Minister Sushma Swaraj
-
పాక్ అదుపులో ఉన్న ఉత్తరాంధ్ర జాలర్లను విడిపించండి
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ అదుపులో ఉన్న 20 మంది ఉత్తరాంధ్ర జాలర్లను విడిపించాలని కోరుతూ కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ విన్నవించింది. ఈమేరకు పార్టీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. వీరితో పాటు జాలర్ల కుటుంబ సభ్యుడు బర్రి కామయ్య, వైఎస్సార్ సీపీ నేతలు వాసుపల్లి అప్పన్న, పతివాడ అప్పలనాయుడు కూడా ఉన్నారు. ఆందోళనలో ఉన్న జాలర్ల కుటుంబాలకు ఊరట కలిగించాలని మంత్రికి విన్నవించారు. -
ట్విటర్ వేదికగా సాయం చేసిన మంత్రి
లక్నో, ఉత్తరప్రదేశ్ : కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. ట్విటర్ వేదికగా సాయం కోరితే వెంటనే స్పందిస్తారు. ఇందకు నిదర్శనంగా లక్నోలో మరో సంఘటన జరిగింది. మతాంతర వివాహం చేసుకున్న కారణంగా ఓ జంటకు పాస్‌పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించారు లక్నో పాస్‌పోర్ట్ అధికారులు. అంతేకాక అన్య మతస్తున్ని పెళ్లి చేసుకున్నందుకు సదరు మహిళను తీవ్రంగా అవమానించారు. దాంతో తమకు సాయం చేయండంటూ ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. వీరి అభ్యర్ధనకు స్పందించిన సుష్మా స్వరాజ్ వీరికి పాస్ పోర్టు వచ్చేలా చేసారు. వివరాల ప్రకారం...నోయిడాకు చెందిన తన్వి సేత్ అనే మహిళ ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. బుధవారం తన్వి కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవడానికి స్థానిక పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లింది. అయితే అక్కడ వికాస్ మిశ్రా అనే అధికారి తాను ముస్లింను వివాహం చేసుకున్నానే కారణంతో తనతో అవమానకరంగా ప్రవర్తించాడని తెలిపింది తన్వి. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా సుష్మా స్వరాజ్‌కు వివరించింది. ఈ విషయం గురించి తన్వి ‘సుష్మా మేడమ్.. పాస్‌పోర్ట్ కార్యాలయంలోని అధికారులు ప్రజల పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారని నేను అసలు ఊహించలేదు. నేను ముస్లింని పెళ్లి చేసుకున్నానని ఓ అధికారి నన్ను అవమానించాడు. అంతేకాక మా ఇద్దరిలో ఎవరో ఒకర్ని పేరు మార్చుకోవాలని అంటున్నాడు. అందరు చూస్తుండగానే నా మీద కేకలు వేసాడు. ఇంతటి అవమానాన్ని నా జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలేదు. ప్రస్తుతం అతడు నా పాస్‌పోర్ట్‌తో పాటు నా భర్త పాస్‌పోర్ట్‌ను కూడా హోల్డ్‌లో పెట్టాడు. అతని ప్రవర్తన చూసి షాకయ్యా. నాకు వివాహం అయ్యి 12 ఏళ్ల అవుతుంది. ఇప్పటికి నా సర్టిఫికెట్లలో నా పేరు తన్వీ సేత్గానే ఉంది. పెళ్లి తర్వాత ఆడవాళ్లు పేరు మార్చుకోవాలనే నియమం ఎక్కడ లేదు. అయినా ఏ పేరు పెట్టుకోవాలన్నది నా వ్యక్తిగత విషయం. ఇది మా కుటుంబానికి సంబంధించినది. మాకు పాస్‌పోర్ట్ వచ్చేలా సాయం చేయండి’ అని ట్వీట్ చేసింది. దీనిపై సుష్మా స్పందించారు. ఈ కేసును పీయూష్ వర్మ అనే పాస్‌పోర్ట్ అధికారికి అప్పగించి తన్వి దంపతులకు పాస్‌పోర్ట్ వచ్చేలా చేసారు. అంతేకాక తన్వి దంపతుల పట్ల అవమానకరంగా ప్రవర్తించిన అధికారిని బదిలీ చేశారు. -
యుద్ధం పరిష్కారం కాదు!
♦ భారత్ ఓపికగా, నియంత్రణతో ముందుకెళ్తోంది ♦ ఉగ్రవాదం వీడితేనే పాక్‌తో చర్చలు ♦ చైనాతో ఉద్రిక్తతలపై సుష్మాస్వరాజ్.. న్యూఢిల్లీ: చైనాతో నెలకొన్న సరిహద్దు సమస్యకు చర్చలే ఏకైక పరిష్కార మార్గమని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం పార్లమెంటులో వెల్లడించారు. ఈ సమస్య పరిష్కారంలో భారత్ చాలా ఓపికగా వ్యవహరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. డోక్లామ్ సరిహద్దు సమస్యతోపాటుగా ఎన్ఎస్జీలో భారత సభ్యత్వం, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై ఐరాస ఆంక్షల విషయాల్లోనూ చైనాతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని సుష్మ తెలిపారు. భారత విదేశాంగ విధానం, వ్యూహాత్మక భాగస్వాములతో వ్యవహరిస్తున్న విధానం అనే అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ‘ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు ఓపిక, నియంత్రణ కీలకం. అందుకే మనం ఓపికగా ఉంటూ మాటల్లో నియంత్రణ పాటిస్తున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు. డోక్లాం వివాదంపై నెలరోజులుగా అనుసరించిన తీరును మంత్రి సభకు వివరించారు. ‘ప్రతి సమస్యకు యుద్ధమే పరిష్కారం కాదు. అందుకే నేర్పుతో దౌత్యపరంగా సమస్య పరిష్కారం కావాలి’ అని సుష్మ వెల్లడించారు. ఉగ్రవాదం వీడితేనే.. ఉగ్రవాదానికి ముగింపు పలికినపుడే పాకిస్తాన్‌తో చర్చలు ప్రారంభమవుతాయని కూడా సుష్మ స్పష్టం చేశారు. ‘ఒకవైపు నుంచే చర్చలు జరగాలని కోరుకోవటం సరికాదు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి జరగవు. వారు (పాక్) ఉగ్రవాదానికి సాయం చేయటం ఆపినపుడే.. మనం చర్చలు ప్రారంభిస్తాం’ అని స్పష్టం చేశారు. మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా సార్క్దేశాధినేతలను ఆహ్వానించిన విషయాన్ని సుష్మ గుర్తుచేశారు. పాక్ సహా పొరుగుదేశాలన్నింటితో సత్సంబంధాల కోసమే తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కాగా, చైనాతో సరిహద్దుపై వివాదం జరుగుతుంటే రాహుల్‌గాంధీ చైనా దౌత్యవేత్తతో సమావేశమవటంపై సుష్మ మండిపడ్డారు. ‘ముందుగా మీరు (కాంగ్రెస్) మన ప్రభుత్వం నుంచి వివరాలు తీసుకున్నాక చైనా అధికారిని కలవాల్సింది’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా, ఓబీఓఆర్‌పై కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని రాజ్యసభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. ‘చిట్‌ఫండ్’లపై చట్టం సిద్ధమవుతోంది: జైట్లీ చిట్‌ఫండ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రజలను కాపాడేందుకు తీసుకొస్తున్న చట్టం ముసాయిదా సిద్ధమవుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. లోక్‌సభలో బ్యాంకింగ్ నియంత్రణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రమాదపుటంచున 100 వంతెనలు: గడ్కారీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో 100కుపైగా వంతెనలు ప్రమాదపుటంచున ఉన్నాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. వీటిపై అత్యవసరంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని లోక్‌సభలో మంత్రి వెల్లడించారు. వీటి భద్రతను పెంచేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారన్నారు. ‘దేశంలోని మొత్తం లక్షా60వేల వంతెనల భద్రతాప్రమాణాలను అధికారులు తనిఖీ చేశారు. అందులో 100 పైగా వంతెనలు బలహీన స్థితిలో ఉన్నాయి. అవి ఎప్పుడైనా కూలిపోవచ్చు’ అని చెప్పా రు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థలో రూ. 7.5 కోట్ల స్కాంపై విచారణ జరుపుతామన్నారు. -
పాక్ నుంచి తిరిగొచ్చిన సూఫీ గురువులు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి అదృశ్యమైన ఇద్దరు సూఫీ గురువులు సోమవారం ఢిల్లీకి క్షేమంగా తిరిగొచ్చారు. హజ్రత్ నిజాముద్దీన్ దర్గా ప్రధాన గురువు సయ్యద్ ఆసిఫ్ నిజామీ, ఆయన మేనల్లుడు నాజిమ్ అలీ నిజామీ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చి ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. అయితే వారు పాక్‌లో ఎలా అదృశ్యమైంది పూర్తిగా వివరించలేదు. భారత నిఘా సంస్థ ‘రా’తో సంబంధాలు ఉన్నందువల్లే పాక్‌లో నిర్బంధించారనే వార్తలను వారు ఖండించారు. అయితే తమను పాక్ సిబ్బంది నిర్బంధించడం నిజమేనని అం గీకరించారు. తమ నిర్బంధంలో ఐఎస్ఐ పాత్రపై కూడా వారు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఈ సందర్భంగా వారు మంత్రి సుష్మా స్వరాజ్‌కు, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శాంతిని, ప్రేమను ప్రబోధించడానికే పాక్‌కు వెళ్లామని, అక్కడ కొందరికి తమ బోధనలు రుచించలేదని చెప్పారు. తాము మళ్లీ వెళ్తామని ప్రకటించారు. తమను వెనక్కి పంపిన పాక్ ప్రభుత్వానికి కూడా వారు ధన్యవాదాలు తెలిపారు. నిజాముద్దీన్ దర్గాలో వీరికి ఘనస్వాగతం పలికారు. వీరి ద్దరూ 90ఏళ్ల వయసుండే ఆసిఫ్ సోదరిని చూడటానికి ఈనెల 8న లాహోర్‌కు వెళ్లిన తర్వాత వారి సమాచారం తెలియకుండా పోయిన సంగతి తెలిసిందే. -
బిటిష్ వీసా నిబంధనల సడలింపునకు కృషి
ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ వీసా నిబంధనలను సరళతరం చేయించేందుకు భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఈ మేరకు బ్రిటన్‌తో సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె గురువారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వీసా నిబంధనలను సరళతరం చేస్తే భారత్–బ్రిటన్ ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అక్కడి ప్రభుత్వానికి సూచించినట్లు వివరించారు. ఏపీలో 1,95,022, తెలంగాణలో 82,023 ఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి గృహ నిర్మాణానికిగాను ఏపీలో 112, తెలంగాణలో 145 ప్రాజెక్టులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయని కేంద్ర గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖమంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్ వెల్లడించారు. ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో.. 2022 సంవత్సరంలోపు పూర్తి చేయాల్సిన ఈ మిషన్‌లో భాగంగా ఏపీలో 1,95,022, తెలంగాణలో 82,023 ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యమని పేర్కొన్నారు. -
సౌదీ చెర నుంచి స్వదేశానికి
⇒ పదేళ్లు జైల్లో మగ్గిన దేగాం వాసి ⇒ 4న అర్ధరాత్రి విడుదల ఆర్మూర్ అర్బన్ (ఆర్మూర్ ): సౌదీలోని ఓ వ్యక్తి మృతికి కారణమై మరణ శిక్ష పడిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన చేపూర్ లింబాద్రి శనివారం అర్ధరాత్రి విడుదలయ్యాడు. దీంతో లింబాద్రి కుటుంబ సభ్యులు ఆనందంలో ఉద్వేగానికి గురయ్యారు. వివరాలు దేగాం గ్రామానికి చెందని చేపూర్ లింబాద్రి 1995లో ఉపాధి కోసం సౌదీ దేశానికి వెళ్లాడు. ఒక రోజు తోటలో పనిచేస్తుండగా అదే దేశానికి చెందిన ఇద్దరు తండ్రీకొడుకులు తోటలో గడ్డి కోయడానికి వచ్చారు. లింబాద్రి వారించే ప్రయత్నం చేయగా విచక్షణా రహి తంగా కొట్టారు. పెనుగులాటలో కింద పడ్డ సౌదీ దేశస్తుడి తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. దీంతో లింబా ద్రిని సౌదీ ప్రభుత్వం అరెస్టు చేసి మరణ శిక్ష విధించింది. ఎంపీ కవిత చొరవతో..: గ్రామస్తులు, లింబాద్రి స్నేహితులు ఈ విషయాన్ని ఎంపీ కవిత సహాయంతో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. సుష్మాస్వరాజ్ ద్వారా సమస్యను తెలుసుకున్న ప్రధాని మోదీ సంప్రదింపులు జరపగా 10 లక్షల రియాల్స్ (రూ.కోటి 80 లక్షలు) చెల్లించాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక సౌదీ దేశస్తుడు మానవతా దృక్పథంతో ఆ సొమ్మును చెల్లించడంతో లిం బాద్రి జైలు నుంచి విడుదలయ్యాడు. ఆదివారం శంషా బాద్ ఎయిర్‌పోర్టు నుంచి స్వగ్రామం చేరుకోవడంతో భార్య లక్ష్మి, కుమార్తెలు శ్యామల, స్రవంతి, తల్లిదం డ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. -
పాస్‌పోర్టు సేవా కేంద్రం మంజూరు
అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ వరంగల్ వరంగల్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం మంజూరైంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వరంగల్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. వరంగల్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇటీవల కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. దీనికి సమాధానంగా సుష్మాస్వరాజ్ ఎంపీ కవితకు ఫిబ్రవరి 27న లేఖ రాస్తూ హన్మకొండ నక్కలగుట్టలోని హెడ్ పోస్టాఫీసులో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తపాలా శాఖతో కలిసి దేశ వ్యాప్తంగా పలు నగరాల్లోనూ పోస్టాఫీసులలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని పోస్టాఫీసు పాస్‌పోర్టు కేంద్రాలుగా పిలవనున్నారు. త్వరలోనే ఇలాంటిది హన్మకొండలో ఏర్పాటు కానుంది. -
మానస సరోవర్ యాత్ర ప్రారంభం
న్యూఢిల్లీ: ఈ ఏడాది కైలాస్ మానస సరోవర్ యాత్రను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం ఢిల్లీలో ప్రారంభించారు. మొదటి బృందం యాత్ర ప్రారంభం సందర్భంగా సుష్మా మాట్లాడుతూ... యాత్రికులు చైనాలో ప్రవేశించినప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. దాదాపు 1,430 మంది భక్తులు 25 బృందాలుగా చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న మానస సరోవర్‌ను సందర్శించుకుంటారు. వైష్ణోదేవి ఆలయం వద్ద హైఅలర్ట్ జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయ బేస్ క్యాంప్ సమీపంలో ఓ వంతెన వద్ద పోలీసులు జరిపిన తనిఖీలో ఆర్మీకి చెందిన రెండు యూనిఫాంలు, బూట్లు అనుమానస్పదంగా లభ్యమయ్యాయి. దీంతో అక్కడ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. -
కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కి మంత్రి కేటీఆర్ లేఖ
- సౌదీలో ఉద్యోగులను తొలగిస్తున్న బిన్ లాడెన్ కంపెనీ - ఇప్పటికే 50 వేల మంది విదేశీ కార్మికులను తొలగించిన కంపెనీ - కరీంనగర్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ వారీ ఇబ్బందులపై మంత్రి ఆందోళన - కంపెనీలో ఉద్యోగాలు పోయిన వారిని అదుకోవాలని వినతి - తెలంగాణకి తిరిగి వచ్చేవారికి దౌత్యపరమైన సహాయం చేయాలి - తెలంగాణకి తిరిగి వచ్చేవారిని ఆదుకుంటామని భరోసా హైదరాబాద్ : సౌదీలోని అతిపెద్ద నిర్మాణ సంస్థ బిన్ లాడెన్ గ్రూప్ నుంచి ఉద్యోగులను తొలగిస్తుండడంపైన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి శ్రీమతి సుష్మాస్వారాజ్ కి తెలంగాణ ప్రవాస భారతీయుల శాఖమంత్రి కె.తారకరామరావు మంగళవారం లేఖ రాశారు. గత ఆరు నెలలుగా బిన్ లాడెన్ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నదని, ఇప్పటికే సుమారు 50 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించినట్టు వార్తలు వస్తున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు. తెలంగాణ నుంచి సౌదీకి వెళ్లే కార్మికులు చాలావరకు నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారని, ముఖ్యంగా బిన్ లాడెన్ గ్రూప్‌లో చాలామంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. ఇప్పటికే చాలామందిని అర్ధాంతరంగా కంపెనీ యాజమాన్యం ఉద్యోగాల నుంచి తొలగించిందని, ఉద్యోగాల్లో కొనసాగతున్నవారికీ గత ఆరు నెలలుగా జీతాల చెల్లింపులు చేయడం లేదని తెలుపుతున్నారని మంత్రి కె.తారక రామారావు లేఖలో పేర్కొన్నారు. దీంతో ఇక్కడి నుండి వెళ్లిన తెలుగువారు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారని, వారి వీసాలు సైతం రద్దు కావడంతో వారి కష్టాలు మరింత ఎక్కువవుతున్నాయన్నారు. ముఖ్యంగా రియాద్, జెడ్డా, మక్కా, మదీనా, దుబాయ్ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ కార్మికుల పరిస్థితి మరింత కష్టంగా ఉందని మంత్రి లేఖలో తెలిపారు. వీసా రద్దయిన చాలామంది కార్మికులు పని లేక పస్తులుంటున్నారని లేఖలో తెలిపారు. అయితే కొంత మంది స్వదేశానికి రావాలని కోరుకుంటున్నారు, కానీ వారికి రావాల్సిన బకాయిలు వస్తేగానీ తిరిగి వెనక్కి వచ్చే పరిస్ధితి లేదన్నారు. బకాయిలు చెల్లించాలంటూ కంపెనీల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బిన్ లాడెన్ కంపెనీ వైఖరిపైన ఆగ్రహంగా ఉన్న విదేశీ కార్మికులు ధర్నాలు చేయడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో భారత కార్మికుల రక్షణ పట్ల మంత్రి అందోళన వ్యక్తం చేశారు. వారికి సంపూర్ణ రక్షణ అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సుష్మా స్వారాజ్ను కోరారు. ఇప్పటికే తెలంగాణకి పదుల సంఖ్యలో తిరిగి వస్తున్న కార్మికులకి దౌత్యపరమైన పరమైన సహాయాన్ని పెంచాల్సిందిగా మంత్రి కోరారు. కేంద్ర మంత్రితోపాటు సౌదీ రాయబారికి సైతం ఓక లేఖను రాయనున్నట్లు మంత్రి తారక రామారావు తెలిపారు. సౌదీలోని కార్మికులు ఆందోళన పడవద్దన్న మంత్రి, స్వదేశానికి తిరిగి వచ్చే కార్మికులకి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇలాంటి సమస్యను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక వ్యూహంతో పలు చర్యలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నదని తెలిపారు. -
సుష్మ ‘ముసుగు’పై విమర్శలు
న్యూఢిల్లీ: ఇరాన్ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు రౌహానీతో భేటీ సందర్భంగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తలనిండా కప్పుకున్న ఫొటోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భారత ఇంధన అవసరాల విషయంలో ఇరాన్‌ను సంతృప్తిపరిచేందుకే మంత్రి ఆ దేశ వేషాధారణలో కనిపించారని నెటిజన్లు అంటున్నారు. అయితే ఇరాన్ సాంప్రదాయం, చట్టాల ప్రకారం అక్కడ పర్యటించే వారెవరైనా తలను పూర్తిగా కప్పుకోవాల్సిందే. 2014లో స్కార్ఫ్ ధరించేందుకు యురోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రిబొనీనో నిరాకరించటంతో పర్యటన రద్దుచేసుకోవాల్సి ఉంటుందని ఇరాన్ పేర్కొంది. -
ఇరాన్ నమ్మకమైన భాగస్వామి
టెహ్రాన్: భారత ఇంధన అవసరాలు తీర్చటంలో తమ దేశం ఎప్పటికీ నమ్మకమైన భాగస్వామిగానే ఉంటుందని.. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ తెలిపారు. చమురుతోపాటు విద్య, శాస్త్ర సాంకేతిక, సంస్కృతి రంగాల్లోనూ భారత్‌తో బంధాలను మరింత బలోపేతం చేసుకుంటామన్నారు. ఇరాన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్‌తో రౌహానీతో పాటు వివిధ శాఖల మంత్రులతో భేటీ అయ్యారు. ఇంధన రంగంలో సహకారాన్ని పెంచటంతోపాటు భారత్‌తో సంబంధాలకు కీలకమైన చబహార్ పోర్టును అభివృద్ధి చేయటంపై చర్చ జరిగింది. చబహార్ పోర్టు అభివృద్ధికి రూ. వెయ్యికోట్టు), భారత్ నుంచి స్టీల్ సరఫరా కోసం రూ. 2.6వేల కోట్లు అప్పుగా ఇవ్వనున్నట్లు సుష్మ తెలిపారు. -
ఏపీలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం
కేంద్రమంత్రి వెంకయ్య వెల్లడి ఉంగుటూరు: ఏపీలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు.ఈమేరకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు వివరించారు. విజయవాడ చాప్టర్ ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఏపీలో 77 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. రైల్వే జోన్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేస్తూ, విభజన చట్టంలోని 35 అంశాలను త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు.విశాఖలో 200 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వెంకయ్యతో సుజనా రహస్య మంతనాలు: మారిషస్ బ్యాంకు రుణాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి సుజనాచౌదరి శనివారం వెంకయ్యనాయుడిని కలసి రహస్య మంతనాలు జరిపారు. అరెస్టు నుంచి బయటపడేందుకే ఈ మంతనాలు జరిపినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ట్రస్ట్‌లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నా హాజరుకాకపోవడంతోపాటు మీడియాకు కూడా కనిపించకుండా వెళ్లడం గమనార్హం! -
సమస్యను అమెరికా దృష్టికి తీసుకెళ్లాం
-
ఉగ్రవాదాన్ని ఎలా నిర్మూలిద్దాం?
చోగమ్ సదస్సులో మంతనాలు వాలెట్టా(మాల్టా): ఉగ్రవాద నిర్మూలనపై చోగమ్ కూటమి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ సహా 53 దేశాలతో కూడిన కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు(చోగమ్) శుక్రవారం మాల్టా రాజధాని వాలెట్టాలో ప్రారంభమైంది. ఉగ్రవాద నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు, త్వరలో పారిస్‌లో జరిగే వాతావరణ సదస్సులో ఒప్పందం ఖరారుకు ఎదురవుతున్న అడ్డంకుల తొలగింపుపై మంతనాలు జరిపారు. మూడు రోజులు సాగే ఈ సదస్సును బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ప్రారంభించారు. అడవుల సంరక్షణ, ఇతర రంగాల్లో కామెన్వెల్త్ దేశాల విజయాలను వివరించారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రసంగిస్తూ.. ఉగ్రవాదం ప్రపంచం ఎదుర్కొంటున్న పెనుసవాలని అన్నారు. చోగమ్ దేశాల్లో ఉగ్రవాద నిరోధానికి 50 లక్షల పౌండ్లతో(రూ. 50కోట్లు) నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాద నిర్మూలనే కామన్వెల్త్ దేశాలకు అత్యంత ప్రాధాన్య అంశంగా ఉండాలని మాల్టా ప్రధాని జోసఫ్ మస్కట్ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో భారత్ తరఫున విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొంటున్నారు. సదస్సులో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కి మూన్ తదితరులు ప్రసంగిస్తారు. రెండేళ్లకోసారి జరిగే చోగమ్ సదస్సును ఈ సారి ‘యాడింగ్ గ్లోబల్ వాల్యూ’ అనే అంశంపై నిర్వహిస్తున్నారు. సదస్సుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, చోగమ్ ప్రధాన కార్యదర్శిగా తొలిసారి ఒక మహిళ ఎన్నికైంది. బ్రిటన్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ప్యాట్రీసియా స్కాంట్లాండ్ను ఈ పదవికి ఎన్నుకున్నారు. భారత్‌కు చెందిన కమలేశ్ శర్మ నుంచి 2016 ఏప్రిల్‌లో ఆమె ఈ బాధ్యతలు అందుకుంటారు. ఇదిలా ఉండగా, పారిస్ వాతావరణ సదస్సుకు సంబంధించి చోగమ్‌లో తీసుకునే నిర్ణయం వాస్తవాలకు అద్దం పట్టేలా ఉండాలని భారత్ వాదించింది. -
నేటి నుంచి భారత్-ఆఫ్రికా సదస్సు
-
నేటి నుంచి భారత్-ఆఫ్రికా సదస్సు
భారత్‌లో తొలి భారీ అంతర్జాతీయ కార్యక్రమం 4 రోజుల సద స్సుకు 54 దేశాల అధినేతలు, ప్రతినిధులు ♦ ఇంధనం, వాణిజ్యం తదితర రంగాల్లో సహకారం పెంపునకు కృషి న్యూఢిల్లీ: ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు ప్రాంతాల మధ్య అపూర్వ అనుబంధానికి, సహకారానికి రంగం సిద్ధమైంది. మూడవ భారత్-ఆఫ్రికా వేదిక సదస్సు-2015 సోమవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఆఫ్రికా ఖండంలోని మొత్తం 54 దేశాలన్నీ పాల్గొంటున్న నాలుగు రోజుల ఈ శిఖ రాగ్ర భేటీకి వాటిలో 40 దేశాల ప్రభుత్వానిధినేతలు హాజరు కానున్నారు. ఆఫ్రికా బయట ఆ దేశాలన్నీ ఒక సమావేశంలో పాల్గొనడం ఇదే తొలిసారి. 1983లో ఢిల్లీలో 42 దేశాలు పాల్గొన్న కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సదస్సు తర్వాత మన దేశంలో ఇదే అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమం. ఇంధనం, ఇతర ప్రకృతి సహజ వనరులు అపారంగా ఉన్న ఆఫ్రికాతో స్నేహసంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ భేటీ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకిస్తోంది. సోమవారం ఇరుపక్షాల సీనియర్ అధికారులు చర్చలు జరుపుతారు. 27న విదేశాంగ మంత్రులు భేటీ అవుతారు. 29న శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఆ రోజు రాష్ట్రపతి మోదీ రాష్ట్రపతి భవన్లో విందు ఇస్తారు. ఏం చర్చిస్తారు? ప్రధాని మోదీ చేపట్టిన భారీ దౌత్య కార్యక్రమంగా భావిస్తున్న ఈ సదస్సులో ఆహారం, ఆరోగ్యం, పర్యావరణ రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార మార్గాలపై మంతనాలు జరుపుతారు. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధంలో సహకారాన్ని బలోపేతంపై దృష్టి సారిస్తారు. పలురంగాల్లో అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమెలాగో చర్చిస్తారు. భారత్, ఆఫ్రికాల మధ్య ప్రస్తుతం ఏటా 70 బిలియన్ డాలర్ల (రూ. 4.5 లక్షల కోట్లు) వాణిజ్యం కొనసాగుతోంది. పటిష్ట భద్రత.. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ సదస్సుకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంతోపాటు నగరమంతా భద్రత కట్టుదిట్టం చేశారు. రెండు హెలికాప్టర్లతో నిఘా ఉంచారు.తొలి భారత్-ఆఫ్రికా సదస్సు 2008లో ఢిల్లీలో, రెండోది ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో జరిగాయి. ఊహకు అందనిది.. ప్రపంచ జనాభాలో ఆరింట ఒక వంతు జనాభా ఉన్న భారత్, ఆఫ్రికాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోశాశ్వత సభ్వత్వం లేకపోపోవడం ఊహకు అందని, అర్థంకాని విషయమని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ఈ అసంబద్ధతను తొలగించడానికి ఆఫ్రికా, భారత్‌లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆమె ఆదివారం ఢిల్లీలో ఇండియా-ఆఫ్రికా ఎడిటర్స్ ఫోరమ్ మూడు సమావేశ్నా ప్రారంభిం ప్రసంగించారు. పలు రంగాల్లో రెండు ప్రాంతాల మధ్య సహకారం పెంపొందాలన్నారు. -
వెయ్యి దాటిన ‘హజ్’ మృతుల సంఖ్య
- మృతుల్లో 35 మంది భారతీయులు మినా: హజ్ యాత్ర సందర్భంగా గత గురువారం మినాలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందినవారి సంఖ్య 1,090కి చేరిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మృతదేహాల ఫొటోలను సౌదీ అధికారులు విడుదల చేశారని ఆదివారం సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. సౌదీ అధికారులు మరో 13 మంది భారతీయుల మృతదేహాలను గుర్తించడంతో ఆ దుర్ఘటనలో చనిపోయిన భారతీయుల సంఖ్య 35కి చేరింది. తాజాగా గుర్తించిన మృతులు జార్ఖండ్, యూపీ, బిహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారని అధికారవర్గాలు తెలిపాయి. హజ్ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సౌదీ రాజు సల్మాన్ ఆదేశించారు. -
రాజీనామా చేసే వరకూ చట్టసభలు సాగనివ్వం
- రాజ్యసభ సభ్యుడు వీ.హన్మంతరావు ఆదిలాబాద్ కల్చరల్ : అవినీతి కుంభకోణంలో లలిత్‌మోడీ, వసుంధరరాజే, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మంత్రులను కాపాడే విధంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేసే వరకూ చట్టసభలు జరగనివ్వబోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ.హన్మంతరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆదిలాబాద్‌కు వచ్చిన ఆయన ఆర్ అండ్ బీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ చౌక్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుష్మాస్వరాజ్‌తోపాటు కుంభకోణాలకు బాధ్యులైన వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని చెప్పేదొకనటి.. చేసేదొకటని విమర్శించారు. నల్లధనాన్ని బయటకు తెస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దకపోగా.. తిండిలేని తెలంగాణగా మారుతోందని ఎద్దేవా చేశారు. చీప్‌లిక్కర్ ప్రవేశపెడితే పేదల బతుకు ఛిద్రమవుతుందని అన్నారు. సంపాదన సరిపోక డి.శ్రీనివాస్ టీఆర్ఎస్లోకి వెళ్లాడని విమర్శించారు. పోలీసులు హన్మంతరావుతోపాటు నాయకులను అరెస్టు చేసి రాస్తారోకో విరమింపజేశారు. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి నరేష్‌జాదవ్, గండ్రత్ సుజాత, అనిల్‌జాదవ్, అజయ్, సంజీవ్‌రెడ్డి, జ్యోతి పాల్గొన్నారు. -
సుష్మా జీ.. నా సోదరిని రక్షించండి
తక్షణం స్పందించిన సుష్మా... యువతికి వీడిన చెర దుబాయ్: ఆమె ఓ ఎయిర్ హోస్టెస్. మంచి కెరీర్ కోసమని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లింది. అయితే ఉద్యోగాల పేరిట తీసుకెళ్లిన ఏజెంట్లు ఆమెనక్కడ మరికొందరితో కలిసి నిర్బంధించారు. ఉద్యోగరీత్యా ఖతార్‌లో ఉంటున్న ఆమె సోదరుడు దేవ్ తంబోలికి ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు ఈనెల 21న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశాడు. ‘సుష్మా జీ... నా సోదరి ఈనెల 14న యూఏఈకి వెళ్లింది. ఏజెంట్లు ఆమెనక్కడ నిర్బంధించారు. కొడుతున్నారట కూడా... దయచేసి సహాయం చేయండి’ అని కోరాడు. దాంతో సుష్మా స్పందించి యూఏఈలోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని రంగంలోకి దింపారు. స్థానిక పోలీసులు, ప్రవాస భారతీయుల సహాయంతో మొత్తం మీద 33 ఏళ్ల యువతిని రక్షించారు. ఈ విషయాన్ని సుష్మా వెంటనే తంబోలికి ట్వీట్ ద్వారా తెలిపారు. రాయబార కార్యాలయం నడిపే శరణాలయానికి తరలించామని, ఆమె క్షేమంగా ఉందని తెలిపారు. -
గీతను తీసుకొచ్చేందుకు సన్నాహాలు: సుష్మ
న్యూఢిల్లీ: భారత్ నుంచి తప్పిపోయి పాకిస్తాన్‌కు చేరిన మూగ చెవిటి అమ్మాయి గీతను భారత్‌కు రప్పించేందుకు చట్టపరమైన చర్యలు చేట్టామని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ట్విటర్ ద్వారా తెలిపారు. ‘గీతను వెనక్కి తీసుకుని రావటానికి అవసరమైన చర్యలను పూర్తిచేస్తున్నాం’ అని ఆమె అన్నారు. అంతే కాకుండా గత కొన్ని రోజులుగా పంజాబ్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాలుగు కుటుంబాలు గీత తమ కూతురేనని చెప్తున్నారని సుష్మ పేర్కొన్నారు. ‘‘భారత హైకమిషనర్‌కు గీత కొన్ని వివరాలు చెప్పింది. తనకు ఏడుగురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నారని పేర్కొంది. తన తండ్రితో కలసి ఆలయానికి వెళ్లినట్లు రాసి చూపింది. ఆలయం పేరు ‘వైష్ణోదేవి’ అని రాసింది. గీత కుటుంబాన్ని వెతకటంలో సాయం చేయండి’’ అని సుష్మ ట్వీట్ చేశారు. 15ఏళ్ల క్రితం పొరపాటున పాకిస్తాన్లో కాలుపెట్టిన గీతను కరాచీలోని భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్ కలిసిన సంగతి తెలిసిందే. -
మానవత్వం చూపడమే నేరమా!?
ప్రాణాంతక కేన్సర్‌తో మోదీ భార్య బాధపడ్తోంది * అందుకే మానవతా దృక్పథంతో స్పందించా! న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రతిష్టంభనకు, తనపై విపక్షాల ఆరోపణలకు కారణమైన ‘లలిత్‌గేట్’పై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. తాను సాయం చేసింది లలిత్ మోదీకి కాదని, కేన్సర్‌తో బాధపడుతూ చావుబతుకుల్లో ఉన్న ఆయన భార్యకని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితే ఎదురైతే ప్రతిపక్ష నేత సోనియాగాంధీ ఎలా స్పందించేవారంటూ ప్రశ్నించారు. ‘నీ చావు నువ్వు చావంటూ ఆ కేన్సర్ రోగిని వదిలేసేవారా?’ అంటూ గురువారం లోక్‌సభలో భావోద్వేగపూరిత ప్రకటన చేశారు. లలిత్ మోదీకి ప్రయాణ పత్రాలు అందించాలంటూ తాను బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి సిఫారసు చేయలేదని, ఆ నిర్ణయాన్ని బ్రిటన్‌కే వదిలానని స్పష్టం చేశారు. ‘లలిత్ మోదీ పోర్చుగల్ వెళ్లేందుకు అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్స్ మీరు ఇవ్వాలనుకుంటే.. ఆ నిర్ణయం భారత్‌తో బ్రిటన్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోదు’ అని మాత్రమే బ్రిటన్ ప్రభుత్వానికి చెప్పానని వివరణ ఇచ్చారు. అదికూడా కేవలం మానవతా దృక్పథంతో చేశానని వివరించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నానన్న సుష్మ.. ప్రతిపక్షంలోని మిత్రులు తనకా అవకాశం ఇవ్వడం లేదని, తన వాదన వినేందుకు వారు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. మీడియాలోనూ ఈ విషయంలో వరుసగా తప్పుడు వార్తలు వస్తున్నాయన్నారు. ‘నాపై ఆరోపణలు చేస్తున్న వారికి సవాలు చేస్తున్నా. మీ ఆరోపణలను రుజువు చేసే ఒక్క కాగితం ముక్క, ఒక్క ఈమెయిల్ కాపీ, ఒక్క డాక్యుమెంట్ ను చూపండి’ అన్నారు. ‘అంతా ఇదెలా చేశావని అడుగుతున్నారు. నేనేం చేశాను? మోదీకేమైనా ఆర్థిక సాయం చేశానా? భారత్ నుంచి తప్పించుకునేందుకు సాయపడ్డానా?’అని ఆగ్రహంగా ప్రశ్నిం చారు. ‘లలిత్ మోదీ భార్య గత 17 ఏళ్లుగా కేన్సర్‌తో బాధపడుతోంది. దాదాపు 10 సార్లు ఈ ప్రాణాంతక వ్యాధి ఆమెకు తిరగబెట్టింది. ఆమెకు పోర్చుగల్‌లో తక్షణమే చికిత్స చేయడం అత్యవస రం. అలాంటి మహిళకు సాయంచేయడం నేరమా? ఒకవేళ అది నేరమే అయితే, నేను నేరం చేశానని ఈ సభలో ఒప్పుకుంటున్నా. దీనికి ఏ శిక్షకైనా నేను సిద్ధమే’ అని ఉద్వేగపూరితంగా అన్నారు. ‘నా స్థానంలో సోనియాగాంధీ ఉంటే ఏం చేసేవారు? తన చావు తాను చావమని ఆ కేన్సర్ పేషెంట్‌ను వదిలేసేవారా?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోర్చుగీస్ డాక్టర్ల నివేదికను ఆమె చదివి వినిపించారు. లలిత్‌కి ట్రావెల్ డాక్యుమెంట్లు ఇస్తూ.. నిబంధనల ప్రకారమే వాటిని జారీ చేస్తున్నామని బ్రిటన్ హోంశాఖ ప్రకటించింది కానీ, భారత విదేశాంగ మంత్రి సిఫారసుల ఆధారంగా వాటిని జారీ చేస్తున్నట్లుగా ప్రకటించలేదని సుష్మాఅన్నారు. సుష్మ ప్రకటన చేస్తున్న సమయంలో ప్రతిపక్ష స్థానాలు దాదాపు ఖాళీగా ఉన్నాయి. అధికార పక్ష సభ్యులు మాత్రం బల్లలు చరుస్తూ సుష్మ ప్రకటనపై తమ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేకపోవడాన్ని సావకాశంగా తీసుకుని తానీ ప్రకటన చేయడం లేదని, ఈ అంశంపై చర్చ కోసం ఎదురు చూస్తున్నానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘జననం, మరణం.. గౌరవం, అప్రతిష్ట.. ఇవన్నీ దైవ నిర్ణయాలు’ అంటూ తాత్విక వ్యాఖ్యలు చేశారు. సుష్మ ప్రకటనను విపక్షాలు తిప్పికొట్టాయి. సుష్మ, మోదీ మరోసారి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. సుష్మ తప్పుచేయకపోతే ఈ వ్యవహారంపై మోదీ ఎందుకు విచారణ జరిపించరని సీపీఎం నిలదీసింది. -
వారు రాజీనామా చేయాల్సిందే!
ఆ తర్వాతే సమావేశాల్లో చర్చ * పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సీఎంలు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ స్పష్టంచేశారు. వారి అక్రమాలపై ప్రధాని మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ‘మన్ కీ బాత్’ చాంపియన్ ఈ విషయంలో ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారని నిలదీశారు. సోమవారమిక్కడ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) భేటీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చ జరిగితే లలిత్‌గేట్, వ్యాపమ్‌లపై ప్రధాని కూడా మాట్లాడతారని, ముందుగా చర్చకు అంగీకరించాలన్న మంత్రి వెంకయ్య చేసిన సూచనను ఆమె తోసిపుచ్చారు. ముందుగా సుష్మా, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధర రాజే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘అవకతవకలకు పాల్పడినవారు పదవుల్లో ఉన్నంత వరకు చర్చకు అర్థమే లేదు. వారు రాజీనామా చేయాలి. తర్వాతే చర్చ’ అని పేర్కొన్నారు. ‘విపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం చట్టబద్ధ వ్యూహంగా మలుచుకున్నవారు ఇప్పుడు మాకు సమావేశాల నిర్వహణ గురించి చెబుతున్నారు’ అని దుయ్యబట్టారు. అవినీతిపై ప్రధాని మౌనం కారణంగానే సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొందన్నారు. సమావేశాలు జరగాలని, బిల్లులు ఆమోదం పొందాలని తామూ భావిస్తున్నామని, అయితే అవినీతిపై ప్రభుత్వ మొద్దునిద్ర వల్ల తాము ఈ వైఖరి అవలంబించాల్సిన వస్తోందని చెప్పారు. -
యోగా మతపరమైంది కాదు: సుష్మ
న్యూయార్క్: యోగాను ఏదో ఒక మత కార్యక్రమంగా చూడరాదని.. ఈ పురాతన అధ్యాత్మిక ఆచరణ.. ప్రతికూల పోకడలకు ఔషధంగా పనిచేయగలదని.. హింస, ఘర్షణలతో సతమతమవుతున్న ప్రపంచంలో మానవులను శాంతి మార్గంలో నడిపించగలదని భారత్ పేర్కొంది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఆదివారం తొలి అంతర్జాతీయ యోగా డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. ‘‘యోగా అంటే.. కలవటం, ఐక్యం కావటం అని అర్థం. ప్రపంచమంతా ఒక కుటుంబం. దానిని మనం యోగాతో సమైక్యం చేయగలం. ‘వసుధైక కుటుంబం’ అనే భారత ఉత్తమ సంప్రదాయంలో.. స్నేహం, సోదరభావాల సందేశాన్ని విస్తరించటానికి ఐరాస యోగా ఒక సమర్థవంతమైన సాధనం. యోగా అనేది ఒక మతం కాదు. దానిని ఏదో మతానిదిగా చూడరాదు. అదొక శాస్త్రం. ఆరోగ్యరంగా ఉండే శాస్త్రం. శరీరం, మనసు, ఆత్మలను సమైక్యం చేసే శాస్త్రం. మన వాస్తవ సామర్థ్యాన్ని సాకారం చేసే శాస్త్రం’ అని అభివర్ణించారు. సమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్, సర్వసభ్య సభ అధ్యక్షుడు శాం కుటేశ, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు తుల్సీ గబ్బార్డ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెనీవాలోని ఐరాస కార్యాలయంలో డెరైక్టర్ జనరల్ మైఖేల్ ముల్లర్ అధ్యక్షతన యోగా డే నిర్వహించారు. -
నాపై ఆంక్షలు లేవు
ప్రధాని క్రియాశీలంగా ఉండడం సమస్య కాదు: సుష్మ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తనపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఆయన క్రియాశీలక వైఖరి తనకు ఏమాత్రం సమస్య కాదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టంచేశారు. తమ బృందంలో నంబర్ 1, నంబర్ 2 స్థానాల కోసం పోటీ లేదని, అందరం కలసికట్టుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఆదివారమిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది కాలంలో తమ ప్రభుత్వం విదేశాంగ విధానంలో సాధించిన ప్రగతిని వివరించారు. ప్రధాని క్రియాశీలకంగా ఉండడం సమస్యగా భావిస్తున్నారా అని కొందరు విలేకరులు అడగ్గా.. సుష్మ పైవిధంగా సమాధానమిచ్చారు. బయటకు పెద్దగా కనిపించడం లేదని ప్రశ్నించగా.. ‘‘నా వైఖరికి తగ్గట్టుగానే ఉంటా. నా ప్రస్తుత ప్రొఫైల్.. లో ప్రొఫైల్‌కే సరిపోతుంది. నేను లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతీరోజూ మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు విదేశాంగ మంత్రిగా ఆ అవసరం పెద్దగా ఉండదు. విదేశాంగ మంత్రి మాట్లాడితే అది వ్యక్తిగత అభిప్రాయమో, పార్టీ అభిప్రాయంగానో చూడరు. ఒక దేశ వైఖరిగా చూస్తారు’’ అని బదులిచ్చారు. కాగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పనిచేసి, హింసాయుత కార్యక్రమాలకు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడే పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతామని సుష్మా స్వరాజ్ తేల్చిచెప్పారు. ముంబై దాడుల సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఐఎస్‌పై ఉక్కుపాదం
‘ఆసియా- ఆఫ్రికా సదస్సు’లో సుష్మ జకార్తా: సమస్త మానవాళికి ప్రమాదకరంగా మారి, ప్రపంచ నాగరికతనే సవాలు చేస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ఈ మహమ్మారిని అంతం చేసేందుకు ఆసియా, ఆఫ్రికా దేశాలు ఐక్యంగా, కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ‘ఆసియా - ఆఫ్రికా దేశాల సదస్సు-2015’లో బుధవారం ఆమె మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల్లో సంస్కరణల కోసం ఆసియా, ఆఫ్రికా దేశాలు కలసికట్టుగా కృషి చేయాలన్నారు. కాలి గాయంతో బాధపడుతున్న సుష్మాస్వరాజ్ సదస్సులో కూర్చునే ప్రసంగించారు. తర్వాత తనకు పరిచయమున్న దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి మషబనెతో కాసేపు ముచ్చటించారు. -
భారత్ తిరిగొచ్చిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తొమ్మిది రోజుల విదేశీ పర్యటనను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం భారత్‌కు తిరిగివచ్చారు. మయన్మార్, ఆస్ట్రేలియాలో పర్యటన తర్వాత ఫిజీలో ఒకరోజు గడిపిన మోదీ.. ఆ దేశ రాజధాని సువా నుంచి 14 గంటల ప్రయాణం అనంతరం ప్రత్యేక విమానంలో ఉదయం 7.15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. మయన్మార్‌లో తూర్పు ఆసియా, ఆసియాన్-భారత్ సదస్సుతో పాటు జీ-20 సదస్సులో మోదీ పాల్గొన్నారు. నెహ్రూ తర్వాత ఆస్ట్రేలియాలో, ఇందిరాగాంధీ తర్వాత ఫిజీలో పర్యటించిన ప్రధాని మోదీనే కావడం విశేషం. ఆస్ట్రేలియాలో నాలుగు రోజులపాటు పలు నగరాలను ప్రధాని సందర్శించారు. అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. కాన్బెర్రాలో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో శిఖరాగ్ర చర్చ లు జరిపారు. ఉగ్రవాదంపై పోరులో అంతర్జాతీయ వ్యూహంతో ముందుకుసాగాల్సిన అవసరముందని మోదీ విదేశీ నేతలకు నొక్కిచెప్పారు.