Africa: Gunfire Erupted At Military Base Near Capital Burkina Faso - Sakshi
Sakshi News home page

బుర్కినా ఫాసోలో మిలటరీ తిరుగుబాటు!

Jan 24 2022 3:48 PM | Updated on Jan 24 2022 5:02 PM

Gunfire Erupted At Military Base Near Capital Burkina Faso In Africa - Sakshi

Africa: ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశ రాజధాని దగ్గరలోని మిలటరీ బేస్‌ వద్ద ఆదివారం భారీ కాల్పులు జరిగాయి. దీంతో టర్కీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలటరీ తిరుగుబాటు జరిగిందన్న పుకార్లు వ్యాపించాయి. ఇటీవల కాలంలో దేశంలో పెరిగిపోతున్న ముస్లిం తిరుగుబాట్లను ప్రభుత్వం సరిగా అణిచివేయడంలేదన్న ఆరోపణలున్నాయి.

అయితే ఆర్మీ తిరుగుబాటు ఏమీ జరగలేదని, అధ్యక్షుడు రోచ్‌ మార్క్‌ క్రిస్టియన్‌ కబోరేను ఎవరూ నిర్భంధించలేదని రక్షణ మంత్రి సింపురె ప్రకటించారు. సైనికుల్లో అభిప్రాయభేదాలు ముదిరి కాల్పులు జరుపుకున్నారని ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఆర్మీలో క్రమశిక్షణ నెలకొల్పేందుకు యత్నిస్తున్నట్లు తెలిపింది.

అంతకుముందు ఆందోళన చేస్తున్న సైనికులు మీడియాకు ఫోన్‌ చేశారు. తమకు సరైన పనిచేసే పరిస్థితులు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. దేశంలో మిలటరీ, ఇంటెలిజెన్స్‌ల్లో వంశపారంపర్యాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఆందోళనలు పెరుగుతున్న సందర్భంగా ఇటీవలే దేశ ప్రధానిని అధ్యక్షుడు తొలగించారు.

(చదవండి: భారీ మూల్యం తప్పదు!..ఉక్రెయిన్‌ అధిపతిగా రష్యా అనుకూల నేత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement