
సాక్షి, అమరావతి : మాజీ సీఎం చంద్రబాబు బీసీలను మోసం చేస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు అన్నారు ఎమ్మెల్యే పార్థసారధి. రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. చరిత్రలో బీసీలకు ఇన్ని నిధులను ఎప్పుడు కేటాయించలేదని తెలిపారు. బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన మాట ప్రకారం బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్లు కేటాయించారన్నారు. ఆటోడ్రైవర్లు, టైలర్లు, చేనేతలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారికి అండగా నిలిచారని ప్రశంసించారు. ఈ బడ్జెట్ బీసీల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు దోహదం చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment