parthasaradhi
-
నేడు రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ హణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) వేగం పెంచింది. రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల పాలక మండళ్ల పదవీకాలం ముగిసి ఏడునెలలు దాటుతున్న నేప థ్యంలో ముందుగా పంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా శనివారం అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి సమావేశం నిర్వహించనున్నారు. ఎన్ని కల నిర్వహణ తీరు, ఓటర్ల జాబితాల ఖరారు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు.. తదితరాలపై పార్టీల నేతలకు స్పష్టతనివ్వనున్నారు. ఓటర్ల జాబితాల ఖరారు, పోలింగ్ స్టేషన్లు, ఇతర ఏర్పాట్లను సెప్టెంబర్ ఆఖరులోగా పూర్తిచేయాలని చూస్తున్నారు. ఓటర్ల జాబితాల ప్రచురణ ముగిశాక రాష్ట్ర ప్రభు త్వం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల వివరాలు అందిన వెంటనే అదేరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఎస్ ఈసీ సన్నా హాలు చేస్తోంది.స్థానిక ఎన్నికల్లోనూ అన్నీ కలుపుకుని 50% రిజర్వేషన్లు మించరాదని సుప్రీంకోర్టు ఆదే శాలున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీనిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థి తుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు ఎలా సాధ్యమన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వపరంగా చేస్తున్న ఏర్పాట్లను బట్టి చూస్తే అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదట్లో గ్రామపంచాయతీ, కొన్నిరోజుల వ్యవధి తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 8న ఎస్ఈసీ పార్థ సారధి మూడేళ్ల పదవీకాలం ముగియ నుంది. అయితే ఇప్పటికే ఆయన ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టినందున, ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపవచ్చని సమాచారం. -
ఖమ్మం జిల్లా కిష్టారంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం
-
మున్సిపల్ ఎన్నికలు యథాతధం: ఎస్ఈసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఎన్నికలు నిర్వహించడం ప్రమాదం.. నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చడమే కాక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విన్నవించాలని సూచిందింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతధంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. ‘‘ఈనెల 30న 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మున్సిపల్ ఎన్నికల నిర్వహిస్తాం. ప్రభుత్వ సూచన మేరకు యథావిధిగా ఎన్నికలు నిర్వహిస్తాం’’ అని పార్థసారధి తెలిపారు. కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేసిందని ... ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు. కాగా లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నిరాకరించారు. ఎన్నికల కమిషన్‌కు మరోసారి విన్నవించాలని పిటీషనర్‌కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను ఆపలేమని చెప్పడంతో డివిజన్ బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపింది. చదవండి: మున్సి‘పోరు’: టీఆర్ఎస్ సరికొత్త రాజకీయం -
‘జగన్ బీసీల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు’
సాక్షి, అమరావతి : మాజీ సీఎం చంద్రబాబు బీసీలను మోసం చేస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు అన్నారు ఎమ్మెల్యే పార్థసారధి. రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. చరిత్రలో బీసీలకు ఇన్ని నిధులను ఎప్పుడు కేటాయించలేదని తెలిపారు. బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన మాట ప్రకారం బడ్జెట్లో రూ. 15 వేల కోట్లు కేటాయించారన్నారు. ఆటోడ్రైవర్లు, టైలర్లు, చేనేతలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారికి అండగా నిలిచారని ప్రశంసించారు. ఈ బడ్జెట్ బీసీల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు దోహదం చేస్తుందన్నారు. -
బాబు ఒక బలహీన ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు
-
‘జన్మభూమి కమిటీల పేరుతో బాబు దోపిడి’
సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహంకార పూరిమైన పాలన చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి అన్నారు. వైఎస్సార్సీపీ మంగళవారం జిల్లాలోని పర్చూరులో నియోజక వర్గాల బూత్ కన్వినర్లకు రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాల్సిన ముఖ్యమంత్రే వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాజన్న రాజ్యం వస్తుందని తెలిపారు. ఏ రాజకీయ పార్టీకైనా కళ్లు, ముక్కు, చెవులు అన్నీ బూత్ కమిటీలే అని చెప్పారు. కర్రలు విసిరినా, కత్తులు తిప్పినా బూత్ స్థాయిలో కన్వినర్లకే సాధ్యమన్నారు. కొత్త ఓట్లు చేర్చడంలో యాక్టివ్‌గా ఉండాలన్నారు. టీడీపీ దోపిడీ రాజకీయాలు, అసమర్ధ పాలనను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల పార్లమెంటు అధ్యక్షుడు మోపిదేది వెంకట రమణ, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజక వర్గ ఇంచార్జులు గరటయ్య, రావి రామనాధం బాబు, ఎడం బాలాజీలు పాల్గొన్నారు. -
ఓటుకు కోట్లు ఆడియోపై విచారణకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లలో సాధ్యం కాని అభివృద్ధి ఒక్క ఏడాదిలో ఎలా సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆడియో టేపులపై విచారణ చేపట్టాలని మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓటుకు కోట్లు కేసులో బాబు ఆడియో టేప్‌లు 90 శాతం మ్యాచ్ అవుతున్నాయి. బాబు ఆడియో టేపుపై కూడా యనమల డిమాండ్ చేసి ఉంటే బాగుండేదని’ పార్థసారధి అన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి కంపెనీకి మొట్టమొదట లీజుకు ఇచ్చింది చంద్రబాబేనని పార్థసారధి గుర్తుచేశారు. జనార్దన్‌రెడ్డిని చంద్రబాబు సింగపూర్‌లో కలిసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జనార్దన్‌రెడ్డినే కాదు.. చంద్రబాబుపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎవరినీ పట్టించుకోవడం లేదు చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని పార్థసారధి విమర్శించారు. రైతులకు మద్ధతు ధర లేక అల్లాడుతుంటే సోమిరెడ్డి పట్టించుకోవడం లేదని.. అలాగే మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే హోంమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర సమస్యలను వదిలిపెట్టి కర్ణాటక గురించి మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ధర్మపోరాటం పేరుతో బాబు దగా.. పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు.. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. బీజేపీ, టీడీపీ ఇద్దరు కలిసి చేసిన అన్యాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాజధానిలో ఇప్పటివరకూ ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టలేదని, మాయ మాటలు చెప్పి రైతుల భూములు బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. అభివృద్ధి చేయడం చేతకాక ప్రభుత్వం ప్రతిపక్షంపై నిందలు వేస్తున్నారని పార్థసారధి అన్నారు. -
‘చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి’
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కలెక్టర్ కార్యాలయాల ముందు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో విజయవంతమయ్యాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ధర్నాలో పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆగ్రహాన్ని చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. హోదాకోసం చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు కూడా ధర్నాలను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని పార్థసారధి అన్నారు. హోదా గురించి మాట్లాడుతుంటే అడ్డుకోవడం సబబేనా అని ప్రశ్నించారు. దీనికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామ చేయడానికి సిద్ధమయ్యారని మరోసారి గుర్తుచేశారు. మీకు దమ్ముంటే రాజీనామాలు చేయండని చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. -
అలాంటి వ్యక్తితో చంద్రబాబు ఫొటోలా?
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ రాష్ట్రంలో రౌడీలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. తెనాలిలో బహిష్కరణకు గురైన సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యంతో చంద్రబాబు దిగిన ఫొటోలను ఆయన ఆదివారం మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. 'ఇటీవల హైదరాబాద్‌లో తుపాకుల అమ్మే ముఠా ఒకటి పట్టుబడింది. సుబ్బుకు తుపాకులు అమ్మేందుకు వచ్చామని ఆ ముఠా విచారణలో తెలిపింది. అలాంటి వ్యక్తితో చంద్రబాబు ఫొటోలు ఎలా దిగుతారు' అని పార్థసారథి ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీలు ఉండటానికి వీల్లేదన్న చంద్రబాబు.. అదే రౌడీలతో కలిసి ఫొటోలు దిగడమేంటి? అని నిలదీశారు. అసాంఘిక శక్తులను, గన్ కల్చర్‌ను టీడీపే ప్రోత్సహిస్తోందని ఆయన దుయ్యబట్టారు. -
చంద్రబాబుపై కేసు ఎందుకు పెట్టరాదు?
-
మామను వెన్నుపోటు పొడవటం కన్నా ఘోరం
హోదా వద్దన్న బాబుపై పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలని సీఎం చంద్రబాబు చెప్పడం అయన తన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం కంటే ఘోరమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విమర్శించారు. హోదాను పక్కన పెట్టి ఏ స్వార్ధం తో చట్టబద్ధత లేని ప్యాకేజీ వెనుక పడు తున్నారని ప్రశ్నించారు. విభజన చట్టంలో లేనివి ఏవైనా ప్రత్యేక ప్యాకేజీలో చెప్పారా? అని నిలదీశారు. హోదా వస్తే రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు నష్టం జరుగుతుం దని మీరు చెప్పదలుచుకున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే కాటేస్తారా? అని మండిపడ్డారు. మంగళ వారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బాబు, వెంకయ్య అధికారంలోకి రాగానే మత్తు ఆవహించి ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వెంకయ్యను ప్రజలంతా అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. హోదా వల్ల ఉపయోగం లేదన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వెంకయ్య, సుజనా చౌదరిలు ఎందుకు ప్రయత్నిస్తున్నారో చెప్పా లన్నారు. ఏ గణాంకాల ఆధారంగా హోదా వల్ల ఏపీకి రూ.3,500 కోట్లే అదనంగా వస్తాయని తేల్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా వల్ల ఉపయోగాలేంటో ఒకసారి వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తుంద న్నారు. ఈశాన్య రాష్ట్రాలతో ఏపీని పోల్చ డం సరికాదన్నారు. వివిధ సందర్భాల్లో వెంకయ్య హోదాపై మాట్లాడిన వీడియో క్లిప్పింగులు ఈ సందర్భంగా ప్రదర్శించారు. -
‘ప్రజలు అసహ్యించుకునేలా వెంకయ్య, బాబు’
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి మాటలు ప్రజలు అసహ్యించుకునేలా ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. వారిద్దరు ప్రతిపక్షంలో ఉంటేనే బావుంటుందని, అప్పుడే ఏపీకి మేలు జరుగుతుందని చెప్పారు. అధికారంలోకి రాగానే అన్ని విషయాలు వీరు మర్చిపోతారని చెప్పారు. ఏపీలో నిజంగా అనుకూల పరిస్థితులే ఉంటే హెరిటేజ్‌ను ఎందుకు విస్తరించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏపీని ఈశాన్య రాష్ట్రాలతో పోల్చడం ఎంతవరకు సమంజసం అని ఆయన నిలదీశారు. అబద్ధాలతో టీడీపీ నేతలంతా మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థంతో చంద్రబాబు, వెంకయ్య ప్రత్యేక ప్యాకేజీని పక్కకు పెట్టారని, ప్రజలు నమ్మి ఓటెస్తే వారిని కాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని సుజనా పందులతో పోల్చడం దారుణం అని, ఆయన దిగాజరి మాట్లాడుతున్నారన్నారు. వల్లభనేని వంశీకి అసలు రైతు సమస్యలు తెలుసా అని ప్రశ్నించారు. ఆయన నియోజకవర్గంలో వేల ఎకరాల్లో పంట నష్టపోయిన విషయం తెలియదా అని నిలదీశారు. -
‘ప్రజలు అసహ్యించుకునేలా వెంకయ్య, బాబు’
-
10 లక్షల మొక్కలు నాటుతాం
రాష్ట్ర మార్కెటింగ్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ములుగు: హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మార్కెట్, సబ్ మార్కెట్ యార్డుల్లో 10 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర మార్కెటింగ్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి అన్నారు. ములుగు మండలం వంటిమామిడి మార్కెట్ యార్డులో శనివారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వంటిమామిడిలో రూ.8.5 కోట్లతో కోల్డ్‌స్టోరేజ్ నిర్మాణాలను చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 330 గోదాముల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని, వీటి నిర్మాణాలకు రూ. వెయ్యి 24 కోట్ల నిధులు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉధ్యానవన శాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్రాంరెడ్డి, మార్కెటింగ్ శాఖ జేడీ రవికుమార్, కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, డైరెక్టర్లు కరుణాకర్‌రెడ్డి, శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వారి కన్నీళ్లను తొక్కేసి రావాలా..?
-
వారి కన్నీళ్లను తొక్కేసి రావాలా..?
హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు. ప్రతిపక్ష నేత రాసిన లేఖపై మంత్రులు విమర్శలు చేయడం మాని వివరణ ఇవ్వాలని అన్నారు. తామెదో ఉద్దేశ పూర్వకంగా రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి రావడం లేదనుకుంటే పొరపాటవుతుందని, ఎంతోమందిని బాధపెట్టి నిర్మిస్తున్న రాజధాని కార్యక్రమానికి తాము హాజరై వారి బాధను అవమానించలేమని, వారి కన్నీళ్లను తొక్కి అవమానించలేమని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడిన పార్థసారథి.. రాజధాని పేరిట ప్రభుత్వం నిర్వహించిన తంతును ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. సాక్షాత్తు ప్రధాని సైతం భూసేకరణ బిల్లు విషయంలో అందరి ఆందోళనలు పరిగణనలోకి తీసుకుంటామని, రైతులకు, పేదవారికి అనుకూలంగా ఉండేలా భూసేకరణ ఉంటుందని, అలా మార్పులు చేసేవరకు భూసేకరణ ఉండబోదని చెప్పినా.. అదే భూసేకరణ బిల్లుతో చంద్రబాబునాయుడు ప్రజల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేవలం 14 వేల ఎకరాలు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం 5వేల ఎకరాలు అవసరం ఉండగా ఎందుకు 33 వేల ఎకరాలు సేకరించారని ప్రశ్నించారు. భూమిని సేకరించిన ప్రాంతాల్లోని పేదలు, భూమిలేని వారు, వృత్తిపై ఆధారపడి బతుకులీడ్చేవారి భవిష్యత్తుకు ఏ మేరకు భరోసా ఇచ్చారని, వారంతా ఎటుపోతారని నిలదీశారు. మెడలు వంచి ఇళ్లలో నుంచి లాగేసి మరి పేదవారి భూములను రాజధాని పేరిట కొల్లగొట్టారని, ఇప్పుడు వారంతా కంటతడిపెడుతుంటే.. ఏ విధంగా రాజధాని శంఖుస్ధాపన కార్యక్రమానికి రావాలని చెప్పారు. తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే, అంతకంటే ముందు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తేనే బావుంటుందనేది తమ అభిప్రాయం అన్నారు. వ్యక్తిగతంగా ప్రభుత్వం ఊహించుకుంటున్న రాజధాని కోసం అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కృష్ణా డెల్టాకు చంద్రబాబు అన్యాయం!
-
'గుంటూరు-బెజవాడ మధ్య వైఎస్ జగన్ దీక్ష'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెల 3,4 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నట్లు వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి తెలిపారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గుంటూరు-విజయవాడ మధ్య వైఎస్ జగన్ దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఏడాది పాలనలో పూర్తిగా ప్రజలను మోసగించారని పార్థసారధి విమర్శించారు. ప్రజలను ఈ విధంగా మోసం, దగా చేసిన ప్రభుత్వాలను తాము ఎన్నడూ చూడలేదన్నారు. రుణమాఫీ, స్పెషల్ స్టేటస్, బలవంతపు భూసేకరణ, నిరుద్యోగ భృతి వంటి అంశాలను చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారని పార్థసారధి ధ్వజమెత్తారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నేతలతో భేటీ అయ్యారు. -
'గుంటూరు-బెజవాడ మధ్య వైఎస్ జగన్ దీక్ష'
-
బాబు మాటలన్నీ ముడుపులకోసమే
- వైఎస్సార్సీపీ నేతలు పార్థసారథి, కొత్తపల్లి ధ్వజం హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చడానికీ, తన అవినీతి అంశాలను మరుగుపరచడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడులు శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ సీఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం తాజాగా ఐదేళ్లలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తీసుకొస్తానని ప్రకటనలు చేశారని, అదెలా సాధ్యమని పార్థసారథి ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రాజెక్టుల ద్వారా సాగులోకి తెచ్చిన 69 లక్షల ఎకరాలేనన్నారు. వీటిలో 20-25 లక్షల ఎకరాలు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాగులోకి తెచ్చినవేనని తెలిపారు. ఇప్పుడు ఐదేళ్లలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తెస్తాననడం ప్రజలను మభ్యపెట్టడానికి కాక మరేంటని ఆయన దుయ్యబట్టారు. చెరువు మట్టిని అమ్ముకుంటున్నారు.. చెరువుల్లో పూడిక తీసిన మట్టిని టీడీపీ నేతలు, కార్యకర్తలు రియల్ఎస్టేట్, ఇతర వ్యాపార అవసరాలకు అమ్ముకోవడం కోసమే నీరు-చెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని పార్థసారథి విమర్శించారు. పోలవరం, పట్టిసీమ, గోదావరి జలాలపై బహిరంగ చర్చకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని ఆయన సవాలు విసిరారు. ఏడాదిలో పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారు? ఏ పని చే శారు? ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అవకాశాలు పెరగాలంటే ఒక్క పోలవరం ప్రాజెక్టుతోనే సాధ్యమని కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఏడాదికాలంలో చంద్రబాబు ఎంత ఖర్చుపెట్టారు? కొత్తగా ఎంత పని పూర్తిచేశారో శ్వేతపత్రం ద్వారా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. -
బాధ్యతలు స్వీకరించిన పార్థసారధి
హైదరాబాద్ సిటీ: తెలంగాణ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా పార్థసారధి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కొన్ని ఫైళ్లను పరిశీలించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జరిగిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఆ బాధ్యతల్లో పనిచేసిన పూనం మాలకొండయ్యకు వీడ్కోలు పలికారు. -
'రైతులకు పరిహారం.. వైఎస్ జగన్ విజయం'
హైదరాబాద్: రైతుల ఎక్స్ గ్రేషియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయడం వైఎస్సార్ సీపీ విజయమని ఆ పార్టీ నేత పార్థసారధి తెలిపారు. రైతుల ఎక్స్ గ్రేషియాపై తదితర ఆంశాలకు సంబంధించి శుక్రవారం మీడియాతో మాట్లాడిన పార్థసారధి.. ఇది తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయమని పేర్కొన్నారు. గతంలో రైతుల ఆత్మహత్యలను భూతద్దంలో చూపిస్తోందని వైఎస్సార్ సీపీని ప్రభుత్వం విమర్శించిందన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చేనేత కార్మికుల, రైతుల ఆత్మహత్యలను అనంత జిల్లా కలెక్టరే ధృవీకరించారన్నారు. రైతులకు అండగా ఉండేందుకు వైఎస్ జగన్ భరోసా యాత్ర చేయబోతున్నారని తెలిసే ప్రభుత్వం ఈ జీవో జారీ చేసిందన్నారు.ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 3.5 లక్షల పరిహారంతో పాటు మరో రూ. 1.5 లక్షలను రుణంగా కూడా ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతులకు ఎక్స్ గ్రేషియా జారీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని పార్థసారధి అన్నారు. రైతులకు మేలు జరగడమే తమకు కావాల్సిందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎగనామం పెట్టేలా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.పట్టిసీమ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఎందుకంత హడావుడి చేస్తుందని ఆయన మండిపడ్డారు. నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని చెప్పి పట్టిసీమ అంశాన్ని తెరపైకి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు నీటిని లిఫ్ట్ చేయడానికి కాదని.. నోట్లను లిఫ్ట్ చేయడానికని పార్థసారధి ఎద్దేవా చేశారు. . చంద్రబాబు పాలనపై రెఫరెండమ్ కావాలంటే 10 మంది మంత్రులు రాజీనామా చేసి పోటీకి సిద్ధంగా కావాలని సవాల్ విసిరారు. -
'శ్రీశైల వాసు హత్యకేసుపై సమగ్ర దర్యాప్తు'
నందిగామ: తమ పార్టీ నాయకుడు బుగ్గవరపు శ్రీశైల వాసు హత్య వెనుక పలు అనుమానాలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పార్థసారథి, సామినేని ఉదయభాను అన్నారు. ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. శ్రీశైల వాసు హత్యకేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే గన్ కల్చర్ తరహాలో హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. పోలీసులు కావాలనే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కృష్ణాజిల్లా నందిగామలో శ్రీశైల వాసును మంగళవారం ఉదయం తుపాకీతో కాల్చిచంపారు. -
'చిల్లర వ్యవహారాలు మానుకోండి'
విశాఖపట్నం: జయలలితకు పడిన శిక్ష వైఎస్ జగన్ కు పడుతుందనడం అవగాహనారాహిత్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి అన్నారు. రాజ్యాంగపరమైన పదవులు జగన్ అనుభవించలేదని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు జగన్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. చిల్లర వ్యవహారాలు పక్కనపెట్టి ప్రజలకు సరైన పాలన అందించాలని సూచించారు. ఐఎంజీ తదితర కేసుల్లో ప్రాథమిక ఆధారాలతో విజయమ్మ కోర్టును ఆశ్రయిస్తే చంద్రబాబు భయపడి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని తెలిపారు. సీబీఐ లేదా అలాంటి సంస్థలతో దర్యాప్తు చేయించుకుని క్లీన్చిట్ ఎందుకు తెచ్చుకోలేదని పార్థసారథి ప్రశ్నించారు. -
రాజధాని కోసం టీడీపీలో రెండు వర్గాలు!
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి ఏర్పాటు చేసిన భూసేకరణ కమిటీలో సీనియర్ మంత్రులను పక్కనపెట్టారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి విమర్శించారు. సోమవారం రాజధాని కమిటీపై మాట్లాడిన ఆయన.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో బీసీ మంత్రులకు అవమానం జరుగుతోందన్నారు. కొత్త రాజధానిలో బడుగు, బలహీన వర్గాలు కూడా బతికేలా ప్రభుత్వం అనుకూల వాతావరణాన్ని సృష్టించాలన్నారు.విజయవాడ పరిసరాల్లో టీడీపీ రియల్ ఎస్టేట్ కంపెనీలు 10వేల కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. టీడీపీ రియలెస్టేట్ వ్యాపారల్లో లాభనష్టాలు బేరీజు వేసుకున్నాకే కొత్త రాజధాని ఎక్కడనే విషయంపై స్పష్టత వస్తుందన్నారు. పోలవరం టెండర్ ఫైనలేజషన్లో పెదబాబుకు, చినబాబుకు దక్కిన వాటాలెంతో చెప్పాలని పార్థసారధి డిమాండ్ చేశారు. పోలవరం టెండర్లో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని ఆయన సూచించారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ చేతగాని దద్దమలా వ్యవహరిస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణంలో భూమి ఇచ్చిన రైతులకు .. అదే విస్తీర్ణంలో భూములు ఇవ్వాలన్నారు. రాజధాని కోసం టీడీపీలో రెండు వర్గాలు పోటీపడుతున్నాయన్నారు. సుజనాచౌదరి గ్రూపు అమలాపురం కావాలిని, సీఎం రమేష్ వర్గం నూజివీడును చేయాలని పట్టుబడుతున్నాయన్నారు. -
తమ్ముళ్లు తన్నుకున్నారు!
-
టిడిపిలో రుమాలు వేసి కాంగ్రెస్ పై తిట్లపురాణం