వాషింగ్టన్: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, అనుబంధ మిలీషియా గ్రూపులే లక్ష్యంగా ఇరాన్, సిరియాల్లోని 85 లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా ప్రకటించింది. గత ఆదివారం జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు సైనికులు మృతి చెందగా మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణించింది.
ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపులే కారణమని ఆరోపిస్తూ ఇందుకు ప్రతీకారం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. శుక్రవారం అమెరికా నుంచి బయలుదేరిన బీ1– లాంగ్‌రేంజ్ బాంబర్ విమానాలు ఇరాన్‌లోని సరిహద్దు పట్టణం అల్–క్వయిమ్ కేంద్రంగా పనిచేసే ఇరాన్ అనుకూల ‘హష్ద్–అల్– షబి’, కతాయిబ్ హెజ్బొల్లా సంస్థల స్థావరాలతోపాటు మొత్తం ఏడు ప్రాంతాల్లోని 85 లక్ష్యాలపై బాంబులతో ధ్వంసం చేసినట్లు అధ్యక్షుడు బైడెన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment