న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి సంబంధించిన కీలకమైన విషయాలను అమెరికా ఇంటెలిజెన్స్, లా ఎన్‌పోర్స్‌మెంట్ ఏజెన్సీలు వెల్లడించాయి. డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ప్రచార, వ్యక్తిగత సమాచారాన్ని ఇరానియన్ సైబర్‌అటాకర్లు దొంగిలించాలరని పేర్కొన్నాయి. ఆ సమాచారాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌కు సిబ్బందికి ఇవ్వడానికి ఆఫర్ చేసినట్లు తెలిపాయి.
‘‘అధ్యక్షుడు జో బైడెన్ ప్రచార సిబ్బందికి ఇరానియన్ సైబర్ అటాకర్లు గుర్తు తెలియని ఈ మెయిల్స్ పంపించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు సంబంధించి దొంగిలించిన ప్రచార, వ్యక్తిగత విషయాలను పంపించారు. ట్రంప్ ప్రచారానికి సంబంధించి దొంగిలించిన సమాచారాన్ని యూఎస్ మీడియా సంస్థలతో పంచుకోవడానికి కూడా ప్రయత్నించారు. అయితే ఏ మీడియా సంస్థలకు ఇవ్వాలనుకున్నారో విషయంపై స్పష్టత లేదు’ అని ఇంటెలిజెన్స్, లా ఎన్‌పోర్స్‌మెంట్ ఏజెన్సీలు వెల్లడించాయి.
ఇరానియన్ సైబర్ అటాకర్ల మెయిల్స్‌కు బైడెన్ ప్రచార బృందం స్పందించలేదని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఇరాన్ ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తోందని ఆగస్టులో పలు ఎజెన్సీలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. రష్యా, ఇరాన్, చైనాలు అమెరికా సమాజంలో విభేదాలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని అగ్రరాజ్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆరోపణలు చేశాయి.
ఇక.. జో బైడెన్ అధ్యక్ష బరి నుంచి వైదొలిగి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment