సమస్త మానవాళికి ప్రమాదకరంగా మారి, ప్రపంచ నాగరికతనే సవాలు చేస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ను తీవ్రంగా
‘ఆసియా- ఆఫ్రికా సదస్సు’లో సుష్మ
జకార్తా: సమస్త మానవాళికి ప్రమాదకరంగా మారి, ప్రపంచ నాగరికతనే సవాలు చేస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ఈ మహమ్మారిని అంతం చేసేందుకు ఆసియా, ఆఫ్రికా దేశాలు ఐక్యంగా, కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు.
ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ‘ఆసియా - ఆఫ్రికా దేశాల సదస్సు-2015’లో బుధవారం ఆమె మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల్లో సంస్కరణల కోసం ఆసియా, ఆఫ్రికా దేశాలు కలసికట్టుగా కృషి చేయాలన్నారు. కాలి గాయంతో బాధపడుతున్న సుష్మాస్వరాజ్ సదస్సులో కూర్చునే ప్రసంగించారు. తర్వాత తనకు పరిచయమున్న దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి మషబనెతో కాసేపు ముచ్చటించారు.