
వాషింగ్టన్: అమెరికాను బెదిరించాలని ప్రయత్నిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీని ట్విట్టర్‌లో హెచ్చరించారు. సింహం తోకతో ఆటలాడవద్దని, ఇరాన్‌తో యుద్ధమంటే అంత సులువైనదికాదని ఆదివారం హసన్ రౌహనీ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చారు.
దీనికి ట్రంప్ స్పందించారు. ‘అమెరికాను బెదిరించాలని చూడకండి. లేదంటే చరిత్రలో మీరెప్పుడూ చవిచూడని పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. బెదిరిస్తే భయపడే దేశం కాదు మాది. అమెరికా ఎప్పటికీ, ఎవరికీ భయపడదు’అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ‘మానసిక యుద్ధతంత్రం’గా ఇరాన్ జనరల్ గోలామ్ హొస్సైన్ ఘెయ్‌పోర్ అభివర్ణించారు.