ట్రంప్‌పై హత్యాయత్నం!.. మస్క్‌ అనుమానం | Elon Musk Doubt on Trump Assassination Attempt | Sakshi
Sakshi News home page

ట్రంప్‌పై హత్యాయత్నం!.. మస్క్‌ అనుమానం

Published Mon, Sep 16 2024 11:32 AM | Last Updated on Mon, Sep 16 2024 11:52 AM

Elon Musk Doubt on Trump Assassination Attempt

ఆస్టిన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు, రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్‌ నామినీ డొనాల్ట్‌ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగిందన్న వార్త కలకలం రేపుతోంది. ట్రంప్‌కు అతి సమీపంలోనే కాల్పులు జరిగాయని, అయితే ఆయన క్షేమంగా బయటపడ్డారన్నది, అనుమానితుడ్ని భద్రతా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయన్నది ఆ కథనాల సారాంశం. ఇక.. ఈ ఘటనను అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. అయితే..

ట్రంప్‌  మద్దతుదారుడిగా పేరున్న  ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్‌ మస్క్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు దుమారాన్ని రేపింది. ‘‘డొనాల్డ్‌ ట్రంప్‌ను వాళ్లు ఎందుకు చంపాలనుకుంటున్నారు?’’ అని ఓ వ్యక్తి ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేయగా దానికి మస్క్‌ స్పందించాడు. బైడెన్‌, కమలపై మాత్రం ఎందుకనో ఎవరూ హత్యాయత్నం చేయడం లేదు అంటూ ట్వీట్‌ చేశారాయన.

ఆ అనుమానాలకు కొనసాగింపుగా.. ఆయన మరిన్ని ట్వీట్లు చేశారు. తాను లేవనెత్తిన అంశాన్ని కనీసం ఎవరూ ప్రస్తావించడం లేదంటూ మరో ట్వీట్‌ చేశారు. ఈలోపు.. ట్రంప్‌ వ్యవస్థను భయపెడుతున్నారని, అందుకే ఆ వ్యవస్థ ఆయన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఆ వ్యవస్థ బైడెన్‌, కమల అంటూ ఓ వ్యక్తి ట్వీట్‌ చేశాడు. అయితే మస్క్‌ దానికి నూటికి నూరు శాతం అంటూ రిప్లై ఇచ్చారు. మస్క్‌ ట్వీట్‌పై డెమోక్రటిక్‌ మద్దతుదారులతో పాటు రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఇదీ చదవండి: చంపినా వెనక్కి తగ్గను: ట్రంప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement