mourning days
-
రతన్ టాటా కన్నుమూత.. నేడు సంతాప దినంగా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం
ముంబై: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు.కాగా రతన్ టాటా అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేప్రకటించారు. దివంగత పారిశ్రామికవేత్తకు గౌరవసూచికంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్రలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం వెల్లడించారు. అలాగే నేడు జరగాల్సిన అన్నీ వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.ఇక రతన్ టాటా భౌతికకాయాన్ని ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సీసీఏ)లో ఈరోజు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంచుతారు. అక్కడ ప్రజలు ఆయనకు చివరి నివాళులు అర్పించనున్నారు. ఈజు సాయంత్రం వర్లీ ప్రాంతంలో రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి.చదవండి: వ్యాపార దిగ్గజం.. దాతృత్వ శిఖరం 'రతన్ టాటా' అస్తమయంరతన్ టాటా మరణ వార్తతో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోమవారం రతన్ టాటా ఆస్పత్రికి వెళ్లడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఐసీయూలో చేరారని వార్తలొచ్చాయి. వాటిపై స్పందించిన ఆయన.. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన రెండ్రోజులకే ఆయన దివంగతులయ్యారు. -
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్‌లో రేపు సంతాపదినం
న్యూఢిల్లీ: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదివారం(మే19) జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. రైసీ మృతి పట్ల చాలా దేశాలు సంతాపం ప్రకటించాయి. ఇందులో భాగంగా రైసీకి గౌరవ సూచకంగా భారత్ మంగళవారం (మే 21) సంతాప దినంగా పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేయడంతోపాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా ఖొమేనీ కన్నుమూసినపుడు కూడా భారత్ మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించింది. -
Chandan Ram Das: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సాంఘీక సంక్షేమ, రవాణా శాఖ మంత్రి చందన్ రామ్ దాస్(63) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. బగేశ్వర్ జిల్లా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. చందన్ రామ్ దాస్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. 'నా కేబినెట్ మంత్రి హఠాన్మరణం విస్మయానికి గురి చేసింది. ఆయన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. సామాజిక సేవ, రాజకీయాల్లో ఆయన లోటు పూడ్చలేనిది.' అని ధామీ ట్వీట్ చేశారు. मंत्रिमंडल में मेरे वरिष्ठ सहयोगी श्री चंदन राम दास जी के आकस्मिक निधन के समाचार से स्तब्ध हूं। उनका निधन जनसेवा एवं राजनीति के क्षेत्र में अपूरणीय क्षति है। ईश्वर पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान एवं परिजनों व समर्थकों को यह असीम कष्ट सहन करने की शक्ति प्रदान करें। ॐ… pic.twitter.com/BMTuaI62sr — Pushkar Singh Dhami (@pushkardhami) April 26, 2023 కాగా.. మంత్రి మృతికి సంతాపంగా బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజులపాటు సంతాపదినాలు ప్రకటించింది. చందన్ రామ్ దాస్ 2007 నుంచి వరసగా నాలుగు సార్లు బగేశ్వర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ధామీ కేబినెట్లోనే తొలిసారి ఆయనకు మంత్రి అవకాశం దక్కింది. చదవండి: సీఎం ఇంటి రిపేర్ల కోసం రూ.45 కోట్లు..! మరి మోదీ రూ.8,400 కోట్ల విమానం సంగతేంటి..? -
క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం సెప్టెంబర్ 11న సంతాపదినంగా ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ: క్వీన్ ఎలిజబెత్ 2 బ్రిటన్ రాణిగా సుదీర్ఘకాలం కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఐతే ఆమె గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మేరకు వేసవి విడిది కోసం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో ఉన్న రాణి గురువారం తుది శ్వాస విడిచారు. దీంతో రాచ కుటుంబికులు, యావత్తు యునైటైడ్ కింగ్డమ్ ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ దేశ ప్రజల ఆమె సుదీర్ఘపాలనను గుర్తు చేసుకోవడమే కాకుండా వారి ఆలోచనలన్నీ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వం కూడా సుదీర్ఘకాలం రాణిగా అత్యున్నత హోదాలో కొనసాగిన క్వీన్ ఎలిజబెత్2 గౌరవార్థం ఒక రోజు దేశం మొత్తం సంతాపదినంగా పాటించాలని శుక్రవారం నిర్ణయించింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 11న సంతాప దినంగా పాటించాలని ప్రకటించింది. యావత్ భారతదేశం ఆరోజుని సంతాపదినంగా పాటించడమే కాకుండా భవనాలన్నింటిపై జాతీయ జెండ మాస్ట్‌లో ఎగురవేసి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ రోజుల ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని పేర్కొంది. (చదవండి: బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే....) -
Shinzo Abe Death: ఆత్మీయుడికి నివాళిగా భారత్ సంతాప దినం
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా.. శనివారం ఒక్కరోజు సంతాపం దినం పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నా ప్రియమైన మిత్రుడు షింజో అబే ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది అని ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు. భారతదేశం-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై ఎల్లప్పుడూ మక్కువ చూపే ఆయన( షింజోను ఉద్దేశించి..) జపాన్-ఇండియా అసోసియేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. టోక్యోలో నా ప్రియమిత్రుడితో దిగిన రీసెంట్ ఫొటో అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్లో ఓ పోస్ట్ ఉంచారు. ఎన్నో ఏళ్లుగా ఆయనతో అనుబంధం కొనసాగిందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉండేందుకు ఆయన ఎంతో కృషి చేశారని, తాజా పర్యటనలోనూ ఆయనతో ఎన్నో కీలకాంశాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ.. షింజో అబే సేవలను గుర్తు చేసుకున్నారు. Sharing a picture from my most recent meeting with my dear friend, Shinzo Abe in Tokyo. Always passionate about strengthening India-Japan ties, he had just taken over as the Chairman of the Japan-India Association. pic.twitter.com/Mw2nR1bIGz — Narendra Modi (@narendramodi) July 8, 2022 చైనా అంటే డోంట్ కేర్ చైనా దుష్టపన్నాగాలను ముందే ఊహించిన వ్యక్తి, చైనా అంటే బెణుకు లేని నేతగా షింజో అబేకి ఓ పేరుంది. అలాగే భారత్‌తో మైత్రి బలపడడానికి అబే కృషి ఎంతో దాగుంది. ప్రధాని పదవిలో ఎనిమిదేళ్లు ఉన్న టైంలో.. ఆయన నాలుగసార్లు భారత్‌కు వచ్చారు. ఇది చాలూ.. ఆయనకు భారత్ అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి. ఆ సమయంలో భారత్ ఆతిథ్యాన్ని ఆస్వాదించడంతో పాటు మోదీ సర్కార్‌తో ఆయన కీలకమైన ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాదు.. ప్రపంచబ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకులు చైనాకు భయపడి.. అరుణాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చేందుకు వెనుకంజ వేశాయి. ఆ సమయంలో.. సుమారు 13 వేల కోట్ల రూపాయాలను ఈశాన్య రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు షింజో అబే. 2014లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని.. ఆ గౌరవంద దక్కించుకున్న జపాన్ ప్రధానిగా నిలిచారాయన. అలాంటి ఆత్మీయుడి కోసం జాతీయ జెండాను సగం వరకు అవనతం చేసి.. శనివారం నివాళి అర్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. -
మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం.. ఏపీలో 2 రోజులు సంతాప దినాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (50) హఠాన్మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. మేకపాటి కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సంతాపం ప్రకటించి నివాళులు అర్పించారు. చదవండి: మంత్రి గౌతమ్ రెడ్డి కన్నుమూత.. నెల్లూరు ఫంక్షన్లో చివరి ఫోటో కాగా, గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల పాటు (సోమ, మంగళ) సంతాపదినాలు ప్రకటించింది. ఈ రోజు సోమవారం సాయంత్రం వరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలోనే ఆయన భౌతిక కాయాన్ని అభిమానులు, నేతల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం నేటి రాత్రికి స్వగ్రామం బ్రహ్మణపల్లికి భౌతికకాయాన్ని తరలించనున్నారు. అమెరికాలో ఉన్న గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి వచ్చిన తర్వాత అధికార లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలను నిర్వహించనున్నారు. చదవండి: మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంత -
రోశయ్య మృతి: 3 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, విజయవాడ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోశయ్య అంత్యక్రియలుకు ప్రభుత్వం తరఫున ముగ్గురు మంత్రులు హాజరు కానున్నారు. వారు బొత్స సత్యనారాయణ, బాలినేని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు రోశయ్య అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. (చదవండి: రోశయ్య మృతి పట్ల సీఎం జగన్ సంతాపం) రోశయ్య గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కొంపల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌లో ఆదివారం రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. చదవండి: Konijeti Rosaiah: రాజకీయాల్లో రోశయ్య ప్రస్థానమిలా.. -
ప్రిన్స్ ఫిలిప్‌కు గన్ సెల్యూట్
లండన్: విండ్సర్ కోటలో శుక్రవారం కన్నుమూసిన రాణి ఎలిజెబెత్–2 భర్త, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరో ప్రిన్స్ ఫిలిప్(99)కు సంతాప సూచికంగా గన్ సెల్యూట్ చేశారు. 8 రోజుల సంతాప ప్రారంభ సూచికగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లోని రాజధానులు లండన్, కార్డిఫ్, బెల్ఫాస్ట్, ఎడిన్బరోలలో శనివారం మధ్యాహ్నం నిమిషానికి ఒక రౌండ్ చొప్పున 41 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దేశవ్యాప్తంగా ఇలా గన్ సెల్యూట్ చేసే జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఈ కార్యక్రమం 18వ శతాబ్దం నుంచి ఆనవాయితీగా వస్తోందని రాయల్ వెబ్సైట్ తెలిపింది. ఇలాంటి గన్ సెల్యూట్ రాణి విక్టోరియా చనిపోయిన సమయంలో 1901లోనూ పాటించారని వివరించింది. రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరోకు రాయల్ నేవీతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని గన్ సెల్యూట్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపింది. గన్ సెల్యూట్ కార్యక్రమాలు ఆన్‌లైన్‌తోపాటు టీవీల్లోనూ ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. పార్లమెంట్ కొత్తగా ఎలాంటి చట్టాలు చేయదు. సంప్రదాయం ప్రకారం, రాణి ఎలిజెబెత్ ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనరు. కొత్తగా ఎలాంటి చట్టాలను ప్రభుత్వం ఆమె ఆమోదం కోసం పంపించదు. డ్యూక్ జీవిత కాలాన్ని ప్రతిబింబిస్తూ అబ్బేలోని టెనోర్ బెల్‌ను శుక్రవారం సాయంత్రం 6 గంటలు మొదలుకొని నిమిషానికి ఒకసారి చొప్పున 99 పర్యాయాలు మోగించనున్నారు. రాయల్ సెరిమోనియల్ ఫ్యూనె రల్ పూర్తి వివరాలు త్వరలో ఖరారు కానున్నాయి. -
భారత్‌లో 5 రోజుల సంతాప దినాలు
* మండేలా మృతికి నివాళిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతికి నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఐదు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర కేబినెట్.. మండేలా మృతికి సంతాప తీర్మానం ఆమోదించినట్టు సమాచార శాఖ మంత్రి మనీష్ తివారీ తెలిపారు. మండేలా ఓ గొప్ప నాయకుడని, ఈ విషాద సమయంలో భారతజాతి మొత్తం దక్షిణాఫ్రికా ప్రజల వెన్నంటే ఉంటుందన్నారు. మరోవైపు భారత పార్లమెంటు మండేలాకు ఘనంగా నివాళులు అర్పించింది. శుక్రవారం ఉభయసభలూ ప్రారంభం కాగానే మండేలాకు నివాళులు అర్పించిన అనంతరం వాయిదా పడ్డాయి. గొప్ప రాజనీతిజ్ఞుడు: ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతి మండేలా ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రపంచ నేత. మానవజాతికి స్ఫూర్తి చిహ్నం. భారత్‌కు చాలా మంచి స్నేహితుడు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. మండేలా కుటుంబ సభ్యులకు భారత్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. పురుషుల్లో పుణ్యపురుషుడు: మన్మోహన్సింగ్, ప్రధాని ఇక్కడ, అక్కడ.. ఇప్పుడు, అప్పుడు.. దేవుడు పురుషుల్లో పుణ్యపురుషులను సృష్టించాడు. మండేలా అలాంటి పుణ్యపురుషుడు. అంతేకాదు.. అణగారిన, అన్యాయానికి గురవుతున్న ప్రజలకు ఓ ఆశాకిరణం. జాతివివక్షకు వ్యతిరేకంగా అంకితభావంతో పోరాడిన గొప్ప నాయకుడు. ఆయన మృతి దక్షిణాఫ్రికాకే కాదు.. భారత్‌కు, ప్రపంచానికి కూడా తీరని లోటు. ధైర్యానికి, త్యాగానికి ప్రతీక: సోనియాగాంధీ, యూపీఏ అధ్యక్షురాలు ధైర్యానికి, త్యాగానికి, క్షమాగుణానికి మండేలా ప్రతీక. దక్షిణాఫ్రికా మహాత్మాగాంధీ వంటి ఆయన.. మొత్తం మానవజాతికి చెందిన మహా నాయకుడు. దక్షిణాఫ్రికా ప్రజలు ఆయన్ను అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకున్నా.. స్వచ్ఛందంగా పదవి వీడిన త్యాగశీలి. మండేలా మరణం ప్రియమైన తండ్రిని కోల్పోవడంలాంటిది. మండేలా అడుగుజాడలు శాశ్వతం: సుష్మాస్వరాజ్, లోక్‌సభలో విపక్షనేత మండేలా అడుగుజాడలు కాలగర్భంలో ఎన్నటికీ కలిసిపోవు. ఈ ప్రపంచంలోకి ఎందరో వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ మండేలా మాత్రం శాశ్వతంగా నిలిచే ఉంటారు. కలచి వేసింది: చంద్రబాబు నాయుడు, టీడీపీ అధ్యక్షుడు మండేలా మరణం తీవ్రంగా కలచి వేసింది. మండేలా నుంచి స్ఫూర్తి పొందిన వారిలో నేనూ ఒకడిని. ప్రపంచవ్యాప్తంగా పీడనకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో పాల్గొనే వారికి ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు నిరంతరం స్ఫూర్తినిస్తాయి. మహోన్నత మానవుడు: వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు 21వ శతాబ్దంలో మానవాళికి ప్రత్యక్షంగా తెలిసిన మహోన్నత మానవుడు నెల్సన్ మండేలా. జాతుల మధ్య వైరానికి స్వస్తి పలికి దక్షిణాఫ్రికా చరిత్రలో మాత్రమే కాకుండా మొత్తం మానవజాతిలోనే నలుపు-తెలుపు అన్న వర్ణ వివక్షను రూపుమాపి మానవులంతా ఒకటేనని మండేలా చాటారు.