
photo credits: Reuters
వాషింగ్టన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వెనుక మరొకరి పాత్ర లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాధ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. 45 ఏళ్ల నాటి హెలికాప్టర్‌ను ఉపయోగించాలనుకోవడం.. అది కూడా వాతావరణం సరిగా లేని సమయంలో ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.
అంతకుముందు ఇరాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి జావెద్ మాట్లాడుతూ హెలికాప్టర్ విడిభాగాల సరఫరాపై అమెరికా విధించిన ఆంక్షల వల్లే తమ అధ్యక్షుడు మరణించారన్నారు. కాగా, రైసీ మృతికి కారణమైన బెల్ 212 హెలికాప్టర్‌లో సిగ్నల్ వ్యవస్థ ప్రధాన లోపంగా కనిపిస్తున్నట్లు టర్కీ రవాణశాఖ మంత్రి అబ్దుల్ ఖదీర్ తెలిపారు.
హెలికాప్టర్‌లో సిగ్నల్ వ్యవస్థ పని చేయడం లేదని, అసలు సిగ్నల్ వ్యవస్థ ఉందో లేదో కూడా తెలియదన్నారు. హెలికాప్టర్ సిగ్నల్ కోసం తాము తొలుత ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. వీవీఐపీలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లలో సిగ్నల్ వ్యవస్థ ఉండి తీరాలని ఖదీర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment