
ఏపీలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం
కేంద్రమంత్రి వెంకయ్య వెల్లడి
ఉంగుటూరు: ఏపీలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు.ఈమేరకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు వివరించారు. విజయవాడ చాప్టర్ ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఏపీలో 77 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. రైల్వే జోన్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేస్తూ, విభజన చట్టంలోని 35 అంశాలను త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు.విశాఖలో 200 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
వెంకయ్యతో సుజనా రహస్య మంతనాలు: మారిషస్ బ్యాంకు రుణాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి సుజనాచౌదరి శనివారం వెంకయ్యనాయుడిని కలసి రహస్య మంతనాలు జరిపారు. అరెస్టు నుంచి బయటపడేందుకే ఈ మంతనాలు జరిపినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ట్రస్ట్‌లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నా హాజరుకాకపోవడంతోపాటు మీడియాకు కూడా కనిపించకుండా వెళ్లడం గమనార్హం!