
photo credits: reuters/file
న్యూఢిల్లీ: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదివారం(మే19) జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. రైసీ మృతి పట్ల చాలా దేశాలు సంతాపం ప్రకటించాయి. ఇందులో భాగంగా రైసీకి గౌరవ సూచకంగా భారత్ మంగళవారం (మే 21) సంతాప దినంగా పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేయడంతోపాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా ఖొమేనీ కన్నుమూసినపుడు కూడా భారత్ మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించింది.