ఇరాన్ నమ్మకమైన భాగస్వామి
టెహ్రాన్: భారత ఇంధన అవసరాలు తీర్చటంలో తమ దేశం ఎప్పటికీ నమ్మకమైన భాగస్వామిగానే ఉంటుందని.. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ తెలిపారు. చమురుతోపాటు విద్య, శాస్త్ర సాంకేతిక, సంస్కృతి రంగాల్లోనూ భారత్‌తో బంధాలను మరింత బలోపేతం చేసుకుంటామన్నారు.
ఇరాన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్‌తో రౌహానీతో పాటు వివిధ శాఖల మంత్రులతో భేటీ అయ్యారు. ఇంధన రంగంలో సహకారాన్ని పెంచటంతోపాటు భారత్‌తో సంబంధాలకు కీలకమైన చబహార్ పోర్టును అభివృద్ధి చేయటంపై చర్చ జరిగింది. చబహార్ పోర్టు అభివృద్ధికి రూ. వెయ్యికోట్టు), భారత్ నుంచి స్టీల్ సరఫరా కోసం రూ. 2.6వేల కోట్లు అప్పుగా ఇవ్వనున్నట్లు సుష్మ తెలిపారు.