నేటి నుంచి భారత్-ఆఫ్రికా సదస్సు
భారత్‌లో తొలి భారీ అంతర్జాతీయ కార్యక్రమం
4 రోజుల సద స్సుకు 54 దేశాల అధినేతలు, ప్రతినిధులు
♦ ఇంధనం, వాణిజ్యం తదితర రంగాల్లో సహకారం పెంపునకు కృషి
న్యూఢిల్లీ: ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు ప్రాంతాల మధ్య అపూర్వ అనుబంధానికి, సహకారానికి రంగం సిద్ధమైంది. మూడవ భారత్-ఆఫ్రికా వేదిక సదస్సు-2015 సోమవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఆఫ్రికా ఖండంలోని మొత్తం 54 దేశాలన్నీ పాల్గొంటున్న నాలుగు రోజుల ఈ శిఖ రాగ్ర భేటీకి వాటిలో 40 దేశాల ప్రభుత్వానిధినేతలు హాజరు కానున్నారు. ఆఫ్రికా బయట ఆ దేశాలన్నీ ఒక సమావేశంలో పాల్గొనడం ఇదే తొలిసారి. 1983లో ఢిల్లీలో 42 దేశాలు పాల్గొన్న కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సదస్సు తర్వాత మన దేశంలో ఇదే అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమం. ఇంధనం, ఇతర ప్రకృతి సహజ వనరులు అపారంగా ఉన్న ఆఫ్రికాతో స్నేహసంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ భేటీ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకిస్తోంది. సోమవారం ఇరుపక్షాల సీనియర్ అధికారులు చర్చలు జరుపుతారు. 27న విదేశాంగ మంత్రులు భేటీ అవుతారు. 29న శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఆ రోజు రాష్ట్రపతి మోదీ రాష్ట్రపతి భవన్‌లో విందు ఇస్తారు.
ఏం చర్చిస్తారు?
ప్రధాని మోదీ చేపట్టిన భారీ దౌత్య కార్యక్రమంగా భావిస్తున్న ఈ సదస్సులో ఆహారం, ఆరోగ్యం, పర్యావరణ రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార మార్గాలపై మంతనాలు జరుపుతారు. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధంలో సహకారాన్ని బలోపేతంపై దృష్టి సారిస్తారు. పలురంగాల్లో అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమెలాగో చర్చిస్తారు. భారత్, ఆఫ్రికాల మధ్య ప్రస్తుతం ఏటా 70 బిలియన్ డాలర్ల (రూ. 4.5 లక్షల కోట్లు) వాణిజ్యం కొనసాగుతోంది.
పటిష్ట భద్రత..
ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ సదస్సుకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంతోపాటు నగరమంతా భద్రత కట్టుదిట్టం చేశారు. రెండు హెలికాప్టర్లతో నిఘా ఉంచారు.తొలి భారత్-ఆఫ్రికా సదస్సు 2008లో ఢిల్లీలో, రెండోది ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో జరిగాయి.
ఊహకు అందనిది..
ప్రపంచ జనాభాలో ఆరింట ఒక వంతు జనాభా ఉన్న భారత్, ఆఫ్రికాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోశాశ్వత సభ్వత్వం లేకపోపోవడం ఊహకు అందని, అర్థంకాని విషయమని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ఈ అసంబద్ధతను తొలగించడానికి ఆఫ్రికా, భారత్‌లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆమె ఆదివారం ఢిల్లీలో ఇండియా-ఆఫ్రికా ఎడిటర్స్ ఫోరమ్ మూడు సమావేశ్నా ప్రారంభిం ప్రసంగించారు. పలు రంగాల్లో రెండు ప్రాంతాల మధ్య సహకారం పెంపొందాలన్నారు.