మాలే: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక విధానాల వల్ల ఓ 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. భారత్ అందించిన ఎయిర్‌క్రాఫ్ట్ వినియోగాన్ని నిరాకరించిన కారణంగా బ్రెయిన్ స్ట్రోక్‌తో బాలుడు మరణించాడు. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న అబ్బాయిని వేగంగా ఆస్పత్రికి తరలించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ కోసం బాధితులు అభ్యర్థించారు. కానీ అనుమతి లభించకపోవడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు
బ్రెయిన్ ట్యూమర్ స్ట్రోక్‌తో బాధపడుతున్న బాలుడి పరిస్థితి విషమించడంతో బాధిత కుటుంబం అతన్ని గాఫ్ అలీఫ్ విల్లింగిలిలోని వారి ఇంటి నుండి రాజధాని మాలేకి తరలించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ అంబులెన్స్‌ను అభ్యర్థించింది. కానీ సమాధానం రాలేదు. 16 గంటల తర్వాత బాలున్ని మాలేకి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
"స్ట్రోక్ వచ్చిన వెంటనే బాలున్ని మాలేకి తీసుకురావడానికి ఐలాండ్ ఏవియేషన్‌కు కాల్ చేశాం. కానీ మా కాల్‌కు సమాధానం అందలేదు. ఉదయం 8:30 గంటలకు ఫోన్‌కు సమాధానం ఇచ్చారు. సాధారణంగా అలాంటి కేసులకు ఎయిర్ అంబులెన్స్ ఇస్తారు. అది ఉండటమే పరిష్కారం" అని బాలుని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యల అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభణ కొనసాగుతోంది. భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలుడి మరణంపై వ్యాఖ్యానించిన మాల్దీవుల ఎంపీ మీకైల్ నసీమ్.. “భారతదేశం పట్ల అధ్యక్షుడి వ్యతిరేక వైఖరి కారణంగా ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవాల్సిన అవసరం లేదు.” అని అన్నారు.
ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా?
Comments
Please login to add a commentAdd a comment