మెజారిటీ డెమొక్రాట్ల అభిప్రాయం
వాషింగ్టన్: అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని బైడెన్‌పై ఒత్తిళ్లు తీవ్రమవుతున్న వేళ ఆయన కంటే కమలా హారిస్ మంచి అధ్యక్షురాలు అవుతారని మెజారిటీ డెమొక్రాట్లు భావిస్తున్నారు. ప్రతి 10 మంది డెమొక్రాటిక్ పార్టీ సభ్యుల్లో ఆరుగురు కమలా హారిస్ అగ్ర రాజ్యాధినేతగా రాణించగలరని అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఆమె సామర్థ్యంపై అపనమ్మకం వెలిబుచ్చగా, మరో ఇద్దరు ఎటూ చెప్పలేమని, తమకు అంతగా తెలియదని చెప్పుకొచ్చారు. ఏపీ–ఎన్‌ఓఆర్‌సీ సెంటర్ ఫర్ పబ్లిక్ ఆఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన పోల్‌లో డెమొక్రాట్లు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ట్రంప్‌తో జూన్ 27న జరిగిన తొలి అధ్యక్ష చర్చలో బైడెన్ తడబడటం, మతిమరపుతో పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ట్రంప్‌ను ఓడించాలంటే అది కమలకే సాధ్యమవుతుందని, బైడెన్ స్థానంలో ఆమె తమ అధ్యక్ష అభ్యర్థి కావాలని డెమొక్రాట్లు డిమాండ్లు వినిపిస్తున్నారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ.. బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ అధ్యక్ష అభ్యరి్థగా వైదొలగడమే పారీ్టకి మేలని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. బైడెన్ కొనసాగితే వైట్‌హౌస్‌ను కోల్పోవడమే కాకుండా ప్రతినిధుల సభ, సెనేట్‌లోనూ డెమొక్రాటిక్ పారీ్టకి ఎదురుదెబ్బ తగులుతుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.
వైదొలగడం లేదు: ప్రచార సారథి
జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడం లేదని ఆయన ప్రచారబృందం సారథి జెన్ ఒమాలీ డిల్లాన్ శుక్రవారం స్పష్టం చేశారు. అయితే బైడెన్‌కు మద్దతు తగ్గుతున్న విషయాన్ని అంగీకరించారు. ‘ఆయనకు 81 ఏళ్లనేది నిజమే.. కానీ ఆయన గెలవగలరని అమెరికా ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని పాదుకొల్పడానికి మేము చేయాల్సింది ఎంతో ఉంది’ అని డిల్లాన్ అన్నారు. బైడెన్ ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నప్పటికీ ఓటర్లు ట్రంప్‌కు ఓటు వేసేందుకు మొగ్గు చూపడం లేదని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment