డెమాస్కస్: ఉత్తర సిరియా అలెప్పో ప్రావెన్స్లోని బెరిమ్హులి గ్రామంపై శుక్రవారం యూఎస్ సంకీర్ణ దళాలు వైమానికి దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 17 మంది మరణించగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు సిరియాలోని మానవహక్కుల పరిశీలకులు శనివారం వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని మానవహక్కుల పరిశీలకులు పేర్కొన్నారు.