donad trump
-
ట్రంప్‌నకు పాలస్తీనా అధ్యక్షుడి ఫోన్.. ‘గాజాలో శాంతి కోసం రెడీ’
అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ శుక్రవారం యూఎస్‌కు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా గాజాలో న్యాయమైన, సమగ్రమైన శాంతి కోసం పని చేయడానికి సంసిద్ధతను ట్రంప్‌నకు తెలియజేసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయానకి అబ్బాస్ అభినందనలు తెలియజేశారు.‘‘అంతర్జాతీయ చట్టాల ఆధారంగా న్యాయమైన, సమగ్రమైన శాంతిని సాధించేందుకు ట్రంప్‌తో కలిసి పని చేసేందుకు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. గాజా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ప్రపంచంలోని సంబంధిత పార్టీలతో కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని అబ్బాస్ ట్రంప్‌నకు తెలిపారు. దీంతో గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు కృషి చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేస్తానని ట్రంప్ తెలిపారు’’ అని పాలస్తీనా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అయితే ట్రంప్ తన ప్రచారం సమయంలో గాజాలో యుద్ధం ముగించడానికి కృషి చేస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.గత ఏడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో హమాస్, ఇజ్రాయెల్ బలగాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో 43,500 మంది గాజా ప్రజలు మృతిచెందినట్లు అధికారులు పేర్కొంటున్నారు.వేల మంది ప్రజలు గాజా నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. -
ఈ ఐదు అంశాలే.. అధ్యక్ష పీఠానికి ఆయుధాలు
-
ట్రంప్ సమాచారాన్ని దొంగిలించి.. బైడెన్ టీంకు ఆఫర్?
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి సంబంధించిన కీలకమైన విషయాలను అమెరికా ఇంటెలిజెన్స్, లా ఎన్పోర్స్మెంట్ ఏజెన్సీలు వెల్లడించాయి. డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ప్రచార, వ్యక్తిగత సమాచారాన్ని ఇరానియన్ సైబర్అటాకర్లు దొంగిలించాలరని పేర్కొన్నాయి. ఆ సమాచారాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌కు సిబ్బందికి ఇవ్వడానికి ఆఫర్ చేసినట్లు తెలిపాయి.‘‘అధ్యక్షుడు జో బైడెన్ ప్రచార సిబ్బందికి ఇరానియన్ సైబర్ అటాకర్లు గుర్తు తెలియని ఈ మెయిల్స్ పంపించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు సంబంధించి దొంగిలించిన ప్రచార, వ్యక్తిగత విషయాలను పంపించారు. ట్రంప్ ప్రచారానికి సంబంధించి దొంగిలించిన సమాచారాన్ని యూఎస్ మీడియా సంస్థలతో పంచుకోవడానికి కూడా ప్రయత్నించారు. అయితే ఏ మీడియా సంస్థలకు ఇవ్వాలనుకున్నారో విషయంపై స్పష్టత లేదు’ అని ఇంటెలిజెన్స్, లా ఎన్పోర్స్మెంట్ ఏజెన్సీలు వెల్లడించాయి.ఇరానియన్ సైబర్ అటాకర్ల మెయిల్స్‌కు బైడెన్ ప్రచార బృందం స్పందించలేదని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఇరాన్ ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తోందని ఆగస్టులో పలు ఎజెన్సీలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. రష్యా, ఇరాన్, చైనాలు అమెరికా సమాజంలో విభేదాలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని అగ్రరాజ్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆరోపణలు చేశాయి. ఇక.. జో బైడెన్ అధ్యక్ష బరి నుంచి వైదొలిగి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు.చదవండి: ట్రంప్‌పై హత్యాయత్నం!.. మస్క్ అనుమానం -
వ్యాక్సిన్ మొదట మాకే కావాలి : ట్రంప్
వాషింగ్టన్ : కరోనా మహమ్మారికి అంతానికి వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా కసరత్తు ముమ్మరమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ మొదట తమ దేశానికే కావాలని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కీలక ఉత్తర్వులపై సంతకం చేయడం గమనార్హం. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు టీకాను సొంతం చేసుకోవడానికి అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అమెరికాలో తయారైన వ్యాక్సిన్ అయినా, విదేశాల్లో తయారైనా వ్యాక్సిన్ తమకే మొదటి ప్రాధాన్యం అన్నట్టుగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు ట్రంప్. కాగా టీకా విషయంలో అమెరికా ఇప్పటికే కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. సప్లై విధానం.. అమెరికన్లకు ప్రాధాన్యత తదితర అంశాలపై ఓ క్లారిటీకి రాగా.. ఇలాంటి సమయలో ట్రంప్ ఆదేశాలు న్యాయ కమీషన్ ముందు నిలబడతాయా లేదా అన్నది సందేహస్పదంగా మారింది. ఇక వ్యాక్సిన్ విషయంలో అమెరికా విధానాలు ఎంతమేరకు సఫలమవుతాయన్నది అనుమానంగా ఉంది. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోపు 10 కోట్ల మందికి, జూన్‌లోపు ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ 10 కోట్ల మందికి టీకా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ఆయన జనవరి 20న నూతన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. -
‘నమస్తే ట్రంప్’తోనే వైరస్ వ్యాప్తి..!
సాక్షి, ముంబై : భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిపై శివసేన తీవ్ర ఆరోపణలు చేసింది. దేశంలో కరోనా విజృంభణకు గుజరాత్లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం కారణమంటూ సామ్నా ఎడిటోరియల్ వేదికగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు అమెరికా ప్రతినిధులు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు లక్షమందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 24న జరిగిన ఈ కార్యక్రమంతోనే దేశంలో కరోనా వ్యాప్తి మరింత పెరిగిందని రౌత్ ఆరోపించారు. (ఒక్క రోజే 8,380 కరోనా కేసులు) గుజరాత్‌తో పాటు ముంబై, ఢిల్లీల్లో అమెరికా ప్రతినిధులు పర్యటించారని, వారి మూలంగానే కోవిడ్ తీవ్ర రూపందాల్చిందని పేర్కొన్నారు. అప్పటికే చైనాతో పాటు అమెరికా, ఇటలీ, యూరప్ దేశాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగుచూశాయని, అయినప్పటికీ ప్రధాని మోదీ నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని వాయిదా వేయలేదని విమర్శించారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. (ఆక్సిజన్ లేక కోవిడ్ బాధితులు మృతి) ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణపై కూడా సామ్నా వేదికగా స్పందించారు. అత్యధిక జనసాంధ్రత కారణంగానే ముంబైలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని రౌత్ పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని సాకుగా చూపించి రాష్ట్రంలో రాష్ట్రపతి విధించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహారాష్ట్రలోనే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోనూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందని గుర్తుచేశారు. ఇక కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర విధించిన లాక్డౌన్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. -
విడాకులకు దారి తీసిన జార్జ్ మృతి
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. పోలీసులు చేతిలో అత్యంత దారుణంగా మృతిచెందిన నల్ల జాతీయుడు జార్జ్ ప్లాయిడ్‌కు మద్దతుగా వేలాదిమంది ప్రజలు వీధుల్లోచ్చారు. జార్జ్ మృతికి కారణమైన పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను తక్షణమే ఉరి తీయాలంటూ నినదిస్తున్నారు. పౌర ఆందోళనలతో గత రెండు రోజులుగా అగ్రరాజ్యం అట్టుడుకుతోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనకు వేదికైన మినియా పోలీస్ స్టేషన్‌ను ఆందోళన కారులు నిప్పుపెట్టడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేయడం ఆ తరువాత ప్రజా ఆగ్రహం దేశ వ్యాప్తంగా విస్తరించడం గంటల్లోనే జరిగిపోయింది. ఈ క్రమంలోనే స్థానిక ప్రభుత్వం ప్రజల ఆందోళనకు తలగ్గొంది. జార్జ్‌ను అత్యంత అమానుషంగా హతమార్చిన పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్‌పై హత్యా కేసును నమోదు చేసి, కటకటాల వెనక్కి పంపింది. (ఆందోళనలతో అట్టుడుకుతున్న అమెరికా) మరో ముగ్గురు అధికారులపై థర్డ్‌డిగ్రీ అభియోగాలను నమోదు చేసింది. ఈ నలుగురు అధికారులను శనివారం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలావుండగా.. జార్జ్ ప్లాయిడ్ మెడపై మోకాలు పెట్టి అత్యంత అమానుషంగా ప్రవర్తించిన డెరెక్ భార్య కీలై చౌవిన్ అతని నుంచి విడాకులు కోరారు. నల్ల జాతీయులపై వివక్ష చూపుతూ, మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటనకు పాల్పడిన చౌవిన్‌తో తన వివాహాన్ని రద్దు చేయాలని ఆమె కోరినట్లు తెలిసింది. ఈ మేరకు కీలై తరఫు న్యాయవాది స్థానిక కోర్టులో విడాకులను కోరుతూ పత్రాలను సైతం దాఖలు చేశారు. ఈ మేరకు అమెరికా పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయి. -
ఆందోళనలతో అట్టుడుకుతున్న అమెరికా
వాషింగ్టన్ : కరోనా వైరస్‌తో ఇప్పటికే అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యం అమెరికాలో నల్ల జాతీయుడు మృతి పెను దుమారాన్ని రేపుతోంది. మిన్నియాపోలిస్ నగరానికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు.. చివరికి చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టి చంపారు. మెడపై మోకాలుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. ‘నాకు ఊపిరి ఆడటం లేదు.. ప్లీజ్..’ అని నిందితుడు మొత్తుకున్నప్పటికి పోలీసు అధికారి మాత్రం కనికరం చూపకుండా ఐదు నిమిషాల పాటు మెడపై మోకాలు అలాగే పెట్టి ఉంచాడు. దీంతో ప్రాణం పోతుందంటూ గిలగిల కొట్టుకున్న జార్జ్ పోలీసు మోకాలి కిందనే ప్రాణాలు వదిలాడు. స్థానికులు ఈ వీడియోను రికార్డ్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారులపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఈ ఘటన అమెరికాలో తీవ్ర నిరసనలకు కారణమైంది. తొలుత మిన్నియాపోలిస్ నగరంలో కొంతమంది యువకులతోతో మొదలైన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి.. జార్జ్‌ను కొట్టిచంపిన పోలీసులను విధులనుంచి తొలగించినా.. ఆగ్రహ జ్వాలలు మాత్రం ఆరలేదు. నలుగురు పోలీసులను ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తన ప్రజానీకం ఆందోళన బాటపడ్డారు. ఈ క్రమంలోనే పరిస్థితి చేదాటిపోవడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. బాష్పవాయులను ప్రయోగించారు. దీంతో పౌరుల నిరసన మరింత తీవ్రరూపం దాల్చింది. ఆందోళకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వాహనాలకు, భవనాలకు నిప్పుబెట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని తేల్చిచెబుతున్నారు. మిన్నియాపోలిస్ నగరం అంతా ధర్నాలు, నినాదాలతో అట్టుడిపోతోంది. ఇక ఘటనకు సంబంధించిన రిపోర్టింగ్ చేస్తున్న ఓ మీడియా ప్రతినిధిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇక ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం స్పందించక తప్పలేదు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఘటనకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక గవర్నర్‌ను ట్రంప్ ఆదేశించారు. (నల్ల జాతీయుడిపై పోలీసుల అమానుష వైఖరి) -
ట్రంప్ ప్రకటనను ఖండించిన కేంద్రప్రభుత్వ వర్గాలు
-
డేంజర్ బెల్!
-
పంజాబ్ టు అమెరికా వయా మెక్సికో
అక్రమ వలసలను అరికట్టడానికి అధ్యక్షుడు ట్రంప్ ఎన్నో చర్యలు తీసుకుంటోంది. వలస నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ వేల మంది అక్రమ వలసదారుల్ని ప్రభుత్వం జైల్లో పెడుతోంది. అమెరికా కార్యక్రమాలు, వలస విధానానికి సంబంధించిన సంస్థ(యూఎన్ ప్రోగ్రామ్స్, మైగ్రేషన్ పాలసీ ఇనిస్టిట్యూట్) లెక్కల ప్రకారం ట్రంప్ అధికారంలోకి వచ్చే నాటికి(2017 సెప్టెంబర్) దేశంలోకి అక్రమంగా ప్రవేశించారన్న కారణంగా 2,227 మంది భారతీయులను అధికారులు పట్టుకున్నారు. 2017 అక్టోబర్ నుంచి 2018 మే మధ్య వీరి సంఖ్య 4,197కు పెరిగింది. వీరుకాక న్యూ మెక్సికో, ఒరెగాన్లలోని శరణార్థి శిబిరాల్లో ఉన్న వేల మందిలో దాదాపు 100మంది భారతీయులు ఉన్నారు. వీరిలో చాలా మంది పంజాబీలే. ఒకవైపు అక్రమ వలసదారులు వేల సంఖ్యలో పట్టుబడుతున్నా వలసదారులు మాత్రం తమ ప్రయత్నాలను ఆపడం లేదు. పంజాబ్‌తోపాటు హరియాణ, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు తమ కలల తీరమైన అమెరికా చేరుకోవడానికి ప్రాణాలు పణంగా పెడుతున్నారు. అమెరికా సరిహద్దు దేశమైన మెక్సికో నుంచి దొంగ తనంగా అమెరికాలో ప్రవేశిస్తున్నారు. ఇలా అక్రమంగా అమెరికా చేరాలనుకునే వారికి కొయటీస్(మనుషుల్ని అక్రమంగా ఇతర దేశాలకు తరలించే వారిని ఇలా పిలుస్తారు)లు సహకరిస్తున్నారు. వేల రూపాయలు తీసుకుని వివిధ మార్గాల ద్వారా వీరు వలసదారులను మెక్సికో ద్వారా అమెరికాలోకి పంపుతున్నారు. పనిలో పనిగా ఈ వలసదారుల చేత బలవంతంగా మాదక ద్రవ్యాలను కూడా దొంగ రవాణా చేయిస్తుంటారు. అక్రమంగా అమెరికా వెళ్లాలనుకునే వారిని గుర్తించి ఒప్పందాలు చేసుకోవడం కోసం కోసం పంజాబ్ తదితర రాష్ట్రాల్లో దళారులు కూడా ఉన్నారు. 4,600కిమీ ప్రయాణం... దొడ్డిదారిన అమెరికా వెళ్లాలనుకునే వారిని కొయటీస్‌లు మొదట విమానంలో దక్షిణ అమెరికా దేశమైన ఈక్విడార్‌కు తీసుకెళ్తారు. ఈక్విడార్ ప్రభుత్వం ‘90డే వీసా ఆన్ అరైవల్’ విధానాన్ని అమలు పరచడం, మెక్సికో ప్రభుత్వం వలసవిధానాన్ని కచ్చితంగా అమలు పరస్తుండటం వల్ల కొయటీస్‌లు వలసదారులను నేరుగా మెక్సికోకు కాకుండా ఈక్విడార్‌కు తీసుకెళ్తారు.అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా కొలంబియాలోని కపుర్గన చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా నికరగువాకు వెళతారు. పనామా అడవుల గుండా వీరు ప్రయాణించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లేటప్పుడు బస్సులు, కార్లలో ఏర్పాటు చేసిన రహస్య అరల్లో వీరిని దాస్తారు. నికరగువా నుంచి హోండూరస్, గ్వాటెమాలాల మీదుగా ప్రయాణించి వీరు మెక్సికో చేరుకుంటారు. సరిహద్దు దాటించేదిలా.... రెండు దేశాల సరిహద్దులో కంచె ఉన్నా చాలా చోట్ల ఖాళీలు (కంచెలేని ప్రాంతాలు) ఉన్నాయి. అక్కడ నుంచి వలసదారులను సరిహద్దు దాటిస్తున్నారు. సరిహద్దు అధికారులతో ఉన్న ‘పరిచయా’లతో కొయిట్లు వీరిని వీలున్న ప్రాంతం నుంచి అమెరికాలోకి పంపుతారు. ఒకోసారి చిన్న పిల్లల్ని సరిహద్దు దాటించి అధికారులు వారిని పట్టుకునే హడావుడిలో ఉండగా మరోవైపు నుంచి వలసదారుల్ని కంచె దాటించేస్తారు. కొందరికి అమెరికా ప్రభుత్వాన్ని శరణార్థి హోదా కోరుతూ రాసిన దరఖాస్తులు ఇచ్చి వాటితో సహా సరిహద్దుల్లో ఉన్న 48 చట్టబద్ధమైన ప్రవేశ మార్గాల్లో ఏదో ఒక చోట అధికారులకు దొరికిపోయేలా చేస్తారు. వీరిని అధికారులు పట్టుకున్నా శరణార్ధుల దరఖాస్తులు ఉండటంతో వెంటనే తిప్పి పంపరు. ఈక్విడార్ నుంచి అమెరికాకు ఉన్న 4,600 కిలో మీటర్ల ఈ ప్రయాణంలో కొన్ని రోజుల పాటు వీరికి ఆహారం కూడా దొరకదు. ఆకలితోనే ప్రయాణించాల్సి వస్తుంది. ఈ కారణంగా దారిలో కొందరు చనిపోవడం కూడా జరుగుతుంది. బయలు దేరిన వారిలో ఎంత మంది గమ్యం చేరుకుంటారు... ఎందరు దారిలోనే ప్రాణాలు పొగొట్టుకుంటారన్నది బయటి ప్రపంచానికి తెలియదు. వలసదారులను తరలిస్తున్న సమాచారాన్ని దారిలో ఉన్న దేశాల్లోని కొయటీస్‌లు ఒకరికొకరు సెల్ఫోన్ల ద్వారా పంపించుకుంటారు. అవసరమైన సొమ్మును వెస్ట్రన్ యూనియన్, మనీగ్రాంల నుంచి బదిలీ చేస్తుంటారు. మెక్సికోకు అమెరికాతో 3,155 కిలో మీటర్ల సరిహద్దు ఉంది. సరిహద్దు పొడవునా1100 కిలో మీటర్ల మేర కంచె ఉంది. అత్యాధునిక పరికరాలు, ఆయుధాలతో దాదాపు16వేల మంది సైనికులు సరిహద్దు వద్ద కాపలా కాస్తుంటారు. అమెరికా చేరే దారులివీ: మొదట ఈక్విడార్ విమానంలో తీసుకెళ్తారు.అక్కడ నుంచి కొలంబియా, పనామా అడవుల మీదుగా మెక్సికో తీసుకెళతారు.ఈ ప్రయాణానికి నెల నుంచి మూడు నెలలు పడుతుంది. 8 నుంచి 15వేల అమెరికా డాలర్లు వసూలు చేస్తారు. మొదట కొలంబియా, పెరు, బొలీవియా చేరుకుంటారు. అక్కడ నుంచి ఏదైనా మధ్య అమెరికా దేశానికి వెళ్లి అక్కడ నుంచి మెక్సికో వెళతారు. ఒక్కోసారి నకిలీ డాక్యుమెంట్లతో నేరుగా మెక్సికోకే పంపుతారు. ఈ దారిలో అమెరికా చేరడానికి కొన్ని వారాలు/నెలలు పడుతుంది. 10 నుంచి 20 వేల డాలర్ల వరకు వసూలు చేస్తారు. (రవాణా చార్జీలు, తిండి ఖర్చు, నకిలీ డాక్యుమెంట్లు, స్థానిక అధికారులకు ఇచ్చే లంచాలు.. అన్నీ దీనిలో కలిసే ఉంటాయి) - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బెదిరించాలని చూడకు.. తట్టుకోలేవ్
వాషింగ్టన్: అమెరికాను బెదిరించాలని ప్రయత్నిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీని ట్విట్టర్లో హెచ్చరించారు. సింహం తోకతో ఆటలాడవద్దని, ఇరాన్‌తో యుద్ధమంటే అంత సులువైనదికాదని ఆదివారం హసన్ రౌహనీ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీనికి ట్రంప్ స్పందించారు. ‘అమెరికాను బెదిరించాలని చూడకండి. లేదంటే చరిత్రలో మీరెప్పుడూ చవిచూడని పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. బెదిరిస్తే భయపడే దేశం కాదు మాది. అమెరికా ఎప్పటికీ, ఎవరికీ భయపడదు’అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ‘మానసిక యుద్ధతంత్రం’గా ఇరాన్ జనరల్ గోలామ్ హొస్సైన్ ఘెయ్పోర్ అభివర్ణించారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికలో భారతీయులు ఎటు?
న్యూయార్క్: పాకిస్థాన్ అంటే హిల్లరీ క్లింటన్‌కు సానుభూతి. ఆ దేశానికి వందల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉపయోగిస్తున్న సైనిక ఆయుధాలు హిల్లరీ ఇచ్చినవే. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీసాను అడ్డుకునేందుకు కూడా ఆమె ప్రయత్నించారు. రిపబ్లికన్ల అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ వర్గం రూపొందించిన టీవీ యాడ్ ప్రచారం ఇది. 38 సెకండ్ల నిడివిగల ఈ టీవీ యాడ్‌ను అమెరికాలోని భారతీయ టీవీ ఛానళ్లలో శుక్రవారం నుంచి విస్తృతంగా ప్రసారం చేస్తున్నారు. క్రుక్డ్ క్లింటన్, వోట్ ఫర్ రిపబ్లికన్, వోట్ ఫర్ యూఎస్-ఇండియా రిలేషన్స్ అనే టైటిల్‌తో ఈ యాడ్‌ను రిపబ్లికన్ హిందూ కొహలిషన్(రిపబ్లికన్ హిందూ మత కూటమి) రూపొందించింది. హిల్లరీ క్లింటన్ ప్రధాన సహాయకురాలు హుమా హబేదిన్కు పాకిస్థాన్ మూలాలు ఉన్నాయని, క్లింటన్ అధికారంలోకి వస్తే ఆమెనే అమెరికా సైనిక దళాల ప్రధానాధికారిని చేస్తారని, హిల్లరీ భర్త బిల్ క్లింటన్ కూడా భారత్‌లోని కాశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చి వేయాలని కోరుకుంటున్నారని కూడా టీవీ యాడ్ ఆరోపణలు చేసింది. పాకిస్థాన్ భూభాగంలో భారత్ సర్జికల్ దాడులు జరిపిన నాటి నుంచి అమెరికన్ భారతీయుల్లో పాకిస్థాన్ పట్ల వ్యతిరేకత, మోదీ ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగింది. అమెరికన్ భారతీయ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ అంశాన్ని బాగా ఉపయోగించుకోవాలని ఇటు డొనాల్డ్ ట్రంప్, ఆయనకు మద్దతిస్తున్న హిందూ వర్గం భావిస్తోంది. అందులో భాగంగా టీవీ యాడ్ల ద్వారా ఊదరగొడుతున్నారు. 2012 లెక్కల ప్రకారం అమెరికాలో 30 లక్షల మంది భారతీయ ఓటర్లు ఉండగా, వారిలో సగం మంది హిందువులున్నారు. ట్రంప్‌ను బలపరుస్తున్న వారు రిపబ్లిక్ హిందూ కోహలిషన్గా, హిల్లరీని సమర్ధిస్తున్న వాళ్లు హిందూ డెమోక్రట్ గ్రూపులుగా వేరు పడ్డారు. పలు భారతీయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు గలవాళ్లు ఉన్నారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్‌లో భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్లు ఉన్నప్పటికీ వారిలో ఎక్కువ మంది డెమోక్రట్ అభ్యర్థికే మద్దతు ఇస్తున్నారు. హిల్లరీని లక్ష్యంగా చేసుకొని భారతీయ టీవీలో ప్రసారం చేస్తున్న తాజా యాడ్‌ను వారు విమర్శిస్తున్నారు. విధానాలను కాకుండా వ్యక్తులను విమర్శించడం తగదని వారు అంటున్నారు. తాము భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఇరుదేశాల మధ్య గౌరవ ప్రదమైన సంబంధాలను కోరుకుంటున్నామని చెప్పారు. ఆది నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాలోని భారతీయులు డెమోక్రట్ అభ్యర్థులకే మద్దతిస్తూ వస్తున్నారు. కానీ ఈసారి రిపబ్లికన్ల తరఫున పోటీ చేస్తున్న ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేస్తుండడం, భారత్‌తో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతుండడంతో ఓ వర్గం రిపబ్లికన్ల వైపు తిరిగారు. అయినప్పటికీ ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో 60 శాతం మంది భారతీయులు అమెరికా అధ్యక్షుడిగా తాము ట్రంప్‌ను కోరుకోవడం లేదని వెల్లడైంది. అయితే అప్పటికి ఇప్పటికీ ట్రంప్‌కు భారతీయుల మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది. కానీ అది ఎంత శాతమన్నది ఇప్పటికీ స్పష్టం కావడం లేదు. భారతీయులను మరింత ఆకర్షించడం కోసం అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం తీసుకొచ్చారు. 2014లో జరిగిన భారత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అబ్ కీ బార్ మోదీ సర్కార్ నినాదంతో అఖండ విజయం సాధించిన విషయం తెల్సిందే. మరి, ట్రంప్ నినాదం భారతీయులను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి. -
డొనాల్డ్ ట్రంప్‌కే ఒబామా సోదరుడి ఓటు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున బరిలోవున్న డొనాల్డ్ ట్రంప్‌కే ఈసారి తాను ఓటేస్తానని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కెన్యా సోదరుడు మాలిక్ ఒబామా (సవతి తల్లి కుమారుడు) స్పష్టం చేశారు. మొదటి నుంచి డెమోక్రట్లకు మద్దతిస్తున్న 58 ఏళ్ల మాలిక్ ఒబామా ఈసారి మనసు మార్చుకున్నారు. అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దడం గొప్ప నినాదమని, అందుకని తాను ట్రంప్‌కు ఓటేస్తానని కెన్యాలోని న్యాంగోమా కొగెలో గ్రామం నుంచి మాలిక్ ఒబామా తన అభిప్రాయాన్ని అమెరికా మీడియాకు తెలిపారు. ‘డొనాల్డ్ ట్రంప్ హృదయం నుంచి మాట్లాడుతారు. అందుకే ఆయన నాకు నచ్చుతారు. అమెరికా గొప్ప దేశంగా తీర్చిదిద్దడం గొప్ప నినాదం. నేను ట్రంప్‌ను కలసుకోవాలని అనుకుంటున్నాను’ అని మాలిక్ ఒబామా వ్యాఖ్యానించారు. అలాగే ఆయన ఒబామా యంత్రాంగం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణల కారణంగానే తాను తన విధేయతను ‘లింకన్ పార్టీ’కి మార్చుకున్నానని ఆయన చెప్పారు. అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రట్ల తరఫున పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌కు ఒబామా ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. ప్రైవేట్ ఈ మెయిళ్ల వ్యవహారంలో హిల్లరీ క్లింటన్‌పై వచ్చిన ఆరోపణలను విచారించకూడదని బరాక్ ఒబామా ప్రభుత్వం నిర్ణయించడం పట్ల కూడా మాలిక్ ఒబామా అసహనంతో ఉన్నారు. తన మంచి మిత్రుల్లో ఒకరైన మొహమ్మద్ గడాఫీని క్లింటన్, ఒబామాలే కలసి చంపించారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలిక్ ఒబామా తన ఆత్మకథను 2012లో రాసి తన దివంగత తండ్రికి అంకితం ఇచ్చిన విషయం తెల్సిందే.