సాక్షి, విజయవాడ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోశయ్య అంత్యక్రియలుకు ప్రభుత్వం తరఫున ముగ్గురు మంత్రులు హాజరు కానున్నారు. వారు బొత్స సత్యనారాయణ, బాలినేని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు రోశయ్య అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది.
(చదవండి: రోశయ్య మృతి పట్ల సీఎం జగన్ సంతాపం)
రోశయ్య గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కొంపల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌లో ఆదివారం రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment