military base
-
సిరియా సైనిక స్థావరాల్లో 80 శాతం ధ్వంసం
ఇజ్రాయెల్: సిరియాలోని వ్యూహాత్మక సైనిక స్థావరాల్లో 80 శాతం ప్రాంతాలపై దాడి చేసి ఆ దేశ సైనిక సామర్థ్యాలను చావుదెబ్బతీశామని ఇజ్రాయెల్ తెలిపింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలన అంతమైన కొద్ది రోజులకే సిరియాలోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై తమ సేనలు గురిపెట్టి పని పూర్తిచేశామని ఇజ్రాయెల్ తెలిపింది. గత 48 గంటల్లో 400కు పైగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం గురువారం ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌కు తూర్పున ఉన్న నిస్సైనీకరణ(బఫర్ జోన్) ప్రాంతంలోకి దళాలను పంపామని, 80 శాతం సిరియా సైనిక స్థావరాలను నేలమట్టంచేశామని వెల్లడించింది. ఆయుధ నిల్వలపై దాడి చేసి, అవి తిరుగుబాటుదారుల శక్తుల చేతుల్లో పడకుండా నిరోధించామని తెలిపింది. అన్ని రకాల ఆయుధాలు ధ్వంసం ‘‘అల్–బైదా పోర్టు, లటాకియా పోర్టు, డమాస్కస్, ఇతర కీలక నగరాల్లో శత్రు వుల యుద్ధవిమానాలను కూల్చే ఆయుధ వ్యవస్థలు, ఆయుధాగారాలకు చెందిన 15 నావికాదళ నౌకలను ధ్వంసం చేశాం. సముద్రతలంపై 80 నుంచి 190 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను చేధించేందుకు సముద్రతలం నుంచి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణులను ధ్వంసంచేశాం. స్కడ్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, ఉపరితలం నుంచి సముద్రం వరకు, ఉపరితలం నుంచి గగనతలంలోకి, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణు లు, మానవసహిత యుద్ధ వాహకాలు (యూఏవీ), యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, రాడార్లు, ట్యాంకులు, హ్యాంగర్లు తదితర వ్యూహాత్మక ఆస్తులను నిరీ్వర్యం చేశాం’’అని సిరియా సైన్యం పేర్కొంది. సిరియాలో 2011లో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వందలాది దాడులు చేసింది.అసద్ పతనంపై నెతన్యాహు ఏమన్నారంటే..అసద్ పాలన అంతమై రోజు చారిత్రాత్మకమైన రోజు అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్, అసద్‌లకు ప్రధాన మద్దతుదారులైన హెజ్బొల్లాలను తాము చావు దెబ్బ కొట్టిన ఫలితమే అసద్ పాలన అంతానికి అసలు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అణచివేత పాలన నుంచి విముక్తి పొందాలనుకునేవారికి స్వేచ్ఛ, సాధికారత ఇజ్రాయెల్ కలి్పంచిందని ఆయన ఒక వీడియో ప్రకటనలో చెప్పారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లను, ఇరాన్ మద్దతు ఉన్న పాలస్తీనా హమాస్ కీలక నేతలను, లెబనాన్ హెజ్బొల్లా సీనియర్ నాయకులను ఇజ్రాయెల్ వరసబెట్టి అనూహ్య దాడుల్లో అంతంచేయడం తెల్సిందే. -
Jordan Attack: అంతటి అమెరికా సైన్యమే పొరబడింది!
జోర్డాన్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరం టవర్ 22పై మిలిటెంట్ గ్రూప్ జరిపిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉండే అమెరికా డ్రోన్ దాడిని అడ్డుకోకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై దర్యాపు చేసిన అమెరికా సైనిక అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. మిలిటెంట్ దళాలు డ్రోన్ దాడులు చేసిన సమయంలో అమెరికాకు సంబంధించిన ఒక డ్రోన్ ఆర్మీ పోస్ట్‌కు వస్తుందని సైనిక శిబిరం భావించింది. తక్కువ ఎత్తులో సైనిక స్థావరం వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ను అప్పటికే షెడ్యూల్ చేసిన తమ డ్రోన్‌గా భావించించారు సైనిక అధికారులు. తమ స్థావరం వైపు వస్తున్న డ్రోన్ తమదే అనుకొని పొరపాటు పడ్డారు. దానివల్లనే మిలిటెంట్ల డ్రోన్ దాడిని తాము అడ్డుకోలేకపోయామని సైనిక అధికారులు పేర్కొన్నారు. మిలిటెంట్లు ప్రయోగించిన డ్రోన్ సైనిక శిబిరంపై పడినట్లు పేర్కొంది. ఈ దాడిలో ముగ్గురు సైనికులు మరణించగా.. 40 మంది సైనికులు గాయపడ్డారు. ఇక్కడ సుమారు 350 మంది అమెరికా సైనికులు పని చేస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ డ్రోన్ దాడి మధ్యప్రాచ్యలో అమెరికా స్థావరం జరిగిన అతి పెద్ద దాడిగా తెలుస్తోంది. ఇరాన్ దేశానికి చెందిన ఇస్లామిక్ రెసిస్టాన్స్ మిలిటెంట్ గ్రూప్ డ్రోన్ దాడికి పాల్పడినట్టు అమెరికా ఆరోపిస్తోంది. ఈ ఘటనపై స్పందిచిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ‘జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ ఇరాన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ గ్రూప్ పని. సమయం వచ్చిప్పుడు తాము అంతే స్థాయిలో స్పందిస్తాం’ అని అన్నారు. అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ మిలిటెంట్‌కు గ్రూప్‌కు తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తాము ఎవరికీ డ్రోన్ దాడులకు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదని ఇరాన్ పేర్కొంది. -
నలుగురు సైనికులను కాల్చి చంపింది మన జవానే.. ఉగ్ర కోణం లేదు..
చండీగడ్: గత బుధవారం పంజాబ్‌లోని భటిండా సైనిక శిబిరంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇది ఉగ్రవాదుల పనా? అని అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ ఘటనలో ఉగ్ర కోణం లేదని పంజాబ్ పోలీసులు సోమవారం వెల్లడించారు. దాడి చేసింది తోటి జవాన్ మోహన్ దేశాయ్ అని తెలిపారు. కాల్పుల అనంతరం అనుమానంతో అతడ్ని అరెస్టు చేసి విచారించగా నేరంగా అంగీకరించినట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో చనిపోయిన నలుగురు జవాన్లు తనను వేధించడం వల్లే దాడి చేసి హతమార్చినట్లు మోహన్ దేశాయ్ అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. మొదట పోలీసులను అయోమయానికి గురి చేసేందుకు కట్టు కథలు చెప్పాడని, ఆ తర్వాత విచారణలో నిజాన్ని ఒప్పుకున్నాడని వివరించారు. ఈ ఘటనలో ఉపయోగించిన ఆయుధాలను మిలిటరీ స్టేషన్ నుంచే మోహన్ దొంగిలించాడని పేర్కొన్నారు. మోహన్‌కు ఇంకా పెళ్లి కాలేదని ఒంటరిగానే ఉంటున్నాడని అధికారులు వెల్లడించారు. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే విషయంపైనా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఏం జరిగిందంటే? పంజాబ్‌లోని భటిండా సైనిక శిబిరంలో శతఘ్ని దళానికి చెందిన జవాన్లు నివసించే ఆర్మీ స్టేషన్‌లోని ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇందులో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలిలో ఇన్సాస్ రైఫిల్‌కు చెందిన 19 ఖాళీ తూటాలు లభించాయి. ఘటన విషయం తెల్సిన వెంటనే తక్షణ స్పందన దళం రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, సైన్యం.. నిందితుడి కోసం వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కన్పించిన మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: మిలిటరీ స్టేషన్‌పై దుండగుల దాడి.. తుపాకులతో కాల్పులు.. నలుగురు సైనికులు మృతి.. -
రష్యా రాకెట్ దాడుల్లో... 600 మంది సైనికులు మృతి!
మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లో సైనికుల తాత్కాలిక నివాసాలపై తాము జరిపిన రాకెట్ దాడుల్లో 600 మంది మరణించారని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా అధీనంలో ఉన్న డాన్‌టెస్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ దాడుల్లో 89 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకార చర్యగానే తాము క్రమటోర్క్‌స్‌పై ప్రాంతంలో సైనికుల ఇళ్లపై దాడులు చేసినట్టు పేర్కొంది. సైనికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఇళ్లకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందడంతో తాము రాకెట్ దాడులు చేశామని ఒక ప్రకటనలో తెలిపింది. ఒక ఇంట్లో 700 మంది సైనికులు ఉంటే, మరొక ఇంట్లో 600 మంది ఉన్నారని తాము చేసిన రాకెట్ దాడుల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఇదే నిజమైతే గత ఫిబ్రవరి 24న యుద్ధం మొదలు పెట్టినప్పట్నుంచి ఉక్రెయిన్‌కు భారీగా ప్రాణనష్టం జరిగిన ఘటన ఇదే. -
రష్యాకు ఊహించని షాక్.. మిలిటరీ క్యాంప్‌పై కాల్పులు.. 11 మంది మృతి
మాస్కో: ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాకు ఊహించని షాక్ తగిలింది. ఉక్రెయిన్ సరిహద్దులోని బెల్గొరోడ్ ప్రాంతంలో రష్యా సైనిక శిక్షణ కేంద్రంపై టెర్రరిస్ట్‌లు దాడి చేశారు. ఇద్దరు దుండగులు కాల్పులు జరపటంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మాజీ సోవియేట్ స్టేట్‌కు చెందిన ఇద్దరు పౌరులు.. సైనికులకు శిక్షణ ఇస్తున్న క్రమంలో కాల్పులు చేపట్టారు. ఇరువురు దుండగులను బలగాలు మట్టుబెట్టినట్లు రష్యా మిలిటరీ వెల్లడించింది. ‘బెల్గొరోడ్ ప్రాంతం పశ్చిమ మిలిటరీ డిస్ట్రిక్ట్‌లోని సైనిక శిక్షణ కేంద్రంపై సీఐఎస్ దేశం పౌరులు ఇద్దరు అక్టోబర్ 15న కాల్పులు జరిపారు. ఉక్రెయిన్‌లో ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ కోసం వలంటీర్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.’ అని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. సైనిక చేరికలను పెంచుతున్నట్లు సెప్టెంబర్ 21న ప్రకటించిన తర్వాత.. ఇప్పటి వరకు 2 లక్షలకుపైగా చేరినట్లు తెలుస్తోంది. సైనిక బలగాల నియామకాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ -
ఉక్రెయిన్‌పైకి హైపర్ సోనిక్ క్షిపణితో దాడి
కీవ్: యుద్ధానికి తెర తీసి మూడున్నర వారాలైనా విజయం అందని ద్రాక్షే కావడంతో రష్యా చిర్రెత్తిపోతోంది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే అత్యాధునిక హైపర్ సోనిక్ క్షిపణి ‘కింజల్’తో ఉక్రెయిన్ సైనిక ఆయుధాగారంపై శుక్రవారం అర్ధరాత్రి విరుచుకుపడింది. పశ్చిమ ఉక్రెయిన్‌లో రొమేనియా సరిహద్దు సమీపంలోని ఇవనో–ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలో క్షిపణులు, వైమానిక ఆయుధాలను నిల్వ చేసే భారీ భూగర్భ ఆయుధాగారాన్ని కింజల్ పూర్తిగా ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ప్రకటించారు. రేవు పుట్టణం ఒడెసా సమీపంలోని ఉక్రెయిన్ సైనిక స్థావరాలను కూడా యాంటీ షిప్ మిసైల్ సిస్టం సాయంతో క్షిపణి ప్రయోగాలతో నేలమట్టం చేసినట్టు చెప్పారు. అణ్వాయుధాలనూ మోసుకుపోగల కింజల్‌ను రష్యా యుద్ధంలో ప్రయోగించడం ఇదే తొలిసారి. అయితే శుక్రవారం నాటి దాడిలో సాంప్రదాయిక వార్ హెడ్నే వాడారు. మిగ్–31 ఫైటర్ జెట్ ద్వారా క్షిపణిని ప్రయోగించారు. డెలియాటిన్ సెటిల్మెంట్లోని తమ ఆయుధాగారంపై క్షిపణి దాడి నిజమేనని ఉక్రెయిన్ చెప్పింది. మారియుపోల్‌లో ఉన్న యూరప్‌లోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ అజోవ్‌స్టాల్ కూడా రష్యా సైన్యం దాడిలో దాదాపుగా నేలమట్టమైందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా భూ, గగన తలాల గుండా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కీవ్‌తో పాటు ఖర్కీవ్, మారియుపోల్, అవ్డివ్కా, క్రమటోర్స్క్, పొక్రోవ్స్క్, నొవొసెలిదివ్కా, వెర్కోనొటొరెస్కే, క్రిమ్కా, స్టెప్నే, లివివ్ తదితర నగరాలు బాంబుల దాడితో వణికిపోతున్నాయి. నివాస ప్రాంతాలపై కూడా రష్యా సైన్యం విచక్షణారహితంగా దాడులకు తెగబడుతోందని ఉక్రెయిన్ దుయ్యబట్టింది. స్కూళ్లు, ఆస్పత్రులు, మ్యూజియాలు, షాపింగ్ సెంటర్లు వేటినీ వదలడం లేదని ఆరోపించింది. మారియుపోల్ దాదాపుగా రష్యా చేతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో అజోవ్ సముద్రంతో ఉక్రెయిన్‌కు సంబంధం తెగిపోయిందంటున్నారు. దక్షిణ ఉక్రెయిన్‌లోని మైకోలైవ్‌లో ఓ సైనిక స్థావరంపై రష్యా జరిపిన దాడుల్లో 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం. 50కి పైగా మృతదేహాలను వెలికితీశారు. దాడి సమయంలో రెజిమెంట్‌లో 200 మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది. పాపం పిల్లలు! ఉక్రెయిన్ నుంచి వలసల సంఖ్య 40 లక్షలు దాటినట్టు సమాచారం. దేశ జనాభాలో ఇది దాదాపు 10 శాతం! 75 లక్షల ఉక్రెయిన్ బాలల్లో సెకనుకు ఒకరి చొప్పున శరణార్థిగా మారుతున్నారు. మరో 10 కారిడార్లు కీవ్, మారియుపోల్, లుహాన్స్క్, రష్యా అధీనంలోని ఖెర్సన్ సహా పలు నగరాల్లో 10 హుమానిటేరియన్ కారిడార్లకు రష్యాతో అంగీకారం కుదిరినట్టు ఉక్రెయిన్ తెలిపింది. నిత్యావసరాల సరఫరాను రష్యా సైన్యం అడ్డుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. ఇప్పటికైనా తనతో నేరుగా చర్చలకు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు. తటస్థ హోదాకు ఉక్రెయిన్ ఓకే: రష్యా నాటో సభ్యత్వ డిమాండ్‌ను వదులుకునేందుకు, తటస్థ దశంగా కొనసాగేందుకు ఉక్రెయిన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చర్చల్లో రష్యా బృందానికి నేతృత్వం వహించిన వ్లాదిమిర్ మెడిన్స్కీ శుక్రవారం చెప్పారు. కానీ తమ వైఖరిలో మార్పూ లేదని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ దుస్తుల్లో రష్యా వ్యోమగాములు? శుక్రవారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు వెళ్లిన ముగ్గురు రష్యా వ్యోమగాములు ఉక్రెయిన్ జెండాతో సరిపోలే నీలి, పసుపు రంగు స్పేస్ సూట్లు ధరించి కన్పించారు! ‘‘ఏ రంగు సూట్లు ఎంచుకోవాలన్నది మా ఇష్టం. పసుపు రంగు సూట్లు మా దగ్గర చాలా పోగుపడ్డాయి. దాంతో అవే వేసుకోవాల్సి వచ్చింది’’ అని వాళ్లు చెప్పారు. ఉక్రెయిన్‌కు నైతిక మద్దతుగానే ఈ పని చేశారా అన్నది తెలియరాలేదు. -
పాకిస్తాన్ రక్తసిక్తం.. వందకుపైగా సైనికులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ రక్తసిక్తమైంది. మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. పంజూర్, నోష్కీ పోస్టులపై రెండు ఆత్మాహుతిదాడులు జరిగాయి. ఒక్కో దాడిలో ఆరుగురు సూసైడ్ బాంబర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో వందల మంది పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. కాగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా పర్యటనకు ముందు ఈ దాడులు జరగడం పాక్ ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. చదవండి: ('సీఎం సార్ హెల్ప్ మీ'.. గమనించి వెంటనే కారు ఆపి..) -
మిలటరీ బేస్ వద్ద తిరుగుబాటు జరిగిందంటూ వదంతులు!!
Africa: ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశ రాజధాని దగ్గరలోని మిలటరీ బేస్ వద్ద ఆదివారం భారీ కాల్పులు జరిగాయి. దీంతో టర్కీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలటరీ తిరుగుబాటు జరిగిందన్న పుకార్లు వ్యాపించాయి. ఇటీవల కాలంలో దేశంలో పెరిగిపోతున్న ముస్లిం తిరుగుబాట్లను ప్రభుత్వం సరిగా అణిచివేయడంలేదన్న ఆరోపణలున్నాయి. అయితే ఆర్మీ తిరుగుబాటు ఏమీ జరగలేదని, అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరేను ఎవరూ నిర్భంధించలేదని రక్షణ మంత్రి సింపురె ప్రకటించారు. సైనికుల్లో అభిప్రాయభేదాలు ముదిరి కాల్పులు జరుపుకున్నారని ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఆర్మీలో క్రమశిక్షణ నెలకొల్పేందుకు యత్నిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు ఆందోళన చేస్తున్న సైనికులు మీడియాకు ఫోన్ చేశారు. తమకు సరైన పనిచేసే పరిస్థితులు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. దేశంలో మిలటరీ, ఇంటెలిజెన్స్‌ల్లో వంశపారంపర్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఆందోళనలు పెరుగుతున్న సందర్భంగా ఇటీవలే దేశ ప్రధానిని అధ్యక్షుడు తొలగించారు. (చదవండి: భారీ మూల్యం తప్పదు!..ఉక్రెయిన్ అధిపతిగా రష్యా అనుకూల నేత! -
అమెరికా స్థావరాల్లో అఫ్గాన్ శరణార్థులు
సంక్షోభంలో ఉన్న అఫ్గానిస్తాన్ నుంచి భయంతో వలస వస్తున్న శరణార్థుల కోసం అమెరికా మరో మూడు మిలటరీ బేస్‌లను కేటాయించింది. ఇప్పటికే మధ్యప్రాచ్యం, యూరప్‌లో శరణార్థుల కోసం కేటాయించిన స్థావరాలతో పాటు తాజాగా మెరైన్ కార్ప్స్ బేస్, ఫోర్ట్ పికెట్, హోలోమ్యాన్ ఎయిర్‌బేస్‌లను సైతం వీరి కోసం కేటాయిస్తున్నట్లు యూఎస్ ప్రతినిధి జాన్ కిర్బే చెప్పారు. అఫ్గాన్ స్పెషల్ వీసా ఉన్న దరఖాస్తుదారులు, వారి కుటుంబసభ్యులు, రిస్కు ఎదుర్కొంటున్న వ్యక్తులను అఫ్గాన్ నుంచి తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నామని, ఈ మిషన్ కు అదనపు మద్దతు కోసం కొత్త బేస్‌లను కేటాయించామని కిర్బే తెలిపారు.చదవండి: అమెరికా, చైనా మధ్య తొలిసారి సైనిక చర్చలు దీంతో అఫ్గాన్ శరణార్థుల కోసం అమెరికా స్వదేశంలో కేటాయించిన స్థావరాల సంఖ్య ఏడుకు చేరిందన్నారు. ఇవి కాకుండా ఖతార్, బహ్రెయిన్, జర్మనీల్లో అమెరికాకు మరో 10 స్థావరాలున్నాయని ఆయన వివరించారు. అమెరికాలోని అన్ని స్థావరాలు కలిసి 70 వేల మందికి ఆశ్రయం కల్పించగలవని కిర్బే చెప్పారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంలో మిలటరీకి హోమ్‌ల్యాండ్ శాఖ, ఆరోగ్య శాఖ సహాయం చేస్తున్నాయని వివరించారు. సరిహద్దు దేశాలేవీ అఫ్గానిస్తాన్ పౌరులను రానీయకపోవడంతో వీరంతా అమెరికా ఆశ్రయం కోసం ఎదురు చూస్తూ విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. చదవండి: విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు ఏ బేస్‌లో ఎంతమంది? జర్మనీలోని రమ్స్టెయిన్ బేస్‌కు గతవారం దాదాపు 7,500మంది శరణార్థులు వచ్చారు. ఈ బేస్ సామర్ధ్యం 12వేలని అధికారులు చెప్పారు. బహ్రెయిన్‌లోని ఇసా ఎయిర్‌బేస్‌లో 5 వేల మందికి ఆశ్రయం కల్పించే యత్నాలు జరుగుతున్నాయి. ఫోర్ట్ బ్లిస్‌లో 650 మందికి ఆవాసం కల్పించారు. దీని సామర్థ్యం పదివేలని అధికారులు చెప్పారు. ఫోర్ట్ డిక్స్లో 9,500 మందికి టెంట్ హౌస్‌ల్లో నివాసం కల్పించారు. అయితే కొన్ని బేస్‌ల్లో పరిస్థితి ఘోరంగా ఉందని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అల్ ఉదైద్ బేస్‌లో పరిస్థితి నరకం కన్నా హీనంగా ఉందని, ఎలుకలు తిరుగుతున్నాయని అధికారులు చెప్పారు. మరోవైపు మిలటరీ బేస్‌ల్లో శరణార్థు లకు తాత్కాలిక నివాసం కల్పిస్తున్నారు కానీ, తర్వాత వీరిని ఎక్కడకు తరలిస్తారన్న విషయమై అమెరికా స్పష్టత ఇవ్వలేదు. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు వీరికి శాశ్వత ఆవాసం కల్పించేందుకు ముందుకువస్తున్నారు. ఈ బేస్‌లను అధ్యక్షుడు బైడెన్ సందర్శించాల్సి ఉన్నా, కాబూల్ పేలుళ్ల కారణంగా వాయిదా పడింది. సరిహద్దు దేశాలు మానవతా ధృక్పధంతో శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని ఐరాస కోరింది. –నేషనల్ డెస్క్, సాక్షి -
ఆఫ్ఘనిస్తాన్‌లో వరుస బాంబు దాడులు..
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండోరోజు బాంబుల మోతతో దద్దరిల్లింది. తాజాగా బుధవారం జలాలాబాద్ నగరంలో కారు బాంబు దాడి జరిగింది. మిలిటరీ కాన్వేను లక్ష్యంగా చేసుకొని జరిపిన ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా.. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. కాగా ఇదే విషయమై అఫ్ఘన్ ప్రతినిధి అతాహుల్లా కోగియాని స్పందించారు. కారు బాంబు దాడి ఉదయం 10. 10 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సాధారణంగానే బిజీగా ఉండే రోడ్డుపై ఆ సమయంలో మిలిటరీ కాన్వేకు చెందిన వాహనం వెళ్లింది. దీనిని లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనేది త్వరలోనే తేలుస్తాం. అని పేర్కొన్నారు. కాగా గాయపడిన వారిని జలాలాబాద్‌లోని రీజినల్ ఆసుపత్రికి తరలించారు. కాగా మంగళవారం రాత్రి ఇదే తరహాలో ప్రజలు ప్రయాణించే బస్సుల్లో బాంబులు పెట్టిన దుండగులు 8 మంది చావుకు కారణం కాగా.. ప్రమాదంలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
తైవాన్ కేంద్రంగా చైనా భారీ స్కెచ్..!
బీజింగ్ : హిందు మహా సముద్రంపై పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నాలను తీవ్రతరం చేస్తోందని అందులో భాగంగా తైవాన్ కేంద్రంగా పథక రచన చేస్తోందని యూఎస్ చట్టసభ ప్రతినిధి రిచర్డ్ డి ఫిషర్ హెచ్చరించారు. చైనా చాలా కాలం నుంచి భారత్, జపాన్ల మధ్య సంబంధాలను దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దక్షిణ చైనా, హిందు మహాసముద్రాల మీద అధిపత్యం సాధించడం ద్వారా భారత్‌కు మిత్రదేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాలను దెబ్బతీయాలనేది చైనా వ్యుహం. రిచర్డ్ మాట్లాడుతూ.. ‘తైవాన్‌లో అణుకేంద్రాలతోపాటు, భారీగా మిలటరీ స్థావరాలు ఏర్పరుచుకోవడం ద్వారా క్రమంగా హిందు మహాసముద్రంపై, దక్షిణ చైనా సముద్రంపై అధిపత్యాన్ని పెంచుకోవచ్చని చైనా భావిస్తుంది. ఆర్థికంగా స్థిరపడుతున్న చైనా, అదే విధంగా సైనిక శక్తిని పెంచుకుంటుంది. దీని ద్వారా భారత్, జపాన్ల మధ్య సంబంధాలను దెబ్బతీయాలని చూస్తోంది. భారత్ పొరుగు దేశాలను తన అదుపులోకి తెచ్చుకోవడానికి వాటికి భారీగా ఆర్థిక సాయం చేయబోతోంది’ అన్నరు. అయా దేశాల్లో కూడా సైనిక బలాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని జిబూటీలో సైనిక స్థావరాన్ని ఏర్పరుచుకున్న చైనా ఆ సరిహద్దుల్లో అమెరికా సైనిక జోక్యం చేసుకోకుండా చర్యలు చేపట్టవచ్చన్నారు. ఇప్పటికే శ్రీలంకతో సత్సబంధాలు కొనసాగిస్తున్న చైనా .. ప్రస్తుతం వనౌతు, పాకిస్తాన్, థాయ్‌లాండ్ వంటి దేశాలతో కూడా అదే విధంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పటికే తైవాన్ను తన సైనిక, అణు స్థావరంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నా చైనా 2025 వరకల్లా ఆ పని పూర్తి చేస్తుందని రిచర్డ్ అన్నారు. -
సీషెల్స్‌లో ఆర్మీ కేంద్రం ఏర్పాటుపై కదలిక
విక్టోరియా: పసిఫిక్ మహాసముద్రంలోని సీషెల్స్ దీవిలో మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న భారత్ ప్రతిపాదన పట్ల అక్కడి రాజకీయ నాయకులు సానుకూలంగా స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015లో సీషెల్స్‌లో పర్యటించిన సమయంలో ఈ ప్రతిపాదన చేశారు. కేంద్రానికి నిధులు భారత ప్రభుత్వమే సమకూరుస్తుందని.. రెండు దేశాలు వినియోగించుకోవచ్చని ప్రతిపాదించారు. తీరప్రాంత రక్షణ, అక్రమంగా చేపలు పట్టడం, మత్తుపదార్థాల రవాణా, పైరసీ వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవటంలో ఈ కేంద్రం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. -
అఫ్గాన్‌లో చైనా మిలటరీ బేస్!
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో మిలటరీ బేస్ నిర్మించేందుకు చైనా ఆ దేశంతో చర్చలు జరుపుతోంది. పర్వతాలతో కూడిన మారుమూల ప్రాంతమైన వాఖన్ కారిడార్‌లో ఇది ఏర్పాటు కానుం దని అఫ్గానిస్తాన్ అధికారులు చెప్పారు. చైనా, అఫ్గాన్ బలగాలు ఇక్కడ సంయుక్తంగా గస్తీ కాసినట్లు గతంలోనే వార్తలు వెలువడ్డాయి. వాఖన్ కారిడార్ నుంచి దాని పొరుగునే ఉన్న తమ సరిహద్దు ప్రాంతం జిన్జియాంగ్లోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారని ఆందోళన చెందుతున్న చైనా..అక్కడ మిలటరీ బేస్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఆర్థికంగా, భౌగోళికంగా తన పలుకుబడిని విస్తరించుకునేందుకు కూడా ఈ ప్రణాళిక దోహదపడుతుందని భావిస్తున్నారు. దక్షిణాసియాలో మౌలిక వసతుల కల్పనకు బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్న చైనాను అఫ్గాన్‌లోని అస్థిర పరిస్థితులు కలవరపెడుతున్నాయి. వాఖన్లో మిలటరీ బేస్ నిర్మాణానికి సంబంధించి డిసెంబర్లోనే చర్చలు జరిగినా పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. -
యుద్ధ విమానాలతో సిరియా స్థావరం చిత్తు
సాక్షి, లెబనాన్ : సిరియాపై ఇజ్రాయెల్ జెట్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. సైనిక స్థావరంపై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయినట్లు సిరియా బలగాలు తెలిపాయి. అయితే, అరబ్ మీడియా, అక్కడి హక్కుల సంస్థలు మాత్రం ఇజ్రాయెల్ జెట్ యుద్ధ విమానాలు సిరియాలోని రసాయన ఆయుధాలు ఉత్పత్తి చేసే స్థావరాన్ని లక్ష్యంగా దాడి చేశాయని, వీటి భద్రతను సిరియా సేనలే చూస్తున్నాయని అభిప్రాయపడ్డాయి. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై ఇజ్రాయెల్ ప్రతినిధులను ప్రశ్నించే ప్రయత్నం చేసినా వారు నిరాకరించారు. మరోపక్క, లెబనాన్ మీడియా ఇజ్రాయెల్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లెబనాన్ ఎయిర్‌స్పేస్ నిబంధనలు ఆ దేశం ఉల్లంఘించిందంటూ వ్యాఖ్యానించింది. లెబనాన్ గగనతలం గుండా ప్రయాణించే సిరియాలోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. -
భారత ఆర్మీ స్థావరం వద్ద తీవ్ర కలకలం!
అనుమానాస్పద బ్యాగులు లభించడంతో హై అలర్ట్ పఠాన్ కోట్ ఆర్మీ స్థావరానికి కొన్ని అడుగుల దూరంలోనే రెండు అనుమానాస్పద బ్యాగులు దొరకడం తీవ్ర కలకలం రేపింది. గురువారం ఉదయం పఠాన్ కోట్ లోని మమూన్ కంటోన్మెంట్ కు సమీపంలో రెండు అనుమానాస్పద బ్యాగులు దొరికాయి. వాటిని స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్ నిపుణులు ఆ బ్యాగులను తెరిచి చూడగా.. అందులో అనుమానాస్పదరీతిలో రెండు మొబైల్ టవర్ బ్యాటరీలు దొరికాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి హై అలర్ట్ ప్రకటించారు. గత మంగళవారం ఓ స్కార్పియో వాహనం బారికేడ్లను ఢీకొట్టి.. పోలీసులను తప్పించుకొని పోయింది. అనంతరం ఆ వాహనాన్ని గురుదాస్ పూర్ జిల్లాలో వదిలేశారు. ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబరుతో ఉన్న ఆ వాహనంలో ఐదారుగురు అనుమానిత వ్యక్తులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించారని గుర్తించిన పోలీసులు.. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.