వైర్‌లెస్ కాలనీలో జోన్ హెడ్‌క్వార్టర్స్ నిర్మాణ మ్యాప్‌ను పరిశీలిస్తున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వీకే త్రిపాఠి
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో విశాఖలో ఘనంగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తీపి కబురు అందింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణానికి రైల్వే బోర్డు నుంచి గురువారం అనుమతులు మంజూరయినట్లు రైల్వే మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని మోదీ విశాఖలో పర్యటిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన విశాఖ వచ్చారు.
జోన్‌కు అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో రైల్వే బోర్డ్ చైర్మన్, సీఈవో వీకే త్రిపాఠీ సైతం కేంద్ర మంత్రితో విశాఖ చేరుకున్నారు. వారికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ రూప్ నారాయణ్, వాల్తేరు డీఆర్‌ఎం అనూప్ కుమార్ శ్రీవాత్సవ స్వాగతం పలికారు. అనంతరం కొత్తగా జోనల్ ప్రధాన కార్యాలయం నిర్మించనున్న వైర్ లెస్ కాలనీని మంత్రి శుక్రవారం రాత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ వైర్‌లెస్ కాలనీలో ప్రతిపాదిత ఎస్‌సిఓఆర్ జోనల్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.106 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని, ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.
చదవండి: మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్.. ఇదీ మన ఘనత
Comments
Please login to add a commentAdd a comment