
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (50) హఠాన్మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. మేకపాటి కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సంతాపం ప్రకటించి నివాళులు అర్పించారు.
చదవండి: మంత్రి గౌతమ్ రెడ్డి కన్నుమూత.. నెల్లూరు ఫంక్షన్‌లో చివరి ఫోటో
కాగా, గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల పాటు (సోమ, మంగళ) సంతాపదినాలు ప్రకటించింది. ఈ రోజు సోమవారం సాయంత్రం వరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలోనే ఆయన భౌతిక కాయాన్ని అభిమానులు, నేతల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం నేటి రాత్రికి స్వగ్రామం బ్రహ్మణపల్లికి భౌతికకాయాన్ని తరలించనున్నారు.
అమెరికాలో ఉన్న గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి వచ్చిన తర్వాత అధికార లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
చదవండి: మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంత
Comments
Please login to add a commentAdd a comment