అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల కాలం చోటుచేసుకున్న హత్యాయత్నానికి సంబంధించిన ఘటనలపై అగ్రరాజ్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.అయితే ట్రంప్.. ఇప్పటికే ఇరాన్ దేశ హిట్‌లిస్ట్‌లో ఉండటంతో టెహ్రాన్‌కు జో బైడెన్ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ హత్యకు కుట్రలు చేసినా.. యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగా భావిస్తామని వైట్ హౌజ్ మంగళవారం ఓ ప్రకటనవిడుదల చేసింది.
‘‘మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇరాన్ నుంచి వచ్చే బెదిరింపులను కొన్నేళ్లుగా పర్యవేక్షిస్తున్నాం. అమెరికా పౌరుడిపై ఏదైనా దాడి జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి.ఈ భద్రతాపరమైన అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ, స్వదేశ భద్రత అంశంగా పరిగణిస్తున్నాం. ఇరాన్ బెదిరింపులకు తీవ్రంగా ఖండిస్తున్నాం.అమెరికాకు సేవలను కొనసాగించే వారితో సహా, గతంలో సేవలందించిన వారి, అమెరికా పౌరులపై ఇరాన్ బెదిరింపులకు పాల్పడితే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కొవల్సి ఉంటుంది’’ అని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి సీన్ సావెట్ అన్నారు.
మరోవైపు.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అమెరికాతో పరోక్ష చర్చలను విరమించుకున్నట్లు ఇరాన్ సోమవారం ప్రకటించింది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష దౌత్య సంబంధాలు లేవు. అయితే ఈ రెండు దేశాల మధ్య ఒమన్‌ను కీలక మధ్యవర్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఒమన్ రాజధాని మస్కట్‌లోమీడియాతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు చర్చలకు జరిగే అవకాశాలు కనిపించటం లేదు’’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment