జోర్డాన్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరం టవర్ 22పై మిలిటెంట్ గ్రూప్ జరిపిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉండే అమెరికా డ్రోన్ దాడిని అడ్డుకోకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై దర్యాపు చేసిన అమెరికా సైనిక అధికారులు కీలక విషయాలను వెల్లడించారు.
మిలిటెంట్ దళాలు డ్రోన్ దాడులు చేసిన సమయంలో అమెరికాకు సంబంధించిన ఒక డ్రోన్ ఆర్మీ పోస్ట్‌కు వస్తుందని సైనిక శిబిరం భావించింది. తక్కువ ఎత్తులో సైనిక స్థావరం వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ను అప్పటికే షెడ్యూల్ చేసిన తమ డ్రోన్‌గా భావించించారు సైనిక అధికారులు. తమ స్థావరం వైపు వస్తున్న డ్రోన్ తమదే అనుకొని పొరపాటు పడ్డారు. దానివల్లనే మిలిటెంట్ల డ్రోన్ దాడిని తాము అడ్డుకోలేకపోయామని సైనిక అధికారులు పేర్కొన్నారు. మిలిటెంట్లు ప్రయోగించిన డ్రోన్ సైనిక శిబిరంపై పడినట్లు పేర్కొంది. ఈ దాడిలో ముగ్గురు సైనికులు మరణించగా.. 40 మంది సైనికులు గాయపడ్డారు. ఇక్కడ సుమారు 350 మంది అమెరికా సైనికులు పని చేస్తున్నారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ డ్రోన్ దాడి మధ్యప్రాచ్యలో అమెరికా స్థావరం జరిగిన అతి పెద్ద దాడిగా తెలుస్తోంది. ఇరాన్ దేశానికి చెందిన ఇస్లామిక్ రెసిస్టాన్స్ మిలిటెంట్ గ్రూప్ డ్రోన్ దాడికి పాల్పడినట్టు అమెరికా ఆరోపిస్తోంది. ఈ ఘటనపై స్పందిచిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ‘జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ ఇరాన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ గ్రూప్ పని. సమయం వచ్చిప్పుడు తాము అంతే స్థాయిలో స్పందిస్తాం’ అని అన్నారు. అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ మిలిటెంట్‌కు గ్రూప్‌కు తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తాము ఎవరికీ డ్రోన్ దాడులకు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదని ఇరాన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment