సిరియా: ఐసిస్‌ స్థావరాలపై అమెరికా దాడులు | us conducts airstrikes against ISIS camps in Syria | Sakshi
Sakshi News home page

సిరియా: ఐసిస్‌ స్థావరాలపై అమెరికా దాడులు

Published Sat, Oct 12 2024 4:39 PM | Last Updated on Sat, Oct 12 2024 8:36 PM

us conducts airstrikes against ISIS camps in Syria

న్యూయార్క్‌: సిరియాలోని ఐసిస్‌ స్థావరాలపై పలు వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా వెల్లడించింది. తమ దాడులతో ఐసిస్‌ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. 

‘‘శనివారం ఉదయం ఐసిస్‌ క్యాంప్‌లపై అమెరికా సెంట్రల్‌ కమాండ్ బలగాలు వైమానిక దాలు చేశాం. ఈ దాడులు.. అమెరికా, దాని మిత్రదేశాలు , భాగస్వాములపై ​​దాడులకు ప్లాన్ చేయటం, దాడుల నిర్వహించటం వంటి ఐసిస్‌ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ దాడులుకు సంబంధించి సమాచారం అందిస్తాం’ అని అమెరికా పేర్కొంది. అయితే ఈ దాడుల్లో మృతుల సంఖ్య తదితర వివరాలు అమెరికా వెల్లడించకపోవటం గమనార్హం.

ఇటీవల కాలంలో సిరియాపై అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి. సెప్టెంబరు నెల చివరిలో ఐసిస్‌ స్థావరాలే టార్గెట్‌గా అమెరికా గగనతల దాడులు చేసింది. ఈ దాడుల్లో 37 మంది హతమైనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మృతి చెందిన వారంతా ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌, అల్‌ఖైదా అనుబంధ సంస్థలకు చెందినవారేనని పేర్కొంది. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది.

చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement