India proposal
-
వ్యాక్సిన్ పేటెంట్ ఎత్తివేతకు అగ్రరాజ్యం మద్దతు
వాషింగ్టన్: ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారిని అడ్డుకట్టకు టీకాతోనే సాధ్యమని భావించి ఆయా దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీ, ఉత్పత్తిలో నిమగ్నమైయ్యాయి. అయితే పేటెంటు ఫీజుల కారణంగా టీకాల ధర పెరగుతుండడంతో ఈ ప్రభావం పేద దేశాలపై పడుతుంది. దీంతో ఖరీదైన టీకాలు కొనలేక వారు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ప్రస్తుత విశ్వవ్యాప్త సంక్షోభం దృష్ట్యా ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే భారత్ సహా దక్షిణాఫ్రికా దేశాలు అమెరికాకు విజ్ఞప్తి చేశాయి. తాజాగా ఈ విషయం పై అగ్రరాజ్యం సానుకూలంగా స్పందించింది. అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం.. మేధో సంపత్తి హక్కులు ముఖ్యమే అయినప్పటికీ మహమ్మారిని అందరూ కలిసి అంతం చేయాల్సి ఉన్నందున పేటెంట్ మినహాయింపును వైట్‌హౌస్ వర్గాలు సమర్థిస్తున్నట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరిన్ టాయ్ ప్రకటించారు. “ఇది అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం. అసాధారణ పరిస్థితుల్లో మనమంతా ఉన్నాం. అందుకు మన ప్రతిస్పందన చర్యలు కూడా అసాధారణంగానే ఉండాలి” అని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ జరిపే ఏకాభిప్రాయ సాధన కృషికి కొంత సమయం పట్టవచ్చని ఆమె గుర్తు చేశారు. అమెరికాకు సరిపడా సరఫరాలు సమకూరినందున ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం టీకాల ఉత్పాదన, పంపిణీ విస్తరణపై దృష్టి పెట్టిందని ఆమె వివరించారు. అలాగే టీకా ముడి పదార్థాల ఉత్పత్తి పెంచేందుకు కూడా కృషి చేస్తుందని టాయ్ తెలిపారు. ఓ కోణంలో ధనిక దేశాలు వ్యాక్సిన్లను నిల్వ చేస్తున్నాయనే విమర్శలు బైడెన్ ప్రభుత్వాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేశాయనే చెప్పాలి. భారత్‌కు సానుకూలంగా స్పందిస్తున్న అగ్రరాజ్యం కరోనాను ఎదుర్కొనే విషయంలో ప్రస్తుతం భారత్‌కు తోడుగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని ఇటీవల శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ చెప్పారు. ఔషధాలు, పరికరాలు, ప్రాణ వాయువు సిలిండర్లతో కూడిన మరికొన్ని విమానాలను భారత్‌కు పంపుతామని ప్రకటించారు. ఇదే కాక భారత్‌కు అమెరికా ఎంతో సహాయం చేస్తోంది. ప్రస్తుతం విజ్ఞప్తికి మద్దతు పలకడం చూస్తే బైడెన్ ప్రభుత్వం భారత్‌కు సానుకూలంగా స్పందిస్తోందని తెలుస్తోంది. ( చదవండి: భారత్‌కు ఎంతో సహాయం చేస్తున్నాం.. మరింత చేస్తాం ) -
భారత్‌కు త్వరలోనే తెలుస్తుంది: ట్రంప్
వాషింగ్టన్: అధునాతన క్షిపణి వ్యవస్థ ఎస్–400 కొనుగోలు కోసం రష్యాతో ఒప్పందం చేసుకున్న భారత్‌కు ఆంక్షల వర్తింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. శ్వేతసౌధంలో జరిగిన ఓ సమావేశంలో విలేకర్లు ఈ అంశాన్ని లేవనెత్తగా.. ‘భారత్‌కు త్వరలోనే తెలుస్తుంది’ అని అన్నారు. ఎప్పుడు? అని ప్రశ్నించగా.. ‘మీరే చూస్తారుగా.. మీరు ఊహించడానికి ముందే’ అని బదులిచ్చారు. రష్యా, ఉ.కొరియా, ఇరాన్ కంపెనీలతో రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల లావాదేవీలు నిర్వహించే దేశాలపై ఆంక్షలు విధించడానికి అమెరికా కాట్సా (కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్) అనే చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఆంక్షల నుంచి భారత్‌కు మినహాయింపు ఇచ్చేందుకు అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు జేమ్స్ మేటిస్, మైక్ పాంపియోలు అనుకూలంగా ఉన్నా అధ్యక్షుడు ట్రంప్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను సున్నా స్థాయికి తగ్గించుకోవాలన్న తమ ఆదేశాలను పాటించని దేశాల సంగతిని తేలుస్తామని ట్రంప్ హెచ్చరించారు. -
సీషెల్స్‌లో ఆర్మీ కేంద్రం ఏర్పాటుపై కదలిక
విక్టోరియా: పసిఫిక్ మహాసముద్రంలోని సీషెల్స్ దీవిలో మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న భారత్ ప్రతిపాదన పట్ల అక్కడి రాజకీయ నాయకులు సానుకూలంగా స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015లో సీషెల్స్‌లో పర్యటించిన సమయంలో ఈ ప్రతిపాదన చేశారు. కేంద్రానికి నిధులు భారత ప్రభుత్వమే సమకూరుస్తుందని.. రెండు దేశాలు వినియోగించుకోవచ్చని ప్రతిపాదించారు. తీరప్రాంత రక్షణ, అక్రమంగా చేపలు పట్టడం, మత్తుపదార్థాల రవాణా, పైరసీ వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవటంలో ఈ కేంద్రం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. -
భారత్ ప్రతిపాదనకు అమెరికా ఓకే
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ ప్రతిపాదనకు అగ్రదేశాలు దన్నుగా నిలిచాయి. పఠాన్ కోట్ సైనిక స్థావరంపై దాడి సూత్రధారి, పాకిస్తాన్ కు చెందిన జైషే-ఈ-మహ్మద్ గ్రూప్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ పై నిషేధం విధించాలన్న భారత్ ప్రతిపాదనకు అమెరికా, యూకే, ఫ్రాన్స్ మద్దతు తెలిపాయి. ఎప్పటిలానే చైనా అడ్డుపడింది. వాషింగ్టన్-ఢిల్లీ మధ్య జరిగిన సంప్రదింపులతో ఈ ప్రతిపాదన తుదిరూపం దాల్చింది. జైషే-ఈ-మహ్మద్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అని, దీనికి సంబంధించిన నాయకులు స్వేచ్ఛగా తిరగకుండా ఆంక్షలు విధించాలని ప్రతిపాదనలో పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనను అమెరికా సమర్థించడంతో చైనా వ్యతిరేకించిందని తెలిపాయి. ఏ ప్రతిపాదనైనా భద్రతా మండలిలో 10 రోజుల్లోగా ఆమోదించాలి లేదా తిరస్కరించాలి.. లేకుంటే నిలిపివుంచాల్సి ఉంటుంది. ఆరు నెలల పాటు ‘హోల్డ్’లో పెట్టిన తర్వాత మరో మూడు నెలలు పొడిగించుకునే అవకాశముంది. అప్పటికీ ఆమోదం లభించకపోతే ప్రతిపాదన కాలపరిమితి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ ప్రతిపాదనకు చైనా బ్రేక్ వేసింది. భద్రతా మండలిలో తాజా పరిణామాలను చైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని భారత విదేశాంగ ప్రకటించింది. సాంకేతిక అంశాలను సాకుగా చూపి చైనా ఇప్పటికే రెండుసార్లు భారత్ ప్రతిపాదనకు అడ్డుతగిలింది.