
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖతార్ భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని ట్రంప్‌కు బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఖతార్‌కు వచ్చినపుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు.
వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారంలో మధ్యప్రాచ్య పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్.. ఖతార్ పాలక కుటుంబం నుంచి విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని బహుమతిగా స్వీకరించనున్నట్లు సమాచారం. ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఖతార్‌కు వచ్చినపుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఒక విదేశీ ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద కానుకను అమెరికా అధ్యక్షుడు స్వీకరించడం, దాని చట్టబద్ధతపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Qatar to Gift $400 Million Plane to President Trump:
▪️According to ABC News, the Trump administration is set to accept a luxury Boeing 747-8 jumbo jet—valued at around $400 million—from the Qatari royal family.
▪️The plane will serve as Air Force One for Trump until just… pic.twitter.com/d1H7OdyNmD— Beau Bannon🇺🇸 (@BeauBannon) May 11, 2025
అయితే, విదేశీ ప్రభుత్వం నుండి ఇంత పెద్ద బహుమతిని అధ్యక్షుడు స్వీకరించడంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అమెరికా రాజ్యాంగంలోని జీతాల నిబంధన, ఆర్టికల్ I, సెక్షన్ 9, క్లాజ్ 8, ప్రభుత్వ పదవిలో ఉన్న ఎవరైనా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏదైనా.. రాజు, యువరాజు లేదా విదేశీ రాష్ట్రం.. నుండి ఏదైనా బహుమతి, జీతం, కార్యాలయం లేదా బిరుదును స్వీకరించడాన్ని నిషేధిస్తుంది. ఈ నేపథ్యంలో, అమెరికా అధికారులు దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్ వన్) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీ విరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్ ‘ఎయిర్‌ఫోర్స్ వన్’కు కొత్త వెర్షనుగా ఉపయోగిస్తారు. సురక్షితమైన కమ్యూనికేషన్లు, ఇతర అవసరమైన సౌకర్యాలు జోడించాలని యోచిస్తున్నారు.