‘ప్రజలు అసహ్యించుకునేలా వెంకయ్య, బాబు’ | ysrcp leader parthasaradhi takes on union minister venkaiah, cm chandrababu | Sakshi
Sakshi News home page

‘ప్రజలు అసహ్యించుకునేలా వెంకయ్య, బాబు’

Published Tue, Jan 31 2017 7:17 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

‘ప్రజలు అసహ్యించుకునేలా వెంకయ్య, బాబు’ - Sakshi

‘ప్రజలు అసహ్యించుకునేలా వెంకయ్య, బాబు’

హైదరాబాద్‌: ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి మాటలు ప్రజలు అసహ్యించుకునేలా ఉన్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. వారిద్దరు ప్రతిపక్షంలో ఉంటేనే బావుంటుందని, అప్పుడే ఏపీకి మేలు జరుగుతుందని చెప్పారు. అధికారంలోకి రాగానే అన్ని విషయాలు వీరు మర్చిపోతారని చెప్పారు. ఏపీలో నిజంగా అనుకూల పరిస్థితులే ఉంటే హెరిటేజ్‌ను ఎందుకు విస్తరించడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఏపీని ఈశాన్య రాష్ట్రాలతో పోల్చడం ఎంతవరకు సమంజసం అని ఆయన నిలదీశారు. అబద్ధాలతో టీడీపీ నేతలంతా మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థంతో చంద్రబాబు, వెంకయ్య ప్రత్యేక ప్యాకేజీని పక్కకు పెట్టారని, ప్రజలు నమ్మి ఓటెస్తే వారిని కాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని సుజనా పందులతో పోల్చడం దారుణం అని, ఆయన దిగాజరి మాట్లాడుతున్నారన్నారు. వల్లభనేని వంశీకి అసలు రైతు సమస్యలు తెలుసా అని ప్రశ్నించారు. ఆయన నియోజకవర్గంలో వేల ఎకరాల్లో పంట నష్టపోయిన విషయం తెలియదా అని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement