మామను వెన్నుపోటు పొడవటం కన్నా ఘోరం
హోదా వద్దన్న బాబుపై పార్థసారథి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలని సీఎం చంద్రబాబు చెప్పడం అయన తన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం కంటే ఘోరమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విమర్శించారు. హోదాను పక్కన పెట్టి ఏ స్వార్ధం తో చట్టబద్ధత లేని ప్యాకేజీ వెనుక పడు తున్నారని ప్రశ్నించారు. విభజన చట్టంలో లేనివి ఏవైనా ప్రత్యేక ప్యాకేజీలో చెప్పారా? అని నిలదీశారు. హోదా వస్తే రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు నష్టం జరుగుతుం దని మీరు చెప్పదలుచుకున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే కాటేస్తారా? అని మండిపడ్డారు. మంగళ వారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.
బాబు, వెంకయ్య అధికారంలోకి రాగానే మత్తు ఆవహించి ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వెంకయ్యను ప్రజలంతా అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. హోదా వల్ల ఉపయోగం లేదన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వెంకయ్య, సుజనా చౌదరిలు ఎందుకు ప్రయత్నిస్తున్నారో చెప్పా లన్నారు. ఏ గణాంకాల ఆధారంగా హోదా వల్ల ఏపీకి రూ.3,500 కోట్లే అదనంగా వస్తాయని తేల్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా వల్ల ఉపయోగాలేంటో ఒకసారి వెబ్‌సైట్‌లోకి వెళ్తే తెలుస్తుంద న్నారు. ఈశాన్య రాష్ట్రాలతో ఏపీని పోల్చ డం సరికాదన్నారు. వివిధ సందర్భాల్లో వెంకయ్య హోదాపై మాట్లాడిన వీడియో క్లిప్పింగులు ఈ సందర్భంగా ప్రదర్శించారు.