విక్టోరియా: పసిఫిక్ మహాసముద్రంలోని సీషెల్స్ దీవిలో మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న భారత్ ప్రతిపాదన పట్ల అక్కడి రాజకీయ నాయకులు సానుకూలంగా స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015లో సీషెల్స్‌లో పర్యటించిన సమయంలో ఈ ప్రతిపాదన చేశారు. కేంద్రానికి నిధులు భారత ప్రభుత్వమే సమకూరుస్తుందని.. రెండు దేశాలు వినియోగించుకోవచ్చని ప్రతిపాదించారు. తీరప్రాంత రక్షణ, అక్రమంగా చేపలు పట్టడం, మత్తుపదార్థాల రవాణా, పైరసీ వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవటంలో ఈ కేంద్రం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment