ఫైల్ ఫోటో
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండోరోజు బాంబుల మోతతో దద్దరిల్లింది. తాజాగా బుధవారం జలాలాబాద్ నగరంలో కారు బాంబు దాడి జరిగింది. మిలిటరీ కాన్వేను లక్ష్యంగా చేసుకొని జరిపిన ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా.. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.
కాగా ఇదే విషయమై అఫ్ఘన్ ప్రతినిధి అతాహుల్లా కోగియాని స్పందించారు. కారు బాంబు దాడి ఉదయం 10. 10 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సాధారణంగానే బిజీగా ఉండే రోడ్డుపై ఆ సమయంలో మిలిటరీ కాన్వేకు చెందిన వాహనం వెళ్లింది. దీనిని లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనేది త్వరలోనే తేలుస్తాం. అని పేర్కొన్నారు. కాగా గాయపడిన వారిని జలాలాబాద్‌లోని రీజినల్ ఆసుపత్రికి తరలించారు. కాగా మంగళవారం రాత్రి ఇదే తరహాలో ప్రజలు ప్రయాణించే బస్సుల్లో బాంబులు పెట్టిన దుండగులు 8 మంది చావుకు కారణం కాగా.. ప్రమాదంలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment