సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నడవనీయకుండా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించేందుకు యత్నించడంతో ఆక్షేపించారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతున్న క్రమంలో టీడీపీ సభ్యులు అడ్డుతగలడంతో సభా సమాయాన్ని వృథా చేస్తున్నారని స్పీకర్ మండిపడ్డారు. సభను అగౌరపరిచే విధంగా టీడీపీ శాసనసభ్యులు ప్రవరిస్తున్నారని రామానారాయణరెడ్డి విమర్శించారు. ప్రతిపక్షనేత కొత్త సంప్రదాయాలు నేర్పుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. ముందుగా రూల్స్ తెలుసుకోవాలని హితవు పలికారు. సభలో ఏ సభ్యుడైనా తన అనుమతి తీసుకుని మాట్లాడాలని స్పీకర్ సూచించారు. ఏ సభ్యుడైనా కచ్చితంగా రూల్స్ పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ స్థానానికి సభ్యులు గౌరవం ఇవ్వాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment