
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కలెక్టర్ కార్యాలయాల ముందు వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో విజయవంతమయ్యాయని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ధర్నాలో పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆగ్రహాన్ని చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. హోదాకోసం చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఈ రోజు కూడా ధర్నాలను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని పార్థసారధి అన్నారు. హోదా గురించి మాట్లాడుతుంటే అడ్డుకోవడం సబబేనా అని ప్రశ్నించారు. దీనికోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామ చేయడానికి సిద్ధమయ్యారని మరోసారి గుర్తుచేశారు. మీకు దమ్ముంటే రాజీనామాలు చేయండని చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment