Union Minister Venkaiah
-
‘మత’ రిజర్వేషన్లకు మద్దతివ్వం
బీసీ ప్రతినిధుల సభలో కేంద్ర మంత్రి వెంకయ్య సాక్షి, హైదరాబాద్: ‘మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. దానికి మేము మద్దతివ్వం. ఆర్థికంగా వెనుకబ డిన వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేం దుకు మాత్రమే రిజర్వేషన్లను ఉపయోగించుకో వాలి. ప్రభుత్వాలు ఆ మేరకు చర్యలు తీసుకో వాలి’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన బీసీ ప్రతిని ధుల మహాసభలో ఆయన మాట్లాడారు. ‘పేద కులాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ సహ కరిస్తుంది. మతపరమైన రిజర్వేషన్లతో ఇతర కులాలు నష్టపోతాయి. కాంగ్రెస్ బీసీలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూసింది. ప్రధాని మోదీ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. జాతీయ బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల మాదిరిగా సర్వాధికారాలను సొంతం చేసుకుం ది. అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీసీలకు రాజ్యాధికారం లేకుండా పోయింది. కానీ, బీజేపీ హయాంలో బీసీ నేత ప్రధానిగా ఉన్నారు’ అని వెంకయ్య చెప్పారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగా ల్లో సరైన ప్రాధాన్యత కల్పించాలన్నారు. అవి రాష్ట్ర ప్రభుత్వ కమిషన్లు... రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన బీసీ కమిషన్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే విషయాలనే నివేదిక రూపంలో ఇస్తున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాకు అనుగుణంగా నివేదికలు ఇచ్చి వాటిని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. ‘రాష్ట్ర బీసీ కమిషన్ ఆగమేఘాల మీద ఒక్క ముస్లింల రిజర్వేషన్లపైనే ప్రభుత్వానికి నివేదిక ఎలా ఇస్తుంది. బీసీల్లో ఉన్న అన్ని కులాలపై అధ్యయనంచేసి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి. ఆమేరకు చర్చించి అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచడంతో బీసీలు తీవ్రంగా నష్టపోతారు. ఈ రిజర్వేషన్ల ను పార్లమెంటు ఆమోదిస్తేనే అమలు సాధ్యమ వుతుంది.’ అన్నారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీల్లో కొత్త కులాలు పుట్టుకొస్తున్నాయని, ఇటీవల భూపా లపల్లి జిల్లాలో పర్యటించిన సమయంలో రాజన్న కులం పేరు విన్నానన్నారు. సమగ్ర అధ్యయనం చేసి బీసీల స్థితిగతులను పరిశీలిం చాలని సూచించారు. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా లభించడంతో బీసీలపై జరిగే అక్రమాలు, అన్యాయాలను పరిశీలించి చర్యలు తీసుకునే అధికారం ఉంటుందన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. జాతీయ బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించి నందుకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయలను సన్మానించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీసీ సంఘ నేతలు సత్యనారాయణ, గొరిగె మల్లేశ్ యాదవ్, కృష్ణ పాల్గొన్నారు. -
తెలంగాణకు రూ.1,673 కోట్లు
అటల్ మిషన్ కింద కేటాయించిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: అటల్ మిషన్ పథకంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.1,673 కోట్లు కేటాయించింది. 2015–17 మధ్యకాలానికి రూ.970 కోట్లు, వచ్చే మూడేళ్లలో రూ.703 కోట్ల మేర నిధుల వ్యయానికి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.1,673 కోట్ల నిధుల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తన వాటాగా రూ.832 కోట్లు మంజూరు చేయనుంది. ఈ మేరకు నిధుల కేటాయింపునకు కేంద్ర మంత్రి వెంకయ్య ఆమోదం తెలిపారు. తెలంగాణలో అమృత్ పథకం కింద ఎంపికైన 12 పట్టణాలకు నిధుల విడుదలపై శుక్రవారం ఢిల్లీలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ 12 పట్టణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రణాళికలను సమీక్షించిన కేంద్రం.. 2015–16కు రూ.415 కోట్లు, 2016–17కు రూ.555 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. అలాగే 2017–20 మధ్యకాలానికి రూ.703 కోట్లు కేటాయించడానికి అంగీకరించింది. రానున్న మూడేళ్లకు ఆమోదించిన నిధుల్లో నీటి సరఫరా కోసం రూ. 559 కోట్లు, మురుగునీటి వ్యవస్థ నిర్మాణానికి రూ.126 కోట్లు.. పార్కులు, పచ్చదనం పెంపునకు రూ.17 కోట్లను కేటాయించనున్నారు. తాగునీటి సరఫరాకు కేటాయించిన రూ.559 కోట్ల నిధుల్లో వరంగల్‌కు మాత్రమే రూ.424 కోట్లు కేటాయించనున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకుగాను ఖమ్మంకు రూ.47 కోట్లు, మహబూబ్‌నగర్‌కు రూ.41 కోట్లు, కరీంనగర్‌కు రూ.24 కోట్లు, నల్లగొండకు రూ.11 కోట్లు, మిర్యాలగూడకు రూ.4 కోట్లు, సూర్యాపేటకు రూ.1.45 కోట్లు కేటాయించనున్నారు. అమృత్ మిషన్‌లో భాగంగా పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీరు అందివ్వాలని, ఒక్కో మనిషికి రోజుకు రూ. 135 లీటర్ల నీరివ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. -
16న యూపీ–బీజేపీ శాసనసభాపక్షం భేటీ!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం మార్చి 16న జరిగే వీలుంది. రాష్ట్రానికి సీఎంని నియమించే పనిలో బీజేపీ నాయకత్వం బిజీగా ఉంది. రాష్ట్రానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రి వెంకయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌లు నియమితులయ్యారు. 16న జరిగే సమావేశంలో వెంకయ్య, యాదవ్‌లు పాల్గొని, ఎమ్మెల్యేలను సంప్రదించి, సీఎం అభ్యర్థుల పేర్లను అమిత్ షాకు నివేదిస్తారు. హోం మంత్రి రాజ్‌నాథ్ , రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా తదితరుల పేర్లు సీఏం పదవికి పరిశీలనలో ఉన్నాయి. మళ్లీ సీఎంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వెనక్కు రావడానికి రాజ్‌నాథ్ విముఖత చూపుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఒక పాత్రికేయుడు రాజ్‌నాథ్‌ను వివరణ కోరగా ఆయన ‘రామ్ రామ్’అంటూ వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన 403 మంది పేర్లతో కూడిన జాబితాను యూపీ ముఖ్య ఎన్నికల అధికారి, ఆ రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించారు. -
భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి
⇒ ట్రంప్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి వెంకయ్య ⇒ కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబానికి పరామర్శ ⇒ అలోక్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన దత్తాత్రేయ హైదరాబాద్/దుండిగల్: అమెరికాలో ఉన్న భారతీయుల రక్షణకు ట్రంప్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అమెరికాలో జాతి వివక్షకు బలైన కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో కలసి ఆయన పరామర్శించారు. మృతుని కుటుంబానికి కావల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్య చెప్పారు. శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకొ చ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి దాడులను వ్యతిరేకించకపోతే అమెరికానే తీవ్రంగా నష్ట పోతుందని స్పష్టం చేశారు. అగ్రరాజ్యంతో భారత్ మిత్ర దేశంగా ఉందని.. ఆ మైత్రి అలాగే కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఘటనపై ఇప్పటికే విదేశాంగ శాఖ నిరసన వ్యక్తం చేసిందని, ఈ విషయమై త్వరలో ఓ బృందం ట్రంప్‌ను కలుస్తుందని వెంకయ్య తెలిపారు. అమెరికాలో భారతీయులను ఆదుకొంటాం: దత్తాత్రేయ అమెరికాలోని భారతీయులెవరూ భయపడా ల్సిన అవసరం లేదని దత్తాత్రేయ చెప్పారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన దాడిగానే భావి స్తున్నానన్నారు. అయితే ఈ దాడిని కేంద్రం సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. అక్కడ ఉన్న తెలుగువారు ధైర్యంగా ఉండాలని సూచించారు. కాగా, ఇదే దాడిలో గాయపడ్డ అలోక్‌రెడ్డి కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య ఆదివారం పరామర్శిం చారు. ఆర్కేపురంలోని అలోక్‌రెడ్డి నివాసానికి వెళ్లిన దత్తాత్రేయ.. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కాగా, అలోక్‌రెడ్డి పరిస్థితి తెలుసుకునేందుకు అమెరికా వెళుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. -
మామను వెన్నుపోటు పొడవటం కన్నా ఘోరం
హోదా వద్దన్న బాబుపై పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలని సీఎం చంద్రబాబు చెప్పడం అయన తన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం కంటే ఘోరమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విమర్శించారు. హోదాను పక్కన పెట్టి ఏ స్వార్ధం తో చట్టబద్ధత లేని ప్యాకేజీ వెనుక పడు తున్నారని ప్రశ్నించారు. విభజన చట్టంలో లేనివి ఏవైనా ప్రత్యేక ప్యాకేజీలో చెప్పారా? అని నిలదీశారు. హోదా వస్తే రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు నష్టం జరుగుతుం దని మీరు చెప్పదలుచుకున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే కాటేస్తారా? అని మండిపడ్డారు. మంగళ వారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బాబు, వెంకయ్య అధికారంలోకి రాగానే మత్తు ఆవహించి ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వెంకయ్యను ప్రజలంతా అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. హోదా వల్ల ఉపయోగం లేదన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వెంకయ్య, సుజనా చౌదరిలు ఎందుకు ప్రయత్నిస్తున్నారో చెప్పా లన్నారు. ఏ గణాంకాల ఆధారంగా హోదా వల్ల ఏపీకి రూ.3,500 కోట్లే అదనంగా వస్తాయని తేల్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా వల్ల ఉపయోగాలేంటో ఒకసారి వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తుంద న్నారు. ఈశాన్య రాష్ట్రాలతో ఏపీని పోల్చ డం సరికాదన్నారు. వివిధ సందర్భాల్లో వెంకయ్య హోదాపై మాట్లాడిన వీడియో క్లిప్పింగులు ఈ సందర్భంగా ప్రదర్శించారు. -
‘ప్రజలు అసహ్యించుకునేలా వెంకయ్య, బాబు’
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి మాటలు ప్రజలు అసహ్యించుకునేలా ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. వారిద్దరు ప్రతిపక్షంలో ఉంటేనే బావుంటుందని, అప్పుడే ఏపీకి మేలు జరుగుతుందని చెప్పారు. అధికారంలోకి రాగానే అన్ని విషయాలు వీరు మర్చిపోతారని చెప్పారు. ఏపీలో నిజంగా అనుకూల పరిస్థితులే ఉంటే హెరిటేజ్‌ను ఎందుకు విస్తరించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏపీని ఈశాన్య రాష్ట్రాలతో పోల్చడం ఎంతవరకు సమంజసం అని ఆయన నిలదీశారు. అబద్ధాలతో టీడీపీ నేతలంతా మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థంతో చంద్రబాబు, వెంకయ్య ప్రత్యేక ప్యాకేజీని పక్కకు పెట్టారని, ప్రజలు నమ్మి ఓటెస్తే వారిని కాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని సుజనా పందులతో పోల్చడం దారుణం అని, ఆయన దిగాజరి మాట్లాడుతున్నారన్నారు. వల్లభనేని వంశీకి అసలు రైతు సమస్యలు తెలుసా అని ప్రశ్నించారు. ఆయన నియోజకవర్గంలో వేల ఎకరాల్లో పంట నష్టపోయిన విషయం తెలియదా అని నిలదీశారు. -
‘ప్రజలు అసహ్యించుకునేలా వెంకయ్య, బాబు’
-
‘బ్రేక్ పార్టీస్.. మేక్ పార్టీ’ మీ విధానమా?
♦ అవినీతి పునాదులపై రాష్ట్రాన్ని నిర్మించాలనుకుంటున్నారా? ♦ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలకు మీ సమాధానమేంటి? ♦ ఏపీ సీఎం బాబును సూటిగా ప్రశ్నించిన ఇండియాటుడే ప్రతినిధి ♦ దీంతో ఆవేశానికి లోనై పలు పరుష వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు సాక్షి ప్రతినిధి, చెన్నై: బ్రేక్ పార్టీస్.. మేక్ పార్టీ మీ విధానమా(పార్టీలను విడగొట్టి.. పార్టీని నిర్మించుకోవడం)? అవినీతి పునాదులపై రాష్ట్రాన్ని నిర్మించాలనుకుంటున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో ఏపీ సీఎం చంద్రబాబు ఖంగుతిన్నారు. ‘ఒకవైపు మీరేమో క్లీన్ ఇండియా, కరప్షన్ ఫ్రీ ఇండియా అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మీపై ఆరోపణలు వస్తున్నాయి కదా?’ అని ప్రశ్నించడంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ సందర్భంగా కొంత ఆవేశానికి గురైన చంద్రబాబు పరుషవ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి ‘హూ ఈజ్ దట్ ఫెలో..?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతలోనే తమాయించుకొని క్షమాపణ చెప్పారు. ప్రముఖ చానల్, మ్యాగ్జైన్ అయిన ఇండియాటుడే చెన్నైలో జాతీయ సదస్సు ఏర్పాటు చేసింది. దీనికి మంగళవారం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం పినరాయ్ విజయన్, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ హాజరయ్యారు. వీరందరి సమక్షంలో ఏపీ సీఎం చంద్రబాబుపై ఇండియాటుడే ప్రతినిధి పలు ప్రశ్నలు సంధించారు. ‘మీరేమో క్లీన్ ఇండియా, అమరావతి ఒక ఆదర్శ రాజధాని అని చెబుతున్నారు. అయితే ఏపీలో మీపై చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. అంటే మీరు బ్రేక్ పార్టీస్, మేక్ పార్టీ విధానంతో అవినీతి పునాదులపై రాష్ట్రాన్ని నిర్మించాలనుకుంటున్నారా?’ అని చంద్రబాబును ఆ ప్రతినిధి ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ఏపీ సీఎం చంద్రబాబు సమాధానమిస్తూ.. తమ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంద ని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనాల్సిన అగత్యం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని భూసేకరణ అంతా పారదర్శకంగా జరుగుతోందని, తన పిలుపునకు స్పందించి 35 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా అప్పగించారని చెప్పారు. రాజధాని నిర్మాణ బాధ్యతలను సీఆర్డీఏ పర్యవేక్షిస్తుండగా రూ.లక్ష కోట్ల అవినీతికి ఆస్కారం ఎక్కడిదని ప్రశ్నించారు. అవినీతి రహిత పాలన దిశగా అమరావతి నిర్మాణం సాగుతోందని పేర్కొన్నారు. రెండుసార్లు ప్రధాని అవకాశం వచ్చింది.. పెద్ద నోట్ల రద్దును 90 నుంచి 95 శాతం మంది ప్రజలు సమర్థిస్తుండగా.. అవినీతిపరులైన 5 శాతం మంది మాత్రమే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ పరమైన ఆర్థిక లావాదేవీలు సైతం చెక్కు రూపేణా నిర్వహించేందుకు తాము సిద్ధమని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలతో సంతృప్తిగా ఉన్నానని, జాతీయస్థాయికి వెళ్లబోనని చంద్రబాబు తెలిపారు. గతంలో తనకు రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా నిరాకరించానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు, అన్నాడీఎంకేపై అజమాయిషీ కోసం సీబీఐ, ఐటీ దాడులను అస్త్రంగా వాడుకోవడం లేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. నల్లధన నిర్మూలన అనేది 2014 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలోని అంశమని, దీని కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. -
చర్చ లేకుండానే మరోరోజుకు వాయిదా..
-
చర్చ లేకుండానే మరోరోజు
క్యూల మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారానికి విపక్షాల డిమాండ్ న్యూఢిల్లీ: నోట్ల రద్దుపై మంగళవారం కూడా పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగింది. అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం కారణంగా ఎలాంటి చర్చ జరగకుండానే వరుసగా నాలుగోరోజూ వారుుదాపడ్డాయి. క్యూల మృతుల పరిహారంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు పట్టుబట్టగా.. లోక్‌సభలో విపక్షాల వారుుదాతీర్మానాల డిమాండ్‌కు అన్నాడీఎంకే జతచేరింది. నోట్లరద్దు నిర్ణయంలో ప్రతి అంశంపై చర్చించేందుకు సిద్ధమేనని మంత్రి అనంత్ కుమార్ చెప్పగా.. చర్చకు తాము సిద్ధమేనని అయితే ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాజ్యసభలో..: ఎగువ సభ ప్రారంభమైనప్పటినుంచీ.. విపక్ష సభ్యులు వెల్‌లోనే నిలబడ్డారు. ప్రధాని సభకు వస్తేగానీ నోట్లరద్దుపై చర్చ ముందుకు సాగనివ్వమన్నారు. పాత కరెన్సీ నోట్లు మార్చుకునే ప్రయత్నంలో భాగంగా ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిలబడి మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీఎంసీల సభ్యులకు.. యూపీ బరిలో బద్ధశత్రువులైన సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు కూడా జతచేరటంతో నినాదాలతో రాజ్యసభ హోరెత్తింది. దీంతో సభ పలుమార్లు వారుుదా పడింది. లోక్‌సభలో రచ్చ.. శీతాకాల సమావేశాల మొదటిరోజునుంచీ నోట్లరద్దుపై విపక్షాలు చేస్తున్న ఆందోళనకు మంగళవారం అన్నాడీఎంకే సభ్యులూ జతచేరారు. విపక్ష సభ్యులు వెల్‌చుట్టూ చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘అమ్మా మీరు మా మాట కూడా వినాలి’అని ఖర్గే వ్యాఖ్యానించగా.. ‘తల్లి తన పిల్లలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది’అని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఆందోళన కొనసాగుతుండగానే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించి సభను వారుుదా వేశారు. కాగా, నోట్లరద్దుపై పార్లమెంటు లో అవసరాన్ని బట్టి ప్రధాని మాట్లాడతారని కేంద్ర మంత్రి వెంకయ్య మీడియాతో అన్నారు. నోట్ల రద్దుపై మూకుమ్మడిగా దాడిచేస్తున్న విపక్షాలు.. బుధవారం పార్లమెంటు ఆవరణలో ధర్నా చేయాలని నిర్ణరుుంచాయి. మన్మోహన్ పాఠాలు చెప్పుకోవచ్చు పంజాబ్ వర్సిటీలో ఆతిథ్య ఉపాధ్యాయుడిగా చేరటం వల్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దుచేయలేమని, ఈ అంశంపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. జూలైలో పంజాబ్ వర్సిటీ.. మాజీ ప్రధాని మన్మోహన్‌కు ‘జవహార్‌లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్షిప్’ అందుకోవాలని కోరింది. -
అమ్మ కోలుకోవాలని..
-
అమ్మ కోలుకోవాలని..
- తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో అన్నాడీఎంకే శ్రేణుల విశిష్ట పూజలు - మదురైలో పాల బిందెలతో 50 వేల మంది ఊరేగింపు - జయ కోలుకుంటున్నారు: కేంద్ర మంత్రి వెంకయ్య సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ ఆదివారం తమిళనాడు వ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు విశిష్ట పూజలు చేశారు. ప్రత్యేక వ్రతాన్ని పాటించి, పాల బిందెలతో వేలాది మంది ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి దేవతలకు అభిషేకాలు నిర్వహించారు. చర్చిల్లో కొవ్వొత్తులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మదురైలో జయ పేరవై, అన్నాడీఎంకే జిల్లా పార్టీ నేతృత్వంలో యాభై వేల మందితో పాల బిందెల ఊరేగింపు నిర్వహించారు. ఇందులో 25 వేల మంది మహిళలు పాల్గొన్నారు. వారంతా వ్రతదీక్షతో తిరుప్పరగుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయానికి పాలబిందెలతో వెళ్లి అమ్మవారు, స్వామివార్లకు అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. అమ్మ ఆరోగ్యంగా ప్రజల్లోకి రావాలని దేవుళ్లని వేడుకున్నారు. పూజల్లో మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాలుపంచుకొన్నారు. చెన్నై అపోలో ఆసుపత్రికి వచ్చే అన్నాడీఎంకే వర్గాలు పట్టణంలో తమకు నచ్చిన ఆలయాలకు వెళ్లి అమ్మ కోసం పూజలు నిర్వహించేవారికోసం ఒక ఆటో డ్రైవర్ ఉచితంగా ఆటో నడుపుతున్నాడు. జయలలిత చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద మహిళలు చేతిలో కర్పూరం వెలిగించుకుని అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కేకే నగర్లో ధన్వంతరి ఆయుష్షు యాగం నిర్వహించారు. వదంతులు సరికాదు: వెంకయ్య సీఎం జయలలిత ఆరోగ్యంపై వదంతులు మంచి పద్ధతి కాదని కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ఆయన అపోలో ఆస్పత్రికివెళ్లి జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత కోలుకుంటున్నట్లు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఉదయం పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి కూడా అపోలో ఆస్పత్రికి వెళ్లి జయలలిత ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సీపీఐ ఎంపీ రాజాలతో పాటు పలువురు నేతలు ఆస్పత్రిలో జయ ఆరోగ్యంపై ఆరాతీశారు. జయ ఆరోగ్యవంతురాలుగా మళ్లీ ప్రజాసేవకు అంకితం కావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు వారు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆపద్ధర్మ సీఎంను నియమించాలి: స్టాలిన్ పద్దెనిమిది రోజులుగా సీఎం జయలలిత ఆస్పత్రిలోనే ఉండటంతో పాలన కుంటుపడిందని, ఆపద్ధర్మ సీఎం లేదా కొత్త సీఎంను నియమించి పాలనను గాడిలో పెట్టాలని ప్రధాన ప్రతి పక్ష నేత, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. మరికొన్నాళ్లు జయ ఆస్పత్రిలోనే ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ స్పందిస్తూ.. ఇన్చార్జి సీఎం నియామకం అనవసరమన్నారు. రాష్ట్రపతి పాలన విధించాలని సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేయడంపై మనిదయ నేయమక్కల్ కట్చి నేత జవహరుల్లా మండిపడ్డారు. కాగా, సీనియర్ మంత్రి పన్నీరు సెల్వంతో పాటు మరి కొందరు అపోలో ఆసుపత్రికే పరిమితమవుతున్నారు. అపోలో నుంచి ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్, సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావుల ఆదేశాలతో అధికారులు విధులు నిర్వహిస్తున్నాయి. ఆపద్ధర్మం అవసరం లేదు: అన్నాడీఎంకే జయలలిత కోలుకుంటున్నందున ఆపద్ధర్మ సీఎం అవసరం లేదని అన్నాడీఎంకే ఆదివార ం నిర్ణయించింది.దీనిపై విపక్షాలు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో అన్నాడీఎంకే అత్యున్నతస్థాయి సమావేశాన్ని జరిపినట్లు సమాచారం. సీఎం కోలుకుంటున్నందున కేబినెట్లో మార్పులూ అవసరం లేదని భావించారని తెలుస్తోంది. -
సాగుకు ప్రాధాన్యత ఏదీ?
‘రైతు నేస్తం’ వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి వెంకయ్య ఆవేదన - ఉత్తమ రైతులు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులకు పురస్కారాలు - సినీ, రాజకీయాలకున్న ప్రాధాన్యం వ్యవసాయానికి లేదని వ్యాఖ్య - ‘సాక్షి’ సాగుబడికి రైతు నేస్తం అవార్డు బహూకరణ సాక్షి, హైదరాబాద్: సినిమాలు, రాజకీయాలకు ఉన్నంత ప్రాధాన్యం వ్యవసాయానికి లేదని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసారశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సినిమా తాత్కాలికమని... వ్యవసాయమే శాశ్వతమని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు వ్యవసాయ రంగంపై మీడియా దృష్టిపెట్టాలని సూచించారు. రైతు నేస్తం పత్రిక వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ రైతులు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులకు ఆయన పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ సరైన పంట దిగుబడులు రాక, ప్రకృతి అనుకూలించక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లాభసాటిగా లేనందువల్ల వ్యవసాయం అంతరించి పోతోందని... రైతులు వ్యవసాయాన్ని వదిలేసి ఇతర రంగాలవైపు వెళ్లిపోతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగం లాభసాటిగా మారాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దిగుబడులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించాలని యోచిస్తున్నామని వెంకయ్య తెలిపారు. వ్యవసాయానికి 10 గంటల నాణ్యమైన విద్యుత్ అవసరమని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మించి ప్రధాన రహదారులకు అనుసంధానించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ రైతులకు మరింత సులభతరమవుతుందన్నారు. ఇందులో భాగంగానే కేంద్రం 2019 నాటికి 65 వేల నివాస ప్రాంతాలకు రహదారుల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ. 19 వేల కోట్లను ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించిందన్నారు. ప్రస్తుతం దేశంలో యూరియా కొరత లేదని... వేపపూత యూరియా అందుబాటులోకి తేవడం వల్ల కొరతను నివారించగలిగామన్నారు. దీనదయాళ్ ఉపధ్యాయ గ్రామజ్యోతి యోజన కింద 2018 మే 1కల్లా మిగిలిన 18,452 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కేసీఆర్ తెలుగులోనే మాట్లాడతారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని వెంక య్య ప్రశంసించారు. చాలా మందికి ఇంగ్లిష్ జబ్బు పట్టుకుందని...అందువల్ల తెలుగు అంతరిస్తోందన్నారు. అయితే కేసీఆర్ తెలుగులోనే మాట్లాడతారని కితాబిచ్చారు. తెలంగాణ మాండలికాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయినా భాష ఒక్కటేనన్నారు. రాష్టంలో 44 మార్కెట్ యార్డుల్లో ఈ-మార్కెటింగ్ అమలు చేస్తున్నామని... వచ్చే ఏడాది అన్ని యార్డుల్లోనూ అమలు చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైతుల ఇబ్బందులను గమనించే ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువులు బాగు చేస్తున్నామన్నారు. రైతులకు ‘సాక్షి’ సేవలు భేష్ రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలోనూ... వ్యవసాయ కథనాల ద్వారా ‘సాక్షి’ సాగుబడి ఎన్నో సేవలు అందిస్తోందని నిర్వాహకులు కొనియాడారు. అందుకే రైతు నేస్తం అవార్డుకు ‘సాక్షి’ సాగుబడిని ఎంపిక చేశామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య, మంత్రి హరీశ్‌రావుల చేతుల మీదుగా అవార్డు, జ్ఞాపికను సాక్షి సాగుబడి తరఫున డెస్క్ ఇన్చార్జి పంతంగి రాంబాబు అందుకున్నారు. మాజీ ఎంపీ యలమంచిలి శివాజీకి జీవన సాఫల్య పురస్కారాన్ని, మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డికి విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డెరైక్ట ర్ డాక్టర్ కేశవులు, వెంకట రామన్నగూడెం ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎ.సుజాత, రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ కె.కొండల్‌రెడ్డి తదితరులకు పురస్కారాలు అందించారు. -
హోదా కాదు..అంతకుమించిందే!
కేంద్ర మంత్రి వెంకయ్య వ్యాఖ్య సాక్షి, చెన్నై: ప్రత్యేక హోదాను మించిన సాయం ఆంధ్రప్రదేశ్‌కు అందించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నామని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. పీఐబీ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన ప్రాంతీయ సంపాదకుల సదస్సులో శుక్రవా రం రెండోరోజు ‘తిరంగా యాత్ర’ వీడియోను ఆయన విడుదల చేశారు. దీని రూపకల్పనకు గజల్స్ శ్రీనివాస్‌తోపాటు పలువురు శ్రమించారని, వీటిని అన్ని టీవీ చానళ్లు ప్రసారం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు తెలుగు మీడియా సంపాదకులతో ఆయన ఇష్టాగోష్టిలో పలు అంశాలపై మాట్లాడారు. ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా అని నినదిస్తున్నారని, దాని వల్ల ప్రయోజనం ఏపాటిదో ఇది వరకు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాల్లోకి వెళ్లి చూస్తే తెలుస్తుందని చెప్పారు. హోదా అంశాన్ని విభజన సమయంలోనే తేల్చి ఉండాల్సిం దని, కేవలం నోటి మాటతో సరిపెట్టారని యూపీఏ సర్కారుపై మండిపడ్డారు. ఒత్తిడి పెరుగుతున్న దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నినాదాన్ని అందుకుందని వెంక య్య వ్యాఖ్యానించారు. రోడ్డుకు అడ్డంగా ఆలయాలు, మసీదులు... ఇలా ఏ నిర్మాణా లు ఉన్నా వాటిని పడగొట్టాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్ని పట్టించుకోదలచుకోలేదన్నారు. సమయానుగుణంగా స్పందిస్తాననన్నారు. -
ఏపీలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం
కేంద్రమంత్రి వెంకయ్య వెల్లడి ఉంగుటూరు: ఏపీలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు.ఈమేరకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు వివరించారు. విజయవాడ చాప్టర్ ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఏపీలో 77 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. రైల్వే జోన్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేస్తూ, విభజన చట్టంలోని 35 అంశాలను త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు.విశాఖలో 200 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వెంకయ్యతో సుజనా రహస్య మంతనాలు: మారిషస్ బ్యాంకు రుణాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి సుజనాచౌదరి శనివారం వెంకయ్యనాయుడిని కలసి రహస్య మంతనాలు జరిపారు. అరెస్టు నుంచి బయటపడేందుకే ఈ మంతనాలు జరిపినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ట్రస్ట్‌లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నా హాజరుకాకపోవడంతోపాటు మీడియాకు కూడా కనిపించకుండా వెళ్లడం గమనార్హం! -
భావప్రకటనా స్వేచ్ఛ మీకేనా?: నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ బీజేపీకో, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికో పరిమితం కాదని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ ధ్వజమెత్తారు. వర్సిటీల ప్రాంగణాల్లో రాజకీయం వద్దని చెబుతున్న వెంకయ్య తన గతాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే భావప్రకటన అంటే ‘అదేదో వారి గుత్తసొత్తు’గా ఉన్నట్టు అర్థమవుతుందని విమర్శించారు. కన్హయ్యను చూస్తే బెదురెందుకు?: రామకృష్ణ సాక్షి, విజయవాడ బ్యూరో: కేంద్రంలో అధికారం ఉందని విర్రవీగుతున్న బీజేపీకి జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యను చూస్తే భయమెందుకని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. కమ్యూనిజంలో నిజాలు లేవని, వారి గురించి మాట్లాడడం అనవసరమని రెండు రోజుల క్రితం విజయవాడ సభలో వెంకయ్య వ్యాఖ్యానించడాన్ని రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తప్పుబట్టారు. కన్హయ్యకుమార్ సభలను చూసి జడిసి, సిద్ధార్థ అకాడమీలో సభకు అనుమతిని వెంకయ్య రద్దు చేయించారన్నారు. -
అభివృద్ధే నా ఊపిరి!
పక్కదారి పట్టించేందుకు విపక్షం కుట్ర ♦ వ్యతిరేక రాజకీయ వ్యూహంలో చిక్కుకోవద్దు ♦ బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ ముగింపు కార్యక్రమంలో మోదీ ♦ భావ ప్రకటన స్వేచ్ఛ, జాతీయవాదాన్ని విడదీసి చూడలేం: జైట్లీ న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని అభివృద్ధి మార్గం నుంచి పక్కదారి పట్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఢిల్లీలో ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘వికాస్, వికాస్, వికాస్.. ఇదే నా ఏకైక లక్ష్యం. మన దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఇదొక్కటే మంత్రం. మన లక్ష్యంపైనే దృష్టి పెడదాం. విపక్షాల వ్యతిరేక రాజకీయాల ఉచ్చులో పడొద్దు. కార్యకర్తలంతా సృజనాత్మకంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా పల్లెల వరకు చేరుకోవాలి. మనం వెళ్తున్న దారినుంచి పక్కకు తప్పించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి.. మన పార్టీ సభ్యులంతా వీటి ప్రభావానికి లోనుకాకుండా అభివృద్ధి దిశగా మన లక్ష్యాన్నే మనసులో పెట్టుకోవాలి’ అని అన్నారు. సమావేశ వివరాలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాకు వెల్లడించారు. ‘గ్రామాలకు వెలుగులు అందించాలనే లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నాం. 65 ఏళ్లుగా చీకట్లో ఉన్న దేశానికి వెలుగులిచ్చాం. 22 నెలల పాలనలో ఎక్కడా అవినీతి మరకల్లేవు. ‘బేటీ బచావ్-బేటీ పఢావ్’ వంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ విషయాలను ప్రతి బీజేపీ కార్యకర్త బాధ్యతగా గ్రామాలవరకు తీసుకెళ్లాలని ప్రధాని తెలిపారు’ అని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపైనే బీజేపీ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆదివారం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. ‘జాతీయవాదం, భావప్రకటన స్వేచ్ఛ ఒకదానితో మరొకటి సమ్మిళితమై ఉంటాయి’ అని అన్నారు. విభేదించే హక్కుందని.. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఏ విషయాన్ని సహించమని ఆయన తెలిపారు. ‘భారత్ మాతాకీ జై’ నినాదంపై జరుగుతున్న వివాదాన్ని పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదన్న జైట్లీ.. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా ఈడెన్ గార్డెన్స్‌లో ఈ నినాదమే మార్మోగిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు సరైన దిశానిర్దేశం లేకుండా పాలన సాగించాయని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతమైన నాయకత్వంలో ప్రగతిశీల పాలన, జాతీయవాద విధానాలతో ముందుకెళ్తోందని జైట్లీ వెల్లడించారు. నాలుగురాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించినట్లు మంత్రి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలతో కుదుర్చుకుంటున్న పొత్తులతో కాంగ్రెస్ పార్టీ తన ప్రతిష్ట తగ్గించుకుందన్నారు. మోదీ.. దేవుడిచ్చిన వరం: వెంకయ్య అంతకుముందు రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి వెంకయ్య.. ‘ప్రధాన మంత్రి మోదీ భారత దేశానికి దేవుడిచ్చిన వరం. పేదల పాలిట భగవంతుడు’ అని ప్రశంసించారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో ఆయన జన్మస్థలానికి ప్రధాని వెళ్తారని పార్టీ ప్రకటించింది. -
రియల్ ఎస్టేట్ బిల్లును గట్టెక్కిస్తాం
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లోనే రియల్ ఎస్టేట్ బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య వ్యక్తం చేశారు. ఈ బిల్లును పార్లమెంటరీ స్ధాయీ సంఘం, సెలెక్ట్ కమిటీలు పరిశీలించి నివేదిక లు అందజేశాయని విలేకరులతో చెప్పారు. జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా కేంద్ర సాయాన్ని అందుకోవడంలో రాష్ట్రాల జాప్యంపై ఆవేదనచెందారు. ప్రణాళిక, వాటి అమలు సామర్థ్యాలను రాష్ట్రాలు పెంపొందించుకోవాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, అటల్ మిషన్, స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్ కింద కేంద్రం హామీ ఇచ్చిన విధంగా నిధులను అందిస్తామని, రాష్ట్రాలు కేంద్రం అందించిన నిధులను త్వరగా ఖర్చుచేసి, మరిన్ని నిధుల కోసం కోరాలని సూచించారు. -
'మోదీ వద్ద అల్లావుద్దీన్ దీపం లేదు'
జూన్ 25 కల్లా ‘స్మార్ట్ సిటీ’ పని మొదలవ్వాలి: వెంకయ్య న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపికయిన 20 నగరాలూ.. జూన్ 25వ తేదీ కల్లా ప్రాజెక్టు పనిని ప్రారంభించాలని కేంద్ర మంత్రి వెంకయ్య కోరారు. ఆ రోజు కల్లా ఈ ప్రాజెక్టు మొదలు పెట్టి ఏడాది పూర్తవుతున్న విషయం తెలిసిందే. ‘ఇండియా స్మార్ట్ సిటీ మిషన్ : తదుపరి చర్యలు’ అనే అంశంపై ఢిల్లీలో జరిగిన ఒక వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.. బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా వరకూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపిక కాలేదన్న విషయాన్ని ఉదహరిస్తూ.. ఈ ఎంపికలో ఎటువంటి రాజకీయాలూ లేవన్నారు. ‘‘ప్రతి నగరాన్నీ స్మార్ట్ సిటీగా మార్చటానికి ప్రధాని దగ్గర అల్లావుద్దీన్ దీపం లేదు. ’’ అని అన్నారు. ప్రజలు పాలనాయంత్రాంగానికి సహకరించకపోతే ఒక నగరం స్మార్ట్ సిటీగా ఎలా అవుతుందంటూ.. ఈ ప్రాజెక్టు విజయవంతం కావటానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు వినియోగించటానికి వీలులేదని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమానికి.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపికైన 20 నగరాలు, ఫాస్ట్ ట్రాక్ పోటీలో పాల్గొంటున్న 23 నగరాలు గల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు పాల్గొన్నారు. -
రూ.10 లక్షల ఆదాయం ఉంటే గ్యాస్ సబ్సిడీ కట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏడాదికి రూ.10 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని నిలిపివేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. సాధ్యాసాధ్యాలపై చర్చించి.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. ‘‘దేశంలో లక్షల సంఖ్యలో అక్రమ గ్యాస్ కనెక్షన్లున్నాయి. వారందరికీ అక్రమంగా గ్యాస్ సబ్సిడీ అందుతోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఈ విషయాన్ని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గుర్తించింది. అందుకే అక్రమంగా సబ్సిడీని పొందుతున్న వారితో పాటుగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, కార్పొరేట్ దిగ్గజాలకూ సబ్సిడీని నిలిపివేయనున్నాం’’ అని వెంకయ్య వివరించారు. ఇప్పటికే దేశంలో 30 లక్షల మంది తమంతట తాము గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారని వెంకయ్య నాయుడు చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీఏపీసీసీఐ) ఆధ్వర్యంలో శనివార ం ఇక్కడ ఎఫ్టీఏపీసీసీఐ ఎక్స్‌లెన్స్ అవార్డులు, సర్టిఫికెట్ల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... దేశ ప్రగతిలో కీలకభూమిక పోషిస్తున్న వ్యవసాయ రంగాన్ని, అన్నదాతలను ఆదుకునేందుకు ఎరువులకు కూడా నగదు రూపంలో సబ్సిడీని అందించనున్నట్లు వెల్లడించారు. గ్యాస్ సబ్సిడీ తరహాలోనే ఎరువుల సబ్సిడీని కూడా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి వేస్తామని తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాలది కీలకపాత్ర అంటూ... ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు. మొత్తం దేశ జీడీపీలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల వాటా 8.17 శాతంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి భారత్ వైపు ఉందన్నారు. ‘‘చైనా, యూరప్, అమెరికా దేశాలు ఆర్థికమాంద్యంలో ఉన్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే రైల్వే, రిటైల్, నిర్మాణం, రక్షణ వంటి 15 రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించాం. దీంతో వివిధ ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తరలి వస్తాయి’’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీఏపీసీసీఐ అధ్యక్షులు అనిల్ రెడ్డి వెన్నం, ఉపాధ్యక్షులు గౌర శ్రీనివాస్, అవార్డు కమిటీ చైర్మన్ శేఖర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలు వీరే హిందుస్తాన్ ఏరోనాటికల్స్ (పారిశ్రామిక ఉత్పాదన), ఏజీఐ గ్లాస్‌ప్యాక్ (ఆల్‌రౌండ్ పనితీరు), గుబ్బా కోల్డ్ స్టోరేజ్ లి. (వ్యవసాయాధారిత పరిశ్రమ), మెటల్క్రాఫ్ట్ రోల్ ఫార్మింగ్ ఇండస్ట్రీస్ (మార్కెటింగ్ ప్రణాళికలు), టాటా కాఫీ లి. (ఎగుమతుల పనితీరు), కోస్టల్ కార్పొరేషన్ (ఎగుమతుల పనితీరు (చిన్న తరహా), ప్రీమియర్ సోలార్ సిస్టమ్స్ (సంప్రదాయేతర), బీహెచ్ఈఎల్ (ఉద్యోగుల సంక్షేమం),కేసీపీ షుగర్ అండ్ ఇండస్ట్రీ కార్పొరే షన్(కార్పొరేట్ సామాజిక బాధ్యత), ఫస్ట్ఆబ్జెక్ట్ టెక్నాలజీస్ (వినూత్న ఉత్పాదన), కాల్టెక్ ఇంజనీరింగ్ (వినూత్న ఉత్పాదన (చిన్నతరహా), రెయిన్ బో స్త్రీ, పిల్లల ఆసుపత్రి (ఆరోగ్య సేవలు), నిమ్రా కేర్గ్లాస్ టెక్నిక్స్ (పరిశోధన, అభివృద్ధి (చిన్నతరహా), సీటీఆర్ఎల్ డేటా సెంటర్స్ (ఐటీ కంపెనీ), తెలంగాణ, ఏపీ పర్యాటక అభివృద్ధి శాఖలు (టూరిజం ప్రమోషన్), మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య (కోవె) (ఉత్తమ అసోసియేషన్), డీఆర్డీవో ‘హెచ్’ ప్రొగ్రామ్ డెరైక్టర్ అదాలత్ అలీ (శాస్త్రవేత్త / ఇంజనీర్). -
లాభసాటిగా వ్యవసాయం
రైతులతో ఇష్టాగోష్టిలో కేంద్ర మంత్రి వెంకయ్య హైదరాబాద్: డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని, టీచర్ కొడుకు టీచర్ కావాలని కోరుకుంటున్నా ప్రస్తుత పరిస్థితుల్లో రైతు కొడుకు మాత్రం రైతు కావాలని కోరుకోవట్లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుద్దామని అన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘రైతు సమస్యలపై ఇష్టాగోష్టి’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ వ్యవసాయ పనులు ఉన్న సమయాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలన్న రైతుల విజ్ఞప్తిని పరిశీలిస్తామన్నారు. అవసరమైతే 100 రోజులున్న పనులను మరో 20 రోజులు పెంచి అయినా రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ బీమా కల్పించాలి రైతులకు వ్యవసాయ బీమా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. బీమా ప్రీమియంపై కొంత కేంద్రం, మరి కొంత రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తూ కొంత రైతు కట్టుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు నెలకు రూపాయి చొప్పున చెల్లిస్తే రూ. 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని, రోజుకు 90 పైసలు చెల్లిస్తే జీవిత బీమా కింద రూ. 2 లక్షలు వస్తుందన్నారు. అగ్రి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తే వ్యవసాయానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రాంతీయ భాషల్లో కిసాన్ చానల్ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రసారం చేసే కిసాన్ టీవీ చానల్ ప్రస్తుతం హిందీలో వస్తోందని, దానిని ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనివల్ల కొంత మేర అయినా రైతులు వారి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకుంటారన్నారు. అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించినప్పుడే మంచి దిగుబడి వస్తుందన్నారు.