సాక్షి, కర్నూలు: కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత శుక్రవారం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. అక్షరాస్యతను పెంచడానికి దేశంలో మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు ప్రతి తల్లిఖాతాలో ఏడాదికి 15 వేలు జమ చేయబోతున్నామని అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ప్రయాణించిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటానని మంత్రి బుగ్గన డోన్ నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment