
సౌదీ చెర నుంచి స్వదేశానికి
సౌదీలోని ఓ వ్యక్తి మృతికి కారణమై మరణ శిక్ష పడిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన చేపూర్ లింబాద్రి శనివారం అర్ధరాత్రి విడుదలయ్యాడు.
⇒ పదేళ్లు జైల్లో మగ్గిన దేగాం వాసి
⇒ 4న అర్ధరాత్రి విడుదల
ఆర్మూర్ అర్బన్ (ఆర్మూర్ ): సౌదీలోని ఓ వ్యక్తి మృతికి కారణమై మరణ శిక్ష పడిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన చేపూర్ లింబాద్రి శనివారం అర్ధరాత్రి విడుదలయ్యాడు. దీంతో లింబాద్రి కుటుంబ సభ్యులు ఆనందంలో ఉద్వేగానికి గురయ్యారు. వివరాలు దేగాం గ్రామానికి చెందని చేపూర్ లింబాద్రి 1995లో ఉపాధి కోసం సౌదీ దేశానికి వెళ్లాడు. ఒక రోజు తోటలో పనిచేస్తుండగా అదే దేశానికి చెందిన ఇద్దరు తండ్రీకొడుకులు తోటలో గడ్డి కోయడానికి వచ్చారు. లింబాద్రి వారించే ప్రయత్నం చేయగా విచక్షణా రహి తంగా కొట్టారు. పెనుగులాటలో కింద పడ్డ సౌదీ దేశస్తుడి తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. దీంతో లింబా ద్రిని సౌదీ ప్రభుత్వం అరెస్టు చేసి మరణ శిక్ష విధించింది.
ఎంపీ కవిత చొరవతో..: గ్రామస్తులు, లింబాద్రి స్నేహితులు ఈ విషయాన్ని ఎంపీ కవిత సహాయంతో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. సుష్మాస్వరాజ్ ద్వారా సమస్యను తెలుసుకున్న ప్రధాని మోదీ సంప్రదింపులు జరపగా 10 లక్షల రియాల్స్ (రూ.కోటి 80 లక్షలు) చెల్లించాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక సౌదీ దేశస్తుడు మానవతా దృక్పథంతో ఆ సొమ్మును చెల్లించడంతో లిం బాద్రి జైలు నుంచి విడుదలయ్యాడు. ఆదివారం శంషా బాద్ ఎయిర్‌పోర్టు నుంచి స్వగ్రామం చేరుకోవడంతో భార్య లక్ష్మి, కుమార్తెలు శ్యామల, స్రవంతి, తల్లిదం డ్రులు ఉద్వేగానికి లోనయ్యారు.