
బిటిష్ వీసా నిబంధనల సడలింపునకు కృషి
బ్రిటిష్ వీసా నిబంధనలను సరళతరం చేయించేందుకు భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఈ మేరకు బ్రిటన్‌తో సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్
ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ వీసా నిబంధనలను సరళతరం చేయించేందుకు భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఈ మేరకు బ్రిటన్‌తో సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె గురువారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వీసా నిబంధనలను సరళతరం చేస్తే భారత్–బ్రిటన్ ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అక్కడి ప్రభుత్వానికి సూచించినట్లు వివరించారు.
ఏపీలో 1,95,022, తెలంగాణలో 82,023 ఇళ్లు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి గృహ నిర్మాణానికిగాను ఏపీలో 112, తెలంగాణలో 145 ప్రాజెక్టులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయని కేంద్ర గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖమంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్ వెల్లడించారు. ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో.. 2022 సంవత్సరంలోపు పూర్తి చేయాల్సిన ఈ మిషన్‌లో భాగంగా ఏపీలో 1,95,022, తెలంగాణలో 82,023 ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యమని పేర్కొన్నారు.