము అడ్డుకుంటున్నామని ఆ పార్టీ నేతలు గగ్గోలు పెట్టడం సరికాదన్నారు. జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రశంసిస్తున్నామంటూనే అర్థం పర్థం లేని విమర్శలు చేయవద్దని విపక్షానికి సలహా ఇచ్చారు. చంద్రబాబు చేపట్టిన నీరు–చెట్టు పథకానికి నాలుగేళ్లలో రూ.793.36 కోట్లు కేటాయించి రూ.4,850 కోట్లు దోచేశారని ఆరోపించారు. స్పీకర్ ఆగ్రహం.. సభ వాయిదా బుగ్గన ప్రసంగం ముగిశాక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేచి బడ్జెట్‌పై మళ్లీ మాట్లాడబోగా సభలో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ దశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకుంటూ గత ఐదేళ్ల బడ్జెట్ సమావేశాలలో ఎన్నడూ ఇలా జరగలేదని, ఆర్థిక మంత్రి వివరణ తర్వాత మళ్లీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన సందర్భం ఎప్పుడూ లేదన్నారు. ఈ దశలో అచ్చెన్నాయుడు స్పీకర్‌ను ఉద్దేశించి అనకూడని మాట అనడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను గురువారం నాటికి వాయిదా వేశారు. దేశ దేశాలు తిరిగి చివరకు రాజమౌళికి.. అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించలేదని విపక్షం వాపోతోందని, వాస్తవానికి చంద్రబాబు కన్నా తామే ఎక్కువగా నిధులు కేటాయించామని బుగ్గన చెప్పారు. రాజధాని నిర్మాణాల పేరిట చంద్రబాబు, ఆయన బృందం తిరగని దేశం లేదని, ప్రత్యేక విమానాల్లో మలేషియా, సింగపూర్, జపాన్, కొరియా, శ్రీలంక, లండన్, కజకిస్తాన్.. ఇలా ఎన్నో దేశాలు తిరిగారని చెప్పారు. ఇలా ఎక్కడికి పోయినా అక్కడి మాదిరిగా నిర్మాణాలు ఉండాలంటూ అమరావతిని భ్రమరావతిగా మార్చి చివరకు రాజమౌళికి అప్పగించారని ఎద్దేవా చేశారు. రాజధాని అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం గత ఐదేళ్లలో ఖర్చు పెట్టింది కేవలం రూ.277 కోట్లయితే తాము ఈ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించామని వివరించారు. హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన గచ్చిబౌలి, నానక్‌రాం గూడాలో చదరపు అడుగు నిర్మాణం రూ.5 వేలకు మించి లేదని, కిటికీలు కూడా లేకుండా అమరావతిలో నిర్మించిన భవనాలకు చదరపు అడుగుకు రూ.12 వేలు వెచ్చించారన్నారు. పెన్షనర్లకు మధ్యంతర భృతి పెన్షనర్లకు కూడా మధ్యంతర భృతి ఇస్తామని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రెండు రోజుల్లోగా జారీ చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని ఇచ్చామన్నారు. కాగా ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల ప్రశ్నకు సమాధానంగా విజయవాడ, జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ అతిథి గృహాలు, పర్యాటక శాఖ అతిథి గృహాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వసతి సౌకర్యం, రాయితీలు కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తామని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్ర బోస్ చెప్పారు. -
‘చంద్రబాబు దేశాలన్ని తిరిగి రాజమౌళికి అప్పగించారు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎలాంటి అయోమయం లేదని ఆర్థిక మంత్రి బుగ్గ రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో పన్నులు చాలా తక్కువగా ఉన్నాయని వివిరించారు. కేవలం ఐదుశాతమే వడ్డీలేని రుణాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వడ్డీలేని రుణాలకు కేటాయింపులు వచ్చే బడ్జెట్లో భారీ ఎత్తున ఉంటాయని బుగ్గన వెల్లడించారు. యువజన క్రీడా సర్వీసుకు రూ. రెండువేల కోట్ల రూపాయలను కేటాయిస్తామని చెప్పి.. కేవలం రూ. 200 కోట్ల మాత్రమే గత ప్రభుత్వ ఖర్చు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. రాజధాని నిర్మాణం కొరకు పలు దేశాలు తిరిగి వచ్చిన చంద్రబాబు చివరకు సినీ దర్శకుడు రాజమౌళికి అప్పగించారని విమర్శించారు. రాజధాని నిర్మాణం కొరకు గత ఐదేళ్లలో రూ. 1700 కోట్లు ఖర్చు చేస్తే.. అందులో సగానికి పైగా కేంద్రమే ఇచ్చిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 277 కోట్లు మాత్రమే కేటాయించిందని వెల్లడించారు. సభలో బుగ్గన మాట్లాడుతూ.. ‘‘రాజధాని నిర్మాణం కొరకు తొలి బడ్జెట్లోనే రూ. 500 కోట్లు కేటాయించాం. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాల్లో సరైన వసతులు కూడా లేవు. చిన్న చినుక పడినా భవనాల్లోకి వర్షం నీరు వస్తోంది. అమ్మఒడి పథకానికిరూ. 6556 కోట్లు కేటాయించాం. ప్రతిపక్షం దానిపైన కూడా విమర్శలు చేస్తోంది. బడ్జెట్‌ను పూర్తిగా చదివితే మా ప్రాధాన్యతలు అర్థమవుతాయి. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, పారిశ్రామికరంగం, సాగునీరు, వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేశాం. తొలి బడ్జెట్లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన 80 శాతం హామీలకు కేటాయింపులు చేశాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఐదేళ్లలో టీడీపీ రూ.96 కోట్లు కేటాయిస్తే.. తాము తొలి బడ్జెట్లోనే రూ. 500 కోట్లు కేటాయించాం. శాసనసభ, మండలి వాయిదా.. బడ్జెట్‌పై బుధవారం చర్చ అనంతం శాసనసభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దానికి ముందు మండలి కూడా రేపటికి వాయిదా పడింది. -
కోర్కెలు తీర్చే దేవుడు జగనన్న : జనసేన ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేసిందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. ఈ విషయంలో ఆయన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని పండగలా చేశారని గుర్తుచేశారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారం ఇవ్వడం గొప్ప విషయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయని రైతులు ఆశించారు. అలాంటి బడ్జెట్‌నే సీఎం వైఎస్ జగన్ రూపొందించారు. పారదర్శకతతో బడ్జెట్‌ను తయారు చేశారు. బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే.. కోరని కోర్కెలు కూడా దేవుడు వైఎస్ జగనన్న అని మత్య్సకారులు చెబుతున్నారు. మత్స్యకారులను ఆదుకోవడానికి సీఎం వైఎస్ జగన్ నిధులు కేటాయించడం సంతోషం. బడ్జెట్లో అన్ని వర్గాల ప్రాధాన్యత ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. 108, 104లతో ప్రజల ఆరోగ్య భద్రత పెరిగింది. కానీ గత ప్రభుత్వం ఆ వాహనాలు తుప్పు పడుతున్న పట్టించుకోలేదు. ఈ బడ్జెట్ కేవలం 50 రోజుల్లో తయారు చేసింది కాదు. పాదయాత్రలో అన్ని వర్గాల కష్టాలను చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ బడ్జెట్ రూపొందించార’ని తెలిపారు. -
టీడీపీ సభ్యులకు సీఎం జగన్ సూచన..!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రతి అంశాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారని విమర్శించారు. సభలో ఎక్కడ కూర్చోవాలనే విషయంలో కూడా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ‘నిబంధనల ప్రకారమే శాసనసభలో సభ్యులకు సీట్ల కేటాయింపు జరిగింది. కేటాయించిన సీట్లలో కూర్చోవాలని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తయినా రూల్స్ పాటించాల్సిందే. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా, రెండోసారి ఎన్నికైనా.. ఎవరైనా చట్టసభలోనే కూర్చుంటారు కదా’ అని సీఎం చురకలంటించారు. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. దాదాపు 10 ప్రశ్నలు సభ్యులు అడగాల్సి ఉండగా.. ఇంతవరకు రెండు ప్రశ్నలు మాత్రమే అడిగారని, విలువైన సభా సమాయాన్ని వృథా చేయొద్దని టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. -
టీడీపీ సభ్యుల తీరుపై భగ్గుమన్న స్పీకర్..!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నడవనీయకుండా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించేందుకు యత్నించడంతో ఆక్షేపించారు. వైఎస్సార్సీపీ సభ్యుడు ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతున్న క్రమంలో టీడీపీ సభ్యులు అడ్డుతగలడంతో సభా సమాయాన్ని వృథా చేస్తున్నారని స్పీకర్ మండిపడ్డారు. సభను అగౌరపరిచే విధంగా టీడీపీ శాసనసభ్యులు ప్రవరిస్తున్నారని రామానారాయణరెడ్డి విమర్శించారు. ప్రతిపక్షనేత కొత్త సంప్రదాయాలు నేర్పుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. ముందుగా రూల్స్ తెలుసుకోవాలని హితవు పలికారు. సభలో ఏ సభ్యుడైనా తన అనుమతి తీసుకుని మాట్లాడాలని స్పీకర్ సూచించారు. ఏ సభ్యుడైనా కచ్చితంగా రూల్స్ పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ స్థానానికి సభ్యులు గౌరవం ఇవ్వాలని అన్నారు. -
వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కాపుల రిజర్వేషన్లపై ఎన్నికల సమయంలో తాము ఏ విషయం అయితే చెప్పామో.. దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్నో కులాలు రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేస్తున్నాయని, కానీ సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని సీఎం వివరించారు. రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం అన్నారు. కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రెండు వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామన్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. దానికి అనుగుణంగానే తొలి బడ్జెట్లోనే వారి సంక్షేమం కోసం రెండువేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు వైఎస్ జగన్ చెప్పారు. మంగళవారం బడ్జెట్‌పై చర్చలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. కాపుల సంక్షేమంపై మీ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వేసిన ప్రశ్నకు సీఎం వివరంగా జవాబిచ్చారు. సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్ల కాలంలో కాపుల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు చేసింది శూన్యమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపులను బీసీల్లో కలుపుతామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో కాపుల సంక్షేమం కోసం చంద్రబాబు అనేక హామీలను ఇచ్చారని.. వాటిలో ఏఒక్కటి కూడా అమలు చేయలేదని సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాపు, తెలగ, బలిజ కులాలకు ఐదేళ్లలో ఐదువేల కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు గత ఎన్నికల సమయంలో చెప్పారని, కానీ ఏ బడ్జెట్లో కూడా పూర్తి నిధులను ఖర్చు చేయలేదని గుర్తుచేశారు. నిధుల కేటాయింపు విషయంలో కాపులను ఏవిధంగా మోసం చేశారో.. రిజర్వేషన్లలో కూడా అదే విధంగా మోసం చేశారని మండిపడ్డారు. కాపులను నిర్లక్ష్యానికి గురి చేశారు కనుకే చంద్రబాబు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారని, టీడీపీ బలంగా ఉన్న గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చాయో ఒక్కసారి పరిశీలించుకోవాలని సీఎం అన్నారు. ఐదేళ్ల కాలంలో కాపులకు ఏం చేశారో కూడా చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. -
‘కాపులను దశలవారీగా మోసం చేశారు’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. సాధ్యం కాదని తెలిసికూడా కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం చేశారని అన్నారు. రిజర్వేషన్లపై పోరాడినవారిని అరెస్టు చేసి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. తుని ఘటనలో తమపై అక్రమంగా కేసులు పెట్టారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక్కరిని కూడా విచారించలేదని తెలిపారు. తుని ఘటనపై విచారణ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కోరారు. ‘కేంద్రం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే... అందులో 5 శాతం కాపులకు ఇచ్చామంటూ బాబు చెప్పుకున్నారు. కాపులను దశలవారీగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. హైదరాబాద్ వదిలి ఆగమేఘాలపై ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికినందుకేనా. అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌజ్‌లో ఎందుకు నివాసముటున్నారు’అని అంబటి ప్రశ్నించారు. -
టీడీపీ నేతలకు అంబటి చురకలు..!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో టీడీపీ నేతల వైఖరిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తప్పుబట్టారు. బడ్జెట్ అంశాలను పూర్తిగా చదివిన తర్వాత స్పందిస్తే బాగుంటుందని చురకలంటించారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే దాదాపు 80 శాతం హామీలను అమలు చేశామని సభ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని చెప్పారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోనే బడ్జెట్లో పొందుపరిచామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ మేనిఫెస్టో చూద్దామంటే ఎక్కడా కనిపించదని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోను టీడీపీ నేతలు టిష్యూ పేపర్లా భావించారని విమర్శించారు. సభలో అంబటి మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అవినీతి ప్రక్షాళన చేపట్టారు. ఇసుక, మట్టి దోపిడీ ఎక్కడా జరగడం లేదు. మా పార్టీ ఉన్నంతవరకు టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. టీడీపీలా మాది కులపిచ్చి పార్టీ కాదు. వెనుకబడిన కూలాలకు బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించాం. నాయిబ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు ప్రయోజనం కలిగించేలా కేటాయింపులు చేశాం. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాం. మైనార్టీల సంక్షేమానికి రూ.2000 కోట్లు కేటాయించాం. ఇమామ్‌లు, పాస్టర్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాం. దశలవారీగా మద్యపాన నిషేదం చేస్తామని ప్రకటించాం. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న మూడోరోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపులను తొలగించారు. ఎక్కడైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. ఎన్టీఆర్ మద్యపాన నిషేదం అమలు చేస్తే.. తర్వాత వచ్చిన చంద్రబాబు ఆ నిషేధాన్ని తొలగించారు’అని అన్నారు. -
చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబ నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. సభా సంప్రదాయాల గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు. గతంలో డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మను కన్నీళ్లు పెట్టించింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. పార్టీ పెట్టి గెలిపించిన ఎన్టీఆర్కే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టించిన చంద్రబాబు సంప్రదాయాలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ‘గత సభలో మీరెలా ప్రవర్తించారో మర్చిపోయారా. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అంతు చూస్తామని నాడు చంద్రబాబు బెదిరించారు. అచ్చెన్నాయుడు ఈరోజు గింజుకుంటున్నారు. గతంలో సాక్షాత్తు అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు సభా సంప్రదాయాలు గుర్తుకురాలేదా. మా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై చర్చను దారిమళ్లించేందుకే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తిస్తున్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా లాంటి పథకాలపై చర్చ జరగకుండా రాద్ధాంతం చేయాలనుకుంటున్నారు. ఈ దేశంలో ఏ అసెంబ్లీలో లేనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షానికి ఉన్న బలం కంటే ఎక్కువ అవకాశాలిస్తున్నారు. సభలో బడ్జెట్‌పై మాట్లాడే దమ్మూ, ధైర్యం లేకే చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారు. రైతుల సమస్యలంటూ టీడీపీ నాయకులు వింతగా మాట్లాడుతున్నారు. రైతుల సమస్యలకు ఐదేళ్లు పాలించిన టీడీపీ కారణం కాదా. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ వాళ్లపై దాడులు చేస్తున్నారు. మళ్లీ వాళ్లే అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వడం విడ్డూరం. ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ నేత చింతమనేని కొట్టినప్పుడు ఏం చేశారు. నారాయణ కాలేజీల్లో ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే విచారణ లేకుండా చేసిన మీరా మాట్లాడేది. కాల్‌మని సెక్స్ రాకెట్లో ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తే టీడీపీ నేతలకు సంబంధముందని కేసులనే లేకుండా చేసింది మీరు కాదా. శాంతి భద్రతల గురించి మీరు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు’అన్నారు. -
నిధులు చాలక..నత్తనడక
కడప–బెంగళూరు రైల్వేలైనుపై కేంద్ర ప్రభుత్వ స్పందన ఆశాజనకంగా లేదు. అందువల్లే పనులు వేగమందు కోలేకపోతున్నాయి. దివంగత సీఎం వైఎస్సార్ తన హయాంలో ఈ రైల్వేలైనుపై ప్రత్యేక ప్రేమ కనబరిచేవారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాను సక్రమంగా కేటాయించారు. ఆయన మరణానంతరం పనులు మందగించాయి. పదకొండేళ్లవుతున్నా ప్రాజెక్టు పెళ్లినడకగా నేసాగుతోంది. టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు కేటాయించలేదు. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడ్జెట్లో రైల్వేలైన్లకు రూ.185కోట్లు కేటాయించడం కొంత ఉత్సాహాన్నిస్తోంది. కేంద్రం కూడా ఇదే రీతిన స్పందిస్తే పనులు పరుగందుకునేవని ప్రజలంటున్నారు. సాక్షి, రాజంపేట(కడప) : కడప వయా మదనపల్లె–బెంగళూరు రైలుమార్గంలో మలిదశపనులు మొదలయ్యాయి. రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్‌ఐడీసీ)లోకి ఈమార్గాన్ని తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడప–బెంగళూరు రైలుమార్గాన్ని పూర్తి చేయాల్సి ఉంది. 2010 సెప్టెంబరులో జాయింట్ వెంచర్లో చేపట్టనున్న ఈ మార్గానికి అప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప శంకుస్ధాపన చేశారు. ఈ రైల్వే మార్గం దివంగత సీఎం వైఎస్సార్ మానసపుత్రిక. 2008–2009లో కేంద్రం ఆమోదించిన ఈ ప్రాజెక్టు పనులను రూ.1000కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. 258 కిలోమీటర్ల మేర నిర్మాణానికి 1,531 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలనేదిలక్ష్యం. తాజా పరిస్థితులు గమనిస్తే అయిదేళ్లలో కాదు కదా కనీసం 15 ఏళ్లు దాటిపోయేటట్లు కనిపిస్తోంది. భూసేకరణకు రూ.199.2కోట్లు కేటాయించారు. 2016–2017లో రూ.58కోట్లు, 2017–2018లో రూ.240కోట్లు కేటాయించారు. మొదటిదశలో పెండ్లిమర్రి వరకు లైను సిద్ధం చేసి డెమోరైలును నడిపిస్తున్నారు. నాలుగుదశల్లో ఈ రైలుమార్గం చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. కేంద్రం ఆమోదం ఆమోదం: 2008–2009లో రైలుమార్గం ప్రారంభం: 2010లో అంచనా వ్యయం: రూ.1000కోట్లు రైలుమార్గం: 258కి.మీ నిర్మాణం: 4దశల్లో... మొదటిదశలో మొదటిదశలో రూ.153కోట్లు కేటాయించారు. ఈ దశలో 21.8కి.మీ వరకు లైన్ నిర్మించారు. కడప నుంచి గంగనపల్లె, పెండ్లిమర్రి వరకు పట్టాలు వేశారు. 311.84 ఎకరాలు భూమిని సేకరించారు. 54 చిన్నబ్రిడ్జిలు, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు.నిర్మాణం కోసం రూ.199.2కోట్లు వెచ్చించారు. రెండోదశలో పెండ్లిమర్రి–రాయచోటి టు వాల్మీకిపురం వరకు లైన్‌ను చేపట్టాల్సి ఉంది. మూడవదశలో మదనపల్లెరోడ్డు టు మదగట్ట (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు), మదగట్ట–ముల్భాగల్ (కర్నాటక రాష్ట్రం సరిహద్దు) లైను పూర్తి చేయాలనుకుంటున్నారు. 4వదశలో ముల్బాగల్ టు కోలార్ వరకు నిర్మాణం చేపట్టేలా రూపకల్పన చేసి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ ఏడాది అరకొరే.. ఆంధ్రప్రదేశ్‌లో 205 కిలోమీటర్ల రైలుమార్గం ఉండగా, కర్నాటకలో 50.40కిలోమీటర్ల మేర రైలుమార్గం నిర్మించాలి. ఈ మార్గ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం వాటా భరిస్తోంది. ఈ ఏడాది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త రైల్వే నిర్మాణాలకు బడ్జెట్లో తమ వాటా కింద రూ.185కోట్లు కేటాయించారు. మొదటిదశలో కడప నుంచి పెండ్లిమర్రి వరకు మార్గం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. 21 కిలోమీటర్ల మార్గం అందుబాటులో ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన రైలుమార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాను కేటాయించాల్సి ఉంటుంది. గత టీడీపీ ప్రభుత్వం సక్రమంగా వాటాలు కేటాయించకపోవడంతో ఈలైను నిర్మాణం జాప్యం జరుగుతూ వస్తోందని విమర్శలున్నాయి. కేంద్రం కూడా రైల్వేబడ్జెట్‌లో ఏటా అరకొరగా నిధులు కేటాయిస్తూ వచ్చింది. ఈ ఏడాది కూడా కడప–బెంగళూరు లైనుకు నామమాత్రంగా రూ.2కోట్లు కేటాయించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...
సాక్షి, అమరావతి : రాష్ట్ర బడ్జెట్ నూతన అధ్యాయానికి తెర తీసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన సోమవారం మాట్లాడుతూ..‘గతంలో ప్రజల అవసరాలు ఒక రకంగా, బడ్జెట్లో కేటాయింపులు మరో రకంగా ఉండేవి. అవసరాలకు తగ్గట్టుగా బడ్జెట్ ఎందుకు ఉండదు అని ఆలోచించేవాడిని. తొలిసారిగా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. ప్రతిపక్షాలకు మేం ప్రవేశపెట్టినట్లుగా ఈ బడ్జెట్ అంచనాలు లేవనే బాధ ఉంది. వైఎస్సార్ పాలన దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. చేతల ప్రభుత్వం ఏర్పడింది. చేసి చూపిస్తోంది. సంక్షేమ కార్యక్రమాలను పేదలు, బడుగులకు అందించిన వ్యక్తి వైఎస్సార్. ఆ పథకాలను లబ్ది చూసిన ప్రజలే వైఎస్సార్ సీపీని ఆదరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర హామీలు ఈ బడ్జెట్లో కనిపిస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ వర్గాలకు ఎంత కేటాయించాలో స్పష్టంగా కేటాయింపులు జరిగాయి. రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో సమస్య ఉంది. అన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్‌ను రూపొందించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వస్తే ఏ పథకాలు ఉంటాయో జగన్ ముందే చెప్పారు. ప్రతిపక్షాలు బడ్జెట్‌ను మేనిఫెస్టోలా ఉందంటున్నారు. మేనిఫెస్టో బడ్జెట్లో కనిపిస్తే తప్పేంటి?. అలా కనిపించకపోతేనే తప్పు. ఆ బాధ్యత మనపై లేదా? అమ్మ ఒడి గొప్ప పథకం. అక్షరాస్యతను పెంచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. అక్షరాస్యతలో మన రాష్ట్రం 31వ స్థానంలో ఉందంటున్నారు. చదువుకోవడానికి వసతులు కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వాటిని పరిగణనలో తీసుకోవాల్సిన బాధ్యత మనపై లేదా?. అమ్మ ఒడి లాంటి పథకం ఈ నిర్లక్ష్యాన్ని తొలగిస్తుంది. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే గొప్ప పథకం. ప్రభుత్వం ఏ దిశగా వెళుతుందో చూడకుండా వాటిలో తప్పులు వెతికే ప్రయత్నం మంచిది కాదు. కేటాయింపులు సరిపోకుంటే మరిన్ని కేటాయింపులు జరుగుతాయి. ప్రైవేట్ విద్యను ఇష్టానుసారంగా పెంచడంతో వారు దోపిడీ చేసుకుంటే వెళ్లిపోయారు. తప్పులు సరిదిద్దడానికి సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. అందుకే వ్యవసాయానికి అధిక కేటాయింపులు.. రైతులకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. రైతులు తమతో పాటు అనేక కుటుంబాల కడుపు నింపడానికి ప్రయత్నిస్తారు. అయితే పంట కోసం చేసిన అప్పులు కూడా తీరక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అందుకే రైతులకు బడ్జెట్ అధిక కేటాయింపులు చేసింది. రాష్ట్రంలో 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయాన్ని మనం పట్టించుకోకుండా ఉండగలమా?. వాళ్లంతా వేరే రంగాల వైపు మళ్లితే పరిస్థితి ఎలా ఉంటుంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో తమ పిల్లలను వ్యవసాయం వైపు చూడనివ్వడం లేదు. ఇతర రంగాల వైపు ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయం మీద ఆధారపడిన రైతులకు చివరకు ఏమీ మిగలడం లేదు. రైతు భరోసా, 9 గంటల విద్యుత్, రైతులకు ఇన్సురెన్స్, సున్నా వడ్డీ రుణాలు... ఇవన్నీ వ్యవసాయాన్ని ప్రోత్సహించే పథకాలే. వ్యవసాయానికి రూ.24వేల కోట్లు కేటాయింపుల ద్వారా రైతులకు నమ్మకం కల్పించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. సొంతిల్లు పేదవాడి కల. ఆ కలలు నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది. చంద్రబాబు సర్కార్‌లో పేదవాడి ఇళ్ల నిర్మాణానికి ఒక్క ఎకరం కొనుగోలు చేసేందుకు బడ్జెట్ కేటాయించారా?. ప్రభుత్వ భూములు లేని చోట భూములు కొనుగోలు చేసి పేదవాడికి ఇళ్ల కోసం ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయడం సంతోషం. ఎన్నికల్లో ఓటు వేయనివాడికి కూడా ప్రభుత్వ పథకాలు అందించాలనుకోవడం గొప్ప లక్ష్యం. చంద్రబాబు హయాంలో ఇంటిపై టీడీపీ జెండా కడితేనే, పచ్చ చొక్కా వేస్తేనే పథకాలు అందే పరిస్థితి. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి. ఎన్నికల అనంతరం ప్రజలను పార్టీరహితంగా చూడాలి. చంద్రబాబు 19సార్లు కేబినెట్ సమావేశాలు పెట్టినా ఇసుక అక్రమ రవాణా ఆగలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇసుకపై కొత్త పాలసీ తీసుకొస్తామనగానే.. అక్రమ ఇసుక రవాణా రాష్ట్రం మొత్తం ఆగిపోయింది. నాయకుడి నిబద్ధతకు ఇది ఉదాహరణ. మత్స్యకార గ్రామాల్లో మహిళలు బెల్టు షాపులు రద్దు చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయిదేళ్లలో రాజధాని పేరుతో చంద్రబాబు సాధించిందేమిటి?. ఎమ్మెల్యే, మంత్రులకు ఒక్క క్వార్టర్ కట్టలేదు. నాలుగో తరగతి సిబ్బంది ఉండేందుకు గృహ నిర్మాణం జరగలేదు. గవర్నర్, స్పీకర్ వ్యవస్థలతో పాటు అన్ని రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారు.’ అని అన్నారు. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా ఎమ్మెల్యే ధర్మాన ప్రసంగం అనంతరం శాసనసభ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. -
పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి సంజీవిని : అనిల్ కుమార్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవిని అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్ట్ అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్వ మీద పట్టిసీమ కట్టి రూ.350కోట్లు దోచేశారని ఆరోపించారు. లక్షా 6వేల కుటుంబాలను ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద తరలించాల్సి ఉందని అన్నారు. వైఎస్సార్ కాల్వలు తవ్వకపోతే భూసేకరణకు వేలకోట్ల రూపాయల అదనపు భారం పడేదన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారన్నారు. పోలవరం దగ్గర ఫొటోలు తీసుకోవటం తప్ప! గత ప్రభుత్వానికి ప్రాజెక్ట్ పూర్తి చేద్దామన్న ధ్యాసే లేదని ఎద్దేవా చేశారు. ముంపునకు గురయ్యే లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్ట్ వ్యయం అంచనా పెంచుకుంటూ పోవడమే తప్ప.. టీడీపీ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వైఎస్సార్ కల : తెల్లం బాలరాజు పోలవరం ప్రాజెక్ట్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కల అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వానికి పోలవరంను పూర్తి చేయాలన్న ఆలోచన రాలేదని మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్వాసితులను కూడా గత ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. టీడీపీ నిర్వాకం వల్లే ప్రాజెక్ట్ పూర్తి కాలేదని ఆరోపించారు. -
వైఎస్సార్ విన్నపంతోనే ఏపీకి కియా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ మొదలైంది. సభ ప్రారంభం కాగానే విపక్షం తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలపై చర్చకు అమతించాలని కోరగా, ముందు ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుందని స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఉభయసభల్లో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. వైఎస్సార్ విన్నపంతోనే ఏపీకి కియా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విన్నపంతో కియా మోటార్స్ మొదటి ప్లాంట్‌ను ఏపీలో పెట్టారని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కియా మోటార్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాసిందని ఆయన వెల్లడించారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ 2007 నుంచే వైఎస్సార్‌తో తనకు అనుబంధం ఉందని కియా సీఈఓ లేఖలో స్పష్టంగా చెప్పారు. ఆటో మొబైల్స్‌లో పెట్టుబడులు పెట్టాలని వైఎస్సార్ 2007లోనే తనకు చెప్పారని కియా సీఈఓ లేఖలో రాశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 38 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. చంద్రబాబులా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగలేదు. ప్రక్కన ఉన్న తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనల గురించి ఎప్పుడైనా విన్నామా? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు తిరిగినట్లు తిరగలేదు. చంద్రబాబు 39 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి విదేశీ పర్యటనలు చేశార’’ని అన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు విదేశీ పర్యటనల ఖర్చుతో ప్రజలపై భారం పడిందని అన్నారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రూ.39కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఆయన విదేశీ పర్యటనలపై విచారణ జరిపించాలన్నారు. తప్పుడు హామీలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు. ఏపీకి ఐటీ సంస్థలు వస్తున్నాయని నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారని, ఆయన అనుభవంతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ 2014 నవంబరులో జపాన్ వెళ్లి మన రాష్ట్ర విద్యాలయాల్లో జపాన్ భాష నేర్పిస్తామని, ఉద్యోగ కల్పన చేస్తామన్నారు. 2015 జనవరిలో దావోస్ వెళ్లి బుల్లెట్ ట్రైన్ తెస్తామన్నారు. మలేషియా తరహాలో బుద్ధిజం టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. 2015 ఏప్రిల్‌లో చైనా వెళ్లి షాంఘై తరహాలో అమరావతి నిర్మిస్తామని, ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటు చేసి సోలార్ పరిశ్రమలు తెస్తామన్నారు. 2015 జులైలో జపాన్ వెళ్లి.. టోక్యోలా అమరావతి నిర్మిస్తామన్నారు. ఇండస్ట్రియల్ టౌన్ షిప్ కడతామన్నారు. విశ్వనగరంగా అమరావతి అన్నారు. వివిధ రంగాల్లో జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని వాటికోసం ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. వాటి ప్రతిపాదనలు ఎక్కడున్నాయి. 2015 సెప్టెంబరులో సింగపూర్ వెళ్లారు. విశ్వనగరంగా అమరావతి నిర్మిస్తామన్నారు. రాజమండ్రిలో సోలార్ పవర్ ప్లాంట్, రూ.2,000 కోట్లతో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని అన్నారు. 2016 మార్చిలో లండన్ పర్యటనలో అమరావతి నిధుల సమీకరణకు లండన్ స్టాక్ ఎక్చేంజి అంగీకరించిందని చంద్రబాబు అన్నారు. 2016లో చైనా పర్యటన చేసి మళ్లీ రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ తెస్తామని చంద్రబాబు అన్నారు. 10వేల కోట్లతో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం అన్నారు. కార్గో హబ్‌గా కృష్ణపట్నం, విశాఖ చేస్తామని చంద్రబాబు అన్నారు. 2016 జులైలో ఖజకిస్తాన్ వెళ్తే.. ఖజకిస్తాన్‌లా అమరావతిని నిర్మిస్తామని అన్నారు. 2016 రష్యా పర్యటన చేశారు. రాష్ట్రంలో మెరైన్ యూనివర్శిటీ తెస్తామని చంద్రబాబు అన్నారు. అమరావతికి మాస్కో సహకారం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. 2017 జనవరిలో శ్రీలంక వెళ్లి శ్రీలంక ద్వీపాల తరహాలో భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ఆనాడు తెలిపారు. 2017 జనవరిలో దావోస్ వెళ్లారు. సాంకేతిక ప్రగతికి మైక్రోసాఫ్ట్ సహకారం తీసుకుంటామని అన్నారు. ఫిన్‌టెక్ వ్యాలీలా ఏపీ తయారు చేస్తామని చంద్రబాబు అన్నారు. 2017 అక్టోబరులో లండన్ వెళ్లినప్పుడు రాష్ట్రానికి ఏరో సిటీ, నలంద యూనివర్శిటీ, ఆర్గానిక్ పుడ్ ఇండస్ట్రీ తెస్తామని అన్నారు. దుబాయ్ వెళ్లినప్పుడు ఎమిరేట్స్ సంస్థకు హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు. 2017 డిసెంబరులో దక్షిణ కొరియాకు వెళ్లి ఏపీ రెండో రాజధాని అని చంద్రబాబు ప్రకటించారు. అనంతలో ఫ్రెండ్లీ కాంప్లెక్స్, కొరియా సిటీ తెస్తామని మొత్తం 3వేల కోట్లు అని ప్రకటించారు. 2018 జనవరిలో దావోస్ వెళ్లి పెట్టుబడులు పెట్టమని విజ్ఞప్తి చేశారు. తర్వాత దుబాయ్‌లో చంద్రబాబు పర్యటన చేశారు. ఫోనిక్స్ ఆధ్వర్యంలో అతిపెద్ద రైస్ మిల్లు వస్తోందని అన్నారు. ఇలా చంద్రబాబు విదేశాల్లో పర్యటించారు. వీటి కోసం 39 కోట్లు ఖర్చు చేశార’’న్నారు. స్కూళ్ల ముఖచిత్రాలను మార్చి చూపిస్తాం : ఆదిమూలపు సురేష్ రెండేళ్లలో ఏపీలోని స్కూళ్ల ముఖచిత్రాలను మార్చి చూపిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. స్కూళ్లలో బయో టాయిలెట్లపై కూడా ఆలోచిస్తున్నామన్నారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ స్కూళ్ల మేనేజ్మెంట్ కమిటీలను గత ప్రభుత్వం రాజకీయం చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక సదుపాయాలు కల్పించలేదు. టీడీపీ ప్రభుత్వం టెండర్లపైనే దృష్టి పెట్టింది. 25వేల స్కూళ్లలో ప్రహారీ గోడలు లేవు. పారిశుద్ధ్య కార్మికులకు గత ప్రభుత్వం జీతాలివ్వలేదు. రేషనలైజేషన్‌తో మూతపడ్డ స్కూళ్లను తిరిగి తెరిపిస్తాం. అన్ని స్కూళ్లలో మౌళిక సదుపాయాలు కల్పిస్తాం. స్కూళ్లలో కనీస సౌకర్యాలు కల్పించడానికి రూ. 1500 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్ల కోసం రూ.160కోట్లు కేటాయించామ’’ని తెలిపారు. -
బడివడిగా..
రాయవరం (మండపేట): చదువు‘కొనే’ స్థితిలో నేడు పేదలే కాదు.. మధ్య తరగతివారూ లేరు. చదువు ఉంటేనే జ్ఞానం.. విజ్ఞానం. ఆదే క్రమంలో కుటుంబ అభివృద్ధి. చిన్నారులు చదువుకోవాలి. అందుకు పేదరికం కారణం కారాదన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన. ప్రజా సంకల్ప యాత్రలో ఆయన చూసిన ఎన్నో సమస్యల్లో చదువు కొనలేని స్థితిలో ఎందరో ఉన్నారని గుర్తించారు. అక్కడ నుంచే మనసులో ప్రణాళికలు వేసుకున్నారు. ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టాక ప్రాధాన్యాల క్రమంలో విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా వివిధ రంగాల అభివృద్ధికి బాటలు వేశారు. ఈ క్రమంలో విద్యారంగం పటిష్టానికి చర్యలు తీసుకున్నారు. కార్పొరేట్ విద్యకు ఏమాత్రం తీసిపోని రీతిలో సర్కారు విద్యను అందిస్తామని, అందుకు మౌలిక వసతులు కల్పించి విద్యార్థికి ఆ పాఠశాలలో చదవాలనే ఆసక్తి కలిగే వాతావరణం కల్పించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తల్లిదండ్రులకు పేదరికం అడ్డు కాకుండా వారి పిల్లలను పాఠశాలకు పంపిస్తే అమ్మఒడి పథకం కింద తల్లి ఖాతాలో విద్యార్థికి రూ.15 వేలు వేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా బడ్జెట్లో అందుకు నిధులు కేటాయించారు. మొత్తంగా విద్యారంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ముందుకు సాగిపోతున్నారు. పాలకులు నిధులు కేటాయించేశారు. ఇక మిగిలింది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపడం.. అధికారులు పాఠశాలల అభివృద్ధికి సత్వర చర్యలు తీసుకోవడమే తరవాయి. ఇంటర్మీడియట్ వరకూ అమ్మ ఒడి ఈ పథకం కింద జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 5.7 లక్షల మందికి ప్రయోజనం చేకూరనున్నట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 4.1 లక్షల మంది వరకు చదువుతుండగా, ఇంటర్మీడియట్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి 60 వేల మంది ప్రయోజనం పొందనున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన మరో లక్ష మంది వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లాలో విద్యార్థులకు ఏటా రూ.765 కోట్లు ఈ పథకం కింద ఖర్చుయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్లో అమ్మఒడికి రూ.6,455.80 కోట్లు కేటాయించడం విశేషం. జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థికి రూ.20వేలు జగనన్న విద్యాదీవెన పథకం కింద ఉచిత విద్యను అందించేందుకు ఫీజు నూరు శాతం రీయింబర్స్ చేసేలా పథకాన్ని అమలు చేయనున్నారు. దీనితో పాటు వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ఏడాదికి రూ.20వేల వంతున అందజేయనున్నారు. వీటికోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.4,962 కోట్లు కేటాయించారు. మౌలిక సదుపాయాలకు పెద్దపీట పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, రానున్న రెండేళ్లలో వాటి రూపురేఖలు మార్చనున్నట్లు సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించారు. జిల్లాలో 4,416 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అధ్వానంగా, మధ్యస్తంగా ఉన్న పాఠశాలలకు ఈ మేరకు లబ్ధి చేకూరనుంది. ‘గౌరవం’ పెరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వర్కర్లకు గౌరవ వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచారు. దీంతో ఆ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు బడ్జెట్లో రూ.1,077 కోట్లు కేటాయించారు. జిల్లాలో 4,283 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 7,563 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. -
హామీలను మించి లబ్ధి
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నవ శకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాంది పలికారని బీసీ సంఘాల నేతలు, ప్రముఖులు కొనియాడుతున్నారు. రాజ్యాధికారంలో బీసీలకు సింహభాగం కల్పించడమే కాకుండా.. బడ్జెట్లో బీసీల సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యమిచ్చారని ప్రశంసిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్లో బీసీ ఉప ప్రణాళికకు మేనిఫెస్టోలో చెప్పినదానికంటే అధికంగా నిధుల కేటాయింపుతో చరిత్ర తిరగరాశారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి మార్గం సుగమం చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ (రిటైర్డ్), బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వంటి ప్రముఖులతోపాటు బీసీ కులాల ప్రతినిధులు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యాధికారం అంటే ఇదీ.. బీసీలకు నిజమైన రాజ్యాధికారం అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూపించారని బీసీ సామాజికవర్గ ప్రముఖులు కొనియాడుతున్నారు. అందుకు ఆయన మంత్రివర్గ కూర్పే నిదర్శనమని ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం కేటాయిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఆ వర్గాలకు తన మంత్రివర్గంలో ఏకంగా 60 శాతం పదవులు కేటాయించారు. అంతేకాకుండా బీసీవర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. బీసీ వర్గానికి చెందిన మంత్రులకు కీలకమైన శాఖలను కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కీలకమైన రెవెన్యూ, పురపాలక, జలవనరులు, ఆర్ అండ్ బి, కార్మిక శాఖలను ఆ వర్గాలకు ఇచ్చారు. అతి ముఖ్యమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని కూడా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు ఇవ్వడం విశేషం. ఇక మీదట నియమించనున్న అన్ని నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీలకే అగ్ర ప్రాధాన్యం ఇస్తామని కూడా సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. దాంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడానికి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నట్లుగా స్పష్టమవడంతో ఆ వర్గాలకు ఆనందం కలిగిస్తోంది. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని వైఎస్సార్సీపీ పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టడాన్ని ఆర్.కృష్ణయ్య ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో బీసీ పార్టీలని చెప్పుకుంటున్న పార్టీలు కూడా ఇంత వరకు ఆ దిశగా ప్రయత్నించలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం సామాజిక న్యాయ సాధన కోసం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పనకు తమ పార్టీ ద్వారా బిల్లును ప్రవేశపెట్టడం మంచి పరిణామమన్నారు. ఆయన ప్రయత్నం దేశంలో చర్చకు దారి తీసిందని, సామాజిక న్యాయ సాధనకు ముందడుగు వేశారని ప్రశంసించారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే అధికం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే ఎక్కువగా బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ బడ్జెట్లో నిధులు కేటాయించారని బీసీ వర్గాలు కొనియాడుతున్నాయి. బీసీ ఉప ప్రణాళికకు ఏటా రూ.15 వేల కోట్లు చొప్పున కేటాయిస్తామని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ అంతకంటే కొంచెం ఎక్కువగానే 2019–20 బడ్జెట్లో బీసీ ఉప ప్రణాళికకు రూ.15,061కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి చెప్పారు. గత ఏడాది టీడీపీ ప్రభుత్వం కేటాయించిన దానికంటే 23.46 శాతం అధికంగా కేటాయించడం విశేషం. బీసీల సంక్షేమానికి ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ దేశంలో అందరి దృష్టిని ఆకర్షించారని జస్టిస్ ఈశ్వరయ్య (రిటైర్డ్) అన్నారు. కార్పొరేషన్లతో 139 కులాలకు నేరుగా లబ్ధి బీసీ కుటుంబాలకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన కార్యాచరణ చేపట్టారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశంసించారు. ప్రస్తుతం ఏపీలో 29 బీసీ కులాలకే ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నాయి. దాంతో ఆయా ఉప కులాల్లోని పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతూ వచ్చింది. బీసీల్లోని అన్ని ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అన్నట్లుగానే బీసీల్లోని 139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తొలి బడ్జెట్లోనే ప్రకటించింది. అంటే కొత్తగా మరో 110 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాంతో ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ఆయా బీసీ ఉప కులాల్లోని లబ్ధిదారులకు అందించడం సాధ్యపడుతుంది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మహిళలకు నాలుగు విడతలుగా ఇచ్చే రూ.75 వేలను ఈ కొత్త కార్పొరేషన్ల ద్వారానే అందిస్తారు. దళారుల బెడద లేకుండా ఇతర ప్రభుత్వ పథకాలు కూడా లబ్ధిదారులకు సకాలంలో అందుతాయి. ఇది బీసీలందరికీ ప్రయోజనం కలిగిస్తుందని బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల్లో సగం బీసీలకే ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా బీసీలకే అత్యధికంగా లబ్ధి కలిగేలా ప్రభుత్వ పథకాలను సీఎం వైఎస్ జగన్ రూపొందించారని జస్టిస్ ఈశ్వరయ్య (రిటైర్డ్) పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ పథకాల్లోను దాదాపు 50 శాతం మంది లబ్ధిదారులు బీసీ వర్గాలకు చెందినవారే ఉన్నందున ఈ ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించిందనడానికి నిదర్శనమన్నారు. అందులో అత్యధికంగా విద్య, ఉపాధి కల్పనకు సంబంధించిన పథకాలు ఉండటం బీసీ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపకరిస్తుందన్నారు. ప్రభుత్వం రూపొందించిన జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, సామాజిక పింఛన్లు, కౌలు రైతుల సంక్షేమం.. ఇలా అన్ని పథకాల్లోనూ సగం మంది లబ్ధిదారులు బీసీలేనన్నది సుస్పష్టం. ఈ దృష్ట్యా ప్రధానంగా బీసీ విద్యార్థుల విద్యాభ్యాసానికి సీఎం వైఎస్ జగన్ బాసటగా నిలిచారని జస్టిస్ ఈశ్వరయ్య (రిటైర్డ్) ప్రశంసించారు. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను బడికి, కాలేజీలకు పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు చొప్పున ఇవ్వనున్నారు. తద్వారా రాష్ట్రంలో 4.50 లక్షల మంది తల్లులకు ప్రయోజనం కలగనుంది. వారిలో దాదాపు 50 శాతం అంటే 2 లక్షల మందికిపైగా బీసీలు ఉన్నారు. వారి కోసమే రూ.1,294.73 కోట్లు కేటాయించడం విశేషం. ఇక వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థుల కోసం ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద విద్యార్థుల తల్లులకు రూ.20 వేలు చొప్పున చెల్లిస్తారు. తద్వారా రాష్ట్రంలో 15,35,911 మంది విద్యార్థుల తల్లులకు ఊరట కలుగుతుంది. వారిలో దాదాపు 7.82 లక్షల మంది బీసీ వర్గాలకు చెందినవారే ఉంటారని అధికారుల అంచనా. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. అందుకోసం ఏకంగా రూ.3,151.74 కోట్లు కేటాయించారు. దీని ద్వారా రాష్ట్రంలో 7.82 లక్షల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. బీసీ రైతులకు బాసట బీసీ రైతుల కష్టాలు తీర్చడం కోసం సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చెప్పారు. చరిత్రలో తొలిసారి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ పథకం కింద రైతులకు ఏటా రూ.12,500 ఆర్థిక సహాయం చేస్తారు. దాంతో రాష్ట్రంలో 64.07లక్షల మంది రైతులు, 15.37 లక్షల మంది కౌలు రైతులకు ప్రయోజనం కలగనుంది. రైతుల్లో దాదాపు 40 శాతం మంది, కౌలు రైతుల్లో 50 శాతం మంది బీసీలే ఉన్నారని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. దాంతో రైతు భరోసా పథకం ద్వారా దాదాపు 26 లక్షల మంది బీసీ రైతులు, దాదాపు 8 లక్షల మంది బీసీ కౌలు రైతులకు లబ్ధి చేకూరనుంది. పింఛన్ల ద్వారా భారీగా లబ్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సామాజిక పింఛన్ల పెంపు ద్వారా బీసీల సామాజిక భద్రతకు అండగా నిలిచిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కొనియాడారు. సామాజిక పింఛన్లను దశల వారీగా రూ.3 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో ప్రకటించారు. మొదటి దశగా ఈ ఏడాది రూ.2,250కు పెంచింది. అంతే కాకుండా వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. తలసేమియా, పక్షవాతం, కుష్టు రోగులు, డయాలసిస్ పేషంట్లకు నెలకు రూ.10 వేలు పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో ప్రస్తుతం పింఛన్ అందుకుంటున్న 53.32 లక్షల మందికి అదనంగా మరో 11.20 లక్షల మంది అర్హులవుతారు. అంటే సామాజిక పింఛన్ల లబ్ధిదారులు 64.52 లక్షల మందిలో దాదాపు 30 లక్షల మంది బీసీలే ఉంటారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంతేకాకుండా బీసీ కమిషన్‌ను పునరుద్ధరించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో బీసీలకు సామాజిక న్యాయం త్వరితగతిన సాధ్యమవుతుందని ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. మనసున్న ప్రభుత్వం.. బీసీల సంక్షేమం అంటే చంద్రబాబులా కేవలం నాలుగు కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం కాదు.. వారికి ఆర్థిక స్వావలంబన కలిగిస్తానని సీఎం వైఎస్ జగన్ తన పాదయాత్రలో తరచూ చెప్పేవారు. అన్నట్లుగానే సీఎం కాగానే తొలి బడ్జెట్లో బీసీల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి పెద్దపీట వేశారు. బీసీల్లోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి కుల వృత్తులకు అండగా నిలిచారు. మత్య్సకారులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, రజకులు.. ఇలా అన్ని బీసీ కులాల సంక్షేమానికి ఉపక్రమించారు. దర్జీలు, ఆటో డ్రైవర్లు.. ఇలా బీసీలే అత్యధికంగా ఉండే వివిధ కార్మిక వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశారు. ఇక జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, సామాజిక పింఛన్లు.. ఇలా అన్ని ప్రభుత్వ పథకాల్లోనూ 50 శాతం వరకు బీసీలకే లబ్ధి చేకూరునుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మత్స్యకారులకు వరాలు పొడవైన తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న మత్స్యకారులపై సీఎం వైఎస్ జగన్ వరాల జల్లు కురిపించారని విశాఖ కోస్టల్ మెక్‌నైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు బర్రి కొండ బాబు సంతోషం వ్యక్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించే మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. తద్వారా రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మత్స్యకార కుటుంబాలకు చెందిన 30 లక్షల మంది జీవితాలకు ప్రభుత్వం భరోసా కల్పించింది. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న భృతి రూ.4 వేలను ఏకంగా రూ.10 వేలకు పెంచారు. అందుకోసం రూ.100 కోట్లు కేటాయించారు. దాంతో మత్స్యకార కుటుంబాల్లో ధైర్యాన్ని కల్పించారు. సముద్రంలో వేటకు వెళ్లే బోట్ల డీజిల్‌పై రాయితీని రూ.6.03 నుంచి రూ.12.93కు పెంచారు. దాంతో బోటు యజమానులైన మత్స్యకారులకు భరోసా కలిగిందని రాజు అనే మత్స్యకారుడు ఆనందంతో చెప్పారు. చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేలు అందిస్తామని ప్రకటించారు. తద్వారా దాదాపు లక్ష కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. కుల వృత్తులపై ఆధారపడిన నాయిబ్రాహ్మణ, రజక కుటుంబాలకు ఏటా రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 1.92 లక్షల మంది రజకులు, 23 వేల మంది నాయిబ్రాహ్మణులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. వైఎస్సార్ బీమా పథకంతో బీసీ కుటుంబాలకు భరోసా కలిగించారు. బీమా మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. వైఎస్సార్ కల్యాణ కానుక పథకం ద్వారా బీసీ యువతుల వివాహానికి ప్రభుత్వం చేయూతనివ్వనుంది. ఒక్కో వధువుకు రూ.50 వేలు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. తద్వారా ఒక్క 2019–20లో 75 వేల మంది వధువులకు ప్రయోజనం కలుగుతుంది. -
ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటా: బుగ్గన
సాక్షి, కర్నూలు: కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత శుక్రవారం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. అక్షరాస్యతను పెంచడానికి దేశంలో మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు ప్రతి తల్లిఖాతాలో ఏడాదికి 15 వేలు జమ చేయబోతున్నామని అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ప్రయాణించిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటానని మంత్రి బుగ్గన డోన్ నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. -
బీసీలకు బడ్జెట్లో పెద్దపీట
-
బడ్జెట్ పట్ల ఏపీ ప్రజలు సంతోషంగా ఉన్నారు
-
బీసీలకు భరోసా..
సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదు బ్యాక్ బోన్.. అంటూ కొత్త నిర్వచనం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి తన ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే వారి అభ్యున్నతి, సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు ఏకంగా రూ.15,061.64 కోట్లు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో బీసీలకు కేటాయింపులు చేయడం ఇదే తొలిసారి. ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అందులో బీసీలకు ఏటా రూ.15,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.75,000 కోట్లు బీసీ ఉప ప్రణాళికకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అప్పుడు ఇచ్చిన మాట మేరకు ప్రస్తుత తొలి బడ్జెట్లోనే బీసీ ఉప ప్రణాళికకు రూ.15,061.64 కోట్లు కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయం కోసం వినియోగించుకుంది తప్ప వారి అభ్యున్నతి, సంక్షేమం గురించి పట్టించుకోలేదు. కాగా, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించిన 2019–20 వార్షిక బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమంపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు సమగ్రాభివృద్ధిని సాధించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. ఇందుకోసం మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా రూ.15,061.64 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. బీసీ ఉప ప్రణాళికలో కేటాయించిన నిధులతో బీసీ వర్గాలు వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. ఈ నిధులతో వెనుకబడిన వర్గాల నివాస ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. బీసీ కమిషన్‌ను మరింత సమర్థవంతంగా మార్చేందుకు పునర్ నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని బడ్జెట్లో స్పష్టం చేసింది. ప్రమాదవశాత్తు మరణించిన బీసీ కులాలకు చెందిన వారికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.5 లక్షల సాయం అందించనుంది. నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు మంచి రోజులు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.10,000 వరకు నాయీ బ్రాహ్మణులకు, రజకులకు ఆదాయ మద్ధతును ఇవ్వాలని నిర్ణయించినట్లు బడ్జెట్లో స్పష్టం చేసింది. ఇందు వల్ల వారి యంత్రాలను ఆధునికీకరించుకుని, అధిక ఆదాయం ఆర్జించేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో రూ.200 కోట్ల వ్యయంతో సుమారు 23,000 మంది నాయీ బ్రాహ్మణులకు, 1,92,000 మంది రజకులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేసింది. దర్జీలకు ప్రతి సంవత్సరం 10 వేల రూపాయల చొప్పున ఆదాయ మద్దతును ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 29 బీసీ కులాల కార్పొరేషన్లకు రూ.3,964.05 కోట్లు ప్రస్తుతం అమల్లో ఉన్న బీసీ కులాలకు చెందిన 29 కార్పొరేషన్లకు ఈ బడ్జెట్లో బీసీ ఉప ప్రణాళికలో భాగంగా రూ.3964.05 కోట్లు కేటాయించారు. ఈ 29 కులాల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వీరి జీవనోపాధి కోసం వివిధ పథకాల కింద ఆర్థిక సాయం చేయనున్నారు. సబ్సిడీలతో పాటు ఆర్థిక సాయం అందించనున్నారు. చేనేత కుటుంబాలకు చేయూత చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు చేశారు. ప్రతి చేనేతకారుడి కుటుంబానికి రూ.24 వేల చొప్పున వైఎస్సార్ పేరుతో ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సాయం చేనేత కార్మికులు తమ పరికరాలను ఆధునికీకరించుకుని మర మగ్గాల ఉత్పత్తులతో పోటీపడేందుకు ఉపయోగపడనుంది. చేనేత కార్మికులు గౌరవప్రదమైన ఆదాయం ఆర్జించడానికి అవసరమైన మార్కెటింగ్ సహాయాన్ని ఇతర సబ్సిడీలను కూడా ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది. వధువులకు వైఎస్సార్ పెళ్లి కానుక బీసీ గర్జన, మేనిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తొలి బడ్జెట్లోనే బీసీ వర్గాలకు పెళ్లి కానుకను తీసుకువచ్చారు. వైఎస్సార్ పెళ్లి కానుక కింద రూ.300 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద బీసీ కులాలకు చెందిన వధువులకు రూ. 50,000 చొప్పున వివాహ కానుక ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరంలో 75 వేల మంది బీసీ వధువులు ప్రయోజనం పొందనున్నారు. కాగా.. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు వచ్చే సంవత్సరం నుంచి వైఎస్సార్ చేయూత కింద ప్రయోజనాలు పొందనున్నారు. వీరికి నాలుగేళ్లలో నాలుగు విడతలుగా రూ.75 వేలు ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, ఇతర ఆర్థిక సంస్థలను సమీక్షించి ఈ ఏడాదిలోనే లబ్ధిదారులను గుర్తించేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు వలంటీర్ల సహాయంతో సంబంధిత కార్పొరేషన్ల ద్వారా అర్హులందరికీ దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. బీసీ విద్యార్థులకు అన్ని విధాల అండ రాష్ట్రంలో 7.82 లక్షల మంది బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్లో రూ.2,218.14 కోట్లు కేటాయించారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు కేటాయించ లేదు. చదువుకునే వయసు పిల్లలందరూ విద్యా సంస్థల్లోనే ఉండాలనే లక్ష్యంతో జగనన్న అమ్మ ఒడి పథకం కింద బీసీ వర్గాల వారికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. ఈ పథకం కింద బీసీ వర్గాలకు చెందిన పిల్లలను బడికి పంపిస్తే వారి తల్లులకు ఏటా రూ.15,000 ఇచ్చేందుకు బీసీ ఉప ప్రణాళికలో రూ.1294.73 కోట్లు కేటాయించారు. ఆటో డ్రైవర్లకు రూ.400 కోట్లు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా పలు జిల్లాల్లో ఆటో డ్రైవర్లు ఆయన్ను కలిసి వారి ఇబ్బందులను, ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సొంతంగా ఆటో కలిగి నడుపుకుంటున్న డ్రైవర్లందరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే తన తొలి బడ్జెట్లోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అదించేందుకు ఏకంగా రూ.400 కోట్లు కేటాయించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆటో డ్రైవర్ల కోసం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బడ్జెట్లో కేటాయింపులు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక కార్పొరేషన్‌తో ప్రతి కులానికీ భరోసా మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా వెనుకబడిన తరగతుల్లోని కులాల కోసం ప్రభుత్వం 139 ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తుందని బడ్జెట్లో ప్రకటించారు. ఈ కార్పొరేషన్లు వివిధ బీసీ ఉప–సామాజిక వర్గాలకు చెందిన ప్రజల అభివృద్ధికి సహాయం అందిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లను సంస్కరించాక వైఎస్సార్ చేయూత పథకాన్ని ఈ కార్పొరేషన్ల ద్వారా వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల రాజకీయ అభ్యున్నతి కోసం దేవాలయాల ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు తదితర నామినేటెడ్ పోస్టుల విషయంలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టం తీసుకురావని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రభుత్వం నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో ఈ వర్గాల ఆర్థిక ఔన్నత్యం కోసం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని బడ్జెట్ స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో బీసీల సంక్షేమం కోసం పేర్కొన్న భాగం. ఈ హామీలన్నింటినీ నెరవేర్చేందుకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించారు. ► 7.82 లక్షల బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,218.14 కోట్లు ► ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి అందించనున్న సాయం రూ.24,000 ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు -
నవ్యాంధ్రలో ‘నవ’శకం
రాజకీయ పార్టీలకూ, రాజకీయ నాయకులకూ విశ్వసనీయతే ప్రాణం. అన్న మాటకు కట్టుబడి ఉండే నాయకులను ప్రజలు ఆరాధిస్తారు. మాటలకూ, చేత లకూ పొంతనలేని నాయకులను తిరస్కరిస్తారు. ఇది అత్యంత సరళమైన విషయం. ప్రజల కళ్ళు కప్పవచ్చుననీ, వారిని మభ్యపెట్టవచ్చుననీ, ప్రచార బలంతో నమ్మించవచ్చుననీ నాయకులు అనుకుంటే భంగపాటు తప్పదు. శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో సమర్పించిన 2019–20 బడ్జెట్ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికను నిజాయతీగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నదని సూచిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాథమ్యాలను ఈ బడ్జెట్ వెల్లడిస్తుంది. ప్రభుత్వ భావజాలానికి ప్రతీకగా నిలుస్తుంది. జగన్ మోహన్‌రెడ్డి కనీవినీ ఎరుగని ఆధిక్యంతో ఎన్నికలలో విజయం సాధించడానికి ఒకానొక చారిత్రక నేపథ్యం ఉన్నది. దాదాపు పదేళ్ళపాటు కఠోర పరిశ్రమ, ప్రజలే కేంద్రంగా సాగిన ప్రజాసంకల్పయాత్ర, నవరత్నాలూ, బీసీ డిక్లరేషన్ వగైరా కార్యక్రమాలన్నీ వైఎస్ఆర్సీపీకి పేదల గుండెల్లో సుస్థిరమైన స్థానం కల్పించాయి. రాజన్న రాజ్యం రూపంలో సంక్షేమ రాజ్యం నెలకొల్పుతానంటూ జగన్ మోహన్‌రెడ్డి బహిరంగసభలలో వాగ్దానం చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఇతోధికంగా నిధులు కేటాయించాలనీ, వారిని అభివృద్ధిలో భాగస్వా ములను చేయాలనీ సంకల్పం చెప్పుకున్నారు. పాదయాత్రలో కోటిమందికిపైగా సాధా రణ ప్రజలను కలుసుకొని వారి బాధలగాథలు ఆలకించి, ఆకళింపు చేసు కున్నట్టు బడ్జెట్ కేటాయింపులు చెబుతున్నాయి. కల్లబొల్లి కబుర్లు చెప్పకుండా చేసేది చెప్పడం, చెప్పిందే చేయడం అనే ధర్మాన్ని ప్రభుత్వాలు పాటిస్తే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాయి. ఆ బాటలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయా ణిస్తున్నట్టు బడ్జెట్ వివరాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, బడ్జెట్ కేటాయిం పులు వేరు, వాస్తవంగా ఖర్చు చేయడం వేరు. ఊహించిన ఆదాయం అందక పోయినా, ప్రభుత్వాల ప్రాథమ్యక్రమం మారిపోయినా కేటాయింపులు ఘనంగా ఉంటాయి కానీ నిధులు విడుదల కావు. బాధ్యతాయుతమైన రాజ కీయ నేతలూ, పార్టీలూ ఎన్నికల ప్రచారంలో వినియోగించిన ప్రణాళికకు కట్టు బడి పరిపాలన సాగించాలని ప్రయత్నిస్తారు. వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమా వేశం (ప్లీనరీ)లో ప్రకటించిన నవరత్నాలనూ, బీసీ డిక్లరేషన్‌లో పొందుపరిచిన అంశా లనూ సంపూర్ణంగా అమలు చేయాలనే పట్టుదల ప్రభుత్వానికి దండిగా ఉన్నట్టు బుగ్గన బడ్జెట్ స్పష్టం చేస్తున్నది. సామాజికస్పృహ బుగ్గన బడ్జెట్ ప్రతిపాదనలలో సామాజిక సమతౌల్యం సాధించే ప్రయత్నం కనిపిస్తున్నది. ఆర్థికంగా, సామాజికంగా వెనక» డిన వర్గాలకు చేయూతనిచ్చి ఆ వర్గాలను వేగంగా ముందుకు నడిపించాలనే తాపత్రయం ఉన్నది. వివిధ వర్గాల సంక్షేమానికి ఏమేమి చేయాలని సంకల్పించారో పాదయాత్ర సందర్భంగా బహి రంగ సభలలో జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ప్రకటించిన అంశాలన్నింటినీ క్రమంగా, వేగంగా అమలు చేస్తూ వస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజ లను కలుసుకోవడం వల్ల, మాట్లాడటం వల్ల సమాజంలో ఎంతటి వైవిధ్యం ఉన్నదో, సమస్యల స్వభావం ఏమిటో, వందకుపైగా ఉన్న వెనుకబడిన కులా లవారికి మేలు చేయడం ఎలాగో ఒక స్పష్టమైన అవగాహన కలిగింది. మనసులో ఒక సామాజికన్యాయం సాధించేందుకు అనుసరించవలసిన వ్యూహం రూపు దిద్దుకొని ఉంటుంది. దాని ప్రభావం టిక్కెట్ల పంపిణీపైన ఉంది. ఆ తర్వాత మంత్రివర్గ నిర్మాణంలోనూ ఉంది. ఆ వ్యూహం ప్రాతిపదికగానే ప్రాథమ్యాలు నిర్ణయించుకొని ఉంటారు. అదే పద్ధతిలో బడ్జెట్ రూపకల్పన జరిగినట్టు కనిపిస్తున్నది. సంక్షేమాన్నీ, అభివృద్ధినీ సమాంతరంగా సాగించాలన్నది ప్రాథమిక లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపప్రణాళికలకు కేటాయింపులు నిరుటి కంటే పెరి గాయి. రూ. 2,27,974 కోట్ల బడ్జెట్వ్యయంలో సంక్షేమ కార్యక్రమాలకోసం కేటాయించిన మొత్తం రూ. 75 వేల కోట్లు. దళితులలో మాలలకూ, మాదిగ లకూ, రెల్లి కులస్తులకూ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చారు. ఎస్సీ ఉపప్రణాళికకు కేటాయించిన మొత్తం నిరుటి కేటాయింపు కంటే 33.60 శాతం అధికం. బీసీ ఉపప్రణాళికకు 15,000 కోట్లు కేటాయించడం కూడా విశేషం. నిరుటి కేటాయింపు కంటే ఇది 17.03 అధికం. బీసీలను ఓటు బ్యాంకుగా కాకుండా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తించి వారి అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న స్పృహ జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. టిక్కెట్ల కేటాయింపులోనూ, నిధుల మంజూరులోనూ బీసీలకు పెద్దపీట వేసి బీసీ డిక్లరేషన్‌లో చేసిన బాసలను నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. డిక్లరేషన్‌లో చెప్పినట్టే ఉపప్రణాళికకు నిధులు కేటా యించారు. అదే విధంగా నామినేషన్‌పైన ఇచ్చే చిన్న కాంట్రాక్టు పనులలో సగం బీసీలకు ఇస్తామంటూ జగన్మోహన్రెడ్డి వాగ్దానం చేశారు. కాపుల సంక్షేమం కోసం ఐదేళ్ళలో పదివేల కోట్లు కేటాయిస్తామంటూ చేసిన వాగ్దానానికి అను గుణంగానే ఈ వార్షిక బడ్జెట్లో ఆ సామాజికవర్గానికి రెండు వేల కోట్లు ప్రత్యే కించారు. ఆయన సాధించిన అద్భుతమైన విజయంలో అన్ని కులాల, అన్ని ప్రాంతాల, అన్ని మతాల పాత్రా ఉన్నది. పైగా కులాలకూ, ప్రాంతాలకూ, మతా లకూ, రాజకీయాలకూ, పార్టీలకూ అతీతంగా సర్వజన సంక్షేమం ధ్యేయంగా పనిచేయాలన్నది వైఎస్ఆర్సీపీ అధినేత అభీష్టం. అందుకే అందరినీ సంతృప్తి పరచాలని ప్రయత్నం. మొత్తం 139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. మేనిఫెస్టోనే మంత్రం ఇవన్నీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలే. ఇచ్చిన వాగ్దానాలను మసిపూసి మారేడుకాయ చేయకుండా, షరతులు విధించి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుటిల యత్నాలకు ఒడిగట్టకుండా చెప్పినవి చెప్పినట్టు చేసే సంకల్పాన్ని బడ్జెట్ ప్రతిపాదనలు సూచిస్తున్నాయి. నేలవిడిచి సాము చేయకుండా ఉన్న ఆర్థిక పరిమితులలోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు అవసరమైన కేటాయిం పులు సముచితంగా జరిగాయి. సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో మూడు ప్రాంతాల ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకు న్నారు. ప్రతిగ్రామానికీ తాగునీరు ఇవ్వాలని ప్రయత్నం. పింఛన్లకు కేటాయింపు లను మూడు రెట్లు పెంచారు. ఆటో డ్రైవర్లకూ, నాయీ బ్రాహ్మణులకూ, రజ కులకూ, మత్స్యకారులకూ, దర్జీలకూ, చేనేత కార్మికులకూ, బ్రాహ్మణులకూ, యువన్యాయవాదులకూ చేసిన వాగ్దానాలను విస్మరించలేదు. ప్రతి చేనేత కుటుంబానికీ సంవత్సరానికి రూ. 24వేలు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. దీని వల్ల 98 వేల చేనేత కుటుంబాలు లబ్ధిపొందుతాయని అంచనా. ఆరోగ్యశ్రీ, 108 వంటి ఆరోగ్య పథకాలను పునరుద్ధరించి వైఎస్ హయాంలో ఎంత సమర్థంగా వినియోగించారో అంతే సమర్థంగా ప్రజలకు ఆరోగ్యసేవలు అందించాలన్న తపన బుగ్గన బడ్జెట్లో కనిపిస్తున్నది. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు కల్పించేందుకు అవసరమైన కేటాయింపులు కూడా చేశారు. అదే విధంగా ఉచిత విద్యుచ్ఛక్తి సరఫరా కార్యక్రమంలో విద్యుత్ వినియోగం పరిమితిని 200 యూనిట్ల వరకూ పెంచడం వల్ల అదనంగా 3.42 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఎంత కేటాయించారన్నది కాదు ప్రశ్న. ఎంత ఖర్చు చేశారన్నది ముఖ్యం. నిగూఢ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, కొన్ని వర్గాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే దురుద్దేశాలు ఉన్నాయా, నిధులు దారిమళ్లాయా అనేవి బడ్జెట్ ప్రతిపాదనలలో నిశితంగా గమనించ వలసిన అంశాలు. ఈ బడ్జెట్లో అటువంటి నిగూఢమైన కోణాలు ఏవీ ఉన్నట్టు లేదు. బుగ్గన చెప్పినట్టు సింగపూర్ అంతర్జాతీయ విమా నాలకు లోటుభర్తీ (వయబిలిటీ గ్యాప్ ఫండ్) సమకూర్చాలా లేక వేలాది తల్లులకూ, పిల్లలకూ పోషకాహారం అందించాలా అనే ప్రశ్నే ఉదయించకూడదు. సింగపూర్ వ్యామోహంతో టీడీపీ సర్కార్ చేసిన తప్పులను సరిదిద్దవలసిన బాధ్యత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపైన ఉన్నది. విభజన కారణంగా నష్టబోయిన రాష్ట్రం, ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్న రాష్ట్రం. రుణభారం అధికంగా ఉన్న రాష్ట్రం. ఈ పరిమితులకు లోబడి పొదుపు చర్యలు తీసుకుంటూనే బడుగు వర్గాలకు పెద్ద పీట వేసే ప్రయత్నం బుగ్గన చేశారు. రైతన్నకు వెన్నుదన్ను మంత్రి బొత్స సత్యనారాయణ సమర్పించిన వ్యవసాయ బడ్జెట్ సైతం అన్నదాతలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలకు తగినట్టుగానే ఉంది. మొత్తం బడ్జెట్ వ్యయంలో 12.66 శాతం వ్యవసాయరంగానికి కేటాయించడం విశేషం. ఈ బడ్జెట్లో వ్యవసాయరంగానికి కేటాయించిన రూ. 28,866 కోట్లు నిరుటి కంటే రూ. 9,796 కోట్లు అధికం. పెట్టుబడి సాయం రైతు కుటుంబానికి వైఎస్ఆర్ రైతుభరోసా పథకం కింద రూ. 12,500ల వంతున రూ. 8,796 కోట్లు అవసరం. కౌలురైతులకు సైతం ఇది వర్తిస్తుంది. రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంపైనా శాసనసభలో ముఖ్యమంత్రికీ, ప్రతిపక్ష నాయకుడికీ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. సున్నా వడ్డీ రుణం తన హయాంలో ఇప్పించా మంటూ చంద్రబాబునాయుడు ప్రకటిస్తే, సత్యదూరమంటూ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయరంగం వృద్ధిరేటు మైనస్ 4.12 శాతం ఉన్న దంటూ ఆర్థికశాఖ విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకటిస్తే వ్యవసాయంలో దేశం లోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ అంటూ మాజీ ముఖ్యమంత్రి బిగ్గరగా చెప్పు కున్నారు. రెండు పక్షాలు భిన్నమైన ప్రకటనలు చేసినప్పుడు నిజం నిగ్గు తేల్చడానికి స్వతంత్ర వేదిక ఉంటే బాగుంటుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కోసం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించారనీ, ఇందుకు కనీసం నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందనీ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొత్త చెల్లిం పులు ఏప్రిల్, మే మాసాలలో జరుగుతాయి కనుక ఆ భారం వచ్చే బడ్జెట్‌పైన ఉంటుందనీ, ఇప్పుడు రుణాలు తిరిగి చెల్లించేవారు ఎక్కువమంది ఉండరు కనుక కేటాయించిన చిన్న మొత్తం సరిపోతుందనీ ప్రభుత్వ వర్గాల వివరణ. వడ్డీలేని రుణం, పంట ధరల స్థిరీకరణ, కౌలు రైతులకు పంటరుణాలు ఇవ్వా లన్న ప్రతిపాదనలు వ్యవసాయరంగంలో నెలకొన్న సంక్షోభాన్ని చాలా వరకూ పరిష్కరిస్తాయి. అప్పుల ఊబిలో చిక్కుకొని దిక్కుతోచక ఆత్మహత్యను ఆశ్ర యించిన రైతుల కుటుంబాలకు ఏడు లక్షల వంతున పరిహారం ఇవ్వాలన్న నిర్ణయం కూడా స్వాగతించదగినదే. కడచిన అయిదు సంవత్సరాలలో ఆత్మ హత్య చేసుకున్న రైతుల కుటుంబాలలో పరిహారం అందని కుటుంబాలకు తన ప్రభుత్వం కుటుంబానికి ఏడు లక్షల రూపాయల వంతున చెల్లిస్తుందంటూ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం హర్షణీయం. రైతును కాపాడుకునేందుకు ఎంత ఖర్చు చేసినా, ఎంత దూరం వెళ్ళినా తప్పులేదు. సమాజంలో వివిధ వర్గాలకూ, దాదాపు అన్ని వర్గాలకూ ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలు నూటికి నూరు పాళ్ళూ అమలు చేయడానికి అవసరమైన భారీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నవారు ఉన్నారు. ‘వేర్ దేర్ ఈజ్ ఎ విల్, దేర్ ఈజ్ ఎ వే’, సంకల్పం ఉంటే మార్గం ఉంటుం దనే సామెత ఉంది. ఇంతకు మునుపు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇప్పుడు జగన్ మోహన్‌రెడ్డి కానీ విశ్వసనీయత కలిగిన నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం వెనుక విశ్వసనీయత ప్రధానమైన హేతువు. జగన్మోహన్రెడ్డి యూఎస్పీ (యునీక్ సెల్లింగ్ పాయింట్–ఆయనకే ప్రత్యేకమైన ఆకర్షణీయమైన లక్షణం) అదే. వాగ్దానాలు చేసే ముందే వాటి అమలు సాధ్యాసాధ్యాల గురించి లోతుగా ఆలోచించి ఉంటారు. ఇప్పుడు గెలిపించిందీ, మున్ముందు గెలిపించేదీ ఆ విశ్వసనీయతే కనుక యూఎస్పీ దెబ్బతినకుండా కాపాడుకోవాలన్న సంగతి ముఖ్యమంత్రికి తెలుసు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వానికీ, ఆచరణశీలతకూ, వాస్తవిక దృష్టికీ అద్దం పట్టే విధంగా బుగ్గన బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. రాజ్యాంగం లాగానే బడ్జెట్ కూడా సదుద్దేశాలతో నిర్మించుకున్నది. దాని అమలులోనే సాఫల్య వైఫల్యాలు ఉంటాయి. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం క్రమ శిక్షణతో బడ్జెట్లో ప్రతిపాదించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య రంగాల లక్ష్యాలను సాధించగలిగితే నవ్యాంధ్రలో నవశకానికి నవరత్నాలతో శ్రీకారం చుట్టినట్టే. కె. రామచంద్రమూర్తి -
బీసీ జాతి అభివృద్ధి చెందేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు
-
‘జగన్ బీసీల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు’
సాక్షి, అమరావతి : మాజీ సీఎం చంద్రబాబు బీసీలను మోసం చేస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు అన్నారు ఎమ్మెల్యే పార్థసారధి. రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. చరిత్రలో బీసీలకు ఇన్ని నిధులను ఎప్పుడు కేటాయించలేదని తెలిపారు. బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన మాట ప్రకారం బడ్జెట్లో రూ. 15 వేల కోట్లు కేటాయించారన్నారు. ఆటోడ్రైవర్లు, టైలర్లు, చేనేతలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారికి అండగా నిలిచారని ప్రశంసించారు. ఈ బడ్జెట్ బీసీల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు దోహదం చేస్తుందన్నారు. -
‘ఆర్టీసీని మరింత బలోపేతం చేశారు’
సాక్షి, విజయవాడ : ఆర్టీసీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత బలోపేతం చేశారన్నారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో టీడీపీ ప్రభుత్వ బడ్జెట్లో ఆర్టీసీకి ఎప్పుడూ ఇంత స్థాయిలో కేటాయింపులు చేయలేదన్నారు. ఈ బడ్జెట్లో ఆర్టీసీకి దాదాపు 1572 కోట్లు కేటాయించారని.. ఫలితంగా ఆర్టీసీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ఉద్యోగులు, కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. -
‘ఈ పథకం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదు’
సాక్షి, అమరావతి : రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబానికి రూ.7 లక్షల చెల్లించే బీమా పథకం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్షనేత విజయసాయి రెడ్డి తెలిపారు. రైతన్నల పట్ల తనకున్న ఆపేక్షను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ బీమా స్కీమ్‌తో కనబర్చారని కొనియాడారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం నిశ్చింతగా జీవించడానికి ఈ పథకం భరోసా కల్పిస్తుందన్నారు. శనివారం ఆయన ట్విటర్ వేదికగా రాష్ట్ర బడ్జెట్‌ను కొనియాడారు. ‘వార్షికాదాయం 5 లక్షల వరకు ఉన్న మధ్యతరగతి కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం సాహసోపేత చర్య. రాష్ట్రంలోని మూడొంతులకు పైగా ప్రజలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. మధ్యతరగతి ప్రజలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. తుపాన్లు, కరువుకాటకాలతో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోస్తుంది. 29 వేల కోట్ల కేటాయింపు రైతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తుంది. వడ్డీ లేని రుణం, ధరల స్థిరీకరణ నిధి, కౌలు రైతులకు పంట రుణాలు చరిత్రలో నిలిచి పోతాయి. జగన్ గారు రైతులకిచ్చిన మాట నిలుపుకున్నారు.’ ’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. గత ప్రభుత్వం ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ప్రపంచంలోనే ఐదో పెద్ద సిటీ చేస్తామన్న అమరావతి గ్రాఫిక్స్ దశలోనే ఉందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు విచ్చల విడిగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. కార్పోరేషన్లు, ప్రభుత్వ సంస్థల ద్వారా రుణంగా తెచ్చిన రూ.లక్ష కోట్లు ఏమయ్యాయో అంతుబట్టడం లేదన్నారు. -
వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు
-
సీఎం జగన్ వ్యవసాయానికి పెద్దపీట వేశారు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఏపీ బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేశారని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి 12.66 శాతం కేటాయించారని, ఉచిత విద్యుత్‌కు చేసిన ఖర్చుతో కలిపి వ్యవసాయానికి 13.5 శాతం కేటాయింపులు దాటుతాయని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రైతుల పంటలకు గిట్టుబాటు ధర కోసం రూ. 3 వేల కోట్లు కేటాయించారు. గత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు. చంద్రబాబులాగా వైఎస్ జగన్ మాట తప్పే వ్యక్తి కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటలకు భీమా కడతామని ప్రకటించారు. టీడీపీ అధికారంలో ఉండగా చనిపోయిన రైతులకు పరిహారం అడిగితే.. ‘రైతులకు పరిహారం ఇస్తే మరింత మంది పరిహారం కోసం చనిపోతా’రని చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతులకు వైఎస్ జగన్ పరిహారం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది నుంచి ఇవ్వాల్సిన రైతు భరోసాను ఈ ఏడాది నుంచే ఇస్తున్నారు. రైతులకు లక్ష వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మేలు చేసినట్లే వైఎస్ జగన్ కూడా మేలు చేస్తున్నారు. రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుంది. వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. గత ప్రభుత్వం విత్తన కంపెనీలకు నిధులను ఎగ్గొట్టింద’’ని వెల్లడించారు. -
సంక్షేమానికి తొలి అడుగు..
పేదల వైద్యానికి భరోసా, అన్నదాతకు అండదండ, బడుగు జీవుల జీవనానికి మద్దతు, అక్కచెల్లెమ్మల ఉన్నతికి చేయూత, అవ్వాతాతలకు ఆసరా, కార్మికులు, విద్యార్థులకు ఆపన్నహస్తం.. ఇలా అన్ని వర్గాల ప్రజలు మెచ్చే రీతిలో రాష్ట్ర బడ్జెట్ నిలిచింది. శుక్రవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి రూ.2,27,297 కోట్లతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బుగ్గన కేటాయింపుల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. స్థిరమైన సమసమాజ ఆర్థికాభివృద్ధి, అన్ని వర్గాల సాధికారత శ్రేయస్సుకు బడ్జెట్ అద్దం పడుతోందని ఆర్థికరంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద, బడుగుల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాలు, మహిళల సంరక్షణ, మైనారిటీల సంక్షేమం వంటి కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక సమీకరణ, అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వ్యవసాయం, సాగునీరు, విద్య, ఆరోగ్యం, ప్రజా సంక్షేమం, ఉపాధి అవకాశాలు, గ్రామీణాభివృద్ధి వంటి ప్రధాన రంగాలకు నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం తీరు ప్రతిబింబించిందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి తిరుపతి : అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా అన్ని రంగాలకు ప్రాధాన్యమిచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ రాజ్యంగా.. పేదల పెన్నిధిగా.. రైతు పక్షపాతిగా నిలుస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అండదండ రైతులకు అండదండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిలుస్తోంది. ఆ విషయాన్ని ఆర్థిక మంత్రి నిధులు కేటాయిస్తూ బడ్జెట్‌ను రూపొందించడం ద్వారా స్పష్టమైంది. 62 శాతం ఉన్న రైతుల ఉన్నతికి కృషి చేయాలనే దిశగా కేటాయింపులు చేపట్టారు. వైఎస్సార్ రైతు భరోసాకు రూ.8,750 కోట్లు కేటాయించారు. తద్వారా పెట్టుబడి సాయం కోసం అక్టోబర్‌లో ప్రతి రైతుకూ రూ.12,500 కేటాయించనున్నారు. రైతులకు వ్యవసాయ రుణాలు సున్నా వడ్డీతో కేటాయింపులు చేపట్టనున్నారు. రైతుల పంటలకు ఉచితంగా బీమా ప్రీమియం చెల్లించనున్నారు. వైఎస్సార్ రైతు బీమా ద్వారా ప్రీమియం చెల్లించేందుకు రూ.1,163 కోట్లు కేటాయించారు. రైతులకు వ్యవసాయ బోర్లు ఉచితంగా వేసేం దుకు రూ.200కోట్లు కేటాయించారు. వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమతో జీవనం నెట్టుకొస్తున్న పాడిరైతులకు సైతం ప్రభుత్వం అండగా నిలిచింది. పాడిరైతులను ప్రోత్సహించే నిమిత్తం లీటరు పాలకు రూ.4 బోనస్ కల్పించారు. జిల్లాలో 3.8 లక్షల కుటుం బాలు పాడి ద్వారా జీవనం సాగిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 32 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి ఉంది. పాడి రైతులకు నిత్యం రూ.1.36 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌గా ఇవ్వనుంది. బడుగులకు భరోసా అరకొర జీతాలతో జీవనం నెట్టుకొస్తున్న బడుగుజీవులకు అండగా రాష్ట్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి కేటా యింపులు చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆశావర్కర్లు గౌరవవేతనం రూ.3వేల నుంచి రూ.10వేలు పెంచారు. మున్సిపల్ ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.12వేల నుంచి రూ.18వేలు పెంచారు. హోంగార్డుల వేతనం రూ.18 వేల నుంచి రూ.21,300 చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవవేతనం రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు వెయ్యి రూపాయలు పెంచారు. ఇవన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల మేరకు ఆర్థిక మంత్రి బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఆటో డ్రైవర్లు, రజకులు, నాయీ బ్రహ్మణులు, టైలర్లు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయింపులు చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించారు. గత పాలకులు అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేయాలనే యత్నం చేపట్టగా, బాధితులకు అండగా నిలవడంలో చిత్తశుద్ధిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చూపింది. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల నిమిత్తం రూ.1150 కోట్లు కేటాయించింది. జిల్లాలో 16,528 మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరికీ ఊరట దక్కుతోంది. ఎప్పటి నుంచో ఎదరుచూస్తున్న వారికి త్వరలో డబ్బులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. విద్య..వైద్యానికి పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసింది. బడ్జెట్లో నిధులు కేటాయింపు ఆ మేరకు రుజువు చేస్తున్నాయి. విద్యను ప్రోత్సహించే నిమిత్తం అమ్మఒడి ప«థకాన్ని ఇదివరకే ప్రకటిం చారు. ఆ మేరకు రూ.32,168 కోట్లు కేటా యించారు. చదువు కొనే రోజుల నుంచి ప్రోత్సాహకం అందించే రోజులను తీసుకొచ్చినందుకు విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు అందుబాటులో వైద్యం అందించాలనే దృక్పథం బడ్జెట్లో స్పష్టంగా కన్పించింది. రూ.వెయ్యి వైద్యం కూడా ఉచితంగా అందించాలనే దిశగా అడుగులు పడ్డాయి. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,740 కోట్లు కేటాయించారు. రూ.5 లక్షలు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ వర్తించేలా నిర్ణయం తీసుకోవడంతో అత్యధికులకు ఉపయోగపడనుందని పలువురు వివరిస్తున్నారు. సాగునీటి రంగానికి ప్రాధాన్యం రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.13,139 కోట్లు కేటాయించగా అందులో చిత్తూరు జిల్లాకు భాగస్వామం ఉన్న ప్రాజెక్టులకు ప్రధాన కేటాయింపులున్నాయి. తెలుగు గంగ, హెచ్ఎన్ఎస్ఎస్, గాలేరి–నగరి పథకాలకు ప్రాధాన్యత దక్కింది. గత ప్రభుత్వంతో పోలిస్తే రెట్టింపు నిధులు దక్కాయి. -
జన సమ్మోహన బడ్జెట్
సాక్షి , రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శుక్రవారం తొలి ఏకాదశి రోజున తొలిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ జిల్లా దిశ, దశను మార్చేస్తుందని, అన్ని వర్గాలకూ మేలు చేసేదిగా, జనరంజకంగా, సంక్షేమానికి పెద్ద పీట వేసేదిగా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ ఉండటాన్ని పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ ఆధారమైన మన జిల్లాకు ఈ బడ్జెట్ వరాల జల్లు బీమా ఇక భారం కాదు అమలాపురం టౌన్: ఇక పంటల బీమా కోసం ప్రీమియం సొమ్ములు చెల్లించే భారం ఇక రైతులకు ఉండదు. నూటికి నూరు శాతం రైతులకు ఇక బీమా ధీమా కానుంది. ముఖ్యమంత్రి జగన్ మాది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నట్టే వారికి పంటల బీమాపై పూర్తి భరోసా ఇచ్చారు. వైఎస్సార్ పీఎం ఫసల్ ఉచిత పంటల బీమా పథకం కింద ప్రభుత్వమే చెల్లించేలా చేశారు. రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ ఎన్నో రాయితీలు, ఉచితాలు ఇచ్చారు. ఉచిత పంటల బీమా పథకానికి ఏకంగా రూ.1,166 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపు ప్రకారం చూసుకుంటే వ్యవసాయ జిల్లా అందులోనూ పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాకు దాదాపు రూ.20 కోట్ల కేటాయింపు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వ్యవసాయానికి ప్రకటించిన ఎన్నో పద్దులు మన జిల్లాకు వాటాగా అన్వయించుకుని లెక్కలు కట్టుకుంటే రూ.కోట్ల కేటాయింపు ఉండడంతో జిల్లా రైతులు బడ్జెట్‌పై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ పీఏసీఎస్‌లలో రైతులకు పంట రుణాలు ఇచ్చినప్పుడు ఆ రుణం మొత్తంలో రెండు శాతం సొమ్ములను పంటల బీమా కింద వసూలు చేసి ప్రీమియం చెల్లించే పరిస్థితి ఉండేది. జిల్లాలోని 304 వ్యవసాయ సహకార సంఘాల్లో దాదాపు రెండు లక్షలకు పైగా రైతులు సభ్యులై ఉన్నారు. అయితే ఇందులో దాదాపు 1.8 లక్షల మంది వరకూ పంట రుణాలు ఏటేటా తీసుకుని వ్యయసాయ పెట్టుబడులకు సద్వినియోగం చేసుకుంటున్నారు. రైతులు సహకార సంఘాల్లో రుణం తీసుకున్నప్పుడు రెండు శాతం సొమ్ములు అంటే దాదాపు రూ.1,500 పంటల బీమా కింద ఆయా సంఘాలు కట్ చేసి ప్రీమియంలు చెల్లించేవి. ఇదంతా గతం. ఇప్పుడు వైఎస్సార్ పీఎం ఉచిత పంటల బీమా పథకం కింద రైతులు ఇలా రుణం తీసుకున్న సొమ్ముల నుంచో.. సొంత సొమ్ముల నుంచో చెల్లించే పరిస్థితి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వమే ఇక నుంచి బీమా ప్రీమియంలు రూ.600 వంతున రెండు దఫాలు చెల్లించే వెసులుబాటు కల్పించారు. అంటే ఈ ఉచిత పథకం వల్ల జిల్లాలో దాదాపు 1.8 లక్షల మంది రైతులకు ఉరటనివ్వనుంది. ఆర్థికంగా కొంత భారం తగ్గే పరిస్థితి ఉంటుంది. ఇంత మంది రైతులకు మొత్తం రూ.16.08 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. మత్స్యకారుల్లో ఆనందోత్సాహాలు కాకినాడ సిటీ: వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం అందించే భృతికి రూ.100 కోట్లు కేటాయించడంతో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 13 తీర ప్రాంత మండలాల్లో సుమారుగా 3.5 లక్షల మంది మత్స్యకారులు కడలిని నమ్ముకుని బతుకుతున్నారు. గత ప్రభుత్వం రెండేళ్లుగా అరకొరగా ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున భృతిని అందిస్తూ సవాలక్ష నిబంధనలు పెట్టేది. జిల్లాలోని తుని, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్, సిటీ, తాళ్లరేవు, ఐ పోలవరం, ముమ్మిడివరం, కరప, ఉప్పలగుప్తం, అమలాపురం, అల్లవరం, మలికిపురం, కాట్రేనికోన తదితర మండలాలకు చెందిన సుమారు 42 గ్రామాల పరిధిలో లక్ష మందికి పైగా మత్స్యకారులు చేపల వేటమీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం అందించిన లెక్కల ప్రకారం వారిలో సుమారు 60 వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. బోట్ల డీజిల్‌కు ప్రత్యేక నిధులపై హర్షం మత్స్యకారులు వేటాడే బోట్లకు డీజిల్ సబ్సిడీ అందించేందుకు రూ.100 కోట్ల కేటాయింపుపై మత్స్యకార వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నారు. జిల్లాలో ఫిషింగ్ మెకనైజ్డ్ వెజల్స్ 435, మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్స్, 3,485లతో పాటు మరో 1,221 మరబోట్లకు సంబంధించి మత్స్యకారులకు ఉపయోగమని వారు అంటున్నారు. పింఛన్‌దారులకు భారీ కేటాయింపులు వృద్ధులకు పింఛన్ రూ.2 వేలు పెంచుకుంటూ రూ.3 వేల వరకూ చేస్తానని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు. ముందు రూ.250 పెంచి రూ.2250 చేశారు. ఇప్పుడు బడ్జెట్లో 12 విభాగాలుగా పింఛన్‌దారులకు రాష్ట్ర బడ్జెట్లో రూ.15,813.51 కోట్లు కేటాయించడంతో పింఛనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5,81,033 మంది పెన్షనర్లకు నెలకు రూ.139.97 కోట్లు అందజేస్తున్నారు. ఆశా వర్కర్ల హర్షం సంకల్ప యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి శుక్రవారం నాటి బడ్జెట్లో రూ. 455.85 కోట్లు కేటాయించడంపై ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4,500 మంది ఆశా వర్కర్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. సొంతింటి కల నేరవేరే వేళ బోట్‌క్లబ్ (కాకినాడ సిటి): టీడీపీ హయాంలో ప్రతి నియోజకవర్గంలో కుప్పలు తెప్పులుగా పేరుకుపోయిన ఇళ్ల దరఖాస్తులకు మోక్షం లభించలేదు. ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 వేలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పాదయాత్ర సమయంలో సొంత ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని సీఎం ప్రస్తుత బడ్జెట్లోనే రూ. 9785.75 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో జిల్లాకు రూ.752 కోట్లు వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. టీడీపీ హయాంలో అరకొరగా కేటాయించిన ఇళ్లకు సైతం బిల్లులు ఇవ్వలేదు. జిల్లాలో 16 వేల మంది ఇళ్లు వివిధ దశల్లో ఉండగా వాటికి రూ. రూ.50 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత బడ్జెట్లో గృహ నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించడంలో పెండింగ్ బిల్లులతో పాటు కొత్తగా నిర్మాణాలు చేసుకొనే వారికి ఎంతో ఊరటనివ్వడంతో వారి ఆనందానికి అవధులేవు. పెట్టుబడికి భరోసా అమలాపురం: నవరత్నాలలో అన్నదాతకు దన్నుగా నిలిచే ‘రైతు భరోసా’ వచ్చే రబీ నుంచి అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రైతు భరోసాకు రూ.8,750 కేటాయించారు. రైతుకు రూ.12,500 అందించనున్నారు. తొలుత ఇది వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి అమలు అవుతుందని భావించినా, ప్రభుత్వం రబీ నుంచే అమలు చేయాలని నిర్ణయించడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కౌలురైతులకు సైతం దీనిని వర్తింపజేశారు. ఈ పథకం వల్ల జిల్లాలో 6.73 లక్షల మంది రైతులకు మేలు జరగనుందని ప్రాథమిక అంచనా. ఏటా వీరందరికీ రూ.841.25 కోట్ల పెట్టుబడి ప్రోత్సాహంగా అందనుంది. జిల్లా వ్యాప్తంగా 64 మండలాల్లో సుమారు 6,81,720 ఎకరాల ఆయకట్టు ఉంది. వరి సాగులో అత్యధికంగా 4.6 లక్షల మంది వరి రైతులున్నారని అంచనా. తరువాత 80 వేల మంది కొబ్బరి రైతులు, 25 వేల మంది ఆయిల్‌పామ్ రైతులు, 30 వేల మంది ఉద్యాన పంట రైతులు, 29 వేల మంది కూరగాయ పంట రైతులు, ఇతర పంటలు, అధికారంగా నమోదైన కౌలురైతులు కలిపి సుమారు 49 వేల మంది వరకు ఉన్నారని అంచనా. లబ్ధిదారుల్లో మూడు వంతుల మంది సన్న, చిన్నకారు రైతులే సుమారు 60 శాతం మంది రైతులు ఎకరం, ఎకరంన్నర సాగు చేసేవారు కావడం గమనార్హం. దీనిలో వరి రైతులు అత్యధిక శాతం మంది ఉన్నారు. వరి సాగుకు జిల్లాలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అయ్యే పెట్టుబడి రూ.35 వేలు. దీనిలో రూ.12,500 ప్రోత్సాహంగా అందితే మిగిలిన పెట్టుబడి 22 వేల 500 మాత్రమే. సాధారణంగా రైతులు తొలి పెట్టుబడి కోసమే అప్పులు చేస్తుంటారు. తరువాత బ్యాంకు నుంచి రుణం అందే వెసులుబాటు ఉంది. రైతు భరోసా వల్ల తాము ప్రైవేటు అప్పులపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరముండదు. వారి దగ్గర అప్పులు చేయడం, తరువాత అయినకాడికి వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఉండదని రైతులు ధీమాతో ఉన్నారు. చిన్న రైతులకు మేలు రైతు భరోసా ద్వారా ఎకరాకు రూ.12,500 ఇవ్వడం వల్ల చిన్న, సన్నకారు రైతులకు చాలా మేలు జరుగుతుంది. అర ఎకరం, ఎకరం, రెండు ఎకరాల ఉన్న రైతులకు పెట్టుబడిలో చాలా వరకు ఉపయోగపడుతోంది. ముఖ్యంగా జిల్లాలో వరి రైతులు నష్టపోవడానికి పెట్టుబడుల కోసం బయట అప్పులు చేయడం కూడా ఒక కారణం. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కొంత వరకు ఉపయోగపడుతోంది కాబట్టి ప్రైవేట్ అప్పుల బెడద చాలా వరకు తీరినట్టే. – సిహెచ్.సూర్యనారాయణరాజు, రైతు, మాగం, అయినవిల్లి మండలం. బడ్జెట్లో చేనేత రంగానికి ఊరట రామచంద్రపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో చేనేతలకు ఊరట కలిగించే విధంగా నిధులు కేటాయించారు. ఈ మేరకు ఆ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా చేనేతలకు బడ్జెట్లో ఈసారి రూ.200 కోట్లను కేటాయించారు. దీంతో జిల్లాలోని 50 చేనేత సహకార సంఘాలు, వీటి ద్వారా సుమారుగా 17 వేలకు పైగా చేనేత కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాలకు రావలసిన సుమారు రూ. 9 కోట్లు ఆప్కో వద్ద స్తంభించిపోయాయి. ఈ బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించటం ద్వారా నిలిచిపోయిన బకాయిలు వచ్చే అవకావం ఉందని నేతన్నలు భావిస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో బోర్లకు రూ.200 కోట్లు సర్పవరం (కాకినాడ రూరల్): నవరత్నాల పథకాల్లో ఒకటైన రైతు భరోసాలో భాగంగా ఉచితంగా బోరు బావులు తవ్వేందుకు బడ్జెట్లో ఈ ఏడాది రూ.200 కోట్లను ప్రతిపాదించారు. జిల్లాలో మెట్ట, ఏజెన్సీ ప్రాంతంలో రైతులు చాలా మంది బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్నారు. మెట్టలోని సుమారు 13వేల బోర్లు వినియోగంలో ఉన్నాయి. వాటికి ఉచిత విద్యుత్ కోసం బడ్జెట్లో రూ.4525 కోట్లు కేటాయించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రైతులకు ఆర్థిక చేయూత ఉచితంగా బోర్లు తవ్వడం వల్ల రైతులకు ఆర్థిక చేయూత ఇచ్చినట్టే. బోరు తవ్వేందుకు అడుగుకు రూ.60 చొప్పున చెల్లించాలి. 300 అడుగులకు రూ.18 వేలతో పాటు కేసింగ్ పైపునకు ఖర్చు అవుతుంది. ఈ మొత్తం మాకు ఆదా అవుతుంది. – అడ్డాల సుబ్బారావు, రైతు – గుర్రప్పాలెం, జగ్గంపేట మండలం -
బడ్జెట్‌తో నవ సంకల్పం దిశగా..
సాక్షి, కర్నూలు : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్‌పై జనం భారీ అంచనాలు.. అందులోనూ ఆర్థిక మంత్రి జిల్లాకు చెందిన నేత కావడంతో ఎన్నో ఆశలు.. ఈ నేపథ్యంలో శుక్రవారం శాసనసభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో జిల్లాకు నిధుల కేటాయించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నవరత్నాలు మెరిసేలా.. ప్రజలు మురిసేలా.. నేలమ్మ పండేలా.. రైతన్న నవ్వేలా.. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ..అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టిన బడ్జెట్.. బాగు బాగు అంటూ కొనియాడుతున్నారు. కరువు నేలలో కర్షకుల కన్నీళ్లు తుడిచేలా.. కృష్ణా జలాలు బీడు భూములను సస్యశ్యామలం చేసేలా.. బీసీలకు చేయూతనిచ్చేలా.. గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపేలా నిధులు కేటాయించి జనరంజక బడ్జెట్ అనిపించారు. రైతు భరోసాతో సాయం రైతులకు పంట పెట్టుబడి కోసం ఏటా మే మాసంలో రూ.12,500 చొప్పున సాయం చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబరు 15 నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతామని మంత్రి బుగ్గన ప్రకటించారు. జిల్లాలో దాదాపు 4.50 లక్షల నుంచి 5 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం దక్కనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 శీతల గిడ్డంగులు నిర్మిస్తామని ప్రకటించారు. తొలిదశలో జిల్లాకు ఒక్కటి చొప్పున నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో కూడా శీతల గిడ్డంగి నిర్మించనున్నారు.రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు బోర్వెల్ మిషన్లు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఇది కూడా రైతులకు మేలు జరిగే నిర్ణయమే. రూ.3 వేల కోట్ల కార్పస్‌ఫండ్‌తో ధరల స్థిరీకరణ నిధి, రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్య నిధి నిర్ణయాలతో కూడా జిల్లా రైతులకు మేలు జరగనుంది. పదేళ్లలో కనీసం ఏడేళ్లు జిల్లా రైతులు కరువు బారిన పడుతుంటారు. రైతులకు వడ్డీలేని రుణాలు.. జిల్లాలో ఏటా 4.50 లక్షల మంది రైతులు రూ.4,360 కోట్ల మేర వ్యవసాయ రుణాలు తీసుకుంటున్నారు. వీరికి వడ్డీ భారం పడకుండా రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై రైతులు చెల్లించే 7 శాతం వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. జిల్లాలో సకాలంలో పంటలు పండక, రుణాలు తీర్చలేక, వడ్డీభారంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు వడ్డీభారం నుంచి ఉపశమనం లభించినట్లయ్యింది. దాదాపు ఏటా రూ. 305 కోట్ల భారం తగ్గనుంది. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరికి వెన్నుదన్నుగా నిలిచేందుకు మహానేత పాలనలో 421 జీవో జారీ చేశారు. అప్పుల బాధ తాళలేక రైతు కుటుంబంలో జరిగిన ఎలాంటి ఆత్మహత్య అయినా రైతు ఆత్మహత్యగా గుర్తించాలని ఆ జీవోలో పేర్కొంది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జిల్లాలో 281 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.వీరిలో కొందరికి ప్రభుత్వం అరకొర పరిహారం మాత్రమే ఇచ్చింది. పరిహారం అందని వారందరికీ ఇప్పుడు రూ.7 లక్షల చొప్పున అందజేస్తామని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అక్కచెల్లెమ్మలకు అండగా.. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 50,691 గ్రూపులు, 5,25,259 మంది సభ్యులు ఉన్నారు. వీరికి సున్నా వడ్డీకే రుణం ఇవ్వాల్సి ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ మేరకు ప్రతి సంవత్సరం పొదుపు సభ్యులు వడ్డీతో సహా బాకీ చెల్లిస్తూ వచ్చారు. వాస్తవంగా సున్నా వడ్డీ కింద ఇచ్చిన అప్పులకు బ్యాంకులకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని చెల్లించకుండా పసుపు, కుంకుమ పేరుతో ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు హడావుడి చేసిన విషయం విదితే. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదుపు మహిళలకు సున్నా వడ్డీకే రుణం ఇచ్చేందుకు సంకల్పించారు. ఇందుకోసం బడ్జెట్లో 1,140కోట్లు కేటాయించగా, జిల్లాకు రూ.90కోట్ల దాకా కేటాయించే అవకాశం ఉంది. ఆడపడుచులకు ఆసరా నవరత్నాలు అమలులో భాగంగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఈ ఉడాది ఏప్రిల్ 11వ తేది వరకు స్వయం సహాయక సంఘాలకు ఉన్న రుణాన్ని లెక్కిస్తారు. జిల్లాలో దాదాపు రూ.823కోట్ల రుణం ఉన్నట్లు అంచనా. ఆ మొత్తాన్ని వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించి నాలుగు వాయిదాల్లో చెల్లించేందుకు నిర్ణయించారు. పెరిగిన కల్యాణ కానుక వైఎస్ఆర్ కల్యాణ కానుక కింద ఇచ్చే ప్రోత్సాహక నగదును సీఎం జగన్ పెంచారు. బీసీ కులాలకు ఇప్పటి వరకు రూ.35వేలు ఇస్తుండగా దానిని రూ.50 వేలకు పెంచారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు గతంలో రూ.40వేలు ఇచ్చేవారు..ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.1లక్షకు పెంచారు. 2019–2020 సంవత్సర కాలంలో ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చేయూత పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు బడ్జెట్లో కార్యరూపం దాల్చాయి. నాయీబ్రాహ్మణులు, రజకులు, ట్యాక్సీడ్రైవర్లు, టైలర్లకు దన్నుగా నిలిచేందుకు ఏడాదికి రూ.10 వేలు ఆర్థికసాయం చేయనున్నట్లు బుగ్గన ప్రకటించారు. దీంతో జిల్లాలో వేలాదిమందికి లబ్ధి చేకూరనుంది. హంద్రీ–నీవా ఫేజ్–1తో సాగునీరు రాయలసీమ జిల్లాలకు వరదాయిని అయిన హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలతో కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని దివంగత సీఎం వైఎస్సార్ ఈ ప్రాజెక్టు చేపట్టారు.ఫేజ్–1లో 1.98 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో 80 వేల ఎకరాల ఆయకట్టు కర్నూలు జిల్లాలో ఉంది. ఫేజ్–1 పనులు 2012లోనే పూర్తయినా డిస్ట్రిబ్యూటరీలు మాత్రం పూర్తి కాలేదు. గత ఐదేళ్లూ డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్లిప్తత ప్రదర్శించింది. దీంతో కాలువలో కళ్లెదుటే నీళ్లు వెళుతున్నా ఆయకట్టుకు మళ్లించుకోలేని దుస్థితి రైతన్నలది. ఫేజ్–1 ద్వారా ఆయకట్టుకు నీళ్లిస్తామని బడ్జెట్లో ప్రకటించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దీనివల్ల జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. -
సాగునీటి ప్రాజెక్టులకు సాహో
సాగునీటి రంగానికి వైఎస్ జగన్ సర్కారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. నిధుల కేటాయింపులో వెనుకాడ లేదు. గత ప్రభుత్వం కన్నా జల వనరుల ప్రాజెక్టులకు నిధులు అధికంగానే కేటాయించారు. కరువుతో అల్లాడుతున్న జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల కింద గ్యాప్ ఆయకట్టు నానాటికి పెరుగుతోంది. రిజిస్టర్ అయిన ఆయకట్టు నానాటికి దిగజారి పోతుంది. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపులో ప్రాధాన్యం కల్పించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీలో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జిల్లాలోని రైతుల ఆంక్షలు, ఆశలకు సమకాలికంగా కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. సాక్షి, ఒంగోలు : జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. దసరా, సంక్రాంతి పండుగల నాటికి మొదటి సొరంగం పనిని పూర్తి చేసి నీళ్లిస్తామంటూ ఐదేళ్లు కాలం గడిపేశారు. తీరా ఎన్నికలు వచ్చినా వెలుగొండ నుంచి నీళ్లు రాలేదు. వెలుగొండ కింద సాగు నీటి కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వెలిగొండను ప్రతిష్టాత్మకంగా స్వీకరించింది. ఈ బడ్జెట్లో నిధులను గత ప్రభుత్వం కన్నా అధికంగానే కేటాయించింది. ఏడాదిలోగా పనులను పూర్తి చేసి 1.1 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకోనున్నారు. రూ.485.10 కోట్లు వెలిగొండ మొదటి టన్నెల్ పనిని పూర్తి చేసేందుకు కేటాయింపులు రూ.28 కోట్లు గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్ పనులు,ఇతర పనులకు కేటాయింపు 1.10 లక్షల ఎకరాలు వెలిగొండ పరిధిలో ఏడాదిలోగా పంటలకు నీళ్లివ్వాలన్న లక్ష్యం రూ.544.52 కోట్లు 2018–19కు గత ప్రభుత్వం నీటి పారుదల రంగానికి కేటాయించిన నిధులు రూ.670.65 కోట్లు 2019–20కు నీటిపారుదల రంగానికి వైఎస్ జగన్ సర్కార్ కేటాయించిన నిధులు ఎర్రం చిన్నపోలిరెడ్డి ప్రాజెక్ట్‌కు .. ఎర్రం చిన్న పోలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకానికి రూ.10 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కింద రూ.111.05 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు పరిధిలో పైప్‌లైను పనులు జరుగుతున్నాయి. గుండ్లకమ్మ రిజర్వాయను నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాజెక్టు కింద 20 వేల ఎకరాలకు నీరు అందించాలని లక్ష్యంగా ప్రతిపాదించారు. 1.33 టీఎంసీల నీటిని తీసుకొనే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. భూసేకరణ, పైపులైన్ల పనులకు ఈ నిధులను కేటాయించారు. పాలేరు రిజర్వాయర్‌కు రూ.5 కోట్లు.. పాలేరు–బిట్రగుంట ప్రాజెక్టు పనులకు రూ.5 కోట్ల కేటాయింపు జరిగింది. పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ పనులకు రూ.5 కోట్లు నిధులను కేటాయించారు. రిజర్వాయర్ పనులకు రూ.4.9 కోట్లు, రూ.10 లక్షలు భూసేకరణకు నిధులను కేటాయించారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.50.50 కోట్లు కాగా ఇప్పటికి రూ.15.07 కోట్లు పని జరిగింది. జిల్లాలోని ఇతర మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యం కల్పించారు. రాళ్లపాడు ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు రూ.1.01 కోట్లు, మోపాడుకు రూ.5 లక్షలు, పోతురాజుకాలువ ఆధునీకీకరణ పనులకు రూ.50 వేలు నిధుల కేటాయింపు జరిగింది. నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం సాగునీటి ప్రాజెక్టులకు అన్ని విధాలుగా చేయూత ఇస్తానన్న జగన్ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లాలో లక్షన్నర ఎకరాలకు పైగా గ్యాప్ ఆయకట్టు పెరిగింది. ఐదేళ్ల నుంచి నీటి పారుదల రంగానికి చుక్క నీరు రావడం లేదు. మధ్య తరహా ప్రాజెక్టుల విషయంలోనూ అస్సలు ఆయకట్టుకే నీరు లేకుండా పోయింది. నాగార్జునసాగర్ కాలువల పరిధిలో లక్షన్నర ఎకరాలకుపైగా గ్యాప్ ఆయకట్టుకు నీరు రాలేదు. ఈ నేపథ్యంలోనే వెలుగొండ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇచ్చి ఈ ప్రాజెక్టు ఏడాదిలోగా మొదటి టన్నెల్ పనిని పూర్తి చేసి నీరివ్వడానికి ప్రభుత్వం దృష్టి పెట్టింది. వెలుగొండ ద్వారానే కరువు జిల్లా అభివృద్ధికి నోచుకుంటుంది. నీటి పారుదల ప్రాజెక్టులకు కావల్సినంత నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంకేతాలు ఇవ్వడం గమనార్హం. గుండ్లకమ్మకు రూ.28 కోట్లు కేటాయింపు గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులకు, కాలువల పనులకు, పునరావాసకాలనీలలోని పనులకు, పునరావాస చెల్లింపులు, ఇతర పనులకు కలిపి నిధులు కేటాయించారు. కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయం పనులకు బడ్జెట్లో రూ.28 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12.845 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకునే సామర్ధ్యంతో అప్పటి సీఎం డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి తలపెట్టారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా గుర్తింపు ఉంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.753.83 కోట్లు కాగా ఇప్పటికి రూ.621.98 కోట్లు వెచ్చించారు. ఖరీఫ్‌కు 62,368 ఎకరాలు, రబీకి 80,060 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. అయితే ఇంకా గుండ్ల కమ్మ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ పూర్తి కాలేదు. జాతికి అంకితం చేయలేదు. గుండ్లకమ్మ దాదాపు పనులన్నీ పూర్తయినా సాగుకు నీరు అధికారికంగా ఇవ్వడం లేదు. గుండ్లకమ్మ పరిధిలో 37.72 ఎకరాల వరకు ఇంకా భూసేకరణ పెండింగ్‌లో ఉంది. రైతులు కోర్టుకు వెళ్లడంతో భూసేకరణ నిలిచిపోయింది. ఏడాదిలోగా వెలిగొండ నీళ్లివ్వడమే లక్ష్యం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుకు 2019–20 బడ్జెట్లో రూ.485.10 కోట్ల వరకు కేటాయించారు. మొత్తం 43.58 టీఎంసీల నీటిని తీసుకుని 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. 15.25 లక్షల మంది జనాభాకు ఈ ప్రాజెక్టు ద్వారానే తాగునీరు అందించేందుకు డిజైన్ చేశారు. వెలిగొండ మొత్తం రూ.5150 కోట్లు అంచనా వ్యయం కాగా రూ.4844.46 కోట్ల పనులు జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.485 కోట్లు కేటాయింపు జరిగింది. మొదటి టన్నెల్ పనిని పూర్తి చేసి ఏడాదిలోగా నీళ్లివ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. -
తొలి పద్దు పొడిచింది
జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే అజెండాగా వ్యవసాయ, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జిల్లాలో 60 శాతంపైగా ఉన్న వ్యవసాయాధారిత కుటుంబాలకు ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీగా నిధులు కేటాయించి వారి సంక్షేమానికి అండగా నిలిచారు. జిల్లాలో సుమారుగా 6.60 లక్షల రైతాంగ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 85 శాతానికి పైగా పేద వర్గాల పిల్లల చదువులు, విద్య వ్యవస్థలో మౌలిక రంగాల కల్పన, అభివృద్ధికి కూడా అదే తీరుగా బడ్జెట్ కేటాయింపులు చేశారు. 4.60 లక్షల మంది తల్లులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. పొదుపు మహిళలు 5.60 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఆక్వా రైతులు 39 వేల మందికి, మత్స్యకారుల 59 వేల మందికి ఆర్థిక చేయూత లభిస్తుంది. సాక్షి, నెల్లూరు : రాష్ట్ర బడ్జెట్ల్లో వ్యవ‘సాయానికి’ పెద్ద పీట వేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో శుక్రవారం ప్రవేశ పెట్టి న బడ్జెట్లో రైతులకు సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు, సాగునీరు, వరద నివారణకు రూ.13,139 కోట్లు, వైఎ స్సార్ రైతు భరోసాకు రూ.8,750 కోట్లు కేటాయించారు. జిల్లాలో సుమా రు 11 లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగువుతోంది. ఇందులో 4.50 లక్షల మంది యాజమాన్య రైతులు ఉంటే.. 1.96 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. పెట్టుబడి సాయంగా అందరి రైతులకు ఏటా రూ.12,500 లబ్ధి కలుగుతోంది. స్వల్పకాలిక రుణాల కింద రూ.12 వేల కోట్లు, దీర్ఘకాలిక రుణాల కింద రూ.1,500 కోట్లు కేటాయించడంతో రైతులకు ఆసరాగా ఉండనుంది. జిల్లాలో దాదాపు ఏటా లక్ష మంది వరకు రుణాలు తీసుకుంటారు. వీరిందరికి వడ్డీ లేని రుణా లు అందనున్నాయి. బడ్జెట్లో కేటా యింపులతో రుణాలు సులభతరం కా నున్నాయి. సేంద్రియ వ్యవసాయానికి రూ.91 కోట్లు కేటాయించారు. జిల్లాలో సేంద్రియ వ్యవసా యం 4 వేల ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. ఉచిత విద్యుత్, ధరల స్థిరీకరణ నిధుల ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. రైతులను ఆదునుకునే విధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులను అన్ని విధాలా ఆదుకునే విధంగా, ఆసరాగా ఉంది. బడ్జెట్లో రైతాంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కేటాయింపులు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. – చిరసాని కోటిరెడ్డి, రైతు సం ఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సాగరపుత్రుల కన్నీళ్లు తుడుస్తూ.. వాకాడు: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో రూ. 590 కోట్లు కేటాయించారు. జిల్లాలో 169 కిలో మీటర్ల సముద్ర తీరం వెంబడి 12 తీర ప్రాంత మండలాల్లో 118 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 59 వేల మంది వేటపై ఆధారపడిన మత్స్యకారులు ఉన్నారు. వీరికి సంబంధించి 5 వేలకు పైగా వేట చేసే లైసెన్స్ కలిగిన బోట్లు ఉన్నాయి. వీరికి గతంలో డీజిల్‌పై రూ.6.03 మాత్రమే రాయితీ ఉండేది. అది కూడా పూర్తిగా అందేది కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మొత్తాన్ని రూ.12.96లకు పెంచారు. ఇందు కోసం డీజల్ సబ్సిడీ కింద రూ. 100 కోట్లు కేటాయించారు. ఐదేళ్లుగా వేట విరామం సమయంలో చెల్లించే పరిహారం అందని ద్రాక్షలా మారింది. గత ప్రభుత్వం వేట విరామం పరిహారం కింద చెల్లిస్తున్న రూ.4 వేలను రూ. 10 వేలకు పెంచి ఏటా పరిహారం కోసం రూ. 100 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. జిల్లాలో 15,321 మంది మత్స్యకారులు లబ్ధిపొందనున్నారు. సముద్రంపై ప్రకృతి విపత్తుల కారణంగా వేట సక్రమంగా సాగక, మత్స్యసంపద దొరక్క నానా అగచాట్లు పడుతున్న మత్స్యకారులకు మత్స్య సందప వృద్ధి కోసం రూ. 60 కోట్లు కేటాయించారు. ఊహ తెలిసినప్పటి నుంచి వేట చేసి 50 ఏళ్లకే వృద్ధాప్యం చెందిన మత్స్యకారులకు పింఛన్ కింద రూ.130 కోట్లు కేటాయించారు. మత్స్యకారులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే గతంలో ఇస్తున్న రూ. 5 లక్షల బీమాను రూ. 10 లక్షలకు పెంచారు. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం మత్స్యకారుల సంక్షేమానికి అనూహ్యంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆదుకున్న సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. నాలుగేళ్లుగా వేట విరామం కింద అందజేయాల్సిన రూ. 4 వేలు డబ్బులు సక్రమంగా అందలేదు. దానిని రూ. 10 వేలకు పెంచి మత్స్యకారులను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉంది. – పోలయ్య మత్స్యకారుడు, కొండూరుపాళెం ప్రభుత్వ విద్యకు పెద్ద పీట రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. బడ్జెట్లో విద్యారంగానికి రూ.32,618 కోట్లు నిధులు కేటాయించారు. ఇందులో జగనన్న అమ్మఒడి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మొత్తం రూ.6,455 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన జగనన్న అమ్మఒడి పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. జిల్లాలో మొత్తం 4,485 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 3,307, ఎయిడెడ్ 114, కార్పొరేట్, ప్రైవేట్ 1,057, కేంద్ర ప్రభుత్వ 7 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 4,28,667 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరితో పాటు ఇంటర్ విద్యార్థుకు కూడా జగనన్న అమ్మఒడి పథకాన్ని విస్తరించనున్నట్లు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌కు సంబంధించి 215 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ యాజమాన్యానికి సంబంధించి 69, కార్పొరేట్, ప్రైవేటుకు సంబంధించి 146 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 32,020 మంది విద్యార్థులు చదువుతున్నారు. అమ్మఒడి పథకంలో భాగంగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ.15 వేలు విద్యార్థి తల్లి ఖాతాకు జమ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో జిల్లాలో మొత్తం 4,60,687 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,077 కోట్లు కేటాయించింది. జిల్లాలో మొత్తం 3,404 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. నెల్లూరు అర్బన్ పరిధిలో ఇస్కాన్ సంస్థ ద్వారా 111 పాఠశాలలు, అక్షయ పాత్ర ద్వారా గూడూరు, మనుబోలు, వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లోని 291 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. వీటితో పాటు మిగిలిన 3,202 పాఠశాలల్లో 3002 ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పాఠశాలల్లో మొత్తం 2,16,320 మంది విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి సరిగా నిధులు ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెన్సీ నిర్వాహకులకు బిల్లులు ఐదారు నెలలు పెండింగ్‌లో ఉంచేవారు. ఆయాలు, హెల్పర్లకు గౌరవ వేతనం సైతం నెలల తరబడి ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు బడ్జెట్లో రూ.1,077 కోట్లు కేటాయించడం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతు సం‘క్షేమం’ దిశగా. ఆక్వా రైతుల కష్టాలు తీరనున్నాయి. ఆక్వా రైతులకు విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణలో పెట్టారు. రాష్ట్ర బడ్జెట్లో ఆక్వా రైతుల విద్యుత్ చార్జీల రాయితీకి రూ.475 కోట్లు కేటాయించారు. జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి 13 మండలాలు ఉన్నాయి. కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, మనుబోలు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు, తడ మండలాల పరిధిలో సాధారంగా సుమారు 1.85 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. కానీ కొన్నేళ్లుగా పెరిగిన పెట్టుబడి వ్యయాలు, ధరల ఆటుపోటలతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం సుమారు 1.25 లక్షల ఎకరాల్లో సాగు అవుతోంది. దాదాపు 39 వేల మంది రైతులు ఆక్వా సాగు చేస్తుంటే.. 22,550 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. సబ్సిడీ విద్యుత్‌తో మేలు నిన్నటి వరకు ఆక్వా రైతులు విద్యుత్ కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జీఓ విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం బడ్జెట్లో విద్యుత్ చార్జీల తగ్గింపునకు నిధులు కేటాయించడం ఆనందంగా ఉంది. ఇది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని స్పష్టమైంది. – కనపర్తి నాగేంద్ర, ఆక్వా రైతు, ఊటుకూరు పొదుపు మహిళలకు వడ్డీలేని రుణాలు జిల్లాలోని పొదుపు మహిళలకు ఇక నుంచి వడ్డీలేని రుణాలు అందనున్నాయి. డీఆర్డీఏ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో, మెప్మా పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో మొత్తం కలిపి 53,350 గ్రూపుల్లో 5.60 లక్షల మంది పొదుపు సభ్యులు ఉన్నాయి. గతంలో పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేది. వడ్డీతో సహా సకాలంలో చెల్లించిన వారికి రాయితీ మొత్తాన్ని తిరిగి బ్యాంకులకు జమ చేసే వారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు అసలు మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. వడ్డీ మొతాన్ని ప్రభుత్వమే బ్యాంకులకు నేరుగా జమ చేయనుంది. ఈ మేరకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,140 కోట్లు కేటాయించింది. పొదుపు గ్రూపులకు 2019 ఏప్రిల్ నుంచి వడ్డీలేని రుణాలు మంజూరు చేయనున్నారు. పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు సుమారు నెలకు రూ.15 కోట్లకు పైగా వడ్డీ ప్రభుత్వం చెల్లించనుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించనునట్లు సమాచారం. మహిళలు చెల్లించవలసిన వడ్డీని ప్రభుత్వం చెల్లించి దానికి సంబం«ధించిన రసీదులను గ్రామ వలంటీర్ల ద్వారా అందజేయనున్నట్లు తెలిసింది. సీఎం తీసుకున్న నిర్ణయం వలన స్వయం సహాయక గ్రూపు మహిళలపై వడ్డీల భారం పడదు. వడ్డీలేని రుణాల పథకం 2012 నుంచి అమలులో ఉంది. పొదుపు మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. మహిళలు తీసుకున్న రుణాలను అసలు, వడ్డీతో కలిపి మహిళలే చెల్లించే వారు. ప్రతి నెల సక్రమంగా చెల్లించన గ్రూపులకు మాత్రమే వడ్డీ తిరిగి చెల్లించే వారు. టీడీపీ ప్రభుత్వం 2016 జూన్ నుంచి వడ్డీలేని రుణాలు చెల్లించకుండా ఎగనామం పెట్టింది. పొదుపు మహిళలు మాత్రం తీసుకున్న రుణాలను వడ్డీలతో సహా తిరిగి చెల్లించారు. టీడీపీ ప్రభుత్వం మహిళను నమ్మించి మోసం చేసింది. నూతన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల స్వయం సహాయక మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
నవ శకానికి 'పద్దు' పొడుపు
సాక్షి, కడప : నవ రత్నాలు.. ప్రభుత్వం ప్రజలకు అందించిన వరాలు..అన్నదాతకు అండగా రైతు భరోసా..మహిళల కష్టాలు తీర్చేందుకు వడ్డీలేని రుణాలు..అమ్మ ఒడితో ప్రతి పేద విద్యార్థి బడిబాట..పింఛన్ల పెంపుతో ధైర్యం..ఆరోగ్యశ్రీతో రోగాలు మాయం..సాగు, తాగునీటి కోసం ప్రాజెక్టులు..ఇదే ప్రభుత్వ లక్ష్యం.. సాధించే దిశగా ప్రయత్నం..ఇచ్చిన మాట నిలుపుకున్నందుకు..రాజన్న బాటలో నడుస్తున్నందుకు.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ప్రజారంజకంగా ఉంటోంది. ఈ దిశగా తొలి బడ్జెట్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. అన్ని వర్గాల ప్రజలకుమేలు చేకూరేలా రూపొందించారు. సొంత జిల్లాకు పెద్దపీట వేశారు. దీంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైద్యం.. ఆరోగ్య దీపం వైద్య, ఆరోగ్యశాఖకు రూ.11,399 కోట్లు, ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీకి రూ.1740 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి పేదకు నాణ్యమైన వైద్యం అందించేలా సర్కారు ముందుకు పోతోంది. చంద్రబాబు సర్కారు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంతో పేదలు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పెద్దఎత్తున నిధులు ఇచ్చారు. దీంతో ప్రతి పేదకు రాష్ట్రంలోనే కాక, ఇతర ప్రాంతాల్లో వైద్యం చేయించుకునేలా వెసులుబాటు కల్పించే దిశగా నిధులు అందిస్తున్నారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతంలోని ఆరోగ్యకేంద్రాలు మెరుగు పరిచేందుకు అవసరమైన స్థాయిలో నిధులు కేటాయింపు జరిగింది. అమ్మ ఒడి.. నూతన ఒరబడి అమ్మఒడి పథకం కింద పాఠశాల, ఇంటర్ కళాశాలలో చదివే విద్యార్థుల తల్లుల అకౌంట్లో ఏటా రూ.15 వేలు జమ చేయనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలో 4.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జూనియర్ కళాశాలలో ప్రథమ, ద్వితీయ ఏడాది చదువుతున్న విద్యార్థులు 46 వేల మంది ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేల వంతున అందిస్తే జిల్లా వ్యాప్తంగా రూ.780 కోట్లు లబ్ధి చేకూరుతుంది. పేదలకు గృహయోగం వైఎస్సార్ గృహ వసతికి మొత్తం రూ.5 వేల కోట్లు, బలహీన వర్గాల ఇళ్లకు రూ.1280 కోట్లు కేటాయించారు. దీంతో దాదాపుగా అర్హులందరికీ గృహ యోగం కలగనుంది. టీడీపీ ప్రభుత్వంలోని మూడేళ్ల కాలంలో జిల్లాకు మొత్తం 55 వేల గృహల కేటాయింపులు జరిగాయి. పెండింగ్‌లో ఉన్న రూ. 40 కోట్లు మంజూరు కానందున ఇప్పటికీ 22 వేల గృహలు వివిధ దశల్లో నిలిచిపోయి ఉన్నాయి. ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా పేదల కష్టాలు త్వరలో తీరిపోనున్నాయి. దీంతో తామంతా అతి త్వరలో సొంతింటికి యజమానులం కాబోతున్నామని సంతోషపడుతున్నారు. మండలానికి ఒక ‘108’ అంబులెన్స్ జిల్లాలో ప్రస్తుతం రెండు బ్యాకప్‌తో కలిపి మొత్తం 30 వాహనాలు ఉన్నాయి. అందులో కండీషన్లో లేని వాహనాలు 20 ఉన్నాయి. దీంతో ఆపదలో ఉండే బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడా పరిస్ధితికి అడ్డుకట్ట పడనుంది. ప్రభుత్వం మండలానికి ఒక అంబులెన్స్‌ను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా జిల్లాలోని 50 మండలాలకు స రిపడా కొత్త వాహనాలు త్వరలో రానున్నాయి. అలాగే గ్రామీణ వైద్యంలో కీలకంగా ఉన్న 104 సంచార వైద్యానికి కూడా మంచి రోజులు రానున్నాయి. ఉక్కు సంకల్పం స్టీల్ ఫ్యాక్టరీకి డిసెంబరు 26న శంకుస్థాపన చేయనున్నట్టు గత వారంలో జమ్మలమడుగులో జరిగిన రైతు దినోత్సవంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు బడ్జెట్లో ఉక్కు ఫ్యాక్టరీకి రూ.250 కోట్లు కేటా యించారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేసేందుకు నిర్ణయించారు. ఇందులో మొదటి దశగా నిధులు కేటాయించారు. నెరవేరిన ఆశ జిల్లాలో 2,131 మంది ఆశావర్కర్లు ఉన్నారు. గతంలో వీరి వేతనం రూ.3వేలు ఉండగా ప్రస్తుతం దీన్ని రూ.10 వేలకు పెంచారు. ఈ లెక్కన వారి ప్రతి నెలా రూ.21.31 కోట్లు జీతాల రూపంలో చెల్లిస్తున్నారు. గతంంలో కంటే దాదాపు రూ.15 కోట్లు అదనంగా ఆశావర్కర్లకు జీతాలు అందుతున్నాయి. పింఛన్.. పెంచెన్ వైఎస్సార్ పింఛన్ కానుకకు రూ.12,801 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద జిల్లాలో 3,01,387 మందికి లబ్ధి చేకూరనుంది. గతంలో నెలకు దాదాపు రూ.54 కోట్లు ఇచ్చే వారు. జగన్ సీఎం కాగానే పింఛన్ల మొత్తాన్ని పెంచారు. ఈ లెక్కన గతంలో ఇచ్చిన దాని కంటే అధికంగా రూ.20 కోట్లతో కలిపి ప్రతి నెలా రూ.73 కోట్లు పింఛన్‌దారులకు అందిస్తున్నారు. సగటున ఏడాదికి రూ.240 కోట్లు జిల్లాలోని పింఛన్‌దారులకు లబ్ధి చేకూరుతుంది. వైఎస్సార్ కల్యాణ పథకం : రూ.716 కోట్లు పింఛన్‌దారులు : 3,01,387 మంది ప్రతి నెలా అందించే మొత్తం : రూ.73 కోట్లు రుణ మాఫీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో 33,226 స్వయం సహయక సంఘాల్లోని 3,22,260 మంది మహిళా సభ్యులు ఇప్పటి వరకు తీసుకున్న రుణం రూ. 1097 కోట్ల వరకు ఉంది. అలాగే మెప్మా పరిధిలో 1.17 లక్షల సంఘాల్లో 1,17,000 మంది సభ్యులు రూ 471.76 కోట్ల రుణాలు తీసుకున్నారు. మొత్తం 4,30,260 మంది సభ్యులు మొత్తం తీసుకున్న రుణం రూ. 1568.76 కోట్ల రుణం నాలుగు విడతల వారీగా రుణ మాఫీ కానుంది. ఈ రుణ మాఫీతో మహిళా సభ్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గత ప్రభుత్వంలో సభ్యులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. -
అన్ని వర్గాలకు మేలు చేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది
-
నవ వసంతం.. తొలి వెలుగు..
ఎన్నికల హామీలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ మాటంటే మాటే ► ‘‘రాజకీయ పార్టీలను చూడం.. కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం. ఎన్నికల్లో మాత్రమే రాజకీయాలు చేయాలి. ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమమే పరమావధి.’’ -సీఎం వైఎస్ జగన్ ► నియోజకవర్గ ఎమ్మెల్యేలకు రూ.కోటి చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధి కేటాయింపు. కేవలం అధికారపక్ష ఎమ్మెల్యేలకు మాత్రమే కాకుండా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఈ నిధి కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం. రైతు ప్రభుత్వం ►హెచ్ఎల్సీ, హంద్రీనీవా, భైరవానితిప్ప ప్రాజెక్టులకు రూ.1,345 కోట్ల నిధులను కేటాయించింది. ►ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.7లక్షల మేర అందించేందుకు బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. ఫలితంగా జిల్లాలోని 200 పైగా రైతుల కుటుంబాలకు ఆసరా లభించనుంది. ►వైఎస్సార్ రైతు భరోసా కింద జిల్లాలోని రైతులకు రూ.12,500 చొప్పున అక్టోబర్‌లో రబీ పంటకు పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వం అందించనుంది. ►రైతాంగానికి ఉచితంగా 9 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు ఉచితంగా బోర్లు వేయించేందుకు కూడా నిధుల కేటాయింపు జరగడం విశేషం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: నవరత్నాల మేనిఫెస్టో అమలు దిశగా మొదటి బడ్జెట్లోనే ప్రభుత్వం పెద్దపీట వేసింది. రైతులు.. మహిళలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమంతో పాటు తోపుడుబండ్ల వ్యాపారులు.. డప్పు కళాకారులతో పాటు ఇతర సామాజిక వర్గాలకు పింఛను పథకాన్ని అమలు చేసేందుకు అనుగుణంగా నిధులను కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం భారీగానే నిధులు వెచ్చించనుంది. జగనన్న అమ్మ ఒడి పథకం కింద బడికి పంపే తల్లులకు రూ.15 వేల చొప్పున సహాయం అందనుంది. ఇక సాంకేతిక విద్యతో పాటు ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు అనుగుణంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో డిజిటల్ తరగతులు, కొత్త భవనాల నిర్మాణం జరగనుంది. అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీకి రూ.55 కోట్లు, జేఎన్టీయూకు రూ.60 కోట్ల మేర నిధులను కేటాయించారు. వైద్యరంగంలో కూడా పెనుమార్పులు రానున్నాయి. 104, 108 సర్వీసులను అభివృద్ధి చేసేందుకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు ఐదారు రెట్ల మేర పెరగడంతో మండలానికో 108 వాహనం ఇక నుంచి రోడ్లపై పరుగులు పెట్టి ఆపదలో ఉన్న వారిని ఆదుకోనుంది. 108 వాహనాలకు బడ్జెట్ మొత్తం రూ.34 కోట్ల నుంచి రూ.143 కోట్లకు, 104 సంచార వైద్యానికి రూ.61 కోట్ల నుంచి రూ.179 కోట్లకు పెరిగింది. ఇందుకు అనుగుణంగా జిల్లాకు కూడా 108 పథకానికి రూ.12 కోట్లు, 104 సంచార వైద్యానికి రూ.15 కోట్ల మేర నిధులు వచ్చే అవకాశం ఉంది. అనంతపురం టు అమరావతి : రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ కొత్త రాజధాని అమరావతికి సరైన రోడ్డు మార్గం లేదు. ఈ నేపథ్యంలో అనంతపురం నుంచి అమరావతి రాజధానికి జాతీయ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో రహదారి నిర్మాణానికి భూసేకరణ సమస్య తీరడంతో పాటు రహదారి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యేందుకు ముందడుగు పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతన్నలకు నేనున్నానంటూ.. త్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు చనిపోయిన కుటుంబానికి రూ.7లక్షలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా రూ.100 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న 200 పైచిలుకు రైతు కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు తీరిపోయేందుకు అవకాశం ఏర్పడింది. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద బడ్జెట్లో రూ.8,500 కోట్లు కేటాయించగా.. ఇందులో జిల్లాలోని లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వాస్తవానికి వచ్చే ఏడాది ఖరీఫ్ సీజను నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని అనుకున్నప్పటికీ రైతుల స్థితిగతులను గమనించి... ఈ ఏడాది రబీ నుంచే రైతులను ఈ పథకం ద్వారా ఆదుకోవాలని నిర్ణయించింది. ఇక 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌తో లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా సాగునీటి వనరులు లేక జిల్లాలోని రైతులు బోర్లపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బోర్లను వేయించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించగా... జిల్లాలోని రైతులకు భారీగా లబ్ధి చేకూరనుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద రైతులు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. ధరల స్థిరీకరణ నిధిని కేటాయించడంతో ప్రతీ పంటకు గిట్టుబాటు ధర లభించనుంది. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా.. : రాష్ట్ర బడ్జెట్లో బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా డప్పు కళాకారులకు గతంలో అందిరికీ కాకుండా కేవలం కొద్ది మందికి మాత్రమే పింఛను అందుతోంది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.25 కోట్లు మాత్రమే కేటాయించగా.. ఈ ఏడాది ఏకంగా రూ.118 కోట్లు కేటాయించారు. ఫలితంగా జిల్లాలోని డప్పు కళాకారులందరికీ అర్హతను బట్టి పింఛను అందనుంది. అదేవిధంగా తోపుడుబండి వారికి కూడా పింఛను పథకం అమలుకానుంది. మరోవైపు వైఎస్సార్ పెళ్లికానుక కింద బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం సహాయం అందించనుంది. ఇక డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు వడ్డీ లేని రుణాలు ఠంచనుగా అందనున్నాయి. ఇక పేదలందరికీ కూడా అటు పట్టణ, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి భారీగానే ప్రభుత్వం నిధులను కేటాయించింది. మారనున్న విద్యా స్వరూపం : పాలిటెక్నిక్ కాలేజీల భవనాల నిర్మాణంతో పాటు డిజిటల్ క్లాస్ తరగతుల ఏర్పాటుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన భారీగా జరగనుంది. రెండేళ్ల కాలాన్ని గడువుగా పెట్టుకుని మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రణాళిక రచించింది. ఉన్నత విద్యారంగంలో జేఎన్టీయూ (ఏ)కు రూ.60 కోట్లు, ఎస్కేయూకు రూ.55 కోట్లు కేటాయించారు. అన్నింటికి మించి జVýæనన్నఅమ్మ ఒడి పథకం కింద పాఠశాలలతో పాటు ఇంటర్మీడియట్ చదివే ప్రతీ విద్యార్థినీ, విద్యార్థి తల్లులకు రూ.15 వేల చొప్పున ప్రభుత్వం అందివ్వనుంది. తద్వారా రాష్ట్రంలో నిరక్షరాస్యత పారదోలడంతో పాటు చదువు భారం కాకుండా నేనున్నానంటూ ఒక అన్నలా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ పథకాన్ని అమలు చేయనుండటంతో ఇప్పటికే జిల్లాలో పాఠశాలలకు పంపే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు డ్రాప్‌అవుట్స్ పూర్తిగా తగ్గాయనే చర్చ జరుగుతోంది. ఇక 8, 9, 10 చదువుకునే అమ్మాయిలకు ప్రత్యేకంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు న్యాప్కిన్లను ప్రభుత్వమే సరఫరా చేయనుంది. తద్వారా బాలికా విద్యాభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రజలు అన్నం అడిగితే ప్రభుత్వం బిర్యానీ పెట్టింది
-
ప్రజలకు న్యాయం చేసేలా బడ్జెట్ ఉంది
-
విజయనగరం@సంక్షేమం..సాకారం
సాక్షి, విజయనగరం : ఎన్నో ఏళ్ల కల. ఎప్పుడు నెరవేరుతుందో... పెండింగ్ సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో తెలియక... తమ కష్టాలు ఎవరు తీరుస్తారో అర్థం కాక... కాలం వెళ్లదీస్తున్న జనానికి ఓ గొప్ప వరం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రూపంలో లభించింది. జనం కష్టాన్ని చూసిన ఆ నేత తొలి బడ్జెట్లోనే వారి కన్నీళ్లు తుడిచారు. సమస్యతో సతమతమయ్యే సామాన్యుడి కళ్లల్లో సంతోషం నింపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన 43 రోజుల్లోనే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లోనే జిల్లాకు వరాలు కురిపించడమే గాకుండా సంక్షేమానికి పెద్దపీట వేసి, బంగారు భవితకు భరోసా కల్పించారు. జిల్లాకు చెందిన మంత్రి బొత్ససత్యనారాయణ ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్లోనూ వరాలు కురిపించారు. వెనుకబడిన జిల్లాగా ఉన్న విజయనగరం జిల్లా ప్రజలు మెరుగైన వైద్యానికి నోచుకోవడం లేదు. జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. అయినా గత ప్రభుత్వాల మనసు కరగలేదు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి కూడా మెడికల్ కళాశాల విషయంలో ప్లేటు ఫిరాయించారు. మాన్సాస్ ట్రస్ట్ ద్వారా మెడికల్ కళాశాల నిర్మిస్తామని ముందుకు వచ్చి, ఖర్చు ఎక్కువవుతోందనే ఉద్దేశంతో వెనక్కు తగ్గారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హామీ ఇవ్వడమేగాకుండా... తొలి బడ్జెట్లోనే రూ.66 కోట్లను కేటాయించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు: తోటపల్లి : రూ. 156 కోట్లు జంఝావతి : రూ. 5.07 కోట్లు తారకరామ తీర్ధసాగర్ : రూ. 21కోట్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి : రూ. 170.06 కోట్లు విజయనగరంతో పాటు ఉత్తరాంధ్రకు ఈ కళాశాల సేవలందించనుంది. ప్రాజెక్టులకు మహర్దశ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో తోటపల్లి పనులు 90శాతం పూర్తికాగా... మిగిలిన 10 శాతం పనులనైనా గత టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. కానీ తామే ఆ ప్రాజెక్టు పూర్తి చేశామని గత ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర సమయంలో జగన్మోహన్రెడ్డి తోటపల్లి గట్టుపై పాదయాత్ర చేశారు. ప్రాజెక్టు వల్ల జిల్లాకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తే వేలాది ఎకరాలు సాగులోకి వస్తాయని, ఎన్నో గ్రామాలకు తాగునీటి అవసరాలు తీరుతాయని గ్రహించారు. అంతేగాదు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి సాగునీటి ప్రాజెక్టుల కొరతే ప్రధాన కారణమని భావించిన జగన్ ఈ ప్రాంతంలో వాటిని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. దానిలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేస్తామని బడ్జెట్లో హామీ ఇవ్వడమే గాకుండా జంఝావతి, తారకరామతీర్థ సాగర్ తదితర ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. రైతులు... మహిళలకు పెద్దపీట తొలి బడ్జెట్లో రైతులు, మహిళలు, క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి పెద్దపీట వేశారు. పగటిపూటే రైతులకు 9గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించారు. రైతు భరోసా, రైతు బీమా, వడ్డీలేని రుణాలు వంటి వరాలిచ్చారు. 11 నెలల కౌలు కాలానికి పంట సంబంధ హక్కులను కలిగి ఉండేందుకు చట్టబద్ద యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామనడం ద్వారా జిల్లాలో కౌలు రైతుల బతుకులకు భరోసా కల్పించారు. పాడి రైతులను సైతం విస్మరించకుండా లీటర్‌పై రూ.4 బోనస్ వచ్చేలా పాడి సహకార సంఘాలను పునరుద్ధరించనుండటం మరో మంచి పరిణామం. మన జిల్లాలోని తీరప్రాంతం వెంబడి మత్స్యకారులు అధికంగా ఉన్నారు. వేట నిషేధ సమయంలో వీరిని ఆదుకునేందుకు ఏ ప్రభుత్వాలు చొరవ చూపిన దాఖాలాల్లేవు. కానీ ఈ బడ్జెట్లో మత్స్యకారులకు వరాలు కురిపించారు. బడ్జెట్‌ద్వారా లబ్ధి పొందుతున్నవారి సంఖ్య అంగన్వాడీ వర్కర్లు : 6,443 ఆశా వర్కర్లు : 2,594 పారిశుద్ధ్యకార్మికులు : 750 పింఛన్‌దారులు : 3,06,124 ప్రభుత్వ ఉద్యోగులు : 22,000 విద్యార్థులు(అమ్మ ఒడి) : 3,34,574 రైతులు(రైతు భరోసా) : 4,50,000 వైఎస్సార్ గృహవసతి : 3,23,000 రేషన్‌కార్డుదారులు : 7,13,000 మత్స్యకారులు : 22,000 వేట నిషేధ సమయంలో ఇన్నాళ్లూ ఇస్తున్న సహాయాన్ని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచారు. వేటకు వెళ్లి దురదృష్ట వశాత్తూ మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోతే అతనిపై ఆధారపడ్డ కుటుంబానికి రూ.10లక్షలను అందిస్తామన్నారు. నవరత్నాల అమలు, సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి కూడా నిధులు వచ్చాయి. వివిధ కార్పొరేషన్ల ద్వారా అర్హులకు రుణాలిచ్చేందుకు నిధులు కేటాయించారు. ఇక జిల్లాలో ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, అంగన్వాడీ వర్కర్లు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, సెర్ప్, గ్రామ సహాయకుడు, మెప్మా రిసోర్స్ పర్సన్స్, హోంగార్డులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజామ్లు ఇలా అనేక వర్గాల జీతాలను పెంచుతూ బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఆయా వర్గాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ప్రజలందరూ మెచ్చే బడ్జెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా ఉంది. ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోంది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేలా కేటాయింపులు చేశారు. మెరుగైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చారు. గత ప్రభుత్వం ఖజానాను పూర్తిగా ఖాళీ చేసినా ధైర్యంగా భారీ బడ్జెట్ కేటాయింపులు చేశారు. విజయనగరానికి మెడికల్‌కళాశాల మంజూరు చేయడం హర్షణీయం. – కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే దేశంలోనే ఆదర్శనీయ బడ్జెట్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆదర్శవంతమైన జనరంజక బడ్జెట్ ఇది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉంది. దేశంలోనే ఎక్కడా లేని పథకాలు, కేటాయింపులు జరపడంపై ఢిల్లీలో ఇతర రాష్ట్ర ఎంపీలు సైతం చర్చించుకుంటున్నారు. రూ.2.67 వేల లక్షలు కోట్లు ఆర్థిక లోటున్నప్పటికీ సంక్షేమ పథకాలకు సముచిత స్థానం కల్పించారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, యువత, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలకు అనుకూలమైన బడ్జెట్. – బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం ఎంపీ -
తొలి ‘పద్దు’ వెలుగులు..
-
విశాఖపై వరాల జల్లు..!
► బడ్జెట్‌తో జిల్లాకు ఒనగూరనున్న లబ్ధి రాజన్న రాజ్యం తిరిగి తెస్తామన్న భరోసా.. ప్రతి కుటుంబంలో నవరత్న వెలుగులు నింపుతామన్న హామీలు వైఎస్ జగన్మోహనరెడ్డిని పట్టాభిషిక్తుడ్ని చేశాయి.. ► పాలన పగ్గాలు చేపట్టిన ఆయన సర్కారు తొలిసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి. ప్రతివారిలో ఆశల మోసులు.ఆ ఆశలను చిగురింపజేస్తూ.. నమ్మకాన్ని నిలబెట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తొలిపద్దు. ఒకవైపు సంక్షేమ శకానికి, రాజన్న రాజ్యానికి బాటలు వేసే నవరత్నాలకు అధిక ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు ప్రగతికి ఊపిరులూదేలా పలు రంగాలకు కేటాయింపులు పెంచడం.. అందులోనూ ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖకు పెద్దపీట వేయడం సర్వత్రా హర్షామోదాలు పొందుతోంది. ► ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగం మొదట్లోనే ఇది నవరత్నాల బడ్జెట్ అని అభివర్ణించడంతోనే జగన్ ప్రభుత్వ ప్రాథమ్యాలేమిటో స్పష్టమైపోయింది. ► వాస్తవానికి ఆర్థిక రాజధానిగా పరుగులు తీయాల్సిన విశాఖ అభివృద్ధి గత టీడీపీ హయాంలో ఐదేళ్లూ కాగితాల్లోనే మగ్గిపోయింది. శిలాఫలకాల్లోనే ఇరుక్కుపోయింది. సదస్సులు, సమ్మేళనాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల హోరులో మరుగున పడిపోయింది. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధిని, అసలు సిసలు ప్రగతిని కాంక్షించారు. అందుకనే.. తన తొట్ట తొలి బడ్జెట్లోనే జిల్లాకు పెద్దపీట వేశారు. ► ఇన్నాళ్లూ ప్రకటనలకే పరిమితమైన విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టుకు ఊపిరి పోశారు. మెట్రో స్థానంలో.. మోనో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కేందుకు పచ్చజెండా ఊపారు.పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తించే విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు రూ.200 కేటాయించారు. ► గిరిజనులకు ఆరోగ్య భరోసా ఇచ్చేలా.. వారి పిల్లలకు వైద్య విద్య అందుబాటులోకి తెచ్చేలా విశాఖ మన్యంలో ప్రత్యేక వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.66 కోట్లు కేటాయించారు. ► విశాఖతో సహా ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కేటాయింపులను రూ.170 కోట్లకు పెంచారు. అదే చేత్తో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు, విశాఖ నగర తాగునీటి అవసరాలకు ఆధారమైన పురుషోత్తపట్నం, తాడిపూడి ప్రాజెక్టులకు సముచిత స్థాయిలో నిధులు ఇచ్చారు. ► మధ్యతరగతి ప్రజలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడంతో పాటు వేలాది మత్స్యకారులకు మేలు చేసే వేట నిషేధ భృతి పెంచడంతో పాటు బోట్లకు డీజిల్ సబ్సిడీ నిధులిచ్చారు. అన్నదాత మోముల్లో చిరునవ్వుల సేద్యం చేసేలా.. అన్ని వర్గాల వారికీ ఆసరా కల్పిస్తూ బడ్జెట్లో నవరత్నాల వెలుగులు ప్రసరించాయి. తొలిపద్దే అయినా.. అభివృద్ధికి హద్దులు లేవన్నట్లు సంక్షేమం.. అభివృద్ధే తారకమంత్రంగా రాష్ట్ర బడ్జెట్ ఉందన్న అభినందనలు అన్ని వర్గాల ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
విశాఖ వీధుల్లో మోనో రైలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వీధుల్లో మోనో రైలు చక్కర్లు కొట్టనుంది. ఆర్థిక రాజధానిగా భాసిల్లుతున్న నగరాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇన్నాళ్లూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లకే పరిమితమైన విశాఖ మెట్రో ప్రాజెక్టును మోనో ప్రాజెక్టుగా మారుస్తూ ఏర్పాటు చేసి తీరుతామని బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన స్పష్టం చేశారు. దీంతో పాటు నగరాభివృద్ధికి కీలకమైన కేటాయింపులు చేస్తూ నవ శకానికి నాంది పలికారు. విశాఖలో మోనో రైలు ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. చైనా, రష్యా, ఇజ్రాయిల్, జర్మనీ, వియత్నాం వంటి 30కి పైగా దేశాల్లో విజయవంతంగా నడుపుతున్న మోనో రైలు ప్రాజెక్టుని నగరంలో ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ తొలిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ మొదటి వరుసలోనే ప్రకటించడం చూస్తే ఈ ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారని స్పష్టమవుతోంది. అత్యాధునిక ఫ్యాబ్రికేటెడ్ సింగిల్‌బీమ్ ద్వారా నడిచే మోనోరైలు నగర వీధుల్లో తిరగాడనుందని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా రవాణాకు పెద్ద పీట వేసిన నేపథ్యంలో ప్రభుత్వం మోనో రైల్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో మెట్రో ప్రాజెక్టు ఏర్పాటు సమయంలో నగరంలో సుమారు 40 మెట్రో స్టేషన్లు నిర్మించి 99 రైళ్లు తిరిగేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇందులో మార్పులుండే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు.. విశాఖపట్నం– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కూ ప్రభుత్వ భారీగానే కేటాయింపులు చేసింది. ఏపీ ట్రాన్స్‌కో కాంపోనెంట్లో భాగంగా నిర్మిస్తున్న భూగర్భ కేబుల్ నిర్మాణ ప్రాజెక్టుకి రూ.200 కోట్లు కేటాయించింది. స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేయూతనిచ్చింది. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.180 కోట్లను ఇవ్వకుండా ఎన్నికల తాయిలాల కోసం వినియోగించుకోగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం తమ వాటాగా ఇవ్వాల్సిన రూ.50 కోట్లు కేటాయించింది. కార్పొరేషన్లో మౌలిక సదుపాయాలు, పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ఏర్పాటు చేసిన సిప్ పథకంలో భాగంగా జీవీఎంసీకి రూ.కోటి కేటాయించారు. కాగా ఘన వ్యర్థాల నిర్వహణకు జీవీఎంసీకి రూ.8.49 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు. -
ఇక 'సిరి'కాకుళమే!
‘సంకల్ప’ సూరీడు.. పాదయాత్రలో జనం కష్టాలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారి బాధలను గుర్తుపెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చి ఇప్పుడు తొలి ‘పద్దు’ పొడిచే వేళ.. వారి కన్నీళ్లు తుడిచేలా, వారి బతుకుల్లో వెలుగులు నిండేలా నిధులు కేటాయించారు.. ‘ప్రజల ముఖ్యమంత్రి’నని నిరూపించుకున్నారు.. నాయకుడి మనసెరిగిన ఆర్థిక మంత్రి విపక్షాలు సైతం ‘బుగ్గన’ వేలేసుకునేలా బడ్జెట్ సమర్పించారు. అన్ని వర్గాల ప్రజలను ఆనందంలో ముంచెత్తేలా తన ప్రణాళికను వెల్లడించారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేలా అనేక నిర్ణయాలను ప్రకటించారు. కిడ్నీ వ్యాధితో బతుకీడుస్తూ ఎన్నాళ్లు జీవిస్తామో తెలీక కొట్టుమిట్టాడుతున్న ప్రాణ దీపాలను వెలిగించేలా రీసెర్చి సెంటర్‌కు రూ.50 కోట్లు కేటాయించారు. వందలాది కోట్ల నిధులిచ్చి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు పూర్వ వైభవం తీసుకురావాలని తలపెట్టారు. సాక్షి, శ్రీకాకుళం : వెనుకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగానికి, అలాగే వ్యవసాయాధారిత వ్యవస్థలకు కూడా బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో జిల్లాలో అత్యధిక శాతం మంది ప్రజలకు ప్రత్యక్షంగానూ.. మరికొందరికి పరోక్షంగానూ లబ్ధి చేకూరనుంది. సాగు, తాగునీటికి కీలకమైన బి.ఆర్.ఆర్ వంశధార, జి.ఎల్ తోటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులను కేటాయించడంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే జిల్లాలో ప్రధానమైన కిడ్నీ రోగుల వ్యధలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గడిచిన మూడేళ్లుగా జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలను తీవ్ర తుఫాన్లు విధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా రాష్ట్రస్థాయిలో రూ.200 కోట్లు కేటాయించారు. దీంతో పాటు వ్యవసాయ రైతులకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించి, ఇందుకోసం నిధులను కూడా తాజా బడ్జెట్లో కేటాయించింది. అలాగే మత్స్యకారుల సంక్షేమానికి కూడా పెద్ద పీట వేసారు. వేటనిషేధ కాలంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన భృతి పెంచడం కూడా విశేషం. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల అమలులో భాగంగా ఇంటర్ వరకు అమ్మ ఒడి పథకం, గ్రామ/వార్డు సచివాలయాలు, గ్రామ/వార్డు వలంటీర్లు తదితర నియామకాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించడంతో నవరత్నాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. అన్ని వర్గాలకు ప్రయోజనం జిల్లాలోని రైతులు, పేదలు, విద్యార్ధులు, డ్వాక్రా మహిళలతో పాటు నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పూర్తి నిర్లక్ష్యంకి గురైన ప్రాజెక్టులకు కేటాయింపులు జరపడంతో సాగు విస్తీర్ణం పెరిగి,రైతులకు లాభదాయకం కానుంది. రైతు స్థిరీకరణ నిధికి కేటాయింపులు జరపడంతో రైతులకు గిట్టుబాటు ధర, పెట్టుబడి అందుబాటులోకి వస్తుంది. ఉద్దానం ప్రాంతంలో వేలాదిమంది కిడ్ని వ్యాధిబారిన పడుతున్నా గత ప్రభుత్వాలు సర్వేలు, నామమాత్రపు చికిత్సలతో సరిపెట్టాయి. డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా, అది పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది. పాదయాత్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో కిడ్నీ రిసెర్చి సెంటర్‌ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో రూ. 50 కోట్లు నిధులు కేటాయించడంలో అక్కడ ఉన్న తీవ్ర స్థాయి వ్యాధితో బాధపడుతున్న 16 వేలమందితోపాటు వ్యాధి లక్షణాలు ఉన్న మరో పది వేలమందికి ఊరట కల్పించే అంశంగా మారింది. జిల్లాలో మత్సకార గ్రామాలు 110 వరకు గ్రామాలు ఉండగా, వేట నిషేధ భృతి రూ.10 వేలకు పెంచడంతో సుమారుగా 9 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఆశా వర్కర్లు, గిరిజన ఆరోగ్య కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు హోంగార్డులు, మద్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ వర్కర్లకు ప్రయోజనం చేకూరేలా బడ్జెట్లో నిధులు కేటాయించారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించడంతో జిల్లాలో 2 లక్షల మందికి ఊరట కల్గించనుంది. జిల్లాలో రుణ పద్ధతితో అర్బన్ హౌసింగ్ ఇళ్లను పేదలకు కేటాయించగా రుణ మాఫీ చేస్తామని పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకొనేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరపడంతో జిల్లాలో అన్ని పురపాలక, నగరపాలక సంఘాల్లో 7వేల వరకు లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారు. మహిళలకు, రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్లో పొందుపర్చడం వలన 48,962 డ్వాక్రా సంఘాలలోని 5,46,715 మంది మహిళలకు, సుమారుగా 5 లక్షల రైతు కుటుంబాలకు మేలు చేకూరుతోంది. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు ప్రధనంగా వంశధార, నాగావళిపై తోటపల్లి ప్రాజెక్టు, మడ్డువలసలు అర్ధంతరంగా ఉండిపోయాయి. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా జిల్లాను సస్యశామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులు రూపకల్పన చేశారు. అయితే ఆయన అకాల మరణంతో పనులు నిలిచిపోయాయి. సుమారుగా పుష్కరకాలం నిలిచిన పనులకు మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాణం పోసింది. వంశధారకు రూ. 147 కోట్లు, మడ్డువలసకు రూ. 9.50 కోట్లు, తోటపల్లికి రూ.156 కోట్లను కేటాయించారు. చిన్నతరహా నీటి ప్రాజెక్టులకు రాష్టంలో రూ. 589.59 కోట్లు కేటాయించారు. దంతో జిల్లాలోని చిన్న ప్రాజెక్టులకు మహర్ధశ వస్తుంది. ఈ బడ్జెట్లో జిల్లాలో సుమారు 5 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరగనుంది. తోటపల్లి ప్రాజెక్టుకు : రూ.156 కోట్లు వంశధార ప్రాజెక్టుకు : రూ.147.10కోట్లు పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధికి : రూ.50 కోట్లు మడ్డువలస ప్రాజెక్టుకు : రూ.9.5 కోట్లు మహేంద్ర తనయ ప్రాజెక్టుకు : రూ.100.94 కోట్లు అమ్మఒడి ద్వారా చదువులకు పెద్ద పీట వేశారు. పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్ధులకు కూడా ఈ అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రతి ఏటా విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలో రూ. 15 వేలు జమ చేయనున్నారు. దీనికి గాను ఈ బడ్జెట్లో రూ. 6,450 కోట్ల్లను కేటాయించారు. దీంతో జిల్లాలో ప్రాధమిక, మాధ్యమిక, ఇంటర్మీడియట్ విద్యార్ధులు సుమారు 3.20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. దీంతో చదువుకొనేందుకు పేదలకు ఆర్ధిక సమస్య లేకుండా ఉంటుంది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఇప్పటి వరకు గడచిన అయిదు సంవత్సరాలుగా నీరసించింది. దీనికి పుర్వవైభవాన్ని తీసుకువచ్చారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందడానికి రోగాల సంఖ్యను 1040కి పెంచడంతోపాటు ఈ బడ్జెట్లో రూ.1740 కోట్లును కేటాయించారు. దీంతో జిల్లాలో తెలుపురంగు కార్డుగల పేద రోగులకు అన్ని రకాల జబ్బులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందనుంది. వైఎస్ఆర్ గృహ వసతి ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం స్థలం ఇవ్వడంతో పాటు, ఆ ఇంటి మహిళ పేరిట పట్టాను అందజేసి, ఆ స్థలంలో ఇల్లు నిర్మాణాకి నిధులు అందజేయనున్నారు. జిల్లాలో సుమారుగా 2 లక్షల ఇల్లులేని పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు, నిర్మాణాలు చేయనున్నారు. ఇందుకుగాను రాష్ట్ర బడ్జెట్లో రూ.8.615 కోట్లును కేటాయించారు. ఈ బడ్జెట్లో వారిలో స్వంత ఇల్లు కల నెరవేనుంది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పొందుపర్చిన విధంగా 300 చదరపు అడుగుల వరకు గల గృహాలక సంబంధించి పట్టణ గృహనిర్మాణ లబ్దిదారుల రుణాలను మాఫీ చేసేందుకు ఈ బడ్జెట్లో పొందుపర్చారు. వైఎస్ఆర్ పింఛను కానుక ద్వారా 60 ఏళ్లు దాటిని వృద్దులకు పింఛను అందజేయనున్నారు. జిల్లాలో కొత్తగా 46 వేల పింఛన్లు రానున్నాయి. గత అయిదేళ్లతో పోల్చితే పింఛను మూడు రెట్లు పెరిగింది. కిడ్నీ రోగులకు, దీర్ఘకాలిక రోగులకు నెలకు రూ. 10 వేలు, అలాగే వికలాంగులకు ’3 వేలు అందిస్తున్నారు. ప్రస్తుతం వివిధ రకాల పింఛనుదార్లు 3,25,785 మంది ఉన్నారు. వీరి సంఖ్య పెరగనుంది. ఈ ఏడాది బడ్జెట్లో రూ. 15746 కోట్లు కేటాయించారు. వైఎస్ఆర్ కళ్యాణ కానుక పథకం కింద బీసీ కులాలకు చెందిన వధువుకి రూ. 50 వేలు, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వధువుకి రూ.లక్ష అందజేస్తారు. గతం కంటే ఈ కానుకను రెట్టింపు చేయడంతో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రయోజనమిలా.. వైఎస్సార్ రైతు భరోసా : 5 లక్షల మందికి జగనన్న అమ్మ ఒడి : 3.20 లక్షల మందికి వైఎస్సార్పెన్షన్ కానుక : 3.26 లక్షల మందికి మత్స్యకారులకు నిషేధభృతి : 9,162 మందికి ఊరట పొందనున్న అగ్రి గోల్డ్ బాధితులు : 2 లక్షల మంది వైఎస్సార్ ఆసరా : 5.46 లక్షల మందికి వైఎస్సార్ గృహ వసతి : 2 లక్షలమందికి పాదయాత్ర హామీలకు కట్టుబడిన బడ్జెట్ ప్రతిపక్ష నాయకునిగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి సమస్యలను గుర్తించి అన్ని వర్గాల వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కట్టుబడి బడ్జెట్ రూపకల్పన చేసినట్లు స్పష్టమైంది. ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చే గుణం ఉన్న వైఎస్ కుటుంబం మాట తప్పకుండా ఉండేలా బడ్జెట్ రూపకల్పన చేశారు. శ్రీకాకుళం జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చి కేటాయి ంపులు జరిగితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఆయన కుమారుడు జగన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధార జీవనాలు ఎక్కువ. వ్యవసాయం, రైతులు, పేదలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. – ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం శాసనసభ్యుడు -
ఆలయాలకు మంచిరోజులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధూప, దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేనిరీతిలో మొట్టమొదటిసారిగా బడ్జెట్లో నిధులు కేటాయించింది. వీటి నిర్వహణకు తగినన్ని నిధుల్లేని హిందూ దేవాలయాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో నిత్య పూజలు జరిపించేందుకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా రూ.234కోట్లను కేటాయిస్తున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం ప్రకటించారు. ఇన్నాళ్లు దేవదాయ శాఖ అంటే.. రాష్ట్రంలోని ఆదాయం ఉండే ఆలయాల నుంచి ప్రతియేటా 21.5 శాతం మొత్తాన్ని ప్రభుత్వం పన్ను రూపంలో వసూలుచేసి, ఆ డబ్బులతోనే దేవదాయ శాఖ ఖర్చులకు ప్రభుత్వం ఖర్చు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ శాఖ అవసరాలకు ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయింపులు అస్సలు జరిగేవి కావు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 19వేల ఆలయాలకు ఏడాదికి రూ.50వేలు ఆదాయం కూడా రాని పరిస్థితి. ఫలితంగా వీటిల్లో నిత్యం ధూప, దీప, నైవేద్యాలు జరిగేవి కావు. కానీ, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008లో ధూప, దీప, నైవేద్యం (డీడీఎన్ఎస్) పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద ధూప, దీప, నైవేద్యాలకు రూ.వెయ్యి, పూజారికి గౌరవ వేతనంగా రూ.1,500 చెల్లించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.5వేలకు పెంచారు. అయితే, ఈ మొత్తాన్ని ఆదాయం ఉన్న వివిధ ఆలయాల ద్వారా దేవదాయ శాఖకు పన్నుల రూపంలో వచ్చే మొత్తం నుంచి ఖర్చుపెట్టేవారు. కానీ, ఆ మహానేత హఠాన్మరణంతో ఈ పథకం కొడిగడుతూ వచ్చింది. రాష్ట్ర విభజన సమయానికి రాష్ట్రంలో 1906 ఆలయాలకు డీడీఎన్ఎస్ పథకం అమలవుతుండగా.. ఈ ఏడాది జూన్ నెలకు ఆ సంఖ్య 1,604కు పడిపోయింది. అలాగే, చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది ఆలయాల నుంచి కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పేరుతో వసూలు చేసిన డబ్బుల నుంచి కేవలం రూ.9.62 కోట్లను మాత్రమే డీడీఎన్ఎస్ పథకానికి ఖర్చు పెట్టింది. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో చిన్నచిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులు డీడీఎన్ఎస్ పథకం కింద అందే ఆర్థిక సహాయంతో పాటు గౌరవ వేతనాన్ని పెంచాలంటూ పెద్దఎత్తున వినతిపత్రాలు అందజేయడంతో ఆయన అప్పట్లో సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి రాగానే తొలి బడ్జెట్లోనే దాని అమలుకు ఏకంగా రూ.234 కోట్లు కేటాయించారు. చరిత్రలో మొదటిసారిగా.. బడ్జెట్లో ఆదాయంలేని ఆలయాల నిర్వహణకు చరిత్రలో మొట్టమొదటిసారిగా రూ.234 కోట్ల మేర కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఆలయాలకు మంచి రోజులు వచ్చాయనిపిస్తోంది. – పద్మ, దేవదాయ శాఖ కమిషనర్ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు సాక్షి, అమరావతి: బ్రాహ్మణుల సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అత్యధిక కేటాయింపు ఇదే. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.500 కోట్ల ఏక మొత్తంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని పట్టించుకోకపోగా.. గడిచిన ఐదేళ్లలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ.282 కోట్లు మాత్రమే. అంటే ఏడాదికి సరాసరిన రూ.56 కోట్లు మాత్రమే కేటాయించిందన్నమాట. రాష్ట్రంలో 18 ఏళ్ల వయస్సు నిండిన బ్రాహ్మణుల సంఖ్యే 45 లక్షలదాకా ఉంటుందని అంచనా. అయితే కార్పొరేషన్‌కు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు మాత్రమే విడుదల చేయడంతో కేవలం 80 వేల మందికే సాయం చేయగలిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బ్రాహ్మణ వర్గానికి గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేసింది. -
అందరికీ ఆరోగ్య‘సిరి’
సాక్షి, అమరావతి: పేదవారి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ రాష్ట్ర సర్కారు బడ్జెట్లో వైద్య రంగానికి పెద్దపీట వేసింది. కనీవినీ ఎరుగని రీతిలో వైద్య ఆరోగ్య శాఖకు తాజా బడ్జెట్లో రూ.11,398.93 కోట్లను కేటాయించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 35 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం విశేషం. అంతేగాక ప్రతి పేదవాడికీ ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంతివైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి పునర్వైభవం తీసుకొచ్చింది. ఈ పథకానికి ఏకంగా రూ.1,740 కోట్లు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ స్థాయిలో ఎప్పుడూ కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. వెయ్యి రూపాయలు బిల్లు దాటితే చాలు.. దాన్ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి వారికి ఉచితంగా వైద్యం అందించాలన్న బలమైన ఆశయంతో ఈ పథకానికి భారీ కేటాయింపులు చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యాన్ని గత సర్కారు ఆపేయడం తెలిసిందే. దీనికి ముగింపు పలుకుతూ.. ఇప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకూ సేవలను విస్తరించింది. గతంలో ఉద్యోగుల వైద్యపథకంలో మాత్రమే ఉన్న కొన్ని జబ్బులను ఇప్పుడు ఆరోగ్యశ్రీలోనూ చేర్చి దాదాపు రెండువేల జబ్బులకు ఉచితంగా వైద్యమందించేలా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారికి సైతం ఉచిత వైద్యమందేలా నిర్ణయించింది. తద్వారా మధ్య తరగతి వారికీ సర్కారు ఆరోగ్య భరోసా కల్పించింది. ఈ ఏడాది దేశ బడ్జెట్ రూ.27,86,349 కోట్లు అయితే ఇందులో ఆరోగ్య రంగానికి కేటాయించింది రూ.62,659 కోట్లు. అంటే కేవలం 2.2 శాతం మాత్రమే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూ.2,27,974 కోట్లు కాగా, ఇందులో ఆరోగ్యశాఖకు రూ.11,398.93 కోట్లు కేటాయించడమంటే ఆరోగ్య రంగానికి 5 శాతం కేటాయింపులు జరిపినట్టు అవుతుంది. 108, 104 బలోపేతం వైఎస్సార్ హయాంలో అద్భుతంగా నడిచిన 108 అంబులెన్సులు, 104 సంచార వైద్యశాలల సేవలు ఆయన మరణానంతరం నిర్వీర్యం కావడం తెలిసిందే. ఇప్పుడు వీటికి కూడా పునర్వైభవం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది. మండలానికొక వాహనాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో ఈ రెండు పథకాలకు 323.14 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది 80 శాతం పైనే. ఇందులో 108 వాహనాలకు రూ.143.38 కోట్లు, 104 వాహనాలకు రూ.179.76 కోట్ల నిధులు వెచ్చించనుంది. క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని పెంచిన రాష్ట్ర సర్కారు వారికోసం ఈ బడ్జెట్లో రూ.455 కోట్లను కేటాయించింది. ఆశా వర్కర్ల వేతనాలను రూ.3 వేల నుంచి రూ.పది వేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెంచడం తెలిసిందే. గురజాలలో ప్రభుత్వ వైద్యకళాశాల గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉన్న గురజాల నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మించేందుకు రూ.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే పాడేరులో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం గురజాలలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 300 పడకల ఆస్పత్రిగా ఉన్నతీకరించి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తారు. మరోవైపు విజయనగరంలో కొత్తగా ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేస్తూ రూ.66 కోట్లు కేటాయించింది. మరోవైపు ఆయుష్ వైద్యకళాశాలల అభివృద్ధికి గతేడాది రూ.30 కోట్లు ఇస్తే ఈ ఏడాది రూ.52 కోట్లు కేటాయించారు. బడ్జెట్లో ప్రధానమైన వాటికి కేటాయింపులు ఇలా.. (రూ.కోట్లల్లో) ఆరోగ్యశ్రీ - 1,740 108 - 123.09 104 - 141.47 ఆశావర్కర్లకు - 455 ఉద్యోగుల వైద్యానికి - 200 రేడియాలజీ సర్వీసులు - 25 మందుల కొనుగోళ్లకు - 126 -
రైతన్నకు నిండు భరోసా
రైతుకు పంట ప్రాణం. పంటకు వాతావరణం ప్రాణం. ఆ పంట రాకపోతే రైతు తట్టుకోలేడు. వాతావరణం సరిగా లేకపోతే పంట తట్టుకోలేదు. అంటే పంటకు బీమా కావాలి. బీమాతోనే రైతుకు ధీమా వస్తుంది. సాక్షి, అమరావతి: వ్యవసాయం, రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తన తొలి వ్యవసాయ బడ్జెట్లో– నవరత్నాలలో భాగంగా ప్రకటించిన ‘వైఎస్సార్ రైతు భరోసా’కు పెద్దపీట వేసింది. మొత్తం వ్యవసాయ బడ్జెట్లో శుక్రవారం శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. 2019–20 సంవత్సరానికి వ్యవసాయం, అనుబంధ రంగాలకు మొత్తం రూ.28,866.23 కోట్లు ప్రతిపాదించగా, అందులో దాదాపు మూడో వంతు రూ.8,750 కోట్లను రైతుకు పెట్టుబడి సాయం కోసం కేటాయించారు. ఈ పథకంతో 15.37 లక్షల మంది కౌలు రైతులు సహా మొత్తం 70 లక్షల మంది అన్నదాతలు లబ్ధి పొందనున్నారు. రైతు బాంధవుడిగా ఖ్యాతిగాంచిన వైఎస్సార్ స్ఫూర్తి్తతో తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అంకితమవుతున్నట్టు బొత్స ప్రకటించారు. జాతీయ ఆహార భద్రతా మిషన్‌కు రూ.141.26 కోట్లు దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి ఏపీలోనే రూ.2,000 కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి, రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించేలా జాతీయ ఆహార భద్రతా మిషన్‌కు బడ్జెట్లో రూ.141.26 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.341 కోట్లు ప్రతిపాదించారు. రైతులకు రాయితీ విత్తనాల సరఫరాకు రూ.200 కోటు, భూసార, భూ విశ్లేషణ పరీక్షల కోసం రూ.30.43 కోట్లు, సూక్ష్మ ధాతు లోపమున్న పొలాలకు జింకు, జిప్సం, బోరాన్ వంటి పోషకాలను 100% రాయితీపై పంపిణీ చేసేందుకు మరో రూ.30.05 కోట్లు, యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి రూ.460.05 కోట్లు ప్రతిపాదించారు. వర్షాధారిత ప్రాంతాల్లో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌ను అమలు చేస్తామని మంత్రి అన్నారు. ప్రకృతి సాగుకు ‘పరంపరాగత కృషి వికాస్ యోజన’ కింద రూ.91.31 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2019–20లో రైతుల సంక్షేమం, వ్యవసాయ విభాగం అభివృద్ధికి రెవెన్యూ పద్దు కింద రూ.12,280.14 కోట్లు, క్యాపిటల్ వ్యయ పద్దు కింద రూ.230.28 కోట్లు ప్రతిపాదించారు. మూడు విశ్వవిద్యాలయాలకు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ శాఖల పరిధిలో ఉన్న 3 విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.630.60 కోట్లను ప్రతిపాదించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి నాబార్డ్–ఆర్ఐడీఎఫ్ నిధులు రూ.60 కోట్లతో కలిపి మొత్తం రూ.415 కోట్లు, ఉద్యాన వర్సిటీకి రూ.98.60 కోట్లు, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.117 కోట్లు ప్రతిపాదించారు. వివిధ శాఖలకు కేటాయింపులు వ్యవసాయంతో పాటు ఉద్యాన రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అధిక ఉత్పాదకత కలిగిన పసుపు వంగడాలను రైతులకు 50 శాతం రాయితీపై అందజేయనుంది. ఉద్యాన శాఖకు 2019–20లో రెవెన్యూ పద్దు కింద మొత్తం రూ.1,532 కోట్లను ప్రతిపాదించగా, అందులో బిందు, తుంపర సేద్య పరికరాల సరఫరాకు రూ.1,105.66 కోట్లు, పామాయిల్ రైతులకు ధరలో వ్యత్యాసం నివారించేందుకు అదనంగా రూ.80 కోట్లు ఉన్నాయి. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం, అరటి ప్రొసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టు పరిశ్రమ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు 90% రాయితీని ప్రకటించింది. బైవోల్టిన్ పట్టు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రైతులకు కేజీ పట్టుగూళ్లకు రూ.50, డీలర్లకు బైవోల్టిన్ పట్టుదారం ఉత్పత్తిపై కేజీకి రూ.130 ప్రోత్సాహకం ఇవ్వనుంది. పట్టు పరిశ్రమ శాఖకు రెవెన్యూ పద్దు కింద రూ.158.46 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1,240.93 కోట్లు, మత్స్యశాఖకు రూ.550.86 కోట్లు, మార్కెటింగ్ శాఖకు రూ.3,214.34 కోట్లు, సహకార రంగానికి రూ.234.64 కోట్లు, ఉచిత విద్యుత్ సరఫరాకు రూ.4,525 కోట్లు, ఆక్వా రంగంలో విద్యుత్ చార్జీల రాయితీకి రూ.475 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగాలు ఉపాధి హామీ పథకంతో అనుసంధానానికి రూ.3,626 కోట్లు ప్రతిపాదించారు. 2019–20లో సుమారు 50,000 సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు ప్రణాళిక ఖరారు చేసినట్టు బొత్స తెలిపారు. వ్యవసాయ బడ్జెట్లో కీలకాంశాలు.. రైతులందరికీ వడ్డీ లేని రుణాలు ధరల స్థిరీకరణ నిధి రూ. 3,000 కోట్లు ప్రకృతి విపత్తుల నిధి రూ. 2,000 కోట్లు రైతులు మరణిస్తే రూ. 7 లక్షల చొప్పున ఆర్థిక సాయం రైతు సమస్యల పరిష్కార వేదికగా అగ్రీ మిషన్ పట్టు పరిశ్రమ శాఖ రూ.158.46 కోట్లు పశు సంవర్థక శాఖ 1240.93 కోట్లు పౌల్ట్రీ రైతుల రుణాలపై వడ్డీ రాయితీ మత్స్య శాఖ రూ.550.86 కోట్లు సహకార రంగం రూ.234.64 కోట్లు ఆక్వా రంగంలో విద్యుత్ చార్జీల రాయితీ రూ.475 కోట్లు ఉపాధి హామీతో వ్యవసాయ, అనుబంధ రంగాలు అనుసంధానానికి రూ.3626 కోట్లు వైఎస్సార్ – పీఎం ఫసల్ బీమా యోజన రూ.1,163 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణ రూ.460.05 కోట్లు వడ్డీ లేని రుణాలు రూ.100 కోట్లు వైఎస్సార్ రైతు బీమా రూ.100 కోట్లు రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.341 కోట్లు రాయితీ విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు రాష్ట్రంలో ఏర్పాటయ్యే కేంద్ర పరిశోధనా సంస్థలకు చేయూత పులివెందులలో అరటి పరిశోధన, ప్రాసెసింగ్ యూనిట్ సహకార డెయిరీకి పాలు పోస్తే లీటర్‌కు రూ.4 బోనస్ పశువులు చనిపోతే పరిహారం పశువుల మందుల సరఫరాకు రూ.75.35 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా కింద ఉచిత బోర్లు రూ. 200 కోట్లు వేర్‌హౌసింగ్ మౌలిక వసతుల నిధి రూ. 200 కోట్లు వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ రూ. 109 కోట్లు రైతులకు ఎక్స్‌గ్రేషియో రూ. 100 కోట్లు సహకార రంగంలో డెయిరీ పటిష్టత రూ. 100 కోట్లు పశుగ్రాసం, దాణా రూ. 100 కోట్లు గోదాముల నిర్మాణం రూ. 37.54 కోట్లు చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు సాయం రూ. 100 కోట్లు చేపల వేట విరామ సమయంలో ఇచ్చే సాయం రూ.10 వేలు జాలర్లకు ఇచ్చే ఆయిల్ సబ్సిడీ లీటర్‌కు రూ.12.96కు పెంపు ప్రమాదవశాత్తూ మత్స్యకారులు మరణిస్తే ఇచ్చే పరిహారం రూ.10 లక్షలకు పెంపు మత్స్యకారుల బోట్లకు డీజిల్ సబ్సిడీ రూ.100 కోట్లు మత్స్య సంపద అభివృద్ధికి రూ.60 కోట్లు ఎస్సీ మత్స్యకారుల సంక్షేమం, సహాయం రూ.50 కోట్లు ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి రూ.100 కోట్లు అన్నదాతలకు ధీమా సాక్షి, అమరావతి: రుణమాఫీ మాదిరి మోసం లేదు.. ‘అన్నదాతా సుఖీభవ’ పథకంలా ఓట్ల కనికట్టు లేదు. లెక్కకు మిక్కిలి హామీలిచ్చి అమలు చేయలేక చతికిలబడిన దుస్థితి లేదు. ఉన్నది ఉన్నట్టు.. ఉండదు కనికట్టు అన్నట్టుగా సాగింది 2019–20 రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్. ‘నేను విన్నాను. నేను ఉన్నాను’ అని సీఎం వైఎస్ జగన్ పలికిన మాటలు వ్యవసాయ బడ్జెట్లో ప్రతిబింబించాయి. నిజానికి మొదట్లో ప్రకటించిన విధంగా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.50 వేల పెట్టుబడి సాయం అందించే కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి ప్రారంభించాల్సి ఉంది. కానీ.. రైతుల కష్టాలను స్వయంగా చూసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే అక్టోబర్‌లో ప్రారంభమయ్యే రబీ నుంచే ఇస్తానని ప్రకటించారు. దానికి అనుగుణంగా ఈ బడ్జెట్లోనే రూ.8,750 కోట్లను కేటాయించారు. దీనివల్ల సుమారు 64.07 లక్షల మంది రైతులకు మేలు కలుగుతుంది. గత ఏడాది కన్నా రూ.9,796 కోట్లు ఎక్కువ ‘వ్యవసాయం దండగ.. టూరిజమే పండగ’ అని చెప్పే చంద్రబాబు గత ఏడాది (2018–19) బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయించిన నిధులు 19,070 కోట్లు. ఈ మొత్తంలో నాలుగైదు విడతల రుణమాఫీకి నయాపైసా కేటాయించకపోవడం రైతులపై గత ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధకు నిదర్శనం. దీనికి భిన్నంగా 2019–20 వ్యవసాయ బడ్జెట్లో వైఎస్సార్ రైతు భరోసా కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు ఏకంగా రూ.8,750 కోట్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్లో ప్రకటించిన రైతు రథం పథకం (ట్రాక్టర్ల కొనుగోలు పథకం) ఎంతగా దుర్వినియోగమైందో అందరికీ తెలిసిందే. అందుకే ప్రస్తుత ప్రభుత్వం యాంత్రీకరణకు పెద్ద పీట వేస్తూనే కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు గ్రూపులకు పరికరాలను అందజేయాలని నిర్ణయించింది. పైసా ఖర్చు లేకుండా రైతులకు బీమా పరిహారం పంటల బీమాలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం ఓ మైలురాయి కాగా.. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వైఎస్ జగన్ ఇచ్చిన హామీకి అనుగుణంగా బడ్జెట్లో ప్రతిపాదనలు చేయడం బహుశా దేశంలోనే మొదటిసారి. ‘మా మానిఫెస్టోనే ఒక భగవద్గీత.. ఒక బైబిల్.. ఒక ఖురాన్’గా భావించామనే దానికి వాస్తవ రూపమే ఈ పథకానికి రూ.1,163 కోట్ల కేటాయింపు. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం అందించే రాయితీలన్నీ రాష్ట్రంలోని 15.37 లక్షల మంది కౌలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవడం గమనార్హం. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని గత ముఖ్యమంత్రి మాట తప్పగా.. ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ రూ.3 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదటిసారిగా రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేశారు. కల్తీ విత్తనాల కట్టడికి చర్యలు గత ప్రభుత్వ హయాంలో కల్తీ విత్తనాలతో అనేక మంది మిర్చి రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. తన ప్రభుత్వంలో ఆ మాటే వినబడకూడదన్న వైఎస్ జగన్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో సమగ్ర పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో వ్యవసాయంపై రూ.81,554 కోట్లు ఖర్చు పెడితే జగన్ ఈ ఒక్క ఏడాదిలోనే రూ.28,866.23 కోట్లు ప్రతిపాదించారు. 2014–15లో రూ.13,110.39 కోట్లుగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రకటిస్తే అందులో అచ్చంగా వ్యవసాయానికి మిగిలింది రూ.4 వేల కోట్లకు మించకపోవడం గమనార్హం. ఇక, 2015–16లో రూ.14,184 కోట్లను ప్రకటించినా అందులో రూ.5 వేల కోట్లు రుణమాఫీకి సర్దుబాటు చేసి సాగుకు నామమాత్రపు నిధులే మిగిల్చారు. 2016–17లో రూ.16,251 కోట్లు, 2017–18లో రూ.18,214 కోట్లు, 2018–19లో రూ.19,070.36 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయానికి కేటాయించినా ఇవేవీ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి దిశగా నడపలేకపోయాయి. చివరకు దురదృష్టవశాత్తు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ప్రకటించిన రూ.5 లక్షల సాయాన్ని కూడా ఇవ్వలేదు. ఇటువంటి దుర్భర పరిస్థితులు క్షేత్రస్థాయిలో నెలకొని ఉంటే వ్యవసాయ రంగం రాష్ట్రంలో 11 శాతం వృద్ధి సాధించిందని చెప్పుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లింది. -
‘నవ’ యుగం
‘నేను విన్నాను... నేను ఉన్నాను’... అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా విలువేమిటో తొలి వార్షిక బడ్జెట్ తెలియజెప్పింది. కులం లేదు.. మతం లేదు.. ప్రాంతం లేదు.. పార్టీలు అసలే లేవు.. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ సంక్షేమం, అందరికీ అభ్యున్నతి.. మాత్రమే సర్కారు లక్ష్యమని బడ్జెట్ ప్రతిపాదనలు రుజువుచేశాయి. సంక్షేమరథాన్ని ఉరకలెత్తిస్తూ రూ. 2,27,974 కోట్లతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2019–20 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. నవరత్నాలకు పెద్దపీట వేసి ‘నవ’ యుగానికి నాంది పలికారు. తొలిబంతినే సిక్సర్ కొట్టినట్లు తొలి పద్దులోనే ఎన్నికల హామీలలో 80 శాతానికిపైగా నెరవేర్చారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం వంటి ప్రాధాన్య రంగాలకు భారీగా కేటాయించారు. ‘వైఎస్సార్ రైతు భరోసా’ అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకునే అపర సంజీవనిగా కితాబులందుకుంటోంది. ‘జగనన్న అమ్మ ఒడి’ తమ బిడ్డల చదువులకు, భవిష్యత్తుకు ఎనలేని భరోసా అని పేదింటి తల్లులు మురిసిపోతున్నారు... సమాజంలోని ఏ వర్గాన్నీ ఈ బడ్జెట్ విస్మరించలేదు. ఆటోడ్రైవర్లు, నాయీబ్రాహ్మణులు, రజకులు, మత్స్యకారులు, చేనేతలు, బ్రాహ్మణులు, లాయర్లు, మౌజన్లు, పాస్టర్లు ఇలా అన్ని వర్గాలకు తీపికబురు అందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి సంతకం, తొలి కేబినెట్ నిర్ణయాలు, తొలి బడ్జెట్ ప్రతిపాదనలు.. ఇలా అన్నీ సంచలనాలే.. అభివృద్ధి పథాన వడివడి అడుగులే.. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు ప్రజల సంక్షేమానికి, వారి కన్నీరు తుడవడానికి నిబద్ధతతో సురాజ్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థ నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి స్పష్టమైన లక్ష్యాన్ని, కార్యాచరణ ప్రణాళికలను ప్రభుత్వం కలిగి ఉంది. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ మా మేనిఫెస్టోలోని కార్యక్రమాలన్నింటినీ సంపూర్తిగా అందించాలని అధికారులందరినీ ముఖ్యమంత్రి ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, ప్రాంతం, పార్టీల వంటివి చూడొద్దని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి, తద్వారా ప్రజల నిజమైన హక్కులను, సమాన అవకాశాలను అధికారికంగా ఉల్లంఘించింది. గత పాలనా వ్యవస్థకు, ప్రస్తుత ప్రభుత్వానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా.సింగపూర్ అంతర్జాతీయ విమానాలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ సమకూర్చాలా లేక వేలాది మంది తల్లులు, పిల్లలకు మెరుగైన పోషకాహారాన్ని అందించాలా అనే విషయంలో మొదటి దాన్ని వదిలేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. – అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్న సమున్నత లక్ష్యాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. అవినీతి రహిత, పారదర్శక సంక్షేమ పాలనే తమ సర్కారు లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. గత పాలకులు తమకు అప్పుల ఖజానాను అప్పగించినా, తమ ప్రభుత్వ ప్రాధామ్యాల మేరకు ఉన్నంతలో బడ్జెట్ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,27,974.99 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం శానససభలో ప్రవేశపెట్టారు. విద్యార్థులకు ‘జగనన్న అమ్మ ఒడి’, ‘జగనన్న విద్యా దీవెన’, రైతులకు భరోసా, యువతకు చేయూత, వృద్ధులకు పింఛన్లు, అందరికీ ఇళ్లు, దశల వారీగా మద్య నిషేధం తమ సర్కారు ప్రాధామ్యాలని వివరించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలు అన్ని వర్గాలకూ భరోసా కల్పిస్తాయని, వీటి అమలు దిశగా బడ్జెట్లో నిధులు ప్రతిపాదించామని అన్నారు. అవినీతికి చెక్ పెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నాం.. ‘‘టెండర్లలో అవినీతికి చెక్ పెట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పోలవరం ప్రాజెక్టుతో సహా సాగునీటి ప్రాజెక్టులు, ఇతర కాంట్రాక్టుల్లో అవినీతిని నిరోధించడానికి జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు. బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ వారసత్వంగా పొందని అత్యంత దయనీయ ఆర్థిక స్థితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారసత్వంగా పొందింది. విభజన సమయంలో రూ.1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్ర రుణం 2018–19 నాటికి రూ.2,58,928 కోట్లకు పెరిగిపోయింది. అంతేకాకుండా వివిధ సంస్థల ద్వారా రూ.10 వేల కోట్ల రుణాలు తీసుకుని గత ప్రభుత్వం ఆయా నిధులను ఇతర అవసరాల కోసం దారి మళ్లించింది. దీనికి అదనంగా మరో రూ.18 వేల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటికీ తోడు ఫిబ్రవరిలో సమర్పించిన 2019–20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కింద ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు దాదాపు రూ.45 వేల కోట్ల వనరుల అంతరం ఉంది. ఇది ఈ ప్రభుత్వానికి సంక్రమించిన భిన్నమైన ఆర్థిక పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు అంశాలతో పాటు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రధానమంత్రిని కోరుతున్నాం. విభజన చట్టంలో కొంత స్పష్టత లేదనే కారణంతో హామీలు నిష్ప్రయోజనం కాకూడదు. బడ్జెట్లో ముఖ్య కేటాయింపులు ఇలా.. గ్రామ వలంటీర్లు, సచివాలయాలకు- రూ.1,420 కోట్లు సంక్షేమ పింఛన్లకు- రూ.15,746.58 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు- రూ.13,139.05 కోట్లు గృహ నిర్మాణాలకు- రూ.9,785.75 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు- రూ.4,962.30 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు- రూ.4,962.30 కోట్లు అమరావతి మౌలిక సదుపాయాలకు- రూ.500 కోట్లు వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి- రూ.1,740 కోట్లు పోలవరం ప్రాజెక్ట్‌కు- రూ.5,129 కోట్లు వైఎస్సార్ రైతు భరోసాకు- రూ.8,750 కోట్లు జగనన్న అమ్మ ఒడికి- రూ.6,455.80 కోట్లు 2022 నాటికి లేమితనం ఉండొద్దు సింగపూర్ అంతర్జాతీయ విమానాలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ సమకూర్చాలా లేక వేలాది మంది తల్లులు, పిల్లలకు మెరుగైన పోషకాహారాన్ని అందించాలా అనే విషయంలో మొదటి దాన్ని వదిలేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. మా మనస్సాక్షి, ఎంపికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 2022 నాటికి రాష్ట్రంలో లేమితనం లేకుండా చూడాలని భావిస్తున్నా. ఇందులో భాగంగా సంక్షేమం, సంపద కల్పన రెండింటినీ సమతుల్యం చేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చేలా మా బడ్టెట్‌ను రూపొందించాం. రైతుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యం 2022 నాటికి వ్యవసాయ ఆదాయాలను రెండింతలు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు అనుకూల పథకాలు ప్రవేశపెట్టింది. రైతుల సంక్షేమమే మా ప్రథమ ప్రాధాన్యం. ముఖ్యమంత్రి అధ్యక్షతన వ్యవసాయ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి రైతుకు ప్రతిఏటా మే నెలలోనే రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తాం. 64.06 లక్షల మంది రైతులు, 15,36 లక్షల మంది కౌలు రైతులు పెట్టుబడి సాయానికి అర్హులుగా గుర్తించిన తొలి ప్రభుత్వం మాదే. రైతులకు పరపతి వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కౌలు రైతులకు సైతం ‘వైఎస్సార్ వడ్డీలేని రుణాలు’ ఇస్తుంది. పంట నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ‘వైఎస్సార్ పంటల బీమా’ను అమలు చేస్తాం. రైతుల తరఫున పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. పశువులకు కూడా బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధిని బడ్జెట్లో ప్రతిపాదించాం. తిత్లీ తుపాను బాధితుల కోసం రూ.150 కోట్లు కేటాయించాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.7 లక్షలు రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించేందుకు ‘వైఎస్సార్ అగ్రి ల్యాబ్’లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైతుల కోసం 13 శీతల గిడ్డంగులు, 24 గోదాములను అభివృద్ధి చేస్తాం. కౌలు రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇచ్చే రూ.4,000 సాయాన్ని రూ.10,000 పెంచుతాం. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం రూ.7 లక్షల చొప్పున సాయం అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మార్చేయాలని నిర్ణయించాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం బడెŠజ్‌ట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించాం. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని వండే వారికి(కుక్‌లు) ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచాం. మళ్లీ ‘కుయ్.. కుయ్’ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108, 104, ఆరోగ్యశ్రీ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడానికి ఆయా కార్యక్రమాలకు తిరిగి ప్రాణం పోయాల్సి ఉంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ని వర్తింపజేస్తాం. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఈ పథకం కింద ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల కేసులకు చికిత్స అందించాలని సర్కారు ప్రతిపాదిస్తోంది. మరో 432 ‘108’ అంబులెన్సులు కొనాలని ప్రతిపాదించాం. ‘104’ సేవల కోసం మరో 676 అంబులెన్సులు కొనాలని నిర్ణయించాం. వచ్చే రెండేళ్లలో ఉత్తమ కార్పొరేట్ ఆస్పత్రులతో సమానంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం ప్రణాళిక రూపొందించి ఈ ఏడాది రూ.1,500 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించాం. పాడేరు, అరకులో రూ.66 కోట్ల ప్రాథమిక వ్యయంతో ఈ సంవత్సరం గిరిజన వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పల్నాడు కోసం గురజాలలో, ఉత్తరాంధ్ర కోసం విజయనగరంలో రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.50 కోట్లతో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం. 2.81 లక్షల మంది వలంటీర్ల నియామకం ఇల్లు లేని 25 లక్షల మందికి వచ్చే ఐదేళ్లలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఉగాది సందర్భంగా 25 లక్షల కుటుంబాల మహిళలకు ఇంటి జాగాలు ఇవ్వనున్నాం. మేనిఫెస్టోలో చెప్పిన మేరకు 300 చదరపు అడుగుల వరకూ గల పట్టణ గృహనిర్మాణ లబ్దిదారులకు రుణ భారాన్ని మాఫీ చేస్తాం. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. పట్టణాలు, గ్రామాల్లో 2.81 లక్షల వలంటీర్లను నియమిస్తున్నాం. గ్రామ సచివాలయాల ద్వారా లక్ష కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నాం. తూకాల్లో, నాణ్యతలో ఎక్కడా తేడా లేకుండా ప్యాకెట్లలో నిత్యావసర సరకుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నాం. బీసీల కోసం 130 ప్రత్యేక కార్పొరేషన్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు ‘వైఎస్సార్ సున్నావడ్డీ’ పథకాన్ని అమలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ యూనిట్ల పరిధిని 100 నుంచి 200కు పెంచుతున్నాం. నాయీ బ్రాహ్మణులు, రజకుల ఆదాయం పెంపు కోసం ఏటా రూ.10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి చేనేత కార్మికుడికి రూ.24 వేలు సమకూర్చనుంది. బీసీల కోసం 130 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయనుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు చెరువులు, సరస్సుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచాం. గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల గౌరవ వేతనాన్ని రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచాం. భూ వివాదాలకు తావులేని విధంగా సర్వే చేసి, టైటిల్ హక్కులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉద్ఘాటించారు. చతుర్విధ వికాసాలు తమ ప్రభుత్వ లక్ష్యం చాణుక్యుని ‘చతుర్విధ వికాసాల’ మాదిరిగా ఉంటుందని బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. ‘అనుకున్న లక్ష్యాన్ని సాధించడం.. సాధించిన దాన్ని సుస్థిర పర్చుకోవడం.. సుస్థిర పరచిన దాన్ని విస్తరించడం.. విస్తరించిన దాన్ని నలుగురికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దడం..’ ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికలని పేర్కొన్నారు. ‘ఈ దేశ నిర్మాణంలో తనకు కూడా ఒక పాత్ర ఉందని ప్రతి పేద వ్యక్తి అర్థం చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు లేకుండా సమాజంలో ప్రతి వ్యక్తి నివసించగలిగే పరిస్థితులు ఉండాలి’ అన్న మహాత్మాగాంధీ మాటలతో బుగ్గన బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ఉన్నత విద్యాభ్యాసానికి ‘జగనన్న విద్యా దీవెన’ మెట్రిక్ అనంతర కోర్సులు చదివే విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ‘జగనన్న విద్యా దీవెన’ పథకానికి అంకురార్పణ చేశామని బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. ‘‘అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు నూరు శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఈ పథకం కింద అందుతుంది. ఆహారం, ప్రయాణం, హాస్టల్, పుస్తకాలు మొదలైన ఇతర ఖర్చుల కోసం ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.20,000 చొప్పున అందిస్తుంది. ఇందుకోసం బడ్జెట్లో రూ.4,962.3 కోట్లు ప్రతిపాదించాం. వివిధ పథకాలకు పేర్లు పెడుతున్న సందర్భంగా మేం వీటికి జగనన్న పేరు పెట్టాలని నిర్ణయించాం. అయితే తన పేరు వద్దే వద్దని ముఖ్యమంత్రి తిరస్కరించారు. ఈ పథకాలు జగన్ రూపొందించినవే కాబట్టి ఆయన పేరు పెట్టేందుకు అంగీకరించాలని ఒత్తిడి తెచ్చి ఒప్పించాం’’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఎడిసన్ స్ఫూర్తిగా ‘జగనన్న అమ్మఒడి’ ప్రతి ఒక్కరికీ విద్యావంతులయ్యే అవకాశం కల్పించాలన్న ఆశయంతో ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ‘‘ఒకప్పుడు ఒక పిల్లవాడు బడికి వెళితే అతడికి అర్థం చేసుకునే శక్తి లేదని పాఠశాల యాజమాన్యం వెనక్కి పంపింది. నా బిడ్డకు చదువుకునే తెలివి ఎందుకు లేదో చూద్దామనే పట్టుదలతో ఆ తల్లి తన చిన్నారిని సొంతంగా చదివించింది. నాటి ఆ బాలుడే ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించిన శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ప్రకటిస్తున్నాం. పిల్లలను పాఠశాలలకు పంపించే ప్రతి తల్లికి ఏటా రూ.15,000 ఈ పథకం కింద ఇస్తాం. దీన్ని ఇంటర్మీడియట్‌కు కూడా విస్తరించాం. ఈ పథకం కింద 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరనుంది. అమ్మఒడి అమలు కోసం బడ్జెట్లో రూ.6,455 కోట్లు కేటాయించాం’’ అని బుగ్గన వివరించారు. -
సున్నా వడ్డీకి చంద్రబాబు ఎగనామం
సాక్షి, అమరావతి : ‘సున్నా వడ్డీ రుణాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను పూర్తిగా దగా చేసింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రైతులకు సున్నా వడ్డీ రుణాల కోసం రూ.11,595 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.630 కోట్లు మాత్రమే ఇచ్చింది. అంటే కేవలం 5 శాతం మాత్రమే ఇచ్చి తామేదో 100 శాతం ఇచ్చామన్నట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాల కోసం రూ.3,036 కోట్లు చెల్లించాల్సి ఉండగా పూర్తిగా ఎగ్గొట్టింది. వ్యవసాయ రుణాల మాఫీ కోసం రూ.87,612 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది. చంద్రబాబు నిర్వాకంతో రైతులు, అక్క చెల్లెమ్మలు పూర్తిగా నష్టపోయారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం టీడీపీ సభ్యులు సున్నా వడ్డీ పథకంపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ అంశంపై గురువారమే చర్చ ముగిసినందున దానిపై ఇక చర్చించేది లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ రైతులకు సంబంధించిన విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉన్నందున ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీడీపీ సభ్యులు చెప్పాల్సిన విషయాలు చెప్పాక తాము పూర్తి ఆధారాలతో సహా సమాధానం చెప్పి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామంటూ చర్చకు అనుమతివ్వాలని కోరారు. ఇందుకు స్పీకర్ అనుమతించగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు తదితరులు సున్నా వడ్డీ పథకంపై సూటిగా స్పందించకుండా కేవలం ప్రభుత్వంపై విమర్శలకే ప్రాధాన్యమిచ్చారు. సున్నా వడ్డీ పథకాన్ని తాము పూర్తిగా అమలు చేయలేదని చంద్రబాబు చెప్పిన గణాంకాలే వెల్లడించాయి. అనంతరం ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానమిస్తూ చంద్రబాబు ప్రభుత్వ తీరును ఆధారాలతో సహా ఎండగట్టారు. తన ప్రసంగానికి టీడీపీ సభ్యులు పలుమార్లు అడ్డుపడినప్పటికీ సున్నా వడ్డీ పథకం గత ఐదేళ్లలో అమలైన తీరును గణాంకాలతో సహా వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ఇలా సాగింది. బాబు గొప్పలు చెప్పుకుంటున్నారు ‘సున్నా వడ్డీ పథకాన్ని గొప్పగా అమలు చేసినట్లు.. అందుకు జాతీయ స్థాయిలో ప్రశంసలొచ్చినట్లు చంద్రబాబు చెబుతున్నారు. దానికి తోడు ఆయనకు ఎల్లో మీడియాలో ప్రాతినిధ్యం ఉంది. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా తానా అంటే వాళ్లు తందానా అంటారు. కానీ వాస్తవాలు ఏమిటో ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. ఇవి టీడీపీ ప్రభుత్వ హయాంలో తయారు చేసిన రికార్డులే. (చేతిలో డాక్యుమెంట్ చూపిస్తూ) దీని ప్రకారం 2014–15లో రైతులకు ఇచ్చిన మొత్తం పంట రుణాలు రూ.29,658 కోట్లు. సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వం రూ.1,186 కోట్లు ఇవ్వాలి. ఆ మొత్తాన్ని ఇస్తేనే బ్యాంకులు సున్నావడ్డీ రుణాలను ఇస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.44.31 కోట్లు మాత్రమే. 2015–16కు గాను రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.57,085 కోట్లు. సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.2,283 కోట్లు. కానీ ఈ పెద్దమనిషి ఇచ్చింది కేవలం రూ.31 కోట్లు మాత్రమే. 2016–17లో రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.58,840 కోట్లు కాగా, సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.2,354 కోట్లు. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.249 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2017–18, 2018–19లో సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వలేదని చంద్రబాబే నిన్న (గురువారం) విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. కానీ నేను రికార్డులు పరిశీలించి చూడగా, ఆయన కేవలం కొంత ఇచ్చినట్లు తెలిసింది. ఆ లెక్కలూ చెబుతాను. 2017–18లో రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.67,568 కోట్లు. సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.2,703 కోట్లు కాగా, ఇచ్చింది కేవలం రూ.182 కోట్లే. 2018–19లో రైతులకు ఇచ్చిన పంట రుణాలు రూ.76,721 కోట్లు. సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.3,069 కోట్లు కాగా, ప్రభుత్వం ఇచ్చింది రూ.122 కోట్లు మాత్రమే. అంటే ఐదేళ్లలో సున్నా వడ్డీ పథకం కోసం ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.11,595 కోట్లు కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.630 కోట్లే. ఆ మాత్రం ఇచ్చి తామేదో సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా అమలు చేశామని, రైతులు సంతోషంగా కేరింతలు కొడుతున్నారని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. రూ.లక్ష అప్పునకు రూ.5 వేలు ఇస్తే సరిపోతుందా? సున్నా వడ్డీ పథకం కోసం చంద్రబాబు ప్రభుత్వం కేవలం 5 శాతం మాత్రమే చెల్లించింది. కానీ తామేదో సున్నా వడ్డీ పథకాన్ని వంద శాతం కచ్చితంగా అమలు చేశామన్నట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆయన తీరు ఎలా ఉందంటే.. ఉదాహరణనకు మన నారాయణస్వామి అన్న రూ.లక్ష అప్పు తీసుకుని.. తర్వాత రూ.5 వేలు చెల్లించేసి.. అప్పు పూర్తిగా తీరిపోయింది.. ఇక నేనుబాకీ లేను.. అంటే కుదురుతుందా? కానీ చంద్రబాబు తీరు మాత్రం అలానే ఉంది. పైగా చంద్రబాబు బుకాయిస్తూ సభను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దమ్మిడీ ఇవ్వలేదంటే... మామూలుగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు దమ్మిడీ ఇవ్వలేదు అంటాం. రూపాయి ఇవ్వలేదు అంటాం. దమ్మిడీ ఇవ్వలేదంటే దానర్థం దమ్మిడీ అని కాదు. లక్ష రూపాయలు ఇవ్వాల్సిన చోట నేను 2 రూపాయలు ఇచ్చాను.. అది దమ్మిడీ కంటే ఎక్కువే కదా.. కాబట్టి నేను ఇచ్చేశాను అని చెప్పినట్లు ఉంది చంద్రబాబు తీరు. 5 శాతం చెల్లించేసి 95 శాతం ఎగ్గొట్టేస్తే సరిపోతుందా? పైగా దీనికి తామేదో సున్నావడ్డీ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేశామని చెప్పుకుంటున్న అధ్వాన్నపు పరిస్థితుల్లో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. చేసిన పనికి వాళ్లు సిగ్గుతో తలదించుకోవాలి. రుణమాఫీ విషయంలోనూ అసత్యాలు వ్యవసాయ రుణాల మాఫీ విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతోంది. 2014 మార్చి 13న నిర్వహించిన 184వ ఎస్ఎల్బీసీ (స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ) సమావేశం ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు. కానీ చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రుణాల మాఫీ కోసం ఇచ్చింది కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే. అయినా సరే చంద్రబాబు నిస్సిగ్గుగా తన 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే (2019 టీడీపీ మేనిఫెస్టోను చదువుతూ) ఎన్నికల హామీలన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేశాం. మేనిఫెస్టోలోని అంశాలన్నీ అమలు చేశాం. చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేశాం.. అని రాశారు. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు. ఈ పథకం ఉన్నట్టా.. లేనట్టా? సున్నా వడ్డీ రుణాల విషయంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలను చంద్రబాబు ప్రభుత్వం మోసగించింది. 2016 నుంచి సున్నా వడ్డీ పథకం అమలు పూర్తిగా సున్నా. ఆగస్టు 2016 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకం కోసం రూ.2,303 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆగస్టు 2016 నాటికి పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకం కోసం చెల్లించాల్సిన రూ.733 కోట్లు కూడా ఇవ్వలేదు. అంటే మొత్తంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం కోసం రూ.3,036 కోట్లు చెల్లించకుండా మోసం చేశారు. ఇలా రైతులు, అక్కచెల్లెమ్మలకు చెల్లించాల్సిన మొత్తం పూర్తిగా ఎగ్గొట్టేస్తే ఆ పథకం ఉన్నట్టా.. లేనట్టా? అందుకే అక్కడ కూర్చోబెట్టారు వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేదు. రైతులకు సున్నా వడ్డీ రుణాలు రూ.11,595 కోట్లతోపాటు పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు రూ.3,036 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టారు. కానీ ఇక్కడకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తూ అసత్యాలు చెబుతున్నారు. ప్రజలు దీన్ని గమనించారు కాబట్టే వారిని అక్కడ కూర్చోబెట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పుడు ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు కాస్త వచ్చే ఎన్నికలనాటికి 13కు తగ్గిపోతారు. లక్ష రూపాయలు ఇవ్వాల్సిన చోట ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మేము అంటే 2 రూపాయలు ఇచ్చాం కాబట్టి రుణం తీరిపోయిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇన్ని అబద్ధాలు చెబుతూ నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే మీరు రాజీనామా చేసి పోవాలా? ఇక్కడే కూర్చోవాలా? ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. టీడీపీకి ఎక్కడా చిత్తశుద్ధి లేదు. రైతులు, మహిళలకు మేలు చేయాలన్న ఆరాటం లేదు. ఎంతసేపూ రాజకీయాలు ఎలా చేయాలి? దేన్ని వక్రీకరించాలి? ఎలా ట్విస్టు చేయాలి? అన్నదే తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య సభ జరుగుతోందంటే బాధనిపిస్తోంది. -
జనరంజక బడ్జెట్
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా నవరత్నాలతో కూడిన జనరంజక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించింది. సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్య, మౌలిక రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట మేరకు అన్ని వర్గాలకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్లోనే శ్రీకారం చుట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజానీకాన్ని సంతృప్తి పరిచే స్థాయిలో బడ్జెట్ ప్రతిపాదించారు. ఎక్కడా దాపరికాలు లేకుండా పూర్తి పారదర్శకతను ప్రదర్శించారు. ఏ ఏ రంగాలకు, ఏ ఏ వర్గాలకు, ఏ ఏ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించారో స్పష్టంగా వివరించారు. బడ్జెట్లో సంక్షేమంతో పాటు అభివృద్ది పంట పండించారు. శుక్రవారం మధ్యాహ్నం 12.20 గంటలకు 2019–20 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల వారికీ కేటాయింపులు ఏ వర్గాన్ని విస్మరించకుండా అన్ని వర్గాలకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఇచ్చిన మాట మేరకు ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మత్స్యకారులు, దర్జీలు, చేనేత కార్మికులు, బ్రాహ్మణులు, లాయర్లకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ, పట్టణ సచివాలయాలకు నిధులు కేటాయించారు. ఇందు కోసం రూ.1,880 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలకు భారీ కేటాయింపులు చేశారు. అన్ని సంక్షేమ పథకాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు పెట్టగా.. అమ్మ ఒడి, విద్యా దీవెనకు మాత్రం జగనన్న పేరు పెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు వైఎస్సార్ పెళ్లి కానుక కింద బడ్జెట్లో 716.26 కోట్ల రూపాయలు కేటాయించారు. కాపులకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు కాపుల సంక్షేమానికి ఏడాదికి రెండు కోట్ల రూపాయల చొప్పున బడ్జెట్లో కేటాయిస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు జగన్మోహన్రెడ్డి ఆ మాటను నిలబెట్టుకుంటా బడ్జెట్లో రూ.2,000 కోట్లు కేటాయించారు. ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.15,000.85 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.4,988.52 కోట్లు, బీసీ ఉప ప్రణాళిక కింద రూ.15,061.64 కోట్లు కేటాయించారు. అగ్రి గోల్ట్ బాధితులకు ఆర్థిక సాయం నిమిత్తం రూ.1,150 కోట్లు, ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి కింద బడ్జెట్లో రూ.500 కోట్లు, కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు రూ.250 కోట్లు కేటాయించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,572 కోట్లు కేటాయించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద సున్నా వడ్డీకి పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కలిపి రూ.1,788 కోట్లు, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రూ.29,329.98 కోట్లు కేటాయింపులు చేశారు. మొత్తం రూ.2,27,974.99 కోట్ల వార్షిక బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94 కోట్లు, మూల ధన వ్యయం రూ.32,293.39 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన పేర్కొన్నారు. రెవెన్యూ ఆదాయం రూ.1,78,697.41 కోట్లు, కేంద్ర పన్నుల వాటా నుంచి రూ.34,833.18 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.60,071.51 కోట్లు వస్తాయని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ.1,778.52 కోట్లు, ద్రవ్య లోటు రూ.35,260.58 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. విద్యా రంగానికి పెద్దపీట విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సాధారణ విద్యకు రూ.32,618 కోట్లు కేటాయించారు. జగనన్న అమ్మ ఒడి కింద పిల్లలను స్కూళ్లకు పంపించే తల్లులకు రూ.15,000 చొప్పున సాయం అందించేందుకు రూ.6,455.80 కోట్లు, స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,500 కోట్లు, వైఎస్సార్ స్కూల్స్ నిర్వహణకు రూ.160 కోట్లు కేటాయించారు. వైద్య రంగానికి రూ.11,399.23 కోట్ల కేటాయింపులు చేశారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీకి రూ.1,740 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు రూ.1,500 కోట్లు, ఆశా వర్కర్లకు పెంచిన వేతనాలను చెల్లించేందుకు రూ.455.85 కోట్లు కేటాయింపులు చేశారు. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో భాగంగా ఆ జలాలను శ్రీశైలానికి మళ్లించడంతో పాటు పోలవరం, హంద్రీ–నీవా తదితర ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా బడ్జెట్లో జల వనరుల శాఖకు రూ.13,139 కోట్లు కేటాయించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల గృహాల నిర్మాణాలకు రూ.9,785.75 కోట్లు, వైఎస్సార్ గృహ వసతికి ఏకంగా రూ.5,000 కోట్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ, వికలాంగ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.4,962.30 కోట్లు కేటాయించారు. రైతుల సంక్షేమానికి రూ.21,161.54 కోట్లు బడ్జెట్లో ప్రధానంగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేటాయింపులు చేశారు. రైతుల సంక్షేమానికి మొత్తం 21,161.54 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు. ఇందులో వైఎస్సార్ రైతు భరోసా కింద రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయంగా 12,500 రూపాయల చొప్పున ఇచ్చేందుకు వీలుగా బడ్జెట్లో రూ.8,750 కోట్లు కేటాయించారు. రైతులకు వడ్డీ లేని రుణాలకు, ఉచితంగా బోర్లు వేయడానికి, ధరల స్థిరీకరణ నిధి, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, గోదాముల నిర్మాణం, సబ్సిడీపై విత్తనాల సరఫరా, పంటల బీమా ప్రీమియంకు బడ్జెట్లో స్పష్టమైన కేటాయింపులు చేశారు. అన్ని రకాల సంక్షేమ పెన్షన్లకు సైతం భారీగా నిధులు కేటాయించారు. పెన్షన్లకు వైఎస్సార్ పెన్షన్ కానుకగా నామకరణం చేశారు. అన్ని రకాల పింఛన్లకు రూ.15,746.58 కోట్లు కేటాయించారు. ఇందులో వృద్ధులు, వితంతువులకే రూ.12,801.04 కోట్లు ఉండటం విశేషం. -
యనమల బడ్జెట్‌పై చర్చకు సిద్ధమా?
సాక్షి, విజయవాడ : రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి మాటలు వింటే నవ్వొస్తుంది.. బడ్జెట్‌పై బహిరంగ చర్చకు యనమల సిద్ధమా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ సవాల్ చేశారు. బడ్జెట్ చూసి యనమలకు మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రవేశపెట్టిన బడ్జెట్.. బడుగు, బలహీన వర్గాలకు, పేదలకు పెద్దపీట వేసిందన్నారు జోగి రమేష్. నవరత్నాలను 80 శాతం ప్రజలకు చేర్చేలా బడ్జెట్ ఉంటే.. యనమల ఎన్నికల హామీలను నెరవేర్చలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యనమల కళ్లు పోయాయా అని ప్రశ్నించారు. జగన్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తే.. చంద్రబాబు నాయుడు దాన్ని వెబ్సైట్ నుంచి తొలగించాడని ఆయన విమర్శించారు. రైతు భరోసా ద్వారా రైతులకు రూ. 8750 కోట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. పంటల గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3 వేల కోట్లు కేటాయించామన్నారు. రైతులకు వైఎస్సార్ బీమా, ఆక్వా రైతులకు విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు జోగి రమేష్. తమది రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. పథకాలకు రాజశేఖర్ రెడ్డి పేరు పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అమ్మ ఒడి ద్వారా కొన్ని లక్షల మంది తల్లుల కలలను నేరవేరుస్తాం అని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు. అతి త్వరలోనే 30 కమిటీలు వేసి.. తెలుగుదేశం నేతలు తిన్న సొమ్ము కక్కిస్తామని జోగి రమేష్ హెచ్చరించారు. -
టీడీపీ ప్రశ్నకు ఆర్థిక మంత్రి బుగ్గన వివరణ
సాక్షి, అమరావతి: రైతులకు సున్నా వడ్డీ వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వందకోట్లను కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రశ్నను లేవనెత్తడంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వారికి వివరణ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ‘మా ప్రభుత్వం వైఎస్సార్ పేరుతో రైతులకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి రూ.100 కోట్లు కేటాయించింది. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ డబ్బు ఎలా సరిపోతుందన్న ప్రశ్నను లేవనెత్తింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం జులై నెల రెండో వారంలో ఉన్నాం. ఇటీవలే ఎస్ఎల్బీసీ సమావేశంలో రూ.87 వేల కోట్లు మేరకు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వచ్చే ఏడాది నుంచి అంటే.. ఏప్రిల్ 1, 2020తో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి, వచ్చే బడ్జెట్లో సున్నావడ్డీ రుణాలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి వడ్డీలేని రుణాలకు కట్టాలి కాబట్టి కేటాయింపులు భారీగా పెరగబోతున్న విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది’ అంటూ ఆర్థిక మంత్రి వివరించారు. చదవండి: అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన చదవండి: రైతులపై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్ చదవండి: వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు -
వ్యవసాయాన్ని పండుగ చేసేలా బడ్జెట్
సాక్షి, అమరావతి : వ్యవసాయం దండుగ అన్న ముఖ్యమంత్రి పాలించిన రాష్ట్రంలో వ్యవసాయం పండుగ అని నిరూపించేలా రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్ ఆచరణాత్మకంగా ఉందన్నారు. ఇది రాష్ట్ర ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే బడ్జెట్ అన్నారు. విద్య, వైద్య, రైతు సంక్షేమానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం : జంగా కృష్ణమూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉందన్నారు ఎమ్మెల్సీ జంగా కృష్ణామూర్తి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు. పారదర్శక పాలన, అవినీతి నిర్మూలనకు ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తోందని పేర్కొన్నారు. వెనకబడిన ప్రాంతాలపై బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. -
‘రాష్ట్ర అభివృద్ధికి, ఆకాంక్షలకు అద్దం పట్టెలా బడ్జెట్’
సాక్షి, అమరావతి : ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధికి అద్దం పట్టిందన్నారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్ సంక్షేమం వైపు మొగ్గు చూపిందన్నారు. విద్యారంగానికి గతంలో కంటే ఎక్కువ కేటాయింపులు చేశారని ప్రశంసించారు. పౌరులకు నేరుగా నగదు రూపంలో సాయం అందించే ప్రయత్నం బాగుందన్నారు. అయితే బడ్జెట్లో జలవనరులకు, పట్టణాభివృద్ధికి, మౌలిక వసతులకు ఎక్కువ కేటాయింపులు చేయకపోవడం బాధాకరం అన్నారు. ఉపాధి, మౌలిక వసతులు, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై సమతుల్యత లేదన్నారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పడం విశేషమన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి స్పష్టత లేదు : లక్ష్మణరావు రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నవరత్నాలు, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. విభజన హామీల్లో కడప ఉక్కు ఫ్యాక్టరీకి రూ. 259 కోట్లు కేటాయించారు. అయితే దీన్ని కేంద్రం చేపడతుందా.. పీపీపీల కింద చేపడతారా అన్న అంశంపై స్పష్టత లేదన్నారు. రాజధాని నిర్మాణంపై కూడా స్పష్టత లేదని ఆరోపించారు. జలవనరులకు 22 శాతం కేటాయింపులు తగ్గాయన్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత : కత్తి నరసింహరావు రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కత్తి నరసింహ రావు. బడ్జెట్ వల్ల 45 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం కింద లబ్ధి చేకూరుతుందన్నారు. సీపీఎస్ రద్దుపై నిర్దిష్ట కాల పరిమితిలో రద్దు ప్రస్తావన చేయలేదన్నారు. -
ప్రతి విద్యార్థికి ఏటా 20 వేలు చెల్లించనున్న ప్రభుత్వం
-
అమ్మఒడి పథకానికి జగనన్న అమ్మఒడిగా నామకరణం
-
ప్రతి మండలంలోనూ అందుబాటులోకి 108 వాహనాలు
-
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే మా లక్ష్యం
-
ఆరోగ్యశ్రీ కోసం బడ్జెట్లో రూ.1740 కోట్లు ప్రతిపాదన
-
వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు
-
‘హామీల అమలు దిశగా అడుగులు’
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రకటించడం అభినందనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నడవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీ నేతలతో సహా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ఉద్దానం ప్రాంతంకు బడ్జెట్లో సరైన ప్రాధాన్యత ఇచ్చారని పలాస ఎమ్మెల్యే డాక్టర్ అప్పల రాజు సంతోషం వ్యక్తం చేశారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చర్యలు అభినందనీయమన్నారు. తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతానికి పునర్ నిర్మాణం దిశగా ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. జీడి, మామిడి, అరటి, కొబ్బరి పంటలకు మంచి కేటాయింపులు చేశారన్నారు. పేద ప్రజలను, వెనుకబడిన ప్రాంతాలను ఆదుకునే విధంగా బడ్జెట్‌ను రూపొందించడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. దేశంలోనే తొలిసారి.. పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ వ్యాఖ్యానించారు. జ్యుడీషియల్ కమిషన్ ద్వారా అవినీతిని నియంత్రించాలని కృతనిశ్చయంతో ఉందన్నారు. అమ్మ ఒడి పథకం అనేది దేశంలోనే తల్లులకు మొట్టమొదటి సారిగా అందిస్తున్న ప్రోత్సాహమని ఆయన స్పష్టం చేశారు. రైతులకు పూర్తి బరోసా కల్పించే చర్యలు, ఆరోగ్యశ్రీ పౌరసరఫరా సేవలను నేరుగా ప్రజల ఇంటికే అందించే చర్యలు అభినందనీయంమన్నారు. మహిళా సంక్షేమం కోసం సున్నావడ్డీ అమలు, ఎస్సీ, ఎస్డీ,బీసీ, మైనార్టీలకు బడ్జెట్లో కేటాయింపులు అద్భుతంగా ఉన్నామని అభినందించారు. -
ఏపీ వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు
సాక్షి, అమరావతి : అన్నదాతకు కొండంత భరోసానిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పులివెందులలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలకు నాణ్యమైన పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కుదేలవుతున్న వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా, కర్షకుల కష్టాలు దూరం చేసేలా రూ. 28,866.23 కోట్లతో రూపొందించిన వ్యవసాయ బడ్జెట్లోని కేటాయింపులు ఈవిధంగా ఉన్నాయి. వ్యవసాయ బడ్జెట్ ప్రధానాంశాలు రెవెన్యూ వ్యయం రూ. 27,946.65 కోట్లు పెట్టుబడి వ్యయం రూ. 919.58 కోట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు రూ.3,223 కోట్లు రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ. 4,525 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి రూ. 3వేల కోట్లు ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు రూ. 1163 కోట్లు వైఎస్సార్ రైతు బీమాకు రూ. 100 కోట్లు ప్రమాద వశాత్తు రైతు చనిపోతే రూ. 7 లక్షల సాయం ఉద్యాన శాఖకు రూ.1532 కోట్లు ఆయిల్‌ఫాం ధరల్లో వ్యత్యాసం తగ్గించేందుకు రూ. 80 కోట్లు ఆయిల్‌ఫాం తోటల సాగు ప్రోత్సాహకానికి రూ.65.15 కోట్లు ఉద్యాన పంటల సమగ్రాభివృద్ధికి రూ. 200 కోట్లు బిందు, తుంపర సేద్య పథకాలకు రూ. 1105.66 కోట్లు సహకార రంగ అభివృద్ధి కోసం రెవెన్యు వ్యయం రూ.174.64 కోట్లు సహకార రంగ అభివృద్ధి కోసం పెట్టుబడి వ్యయం రూ. 60 కోట్లు ప్రతి రైతు కుటుంబానికి వైఎస్సార్ భరోసా కింద రూ. 12,500 2019-20లో రైతులకు స్వల్పకాలిక రుణాల కింద రూ. 12 వేల కోట్లు 2019-20లో రైతులకు దీర్ఘ కాలిక రుణాల కింద రూ.1500 కోట్లు పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.158 కోట్లు పశు సంవర్ధక శాఖ అభివృద్ధికి రూ.1778 కోట్లు పాడి పరిశ్రమకు రూ. 100 కోట్లు గొర్రెల బీమా పథకం కింద గొర్రె మరణిస్తే రూ. 6 వేలు పశువు మరణిస్తే బీమా పథకం కింద రూ. 30 వేలు పశుగ్రాసం కోసం రూ. 100 కోట్లు పశు టీకాల కోసం రూ. 25 కోట్లు కోళ్ల పరిశ్రమ నిర్వాహకుల కోసం రూ. 50 కోట్లు నిషేధ సమయంలో మత్స్యకారుల భృతి రూ. 10 వేలకు పెంపు వేటకు వెళ్లి మత్స్యకారులు చనిపోతే కుటుంబానికి రూ.10 లక్షలు ఆహార భద్రత మిషన్‌కు రూ.141 కోట్లు వ్యవసాయ మౌలిక వసతులకు రూ. 349 కోట్లు రైతులకు రాయితీ విత్తనాల కోసం రూ.200 కోట్లు భూసార పరీక్షల నిర్వహణకు రూ. 30 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణ రూ. 420 కోట్లు జీరో బడ్జెట్ వ్యవసాయానికి రూ.91 కోట్లు చదవండి: ఏపీ బడ్జెట్ లైవ్ అప్డేట్స్ -
నవరత్నాల బడ్జెట్ 2019 - 2020
-
ఏపీ బడ్జెట్ : కాపుల సంక్షేమానికి భారీగా నిధులు
సాక్షి, అమరావతి : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల ప్రచారంలో కాపులకు ఇచ్చిన మాట ప్రకారం వారి సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారు. కాపుల సంక్షేమానికి రూ.2000 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. అలాగే, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు రూ.1150 కోట్లు, వైఎస్సార్ బీమాకు రూ.404 కోట్లు, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి 400 కోట్లు, నాయిబ్రాహ్మణులు, రజకులు, ట్రైలర్ల సంక్షేమానికి రూ.300 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. మరిన్ని కేటాయింపులు.. చేనేతల సంక్షేమానికి రూ.200 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు -
రైతులు, కౌలు రైతులకు ‘భరోసా’
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి వ్యవసాయం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ‘మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో రైతులు, కౌలు రైతులకు భరోసా కల్పించారు. కౌలు చట్టంలో మార్పులు తీసుకొస్తాం. పంటల బీమాను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. సున్నా వడ్డీకే రైతుకు రుణం ఇవ్వడం రైతులకు పెద్ద ఊరట. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.7లక్షల పరిహారం అందిస్తాం. ఎలాంటి కష్టం వచ్చినా ఆత్మహత్యలకు పాల్పడవద్దని మా ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. రైతులు, కౌలు రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా కలెక్టర్లు వెంటనే స్పందించాలి. రైతులు ఏ దశలోనూ మోసపోకుండా చూడాలన్నదే మా ధ్యేయం. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశామ’ని తెలిపారు. చదవండి: ఏపీ బడ్జెట్ లైవ్ అప్డేట్స్ -
వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి భారీ కేటాయింపులు
సాక్షి, అమరావతి : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. వైద్య రంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ బడ్జెట్లో రూ.11,399 కోట్లు కేటాయించారు. దివంగత ముఖ్యమంతి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆరోగ్యశ్రీ పథకానికి పునర్వైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.1740 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని అన్నారు. 108 అంబులెన్స్‌లకు రూ.143 కోట్లు కేటాయించారు. వైద్యరంగానికి చేయూత.. ఆస్పత్రుల్లో మౌలిక వసతులకు రూ.1500 కోట్లు ఆశావర్కర్లకు పెంచిన రూ.10 వేల వేతనానికి రూ.455 కోట్లు మెడికల్ భవనాలకు రూ.68 కోట్లు వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కళాశాలకు రూ.66 కోట్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల-గురజాలకు రూ.66 కోట్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల-విజయనగరంకు రూ.66 కోట్లు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ. 50 కోట్లు రాష్ట్ర కేన్సర్ ఇనిస్టిట్యూట్‌కు రూ.43 కోట్లు -
రైతులపై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను (2019-20) ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. నవరత్నాల అమలే ప్రాధాన్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఇక ఏపీ బడ్జెట్లో రైతులకు సంక్షేమానికి పెద్దపీట వేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు, సాగునీరు, వరద నివారణకు రూ.13,139 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసాకు రూ.8,750 కోట్లు కేటాయించారు. రైతు భరోసా పథకంతో 15 లక్షల మంది కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుందని ఆర్థికమంత్రి తెలిపారు. పంటల మీద కౌలు రైతులు రుణాలు పొందేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. వ్యవసాయానికి కేటాయింపులు ఇలా.. ధరల స్థిరీకరణ నిధి : రూ.3000 కోట్లు ప్రకృతి విపత్తుల నివారణ నిధి : రూ.2002 కోట్లు వైఎస్సార్ రైతు భీమా : 1163 కోట్లు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ : రూ.475 కోట్లు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు రైతులకు ఉచిత బోర్లకు : రూ.200 కోట్లు విత్తనాల పంపిణీ : రూ.200 కోట్లు -
అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన
-
ఏపీ రాజకీయాల్లో ధృడమైన మార్పు...
సాక్షి, అమరావతి: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా రూ.2,27,974.99 కోట్లు కాగా..రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94 కోట్లు అని మంత్రి తెలిపారు. మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు కాగా అలాగే వడ్డీ చెల్లింపుల నిమిత్తం రూ.8,994 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. 2018-19 బడ్జెట్‌తో పోలిస్తే తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 19.32 శాతం పెరుగుదల ఉన్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.1778.52 కోట్లు, ద్రవ్యలోటు సుమారు రూ.35,260.58 కోట్లు జీఎస్డీపీలో ద్రవ్యలోటు సుమారు 3.3 శాతం, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు సుమారు 0.17 శాతంగా ఉందని తెలిపారు మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ...‘మహాత్ముని లక్ష్యాన్ని సాధించే దిశగా మా బడ్జెట్ ఉంది. పేదల కన్నీళ్లు తుడిచే దిశగా ప్రభుత్వం చర్యలు ఉంటాయి. ధృడమైన మార్పు రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. న్యాయపరమైన నియమాలకు లోబడే రాజకీయాలు చేస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాలు, అందరు ప్రజలకు మేలు చేసే దిశగా చర్యలు చేపట్టాం. కృష్ణ ఆయుకట్టు స్థిరీకరణ చేస్తాం. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తాం. మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తాం. వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తెరదించుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించారు.’ అని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను ఏకో ఫ్రెండ్లీగా మారుస్తాం. ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తాం. అన్ని రంగాల సమగ్ర అభివృద్థే మా లక్ష్యం’ అని అన్నారు. నవరత్నాలకు పెద్దపీట రాష్ట్రాభివృద్ధే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నవరత్నాలకే పెద్ద పీట వేస్తున్నాం. గోదావరి నీళ్లను శ్రీవైలంకు తీసుకురావడం మా లక్ష్యం. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్రలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం. అన్ని కాంట్రాకుల్లో పారదర్శకత పాటిస్తాం. అవినీతి రహిత పాలనే మా లక్ష్యం. ప్రతి పనిని ఆన్లైన్లో ఉంచుతాం. ప్రజలు కోరిన పాలన కోసం సీఎం కృషి చేస్తున్నారు. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు సుమారు 0.17 శాతం ఉంది అని మంత్రి బుగ్గన తెలిపారు. వ్యవసాయం, అనుబంధ సంస్థలకు రూ. 20, 677.08 కోట్లు వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.20677 కోట్లు సాగునీరు, వరద నివారణకు రూ.13139 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా పథకానికి రూ.8750 కోట్లు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ.4525 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి రూ.3000 కోట్లు ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002 కోట్లు వైఎస్సార్ రైతు బీమాకు రూ.1163 కోట్లు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీకి రూ.475 కోట్లు రైతులకు ఉచిత బోర్లకు రూ.200 కోట్లు విత్తనాల పంపిణీకి రూ.200 కోట్లు గ్రామీణాభివృద్ధికి రూ..29, 329.98 కోట్లు విద్యుత్‌కు రూ.6,861 కోట్లు పారిశ్రామిక రంగానికి రూ.3,986.05 కోట్లు రవాణా రంగానికి రూ.6,157.25 కోట్లు విద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత రూ.32,618.46 కోట్లు క్రీడలకు రూ.329.68 కోట్లు గృహ నిర్మాణానికి రూ.3617 కోట్లు వైద్య రంగానికి రూ.11,388 కోట్లు సంక్షేమ రంగానికి రూ.14, 142 కోట్లు పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1500 కోట్లు మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077 కోట్లు ఒంటరి మహిళల పెన్షన్లకు రూ.300 కోట్లు వికలాంగుల పెన్షన్లకు రూ.2133.62 కోట్లు ఏపీఎస్ ఆర్టీసీకి రూ.1000 కోట్లు వృద్దులు, వితంతువుల పెన్షన్లుకు రూ. 12801 కోట్లు అమ్మ ఒడి పథకానికి రూ.6,455 కోట్లు ప్రణాళిక విభాగానికి రూ.1439.55 కోట్లు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకు రూ.1,140 కోట్లు -
అవాక్కైన మీడియా ప్రతినిధులు..!
సాక్షి, అమరావతి: అయిదేళ్లు ప్రజాకంటక పాలన అందించడంతో ఓటరు మహాశయులు టీడీపీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అయినప్పటికీ వారు తమపాత్రను నిర్వహించకుండా.. అధికారం కోల్పోయామన్న అసహనంతో వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజానీకానికి అన్నీ చేశామని డబ్బాకొట్టుకుంటున్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, మరికొందరి మాటల్లో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ప్రెస్మీట్లో వారు మాట్లాడుతూ.. రుణాలపై వడ్డీ పూర్తిగా మాఫీ చేశామని అన్నారు. అయితే, ఎంత వడ్డీ మాఫీ చేశారంటూ మీడియా సభ్యులు ఎమ్మెల్యేలను ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా వారు చిందులు తొక్కారు. విలేకరులు పార్టీ ప్రతినిధులుగా వ్యవహిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అధికార పక్షాన్ని ప్రశ్నించాలంటూ దాటవేశారు. ‘మే చేయాల్సింది చేశాం. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు’ అంటూ అక్కడినుంచి తప్పుకున్నారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. -
151 సభ్యులం ఓపికగా వింటున్నాం..
-
కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడతామా?: జగన్
సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం రుణాలపై చర్చ సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దుమారం రేగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు అడుగడుగునా అడ్డు తగిలారు. దీంతో ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందిస్తూ... సభలో 150మంది ఉన్నామని, తాము తలచుకుంటే టీడీపీ సభ్యులు సభలో కూడా తిరగలేరని అన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు ప్రసంగానికి అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో సీఎం మాట్లాడుతూ...‘ మనిషి ఆ సైజులో ఉన్నారు. బుర్ర మాత్రం ఆ స్థాయిలో లేదు. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో కూడా తెలియదు. కూర్చో...కూర్చో’ అంటూ చురకలు అంటించారు. ‘టీడీపీ సభ్యులు మాట్లాడినంత సేపు మాట్లాడారు. మేము ఓపిగ్గా విన్నాం. నేను మాట్లాడేటప్పుడు మాత్రం టీడీపీ మళ్లీ గందరగోళం సృష్టిస్తోంది. కళ్లు పెద్దవి చేసి చూస్తే మేం భయపడం. తప్పు చేసినవారి తీరు ఎలా ఉంటుందో టీడీపీ సభ్యుల తీరు అలా ఉంది. చంద్రబాబు తాను ప్రతిపక్ష నేత అని మరిచిపోయారు. బుద్ధి, జ్ఞానం ఉండాలి. రైతుల కోసం చర్చ జరుగుతుందని మాత్రమే టీడీపీకి అవకాశం ఇచ్చాం. కానీ టీడీపీ సభ్యులు మాత్రం సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. సున్నా వడ్డీ పథకం పూర్తిగా సున్నా. రైతుల రుణమాపీ కింద రూ.87,621 కోట్లు ఇవ్వాలి. అయిదేళ్లలో రూ.15 వేలకోట్లు ఇచ్చి రుణమాఫీ చేశామని రుణమాఫీపై చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారు’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో రెండో రోజు సభలో తెలుగుదేశం ఎమ్మెల్యేల తీరు అభ్యంతరకరంగా మారింది. పలుమార్లు విప్, చీఫ్ విప్‌తో పాటు స్పీకర్ సూచించినా తెలుగుదేశం సభ్యుల తీరు మారలేదు. ప్రతిపక్షనేతకు అడిగిన ప్రతీసారి అవకాశం ఇస్తున్నా.. ఉద్దేశపూర్వకంగా సమావేశాల్లో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ప్రతీసారి టీడీపీ సభ్యులు అరుపులు, కేకలతో సభలో రాద్ధాంతం సృష్టించారు. వీరిని స్పీకర్ వారించినా పద్ధతిలో మార్పు రాలేదు. తొలుత సున్నావడ్డీపై అసత్య ప్రకటనలు చేయడమే కాకుండా.. తర్వాత సభను పక్కదారి పట్టించేందుకు టిడిపి ప్రయత్నించింది. మంత్రులు, అధికార పక్ష నేతలు వారిస్తున్నా.. వినకుండా సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్న తీరును ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు. మరోవైపు స్పీకర్ కూడా టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. -
ఇదేమీ ఫిష్ మార్కెట్ కాదు; స్పీకర్ అసహనం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యుల వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను హుందాగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఒకసమయంలో.. ‘ఇదేమీ ఫిష్ మార్కెట్ కాదు. ప్రజలందరూ మనల్ని గమనిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత మాట్లాడేటప్పుడు ఏ ఒక్కరూ అంతరాయం కలిగించొద్దు’అని అసహనం వ్యక్తం చేశారు. 151 సభ్యులం ఓపికగా వింటున్నాం.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జవాబుతో ప్రజల వద్ద దోషులుగా నిలబడాల్సి వస్తుందని టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడేటప్పుడు మా 151 మంది సభ్యులం ఓపికగా విన్నాం. కానీ, మేం చెప్పేది వినకుండా టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. సభలో టీడీపీ సభ్యులు రెచ్చిపోకుండా కంట్రోల్లో ఉండాలి. సభ సజావుగా సాగేందుకు సభామర్యాదలు పాటించాలి’ - చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీ పనులతోనే సంఖ్యను 23కు పరిమితం చేశారు... సభలో టీడీపీ సభ్యుల తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు ఆర్డర్లో ఉండాలని కోరారు. సభలో గందగోళం సృష్టించొద్దని, క్రాస్టాక్ చేస్తే సభ సజావుగా జరగదని అన్నారు. ‘మీరు చేసిన పనులకు ప్రజలు మీ సంఖ్యను 23కు పరిమితం చేశారు. టీడీపీ రైతులకు ఏం అన్యాయం చేసిందో ప్రజలకు తెలుసు’అన్నారు. -
సున్నా వడ్డీ పథకం పూర్తిగా సున్నా: సీఎం జగన్
-
ఆహా..ఓహో అన్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు..
సాక్షి, అమరావతి: సున్న వడ్డీ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేశామని చంద్రబాబు నాయుడు చెబుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సున్నావడ్డీ పథకం పూర్తిగా సున్నా అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలో ఈ పథకంపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత టీడీపీ ప్రభుత్వ తీరునుఎండగట్టారు. ఓ దశలో ముఖ్యమంత్రి ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుపడ్డుకున్నారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, టీడీపీ తరఫున సభకు వచ్చినవారంతా అలాగే ప్రవర్తిస్తున్నారన్నారు. రౌడీలు, గుండాల్లా సభలో వ్యవహరించవద్దని ఆయన హితవు పలికారు. వ్యవసాయ రుణాల్లో సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వకపోయినా ఇచ్చామని చెప్పుకుంటున్నారని, అందుకే ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ సభలో వారి నాయకుడు ఎలా ఉంటారో, వారి సభ్యులు కూడా అలాగే ఉంటారు. సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వకపోయినా ఇచ్చామన్నారు. అందుకే ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. వడ్డీ లేని రుణాల విషయంలో చంద్రబాబు ఆహా...ఓహో అన్నట్లు జాతీయ స్థాయిలో గొప్పగా అమలు చేసినట్లు చెబుతున్నారు. 2014-15 ఏడాదికి 29,659 కోట్ల పంట రుణాలు ఉన్నాయి. సున్నా వడ్డీ పథకానికి రూ.118 కోట్లు కడితేనే బ్యాంకులు రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తాయి. చంద్రబాబు ప్రభుత్వం రూ.43.31కోట్లు మాత్రమే కట్టింది. 2015-16 ఏడాదిలో 2,283 కోట్లు కట్టాల్సిన పరిస్థితుల్లో రైతులకు ఇచ్చింది రూ.31 కోట్లు మాత్రమే. 2016-17లో సున్నా వడ్డీ పథకానికి రూ.2,354కోట్లు కట్టాల్సిన పరిస్థితుల్లో రైతులకు ఇచ్చింది కేవలం రూ.249 కోట్లు మాత్రమే. అలాగే 2017-18లో సున్నా వడ్డీ పథకానికి రూ.2,703 కోట్లు కట్టాల్సి ఉండగా రైతులకు ఇచ్చింది రూ.182 కోట్లు. ఇక 2018-19లో సున్నా వడ్డీ పథకానికి రూ.3,069 కట్టాల్సి ఉండగా రైతులకు ఇచ్చింది రూ.122 కోట్లు. అయిదేళల్లో సున్న వడ్డీ పథకానికి రూ.11,595 కోట్లు ఇవ్వాల్సి ఉంటే రూ.630కోట్లు మాత్రమే చంద్రబాబు సర్కార్ చెల్లించింది. సున్నా వడ్డీ పథకంలో 95 శాతం ఇవ్వకుండా కేవలం 5 శాతం మాత్రమే ఇచ్చింది. గత ప్రభుత్వం చేసిన మోసానికి రైతులు రూ.11వేల కోట్లు మోసపోయారు’ అని వ్యాఖ్యానించారు. -
అప్డేట్స్: ఏపీ బడ్జెట్ హైలైట్స్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, అర్హులందరికీ సంక్షేమం అందేలా, అన్నదాతకు పెద్దపీట వేస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూపాయలు 2 లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ను సభకు సమర్పించారు. ఈ ఏడాదికిగాను ద్రవ్య లోటును రూ. 35వేల 260 కోట్లుగా, రెవెన్యూ లోటును రూ. 1778 కోట్లుగా బుగ్గన అంచనా వేశారు. రాష్ట్ర జనాభాలో 60శాతంపైగా ఉన్న రైతులు, వ్యవసాయ సంబంధిత కుటుంబాలకు ఆర్థిక మంత్రి బడ్జెట్లో పెద్దపీట వేశారు. రైతులకు వరాలు కురిపిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్నదాతకు అండ, చదువులకు అమ్మఒడి, యువతకు చేయూత, గ్రామాలకు సచివాలయాలు, వైద్యానికి ఆరోగ్యశ్రీ, పరిశ్రమలకు ప్రాధాన్యం, అర్హులందరికీ పింఛన్, దశల వారీగా మద్యపాన నిషేధం, అందరికీ గృహ వసతి, కల్యాణానికి కానుకలు ఇలా మెరుగైన పాలన అందిస్తామన్న హామీని మంత్రి బుగ్గన బడ్జెట్ ద్వారా నెరవేర్చారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. అటు శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏపీ బడ్జెట్ అప్డేట్స్.. హైలెట్స్ ఇవి.. హైలెట్స్: 2019-20 ఏపీ మొత్తం బడ్జెట్: రూ. 2,27,974 కోట్లు ద్రవ్యలోటు: రూ. 35,260 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 1,778 అన్నదాతలకు అండ.. అన్నదాతలకు అన్నివిధాలుగా అండగా నిలిచింది ప్రభుత్వం. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని పలు పథకాలను ప్రకటించింది. రైతన్నలకు పెద్ద పీట వేస్తూ.. సాగును సంతోషంగా నిర్వహించేలా కేటాయింపులు చేసింది. వైఎస్సార్ రైతు భరోసాకు రూ. 8750 కోట్లు కేటాయిస్తూ.. 15 లక్షలమంది కౌలు రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంది. పంట మీద కౌలు రైతులు రుణాలు పొందేందుకు అవకాశం ఇస్తూనే... మెరుగైన ఫలితాలకు భరోసా ఇచ్చింది. 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌కు రూ. 4,525 కోట్లు కేటాయించింది. ధరల స్థిరీకరణ నిధికి 3 వేల కోట్లు, విపత్తు నిర్వహణ నిధికి 2 వేల కోట్లు, వైఎస్సార్ బీమా యోజన కింద రైతుల పంటల బీమా కోసం కట్టే ప్రీమియం కోసం 1163 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ 475 కోట్లు కేటాయించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఉచిత బోర్లకు 200 కోట్లు, విత్తనాల సరఫరాకు 200 కోట్లు కేటాయించింది. ఇంకా మరిన్ని ఇతర పథకాల ద్వారా సాగు పూర్తిగా లాభదాయకమన్న ఆశాభావాన్ని బడ్జెట్ ద్వారా తీసుకొచ్చింది ప్రభుత్వం. రైతు సంక్షేమానికి చేసిన కేటాయింపులివే: రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత రైతు సంక్షేమం: ధరల స్థిరీకరణ నిధికి రూ. 3వేల కోట్లు ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు వైఎస్సార్ రైతు భరోసాకు రూ. 8750 కోట్లు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 20,677 కోట్లు గ్రామీణాభివృద్ధికి రూ. 29,329 కోట్లు సాగునీరు, వరద నివారణకు రూ. 13,139 కోట్లు వైఎస్సార్ రైతు బీమాకు రూ. 1163 కోట్లు ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ. 475 కోట్లు రైతుల ఉచిత బోర్లకు రూ. 200 కోట్లు రైతులకు విత్తనాల పంపిణీ చేసేందుకు రూ. 200 కోట్లు (చదవండి : రైతులపై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్) (చదవండి : రైతులు, కౌలు రైతులకు ‘భరోసా’) గ్రామ వాలంటీర్లకూ కేటాయింపులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్లో ఆర్థికమంత్రి ప్రత్యేక కేటాయింపులు జరిపారు. ఆ కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి... గ్రామ వాలంటీర్లకు రూ. 720 కోట్లు గ్రామ సచివాలయ నిర్వహణకు రూ. 700 కోట్లు మున్సిపల్ వార్డు వాలంటీర్లకు రూ. 280 కోట్లు మున్సిపల్ సచివాలయాలకు రూ. 180 కోట్లు సబ్సిడీ బియ్యం పథకానికి రూ. మూడువేల కోట్లు ఏపీ పౌరసరఫరాలకు సాయం కింద రూ. 384 కోట్లు బలహీన వర్గాల ఆడపడుచుకు కల్యాణ కానుక బీసీలకు కల్యాణ కానుక కింద రూ. 300 కోట్లు ఎస్సీలకు కల్యాణ కానుక కింద రూ. 200 కోట్లు ఎస్టీ గిరిపుత్రికల కల్యాణ కానుక కింద రూ. 45 కోట్లు మైనారిటీ సంక్షేమం కింద షాదీ తోఫాకు రూ. 100 కోట్లు కులాంతర వివాహ పథకానికి రూ. 36 కోట్లు ఆశా వర్కర్లకు అండదండ బడ్జెట్లో ఆశావర్కర్లకు ప్రభుత్వం అండగా నిలిచింది ఆశావర్కర్ల కోసం రూ. బడ్జెట్లో రూ. 455.85 కోట్లు కేటాయింపు ఆశావర్కర్ల వేతనాన్ని రూ. 10వేలకు పెంచుతున్నట్టు సీఎం వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1740 కోట్లు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1500 కోట్లు మెడికల్ భవనాల నిర్మాణానికి రూ. 68 కోట్లు వైఎస్సార్ గిరిజన వైద్య కళాశాలలకు రూ. 66 కోట్లు గురజాల ప్రభుత్వ కళాశాలకు రూ. 66 కోట్లు విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ. 66 కోట్లు శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ పరిశోధన కేంద్రానికి రూ. 50 కోట్లు రాష్ట్ర క్యాన్సర్ నివారణ ఆస్పత్రికి రూ. 43 కోట్లు మత్స్యకారులకు చేయూత మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చేందుకు రూ. 100 కోట్లు జెట్టీలు, హార్బర్ల అభివృద్ధికి రూ. 100 కోట్లు మత్స్యకారుల బోట్లకు సబ్సిడీ ఇచ్చేందుకు రూ. 100 కోట్లు మత్స్యసంపద అభివృద్ధికి రూ. 60 కోట్లు ఎస్సీ మత్స్యకారుల సంక్షేమానికి రూ. 50 కోట్లు సంక్షేమ రంగానికి వెన్నుదన్ను సంక్షేమ రంగానికి రూ. 14,142 కోట్లు వృద్ధులు, వితంతువుల పెన్షన్‌కు రూ. 12,801 కోట్లు ఆశా వర్కర్లకు రూ. 455.85 కోట్లు డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణాలకు రూ. 1140 కోట్లు పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలకు రూ. 648 కోట్లు వైఎస్సార్ గృహ వసతి పథకానికి రూ. ఐదువేల కోట్లు దళితుల అభివృద్ధికి రూ. 15వేల కోట్లు గిరిజనుల అభివృద్ధికి రూ. 4988 కోట్లు వెనుకబడిన వర్గాల (బీసీ) అభివృద్ధికి రూ. 1561 కోట్లు దివ్యాంగుల పెన్షన్లకు రూ. 2133.62 కోట్లు ఒంటరి మహిళల పెన్షన్లకు రూ. 300 కోట్లు మైనారిటీల అభివృద్ధికి రూ. 952 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1,150 కోట్లు కాపు సంక్షేమానికి రూ. 2వేల కోట్లు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రూ. 400 కోట్లు నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్ల సంక్షేమానికి రూ. 300 కోట్లు చేనేత కార్మికుల సంక్షేమానికి రూ. 200 కోట్లు ధార్మిక సంస్థల అభివృద్ధికి రూ. 234 కోట్లు బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌కు రూ. 100 కోట్లు కొత్తగా ప్రాక్టీస్ పెట్టుకునే లాయర్ల సంక్షేమానికి రూ. 10 కోట్లు (చదవండి : వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి భారీ కేటాయింపులు) విద్యారంగానికి అగ్రతాంబూలం విద్యారంగానికి మొత్తంగా రూ. 32,618.46 కోట్లు ఉన్నత విద్యకు రూ. 3,021.63 కోట్లు మధ్యమిక విద్యకు రూ. 21,612.30 కోట్లు అమ్మఒడి పథకానికి రూ. 6,455 కోట్లు పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1,500 కోట్లు మధ్యాహ్న భోజన పథకానికి రూ. 1,077 కోట్లు పాఠశాలల నిర్వహణ గ్రాంటుకు రూ. 160 కోట్లు కేటాయింపుల తీరూతెన్నులివి.. విద్యుత్ రంగానికి రూ. 6861.03 కోట్లు వైద్య రంగానికి రూ. 11,399 కోట్లు గృహ నిర్మాణానికి రూ. 3,617కోట్లు రెవెన్యూ శాఖకు రూ. 9496.93 కోట్లు ప్రణాళిక విభాగానికి రూ. 1439.55 కోట్లు ఏపీఎస్ ఆర్టీసీకి రూ. 1000 కోట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 31,654.75 కోట్లు కడప స్టీల్‌ప్లాంట్‌కు రూ. 250 కోట్లు ఏపీఐఐసీకి రూ. 360 కోట్లు రాజధానిలో మౌలిక సదుపాయాలకు రూ. 500 కోట్లు ముఖ్యమంత్రి అభివృద్ధి నిధికి రూ. 500 కోట్లు ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునే కాల్ సెంటర్‌కు రూ. 73.33 కోట్లు విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి రూ. 200 కోట్లు రాష్ట్రంలో కొత్త రైల్వే నిర్మాణాల్లో రాష్ట్ర వాటా రూ. 185 కోట్లు అమరావతి-అనంతపురం జాతీయ రహదారికి రూ. 100 కోట్లు మంగళగిరిని మోడల్ పట్టణంగా అభివృద్ధి చేసేందుకు రూ. 50 కోట్లు కడప యాన్యూటీ ప్రాజెక్టులకు రూ. 120 కోట్లు స్మార్ట్‌సిటీస్ నిర్మాణం కోసం రూ. 150 అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రూ. 446.77 కోట్లు పౌరసరఫరాల శాఖకు రూ. 4429.43 కోట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధికి రూ. 6587 కోట్లు ఆర్థిక రంగానికి రూ.46,858 కోట్లు ఆ ఫలాలను పక్కదారి పట్టించారా? గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిరేటు సాధించిందని ప్రచారం చేశారా? అది వాస్తవమా? కాదా? అన్నది పరిశీలిస్తున్నాం నిజంగా రెండంకెల వృద్ధి జరిగితే ఆ ఫలాలను పక్కదారి పట్టించారా? విలాసాలకు, అనవసర ఖర్చులకు ఆదాయాన్ని దారి మళ్లించారా? రెండంకెల వృద్ధి నమోదైతే.. అన్నదాతల ఆకలి చావులు ఎందుకు చోటుచేసుకున్నాయి? దయనీయమైన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా ఇచ్చారు! అత్యంత దయనీయమైన ఆర్థిక వ్యవస్థను మా ప్రభుత్వం వారసత్వంగా పొందింది విభజన సమయంలో రూ. 1,30,654 కోట్లుగా ఉన్న అవశేష రాష్ట్ర రుణం (ఇందులో ప్రభుత్వ రుణం రూ. 97,124 కోట్లు కాగా, ప్రజాపద్ద రూ. 33,530కోట్లు) 2018-19నాటికి రూ. 2,58,928 కోట్లకు (ఇందులో ప్రభుత్వ రుణం రూ. 1,92,820 కోట్లు కాగా, ప్రజాపద్ద రూ. 66,108 కోట్లు) చేరుకుంది. అంతేకాకుండా వివిధ సంస్థల ద్వారా రూ. 10వేల కోట్లు రుణం తీసుకొని గత ప్రభుత్వం దారి మళ్లించింది. దీనికి అదనంగా రూ. 18వేల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాకుండా గత ఫిబ్రవరిలో సమర్పించిన 2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోని వాగ్దానాలను నెరవేర్చడానికి రూ. 45వేల కోట్ల వనరుల అంతరం ఉన్నది మహాత్ముడి లక్ష్యసాధన దిశగా అడుగులు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్ తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాన్ని ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాను మా ప్రభుత్వ విజన్ సాకారం చేసే దిశగా బడ్జెట్ రూపకల్పన జరిగింది రాష్ట్రాభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం..నవరత్నాలకు పెద్ద పీట వేస్తున్నాం మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్నీ అమలు చేస్తాం పేదల కన్నీటిని తుడిచేదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తాం కృష్ణా ఆయకట్టును స్థిరీకరిస్తాం సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తాం ఉత్తరాంధ్రలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు త్వరగా పూర్తి చేస్తాం ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కాంట్రాక్టుల్లోనూ పారదర్శకత పాటిస్తాం అవినీతి రహిత పాలనే మా లక్ష్యం సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని నిరోధించేందుకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటుచేశాం గోదావరి నీళ్లను శ్రీశైలానికి తీసుకురావడం మా లక్ష్యం ప్రజారవాణా వ్యవస్థను ఎకో ఫ్రెండ్లీగా మారుస్తాం జీఎస్డీపీలో రెవెన్యూలోటు సుమారు 0.17శాతం ఇది ‘నవరత్నాల’ బడ్జెట్: బుగ్గన నవరత్నాల అమలే ప్రభుత్వ బడ్జెట్ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇప్పటికే స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టోను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. నవరత్నాల పథకాలతోపాటు వ్యవసాయం, నీటి పారుదల, పాఠశాలలు, ఆస్పత్రులు, రహదారులకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెప్పారు. రాష్ట్ర తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. కాలయాపన లేకుండా మొదటి ఏడాదిలోనే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. నవరత్నాలకు పెద్దపీట తొలిసారిగా శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం జనరంజకంగా తీర్చిదిద్దింది. మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.31 లక్షల కోట్ల నుంచి రూ.2.32 లక్షల కోట్ల మధ్య ఉండనుందని సమాచారం. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం వ్యవసాయానికి రూ.28 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. రైతుల పట్ల సీఎం చిత్తశుద్ధికి ఇదిగో నిదర్శనం.. టీడీపీ సర్కారు పెద్ద ఎత్తున బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టడమే కాకుండా భారీ అప్పులను నూతన ప్రభుత్వానికి అప్పగించింది. ఆర్థిక వ్యవస్థ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్వయంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో కలసి బడ్జెట్ రూపకల్పనపై సుదీర్ఘ కసరత్తు చేశారు. గత సర్కారు బకాయిల్లో కొన్నింటిని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్లో కేటాయింపులు చేయడం విశేషం. ఇందుకు ఉదాహరణ రైతులకు గత సర్కారు బకాయి పడ్డ ఇన్పుట్ సబ్సిడీని చెల్లించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించడం. కరువు కాటకాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా టీడీపీ సర్కారు ఎగనామం పెట్టింది. గత సర్కారు ఎగ్గొట్టిన రూ.2,000 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేయించడం అన్నదాతల పట్ల ఆయన చిత్తశుద్ధిని రుజువు చేస్తోంది. మరోపక్క వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తెరదించుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించారు.